అదృశ్యమైన నలుగురు చిన్నారులు క్షేమం
హైదరాబాద్: నగరంలోని బాగ్‌లింగంపల్లిలో అదృశ్యమైన నలుగురు బాలికల ఆచూకీ లభ్యమైంది. అచ్చయ్యనగర్‌కు చెందిన నలుగురు బాలికలు గురువారం సాయంత్రం అదృశ్యమయ్యారు. గాయత్రి(15), దివ్య(15), రుచిత(13), పావని(13) అనే నలుగురు విద్యార్థినులు జిరాక్స్ కోసం వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా చిన్నారుల ఆచూకీ లభ్యమైంది.