children missing
-
అమెజాన్ అడవుల్లో.. పాపం పసివాళ్లు
దట్టమైన అమెజాన్ అడవులు. నెల రోజులుగా అలుపెరగకుండా ముందుకు సాగుతున్న సైన్యం. పాపం.. ఆ నలుగురు పసివాళ్లు ఇంకా బతికే ఉంటారనే ఆశ వాళ్లను అలా ముందుకు పోనిస్తోంది. సజీవంగా ఆ చిన్నారులు ఇంటికి చేరాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు ఇప్పుడు. కొలంబియా అమెజాన్ అడవుల్లో నెల కిందట తేలికపాటి విమాన ఒకటి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అయితే.. అందులో ప్రయాణించిన నలుగురు చిన్నారులకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు బయటపడి ఉంటారని, అడవుల్లోనే ఎక్కడో ఒక దగ్గర సురక్షితంగా తలదాచుకుని ఉండిఉంచొచ్చని కొలంబియా సైన్యం భావిస్తోంది. ఆ ఆశతోనే భారీ సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 శాటిలైట్ చిత్రాల్లో.. పిల్లలు విమాన శకలాల నుంచి నడుచుకుంటూ వెళ్లిన కాలిముద్రలు, అలాగే వాళ్ల కోసం గాలిస్తున్న బృందానికి వాళ్లకు సంబంధించిన వస్తువులు, అడవుల్లో తాత్కాలిక ఆశ్రయం కోసం చేసుకున్న ఏర్పాట్లు, సగం తినిపడేసిన పండ్లు.. కిందటి వారం ఒక జత బూట్లు, డైపర్.. ఇలా ముందుకు వెళ్లే కొద్దీ పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులు దొరుకుతుండడంతో వాళ్లు బతికే ఉంటారన్న ఆశలతో గాలింపును ఉధృతం చేశారు. 👉 దొరికిన ఆధారాలతో వాళ్లు సజీవంగానే ఉన్నారని భావిస్తున్నాం. వాళ్లకు కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న జనరల్ పెడ్రో చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు చనిపోయి ఉంటే స్నిఫ్ఫర్ డాగ్స్ సాయంతో ఈపాటికే ఆ మృతదేహాలను కనిపెట్టేవాళ్లం. కానీ, అలా జరగలేదు కాబ్టటి వాళ్లు బతికే ఉంటారని మేం భావిస్తున్నాం అని ఆయన చెబుతున్నారు. 👉 ఏం జరిగిందంటే.. మే 1 ఉదయం, సెస్నా 206 తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. అయితే ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 👉 ఆపై అది ప్రమాదానికి గురైందని ధృవీకరించుకుని.. శకలాల కోసం గాలింపు చేపట్టారు. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. అయితే.. లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ కనిపించకుండా పోయారు. 👉 దీంతో 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావిస్తున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తున్నారు. 👉 విమాన ప్రమాదంలో ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో చిన్నారు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భీకరమైన,దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో.. రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. అడవి మార్గంలో ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఆ ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి. మూడు కిలోమీటర్లపాటు ఫోకస్ పడేలా సెర్చ్లైట్లను అడవుల్లో ఏర్పాటు చేసింది సైన్యం. తద్వారా పిల్లలు తమవైపు వస్తారనే ఆశతో ఉంది. ఆ నమ్మకమే బతికిస్తోంది.. కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) కమ్యూనిటీకి చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ చిన్నారుల తాత. లెస్లీ తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందేమోనని అంటున్నాడాయన. అయితే.. క్రూర వన్యప్రాణులతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు నెలవు ఆ ప్రాంతం. అలాంటి ముప్పును వాళ్లు ఎలా ఎదుర్కొంటారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారాయన. -
దుబాయ్ వెళ్లేందుకు రైలు ఎక్కిన బాలురు
అమరావతి, బాపట్ల: దుబాయ్ వెళ్లేందుకు ముగ్గురు బాలురు రైలు ఎక్కి బాపట్ల స్టేషన్లో దిగారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో బాపట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన సంజయ్, సూర్యతేజ, గోపీ దుబాయ్ వెళ్లేందుకు అక్కడ చెన్నై రైలు ఎక్కి బాపట్లలో దిగారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో సీఐ అశోక్‌కుమార్ వారిని విచారించారు. సంజయ్ తండ్రి ఆంజనేయులను పిలిపించి వారిని అప్పగించారు. కార్యక్రమంలో ఎస్ఐలు భాస్కర్, హజరత్తయ్య పాల్గొన్నారు. -
కుక్కలపై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ధనవంతుల కుక్క తప్పిపోతే పోలీసులు సర్వశక్తులనూ ఒడ్డి ఆ కుక్కను పట్టుకున్నారని, అదే పేద వాళ్ల పిల్లలు అదృశ్యమైతే వాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గతేడాది జూబ్లీహిల్స్‌లో ఓ ధనవంతుడి కుక్క తప్పిపోతే పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుని యజమానికి అప్పగించారని, అయితే రాష్ట్రం లో పిల్లలు అదృశ్యమైన కేసుల్ని పోలీసులు మూసేస్తున్నారని పిల్లో పేర్కొన్నారు. పిల్లల అదృశ్యం కేసుల్ని పూర్తిస్థాయిలో విచారించేలా ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని, మూసేసిన కేసుల్ని తెరిచి విచారణ చేపట్టేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యా యవాది రాపోలు భాస్కర్ పిల్ దాఖలు చేశారు. దేశంలో ఆడ పిల్లల ఆక్రమ రవాణా జరుగుతోందని, 8,057 వేల పైచిలుకు కేసులు నమోదైతే.. అందులో తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 49 కేసుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2018 మధ్య కాలంలో 2,122 మంది పిల్లలు అదృశ్యమైతే, అందులో 1,350 మంది బాలికలు ఉన్నారన్నారు. ఇంతవరకు వీరి ఆ చూకీ తెలియలేదన్నారు. పిల్లల ఆచూకీ తెలియక మనోవేదన తో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతు న్న ఘటనలూ ఉన్నాయన్నా రు. 2015లో 407 మంది పిల్లలు, ఆ తర్వాత మూడేళ్లలో వరసగా 474, 681, 560 మంది చొప్పున పిల్లల అదృశ్యం కేసులు నమోదైతే, వారిలో అత్యధికంగా బాలికలే 1,350 మంది ఉన్నా రని తెలిపారు. పిల్లో ప్రతివాదులుగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను చేర్చారు. క్రిమినల్ కేసుల పరిష్కారం: పెండింగ్ కేసుల పరిష్కారంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి 24 క్రిమినల్ పిటిషన్లు, 43 మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించారని హైకోర్టు రిజిస్ట్రార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పైశాచికమా.. ప్రమాదమా?
సాక్షి, గుంటూరు : గుర్తు తెలియని అగంతకులు పైశాచికంగా వ్యవహరిస్తూ చిన్నారులను చిదిమేస్తున్నారా..? లేకా ప్రమాదవశాత్తూ పిల్లలు చనిపోతున్నారా..? ప్రస్తుతం పల్నాడులో ఇదే చర్చ కొనసాగుతోంది. మాచర్ల, గురజాల పట్టణాల్లో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. మాచర్లలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏడేళ్ల బాలుడు అదృశ్యమై నాలుగు రోజుల తర్వాత క్వారీ గుంతలో శవమై తేలాడు. తాజాగా గురజాలలో వారం రోజుల కిందట నాలుగేళ్ల బాలుడు సుభాష్ అదృశ్యమై నేటికీ ఆచూకీ లభించలేదు. దుండగులు పిల్లలను కిడ్నాప్ చేసి హత్య చేస్తున్నారా..? ఏమైనా ప్రమాదాలకు గురై చిన్నారులు మృత్యువాత చెందుతున్నారా అనే విషయం నేటికీ పోలీసులు తేల్చకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అభం శుభం తెలియని చిన్నారుల నిండు నూరేళ్ల జీవితాలు అర్ధంతంగా కొడిగడుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు జీవితకాలం శిక్ష పడుతోంది. ఉన్నతంగా పెంచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకున్న వారికి తీరని శోకమే మిగులుతోంది. చిన్నారులు అదృశ్యమైన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ కేసు నమోదు చేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాచర్లలో, తాజాగా ఆగస్టు 25న గురజాలలో ఇద్దరు బాలురు అదృశ్యం ఆ ప్రాంత వాసుల్లో కలకలం రేపుతుంది. ఆయా కేసుల్లో నిందితులను గుర్తించడం పోలీసులకు సైతం మిస్టరీగానే మిగిలింది. ఆధునిక పరిజ్ఞానం ఎంత ఉన్నా నిందితుల గుర్తింపులో నెలలు గడుస్తూనే ఉన్నాయి. కేసులను కొలిక్కి తీసుకురావడంలో పోలీసుల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనలు జరిగిందిలా.. మాచర్లలోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటేశ్వరనాయక్ వెల్ధుర్తి మండలంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. ఇంటి వద్ద భార్య సరోజనీబాయ్ కుమారుడు సాయిసాధిక్ ఉరఫ్ సిద్దు (7) ఈ ఏడాది ఏప్రిల్ 22న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో మాచర్ల టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల అనంతరం బాధితుడి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న క్వారీలోని నీటిలో సిద్దు శవమై తేలాడు. కిడ్నాప్ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసులో మిస్టరీ వీడలేదు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటిలో పడ్డాడా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లి పడేశారా అనే విషయం పోలీసులకు అంతు పట్టడం లేదు. లేకుంటే మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. బాలుడి తల్లిదండ్రులు సైతం తమ బిడ్డను ఎవరో పొట్టనపెట్టాకున్నారని అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేసి రూరల్ ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా గురజాలకు చెందిన గురవయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తాడు. ఇద్దరు మగ పిల్లలున్నారు. పెద్ద కుమారుడు సుభాష్ ఇంటి ఎదురు ఆడుకుంటుండగా గత నెల 25న గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేశారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మరో ఐదు రోజులకు (అగస్టు 30వ తేదీన) బాధితుడి ఇంటి సమీపంలోని ముళ్ళ పొదల్లో బాలుడు అదృశ్యం అయిన సమయంలో వేసుకున్న లాగు, టీషర్టు రక్తపు మరకలతో తడిచి వేర్వేరు చోట్ల పడేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. పోలీస్ జాగిలం కూడా బాలుడు ఇంటి వద్ద నుంచి బట్టలు ఉన్న చోటకు వచ్చి నిలిచిపోయింది. ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదిలా ఉంటే మా బిడ్డను ఎవరో హతమార్చారంటూ తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అసలు బాలుడు ఉన్నాడా..? లేదా..? అనే విషయంలో పోలీసులు కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిడ్నాప్ చేసిన దుండగులు బట్టలకు రక్తపు మరకలు పూశారా? లేకుంటే నిజంగానే పొట్టన పెట్టుకున్నారా? అనే సందేహంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడికి చెందిన బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నట్లయితే... నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌గా ఉన్న గురజాలలో కనీసం ప్రధాన రహదారులను కవర్ చేసేలా ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు లేవు. ప్రధాన దుకాణదారులు, అపార్టుమెంట్లు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కొందరు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు సుముఖత చూపకపోవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. అదే సీసీ కెమేరాలు ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదని పోలీసులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. -
నదిలో పడిన పెళ్లి వ్యాన్ : 7గురు చిన్నారులు గల్లంతు
సాక్షి, లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తోన్న ఎస్యూవీ ఒకటి అదుపు తప్పి కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో కొంతమందిని రక్షించగా, మరికొంతమంది చిన్నారులు గల్లంతయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. లక్నోలో గురువారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 29 మంది వేళ్లి వేడుకు హాజరైన తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న వాహనం నగ్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్వా ఖేరా వద్ద ఇందిర కాలువలో పడిపోయింది. గజ ఈతగాళ్లు 22 మందిని రక్షించగా మిగిలిన ఏడుగురు చిన్నారులు కనిపించకుండా పోయారు. ఎన్డీఆర్ఆఫ్ దళాలు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఎస్కే భగత్ తెలిపారు. కాలువలో వలలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. వీరితోపాటు లక్నో నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు ఘటనాస్థలం వద్దే వుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. SK Bhagat, IG Range Lucknow: A vehicle carrying around 29 people fell into the canal, around 22 people have been rescued so far, 7 children are still missing. Rescue operations by NDRF and local divers underway. pic.twitter.com/6apRZC4e4M — ANI UP (@ANINewsUP) June 20, 2019 -
హమ్మయ్య! దొరికారు..
తూర్పుగోదావరి, కొత్తపల్లి: బషీర్‌బీబీ(బంగారుపాప) ఉరుసు ఉత్సవాల్లో అదృశ్యమైన ఆ ఇద్దరు బాలల ఆచూకీ లభ్యమైంది. ఆ చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం కాకినాడ డీఎస్పీ పీవీఆర్ఎస్ఎస్ఎస్ఎంవీ రవివర్మ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి బాలురు అదృశ్యానికి సంబంధించిన వివరాలు తెలియపరిచారు. గుంటూరు జిల్లా పట్నారిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన షేక్ అజీజ్,ఇదే జిల్లా పొన్నూరు రోడ్డుకు చెందిన కరీముల్లా వారివారి కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 16న ఉరుసుఉత్సవాల కోసం పొన్నాడ వచ్చారు. సోమవారం ఉదయం తమ స్వస్థలాలకు వెళ్లేందు సిద్ధమయ్యారు. అప్పటి వరకూ ఆలయ సమీపంలో ఆడుకున్న షేక్ అజీమ్ తనయుడు షేక్ మహబూబ్ సుభానీ(4), కరీముల్లా తనయుడు సయ్యద్ అబ్దుల్లా(5) కనిపించకపోవడంతో చుట్టూ పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్సై కృష్ణమాచారి కేసు నమోదు చేశారు. అదృశ్యమైన సయ్యద్ అబ్దుల్లా, షేక్ మహబూబ్ సుభానీలిద్దరూ సోమవారం ఆలయం వద్ద ఆడుకుంటుండగా కారుపై అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు వారికి బొమ్మలు కొనిస్తామని చెప్పి కారు ఎక్కించుకుని తీసుకువెళ్లారని డీఎస్పీ తెలిపారు. ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారన్న విషయం తెలుసుకున్న వారు భయంతో కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి చిన్నారులు ఇద్దరినీ విడిచిపెట్టి తిమ్మాపురం పొలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఎవరో ఇద్దరు చిన్నారులు పండూరులో ఉన్నారని చెప్పడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కొత్తపల్లి పోలీసులకు అప్పగించారు. చిన్నారులను వారి తల్లిదండ్రులకు డీఎస్పీ సమక్షంలో అప్పగించారు. చిన్నారులను చూసిన తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. తమ బిడ్డలను అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి, పిఠాపురం ఇన్చార్జి సీఐ ఈశ్వరుడు, సీఐ సూర్యఅప్పారావు, పిఠాపురం ఎస్సై శోభన్‌కుమార్ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు. అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నారు అదృశ్యమైన చిన్నారులు తల్లిదండ్రుల వద్దకు చేరుకోవడంతో తల్లిదండ్రులు బషీర్‌బీబీ అమ్మవారికి తలనీలాలు సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు. -
చైల్డ్‌లైన్ అదుపులో 8 మంది చిన్నారులు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : పలు ప్రాంతాల నుంచి తప్పిపోయి, పారిపోయి వచ్చిన 8మంది చిన్నారులను గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పట్టుకుని చైల్డ్ లైన్‌కు అప్పగించారు. చైల్డ్‌లైన్ సిబ్బంది తెలియజేసిన వివరాల ప్రకారం... పలాస, కాశీబుగ్గ నుంచి ఒక అమ్మాయి, అబ్బాయి(ఇద్దరు మైనర్లు) ప్రేమించుకుని, ఇంటి నుంచి పారిపోయి విశాఖపట్నం వచ్చేశారు. ఇక్కడి రైల్వేస్టేషన్లో మూడు రోజుల నుంచి ఉండడంతో జీఆర్పీ పోలీసులు గమనించి విచారించారు. ముందు అబ్బాయి తండ్రికి బాగోకపోవడంతో కేజీహెచ్‌లో చేర్చామని, అందుకే ఇక్కడ ఉన్నామని చెప్పారు. అనంతరం పోలీసులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పారు. వీరి తల్లిదండ్రులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాలుడి తండ్రి తెలిపారు. సామర్లకోటకు చెందిన అశోక్(14) చదువు ఇష్టం లేక, మధ్యలోనే మానేసి ఇంటి దగ్గర ఉంటున్నాడు. అతని తండ్రి షాపులో పని నిమిత్తం పెట్టగా, పని చేయడం ఇష్టం లేక పారిపోయి వచ్చేశాడు. బిహార్‌కు చెందిన ఎండీ అఖిల్‌అంజుమ్(14), ఎండీ రిజ్వాన్(11)మదర్సాలో చేరేందుకు ఇంటి వద్ద చెప్పకుండా వచ్చేశారు. 13 సంవత్సరాల బాలుడు వాసు తన మామయ్యతో కలిసి రాజమండ్రికి హాస్టల్లో చేరేందుకు వెళ్తున్నట్లు... మామయ్య ట్రైన్ ఎక్కేయగా, తాను మిస్ అయినట్లు తెలియజేశాడు. విజయనగరం జిల్లా తెర్లాం ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు యం.ఈశ్వర్(12), యం.లక్ష్మణ్(10)చెన్నై వెళ్లిపోవాలని ఇంటి దగ్గర ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం వచ్చేశారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారంతా శుక్రవారం రానున్నట్లు చైల్డ్‌లైన్ సిబ్బంది తెలిపారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు మెంబర్ శ్యామ్‌కుమార్ రైల్వేస్టేషన్‌కు చేరి పిల్లలందరికీ రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచినట్లు చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ జాన్‌పీటర్ తెలియజేశారు. -
హతవిధి.. మాధురీ!
బలిజిపేట(పార్వతీపురం): మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక సువర్ణముఖి నదిలో గల్లంతైంది. గ్రామస్తులందరికీ దిగ్భ్రాంతి కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, బాలిక తండ్రి అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గలావల్లి మాధురి(7) స్థానిక ఎలిమెంటరీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తరువాత పాఠశాల నుంచి తోటి పిల్లలతో బయటకు వచ్చి పాఠశాలకు సమీపంలో ఉన్న నది గూళ్ల రేవువైపు వెళ్లి, అంతలోనే నదిలోజారిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బాలిక అందులో కొట్టుకుపోయింది. ఆమెతో వచ్చిన పిల్లలు వెంటనే ఆ సమాచారాన్ని మాధురి తండ్రి నారాయణరావుకు అందజేశారు. వారు అక్కడకు చేరుకునే సరికే సమీపంలో ఉన్న కొందరు నదిలో వెదకడం మొదలు పెట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా అక్కడకు చేరుకుని ఆవేదన చెందారు. సాయంత్రం వరకూ గూళ్ల రేవునుంచి చాకరాపల్లి వరకూ నదిలో వెదికినప్పటికీ ఫలితం కనిపించలేదు. కన్నవారికి కడుపుకోత నారాయణరావు, సరస్వతిలకు ఇద్దరు సంతానం. వీరిలో గల్లంతయిన మాధురి పెద్దది. ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. నారాయణరావు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పిల్లను చదివించాలనే తపనతో పాఠశాలకు పంపించాడు. చిన్నారి గల్లంతైన విషయం తెలుసుకుని ఆ తల్లి రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది. పాఠశాల సమయంలో ఎలా వదిలారు: విద్యార్థులను పాఠశాల సమయంలో బయటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన ఉపాధ్యాయులదే. అయితే వారు అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలివేశారని స్థానికులు నిలదీస్తున్నారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ సాక్షితో మాట్లాడుతూ 2గంటల సమయం దాటిన తరువాత 5వ తరగతి పిల్లలతో కలసి మాధురి బయటకు వెళ్లిందనీ, ఆ సమయంలో ఉపాధ్యాయులంతా తరగతి గదుల్లో ఉన్నారని తెలిపారు. తోటి పిల్లలు వచ్చి విషయం తెలపడంతో అంతా అప్రమత్తమై వెదకడం మొదలుపెట్టామని వివరించారు. -
1500 మంది పిల్లలు అదృశ్యం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో పిల్లలను ఒంటరిగా బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడి పోతున్నారు. బయటకు లేదా బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారన్న నమ్మకం లేకుండా పోతోంది. రోజుకు 12 నుంచి 15 మంది పిల్లలు అదశ్యమవడమే అందుకు కారణం. ఇలా గత ఐదు నెలల కాలంలోనే 1500 మంది పిల్లలు అదశ్యమయ్యారని పోలీసుల రికార్డులు తెలియజేస్తున్నాయి. ఢిల్లీలో వీధి వీధిన సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసినా, హైటెక్ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ పిల్లల కిడ్నాప్‌లకు తెరపడడం లేదు. అదశ్యమైన పిల్లల్లో కేవలం 60 శాతం పిల్లలు మాత్రమే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. వారిలో కూడా ఎక్కువ మంది తమంతట తామే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని వస్తున్నారు. పాత ఢిల్లీ, అవుటర్ ఢిల్లీ ప్రాంతాల్లోనే ఎక్కువగా పిల్లల కిడ్నాప్‌లు జరుగుతున్నాయని డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజన్ భగత్ తెలిపారు. 6 నుంచి 15 ఏళ్ల మధ్యనున్న పిల్లలు ఎక్కువగా అదశ్యమవుతున్నారు. ఢిల్లీ నగరానికి వలసవచ్చిన పేద ప్రజలే పిల్లలే కిడ్నాప్‌లకు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారని, వారి తల్లిదండ్రుల వద్ద పిల్లల ఫొటోలు కూడా ఉండవని భగత్ తెలిపారు. పిల్లల కిడ్నాప్‌లను అదుపుచేసేందుకు ‘పెహచాన్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు ఆయన వివరించారు. కిడ్నాపైన పిల్లల్లో బాలలను ఎక్కువగా దేశంలోని పెద్ద నగరాలు, గల్ఫ్ దేశాలకు వెట్టి చాకిరి కోసం అమ్మేస్తున్నారని, బాలికలను వ్యభిచారంలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు. మారుమూల గ్రామాల్లో పెద్ద వయస్కులకు పెళ్లి చేయడానికి కూడా బాలికలను అమ్మేస్తున్నారని వారు చెప్పారు. అదశ్యమైన పిల్లల జాడను కనుగొనేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని సోషల్ మీడియాను, ఎన్జీవోలను పోలీసులు కోరుతున్నారు. తాము కూడా పెహచాన్ కార్యక్రమం కింద రోడ్లపై కనిపించే పిల్లల ఫొటోలనుతీసి భద్రపరుస్తున్నామని వారు చెప్పారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు
బాన్సువాడ: ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి గల్లంతైన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోతంగల్ చెరువులో గురువారం వెలుగు చూసింది. జల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు సాయికుమార్, అఫ్సర్ ఈ రోజు ఉదయం చెరువులో ఈతకు వెళ్లారు. ఈతకు దిగిన ఇద్దరు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
అదృశ్యమైన నలుగురు చిన్నారులు క్షేమం
హైదరాబాద్: నగరంలోని బాగ్‌లింగంపల్లిలో అదృశ్యమైన నలుగురు బాలికల ఆచూకీ లభ్యమైంది. అచ్చయ్యనగర్‌కు చెందిన నలుగురు బాలికలు గురువారం సాయంత్రం అదృశ్యమయ్యారు. గాయత్రి(15), దివ్య(15), రుచిత(13), పావని(13) అనే నలుగురు విద్యార్థినులు జిరాక్స్ కోసం వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. -
నగరంలో నలుగురు బాలికల అదృశ్యం
-
హైదరాబాద్ చిన్నారుల ఆచూకీ లభ్యం
-
ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారులు
-
ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారులు
చిలకలగూడ (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని వారాసిగూడ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సల్మాన్(4), అమీర్(2), తమ ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం కావడంతో వారి కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో చిన్నారుల తల్లి రేష్మాబేగం ఆదివారం సాయంత్రం చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
ప్రపంచమే ‘మాయా’ బజారు?!
విశ్లేషణ: ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాలబుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురు చూస్తూనే కాటికి చేరుతారు. కూటికి లేని పేదల దగ్గర కూడా ఉండే అమూల్య సంపద బిడ్డలు. ఆ బిడ్డలనూ దోచుకునే దొంగలు భారత్ నుంచి ఇథియోపియా వరకు వర్ధమాన ప్రపంచమంతా విస్తరించారు. 2012లో మన దేశంలో 65 వేల మంది పిల్లలు ‘కనబడుట లేద’ని ఏలినవారి కాకి లెక్కల కథనం. అందులో దాదాపు సగం మంది ఎప్పటికీ ‘కనబడనివారే’నట. 30 శాతానికి మించి కేసులు నమోదు కావని అంచనా. అంటే 2 లక్షలకు పైగా కనబడకుండా పోగా, అందులో లక్ష మంది పిల్లలు కనబడకుండానే మిగిలిపోతున్నారు. మరి గల్లంతయి పోతున్న పిల్లలు ఏమైపోతున్నారు? బడికి వెళ్లే కిలకిల నవ్వులు, మురికివాడల్లోని సొమ్మసిల్లిన గాజుకళ్లు, ప్రభుత్వం చొరబడలేని మహారణ్యాల ఆదివాసి కడుపు పంట లు ఎలా మాయమైపోతున్నాయి? ఏమైపోతున్నాయి? చెన్నై శివార్లలోని ఓ మురికివాడలో నివసించే నీళ్లింకిన కళ్ల నాగరాణిని కదిపితే... మన మురికివాడల నుంచి అమెరికా వరకు విస్తరించిన పిల్లల మాయా బజారు డొంక కదులుతుంది. పద్నాలుగేళ్ల క్రితం కూలిపని చేసి వచ్చి, రాత్రి ఆదమరచి నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి నెలల బిడ్డడు అలిగి వెళ్లి ... ‘అమ్మలగన్న అమ్మ’ లాంటి ఓ ఎన్జీవో ఒడి చేరి అనాథనని చెప్పుకున్నాడనిపించే కాకమ్మ కథను నమ్మలేక కుములుతున్న కన్న పేగు వ్యథ ఆమెది. నాలుగేళ్ల క్రితం ఓ విదేశీ పరిశోధనాత్మక పత్రికా రచయిత వెలుగులోకి తెచ్చిన నాగరాణి కొడుకు సతీష్ కథ పాతదే. దొంగిలించిన బిడ్డలను కొని, అంతర్జాతీయ పిల్లల దత్తత సంస్థలకు ఇచ్చే ఆ ‘అనాధాశ్రమం’ నిర్వాకం అప్పట్లోనే రచ్చకెక్కింది. ఇప్పుడు మళ్లీ ఆ గోల ఎందుకు? అప్పోసప్పో చేసి నాగరాణి రెండు సార్లు కొడుకు దత్తత పోయిన నెదర్లాండ్స్‌కు వెళ్లివచ్చింది. దత్తత చట్ట ప్రకారమే జరిగిందని తేల్చిన నెదర్లాండ్ కోర్టులు డిఎన్ఏ పరీక్షలకు నిరాకరించగా కన్నకొడుకు కంటి చూపుకైనా నోచుకోక తిరిగి వచ్చింది. ఇలాంటి మరో అభాగ్యురాలు జబీన్ కూడా ఇలాగే ఆస్ట్రేలియాకు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చింది. నాగమణులు, ఫాతీమాలు ‘అదృష్టవంతులు.’ మనుషుల అక్రమ తరలింపు కార్యకలాపాల వ్యతిరేక అంతర్జాతీయ సంస్థలు వారి కోసం పోరాడుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో నాగమణి కేసు యూరోపియన్ మానవ హక్కుల న్యాయ స్థానం ముందు దాఖలైంది. దత్తత వలసవాదం తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు దేశవ్యాప్తంగా 1.15 కోట్ల మంది ఉన్నారని అంచనా. అలాంటి వారిని విదేశీ యులకు దత్తత ఇవ్వడానికి వందల కొలదీ సంస్థలు న్నాయి. అవి దొంగిలించిన పిల్లలని తెలిసి కూడా వారిని విదేశీయులకు దత్తత ఇస్తాయి. వేలల్లో పిల్లలు వారి వద్ద దత్తతకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర దత్తత వనరుల కేంద్రం (సిఏఆర్ఏ) నిర్దేశన ప్రకారం దత్తత తీసుకునే విదే శీ తల్లిదండ్రులు 3,500 డాలర్లకు మించి సదరు దత్తత సంస్థకు చెల్లించడానికి వీల్లేదు. కాగా నాగరాణి కొడుకు దత్తత కోసం నెదర్లాండ్స్ తల్లిదండ్రులు చెల్లించినది అంతకు పది రెట్లు... 35,000 డాలర్లు. ఆఫ్రికా, ఆసియా దేశాల పిల్లల దత్తతకు పాశ్చా త్య దేశాల శ్వేతజాతి తల్లిదండ్రులు ఎక్కువగా మక్కువ చూపుతారు. చాలా సందర్భాల్లో అక్రమంగానే దత్తత జరుగుతుందని వారికి తెలుసు. ఇథియోపియా, కంబోడియా లు అంతర్జాతీయ దత్తత వ్యాపారానికి ప్రధాన కేంద్రాలు. చాలా ఆఫ్రికా దేశాల్లో పశువుల సంతలో లాగా పిల్లల్ని ఎంచుకుని మరీ కొనుక్కోవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ... ‘జహారా’ దత్తత కోసం 25,000 డాల ర్లు చెల్లించగా ఇథియోపియాకు చెందిన కన్నతండ్రికి చేరిం ది 300 డాలర్లే. ఆమె కంబోడియా నుంచి దత్తత తీసుకున్న మరో బిడ్డ విషయంలోనూ అదే జరిగింది. మన దేశంలో సైతం పేదరికంతో, ఆడపిల్లల పట్ల సాంఘిక వివక్షతో పిల్లల్ని అమ్మే తల్లిదండ్రులకు గాలం వేసే ‘అనాధాశ్రమాలు’ చాలానే ఉన్నాయి. విదేశీ దత్తతదార్లు మెచ్చే గుణాలు ఉండాలేగానీ బిడ్డ దొంగలించినదైనా, కొన్నదైనా ‘బంగారమే’. బడుగుదేశాల పేద పిల్లలపై పాశ్చాత్యులకు ఎందుకింత వల్లమాలిన ప్రేమ? సంపన్న దేశాల్లో దత్తత తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు స్పష్టమైన నిబంధనావళి ఉంటుంది. ‘దత్తత తీసుకున్నవారు బిడ్డకు కన్న తల్లిదండ్రుల గురించి తెలియజేయాలి, కలుసుకునే అవకాశం కల్పించాలి’ అనేది వాటిలో ఒకటి. వెనుకబడిన దేశాల నుంచి దత్తతలో ఇలాంటి బాదరబందీలు ఏమీ ఉండవు. దత్తత తతంగం లేకుండా పూర్తి అక్రమంగా రవాణా అయ్యే పిల్లలు గల్ఫ్ దేశాలకు చేరి బానిస చాకిరీ చేస్తున్నారు, సెక్స్ బానిసలుగా బతుకుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు, చట్టాలు ఏమి చేస్తున్నాయని అడగకండి. తిండికి బట్టకులేని పేద తల్లిదండ్రులు పిల్లలపై ఒలకబోస్తున్న ప్రేమంతా దత్తతదార్ల నుంచి డబ్బు గుంజ డానికేననే సమాధానం సదా సిద్ధంగా ఉంటుంది. అధిక ఆదాయ, సంపన్న వర్గాల పిల్లలకు ఉండే భద్రతా ఎక్కు వే. కానీ వారు సురక్షితమనడానికి వీల్లేదు. సొంత దేశం, జాతి, వర్ణం, భాష, సంస్కృతులకు దూరంగా దత్తత పేరిట పిల్లల్ని విసిరేయడం అమానుషమని వాదించే వారిని ఎవరు పట్టించుకుంటారు. ‘లేత మాంసం’ మార్కెట్లు దత్తత వ్యాపారం ‘మర్యాదస్తులు’ చేసేది. అలా ఎగుమతి అయ్యే ‘భాగ్యం’ కొందరికే. మిగతావారు ఏమౌతారు? ఆడపిల్లలు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతారు. అన్ని నగరాలను ముంచెత్తి, చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న ఆధునిక సెక్స్ పరిశ్రమకు ముడి సరుకులవుతారు. దేశంలో అధికారికంగా వ్యభిచార వృత్తిలో ఉన్నవారు 30 లక్షల మంది. వారిలో 40 శాతం 18 ఏళ్లలోపు బాలికలే. హెచ్ఐవీ, తది తర వ్యాధులు, ‘వృత్తిపరమైన ప్రమాదాల’ కారణంగా సెక్స్ వర్కర్ల వృత్తి కాలం బాగా పడిపోతోంది. దీంతో సెక్స్ పరిశ్రమ మైనర్ ఆడపిల్లల కోసం ఆవురావురుమంటోంది. క్షామ పీడిత ప్రాంతాల నుంచి, అంతర్గత తిరుగుబాట్లు సాగుతున్న ప్రాంతాల నుంచి ఆడపిల్లల సరఫరా జోరుగా సాగుతోంది. కోల్‌కతా ఈ వ్యాపారానికి జాతీయ రాజధాని, ఎగుమతుల కేంద్రం. ఆ నగర శివార్ల నుంచి బడికి వెళ్లివస్తున్న పన్నెండేళ్ల దీపను మూడేళ్ల క్రితం మత్తు మందిచ్చి ఎత్తుకుపోయారు. రోజుకు 12 నుంచి 14 మం ది మగాళ్ల మృగవాంఛను తీరుస్తూ క్షణం క్షణం తాను మరణించిన వైనాన్ని ఆ బాలిక ఇటీవల కళ్లకు కట్టింది. ఒక్కొక్క ఆడపిల్ల అమ్మకంపైనా వెయ్యి డాలర్ల లాభమని కోల్‌కతాకు చెందిన ఒక ఆడపిల్లల వ్యాపారి జనవరిలో బీబీసీ వార్తాసంస్థకు తెలిపాడు. తాను కోల్‌కతా, ఢిల్లీ, హర్యానాలకు ఆడపిల్లలను సరఫరా చేస్తాననీ, ఆ విష యం పోలీసులకు కూడా తెలుసని వెల్లడించాడు. బెంగాల్‌కే చెందిన మరో మైనరు ఆడపిల్ల రుక్సానా కథ కాస్త వేరు. ఆమెను హర్యానాలోని ఒక కుటుంబానికి అమ్మేసారు. ఆమెను గదిలో పెట్టి తాళం వేసి, ఇంట్లోని ముగ్గురు మగాళ్లూ నిత్యమూ రేప్ చేసేవారు. ఆడపిల్లలను హతమార్చిన ‘పాపానికి’ మగాళ్లు సెక్స్ దాహంతో అల్లాడిపోతున్న ప్రాంతాలు దేశంలో పెరుగుతున్నాయి. ‘లేత ఆడ మాంసా నికి’ అవి సరికొత్త మార్కెట్లు. ‘మర్యాదస్తుల’ బానిసలు అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా కార్యకలాపాలు 127 నుంచి 137 దేశాలకు విస్తరించాయని, ఇది ఏటా 1,000 కోట్ల డాలర్ల విలువైన వ్యాపారమని అంతర్జాతీయ మాననహక్కుల సంఘం అంచనా. అయితే మనుషుల అక్రమ తరలింపు 90 శాతం వరకు స్వదేశంలోనే జరుగుతుంది. అంటే ఏటా పిల్లల ప్రపంచ మార్కెట్ లావాదేవీల విలువ 10,000 కోట్ల డాలర్లకు పైనే. సెక్స్ పరిశ్రమకు చేరని పిల్లలు ఏమవుతున్నారు? రాజధాని ఢిల్లీసహా అన్ని పెద్ద నగరాల్లోనూ ఇప్పుడు సరికొత్త బానిసలు తయారయ్యారు. పిల్లల దొంగల మాఫియా వారిని ఇంటిపని బానిసలుగా అమ్మేస్తుంది. ఆడపిల్లలైతే ఇంటిపని చేయడంతో పాటూ, మగ దాహర్తిని తీర్చే సాధనాలుగా కూడా పనికొస్తారు. అస్సాం నుంచి పన్నెండేళ్ల ప్రాయంలో రాజ ధానికి చేరిన ఎలైనా కుజార్... యజమాని తన ముందే బూతు చిత్రాలను చూస్తూ తనను రేప్ చేసేవాడని చెప్పిం ది. ఆమె ఒక ఎన్జీవో పుణ్యమాని విముక్తిని సాధించింది. పారిపోయిన ‘బానిసలను’ కట్టి, కొట్టి యజమానికి అప్పగించే బాధ్యత కూడా మాఫియా గ్యాంగులదే. అలాంటి ఆడామగా పిల్లలు ఎన్నివేల మంది నగరాల్లో విద్యావంతులు, గౌరవనీయులైన పెద్దమనుషుల ఇళ్లల్లో బానిసలుగా పడి ఉన్నారో లెక్కల్లేవు. గత మూడేళ్లల్లో కనిపించకుండా పోయే పిల్లల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతోంది. పాలకులకు అది పట్టించుకునే తీరుబడి లేదు. ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాల బుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురుచూస్తూనే కాటికి చేరుతారు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
డార్జిలింగ్
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన డార్జిలింగ్ నుంచి ప్రతియేటా పిల్లలు భారీ సంఖ్యలో మాయమైపోతున్నారు! 'చైల్డ్ ఇన్ నీడ్ ఇన్స్టిట్యూట్ (సిని)' అనే సంస్థ విడుదల చేసిన నివేదికను బట్టి చూస్తే, ఇలా పిల్లలు మాయమైపోతున్న ప్రదేశాలలో డార్జిలింగ్ అగ్రస్థానంలో ఉంది. 2012 సంవత్సరంలో డార్జిలింగ్ జిల్లాలో 924 మంది పిల్లలు మాయమైతే, 2010లో 430 మందే అదృశ్యం అయ్యారు. పైపెచ్చు, తప్పిపోతున్న వారిలో సగానికి పైగా ఆడపిల్లలే ఉంటున్నారు. డార్జిలింగ్ ప్రాంతం సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో ఇక్కడినుంచి నేపాల్ మీదుగా వేరే దేశాలకు పిల్లలను తరలించే అవకాశం ఎక్కువగా ఉందని సిని అదనపు డైరెక్టర్ రాజీవ్ కె. హల్దర్ తెలిపారు. ఇలా సరిహద్దులకు దగ్గరగా ఉన్న జిల్లాల్లోని మారుమూల గ్రామాల నుంచి పిల్లలను ఎత్తుకుపోయి విదేశాలకు అమ్మేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను ఇల ఎత్తుకుపోయి వారిని ఫ్యాక్టరీలు, పొలాలు లేదా ఇళ్లల్లో పనివారిగా చేరుస్తున్నారు. ఇక ఆడపిల్లలనైతే బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించడం, చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేయడం, లేదా వారిని భిక్షాటనలోకి దించడం లాంటివి చేస్తున్నారు. దేశంలోనే ఇలా పిల్లలు మాయమైపోతున్న రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో ఉంది. నేపాల్, బంగ్లాదేశ్‌లతో ఈ రాష్ట్రానికి సరిహద్దు ఉండటం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మొత్తం ఎంతమంది పిల్లలు తప్పిపోయినా, గట్టిగా ఆ కేసుల్లో 4 శాతం ఫిర్యాదులు కూడా రావట్లేదు. పిల్లలు తప్పిపోతే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ దాఖలుచేసి, ఆ కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా పోలీసులు మాత్రం తమ తీరు మార్చుకోవట్లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 2012 సంవత్సరంలో ఏకంగా 19 వేల మంది పిల్లలు మాయమైపోయినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది!!