చిలకలగూడ (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని వారాసిగూడ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సల్మాన్(4), అమీర్(2), తమ ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం కావడంతో వారి కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో చిన్నారుల తల్లి రేష్మాబేగం ఆదివారం సాయంత్రం చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.