ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు
Published Thu, Feb 2 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
బాన్సువాడ: ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి గల్లంతైన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోతంగల్ చెరువులో గురువారం వెలుగు చూసింది. జల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు సాయికుమార్, అఫ్సర్ ఈ రోజు ఉదయం చెరువులో ఈతకు వెళ్లారు. ఈతకు దిగిన ఇద్దరు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Advertisement
Advertisement