బాలురను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సీఐ అశోక్‌కుమార్
అమరావతి, బాపట్ల: దుబాయ్ వెళ్లేందుకు ముగ్గురు బాలురు రైలు ఎక్కి బాపట్ల స్టేషన్‌లో దిగారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో బాపట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన సంజయ్, సూర్యతేజ, గోపీ దుబాయ్ వెళ్లేందుకు అక్కడ చెన్నై రైలు ఎక్కి బాపట్లలో దిగారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో సీఐ అశోక్‌కుమార్ వారిని విచారించారు. సంజయ్ తండ్రి ఆంజనేయులను పిలిపించి వారిని అప్పగించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు భాస్కర్, హజరత్తయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment