poker game
-
బ్రోకర్.. జోకర్.. సర్కారే!
‘పేకాట ప్రియుల్లారా.. రండి రండి.. అనువైన చోటు, తిండీ తిప్పల బాధ్యత మాదే.. ముక్కలూ మావే.. మీరు కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు.. అదీ కష్టం అనుకుంటే ఫోన్ పే/గూగుల్ పే అయినా ఓకే. ఇన్నాళ్లూ మీరు ఈ అదృష్టానికి దూరమయ్యారు.. ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడికో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేదిక.. మా శిబిరానికి రండి.. మీ భద్రతకు మాదీ పూచి.. మీకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టడానికి చేతి కింద ఎంతో మంది ‘జాకీ’లూ సిద్ధం.. మీరు డబ్బు గెలుచుకోవాలే గానీ ‘క్వీన్’ కూడా రెడీ.. పైన ‘కింగ్’ మనోడే.. ఇంకెందుకు ఆలోచిస్తారు? జోకర్ పడకపోయినా కూడా ‘షో’ చెప్పొచ్చు.. ట్రిపులెట్లా మీ జీవితం వెలిగిపోవచ్చు.. మీ అదృష్టం పరీక్షించుకోండి..’ అని రాష్ట్రంలో పేకాడేవాళ్లను అధికార టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆహ్వానిస్తున్నారు. ఇసుక రీచ్‌లలో అడ్డగోలు తవ్వకాలతో జేబులు నింపుకుంటున్నది సరిపోదన్నట్టు పేకాటపై పడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు సొంతానికి ‘ఇలా’ సంపద సృష్టించుకుంటున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : ఎన్నో కుటుంబాలను చిధ్రం చేసిన చరిత్ర జూదానిది. పండుగలు, పబ్బాలకు జరిగే జూదంతోనే ఎందరో ఆస్తులమ్ముకుంటున్నారు. పేకాట వల్ల గతంలో ఎన్ని వేల కుటుంబాలు అప్పుల పాలయ్యాయో, ఎంత మంది ఐపీ పెట్టారో ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే రాష్ట్రంలో సామాన్యుల బతుకులతో పేకాడేస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధుల సిండికేట్ల ఆధ్వర్యంలో మూడు ముక్కలు.. ఆరు ఆటలుగా పేకాట దందా బరితెగించి సాగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తెరుచుకున్న అధికారిక, అనధికారిక పేకాట క్లబ్బుల ద్వారా రోజూ అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో జూదానికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రంలో సాగిన పేకాట క్లబ్బుల దందాకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బుల అనుమతులను రద్దు చేసింది. అనధికార పేకాట క్లబ్బుల దందానూ అణచి వేసింది. తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజల సర్వస్వాన్ని దోచుకుంటున్న పేకాట క్లబ్బుల దందాకు ముగింపు పలికింది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా సరే తలొగ్గ లేదు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పేకాట క్లబ్బుల సిండికేట్లు మరోసారి జూలు విదిల్చాయి. ఏకంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బుల సిండికేట్‌కు నాయకత్వం వహిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.ఒకరిని చూసి మరొకరు..కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తుండటం చూసి ఇతర జిల్లాల కూటమి పార్టీల నేతలు సైతం ఈ దందాను ప్రారంభిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మూడు క్లబ్‌లతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అండదండలున్నాయని, ప్రధానంగా ఎమ్మెల్యే కుమారుడు నిర్వాహకులకు మద్దతుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పాలకొల్లులో రెండు క్లబ్బుల్లో పేకాట జోరుగా సాగుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొందరు ఇళ్ల వద్ద, వ్యక్తిగత గెస్ట్ హౌస్‌లలో, పొలాల్లో, ఊరికి దూరంగా ఉండే ఖాళీ స్థలాల్లో పేకాట నిర్వహిస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఐ.పోలవరం, సఖినేటిపల్లి మండలాల్లో ఈ తరహా పేకాట కొనసాగుతోంది. పొలాల్లో పేకాట ఆడేవారిపై పోలీసులు రైడింగ్లు, కేసులు నమోదు చేస్తున్నారు తప్ప గెస్ట్ హౌస్‌లలో పేకాట జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడుల్లో పేకాట స్థావరాలు ఏర్పాటయ్యాయి. నిర్మానుష్య ప్రాంతాలు, ఎత్తైన భవంతులు, అటవీ ప్రాంతాలు ఇందుకు వేదికయ్యాయి. వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో జోరువైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెలో అధికార పార్టీనేత లక్ష్మిరెడ్డి, నాగార్జునరెడ్డి పేకాట నిర్వహిస్తున్నారు. వీరు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ముఖ్య అనుచరులు. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెలో టీడీపీ నేత శివ, ఆయన సోదరుడి ఆధ్వర్యంలో పేకాట జరుగుతోంది. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వరరెడ్డినగర్‌లో పక్కీర్‌రెడ్డి, బండ రాముడు పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. పులివెందుల, సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని పలు ప్రాంతాలలో టీడీపీ చోటా నాయకులు పేకాట దందా నడిపిస్తున్నారు. బ్రహ్మంగారిమఠంలో పేకాట స్థావరం త్వరలో మొదలవుతుందని తెలిసింది. చెన్నూరు మండలం బలసింగాయపల్లె, కనపర్తి, కైలాసగిరి ప్రాంతాల్లో దట్టమైన చెట్లున్న ఏరియాలో టీడీపీ నేతలు పేకాట స్థావరాలు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరి, చిన్నమండెం, పెద్దమండెం, గుర్రంకొండ సమీపంలోని పాత చిత్తూరు జిల్లా సరిహద్దులోని గుట్ట ప్రాంతాల్లో మొబైల్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. రోజుకొక చోట శిబిరాలను నడిపిస్తున్నారు. కొంతమంది పోలీసులు, అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో ఈ వ్యవహారం జరుగుతోంది. మదనపల్లె, రైల్వేకోడూరు ప్రాంతాల్లో కూడా మామిడి తోటల్లో పేకాట కొనసాగుతోంది. ఒంగోలు నడిబొడ్డున గాంధీ రోడ్డులోని ఒక వీధిలో, ఒంగోలు–దశరాజుపల్లి మార్గంలోని ఒక పాత బిల్డింగ్‌లో పేకాట శిబిరాలు సాగుతున్నాయి. కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లోని పలు గ్రామాల్లో రోజూ పేకాట సాగుతోంది. రేపల్లె నియోజకవర్గంలోని ఓ పేకాట శిబిరంలో లోన–బయట ఆటకు రెడీ అన్ని జిల్లాల్లోనూ అదే దందావిశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు వంటి నగరాల్లో అధికారికంగా మూడేసి చొప్పున పేకాట క్లబ్బులు తెరుచుకోగా.. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప వంటి జిల్లా కేంద్రాల్లో అధికారికంగా ఒకటి రెండు క్లబ్బులకు తలుపులు తెరిచి.. అనధికారింగా లెక్కలేనన్ని కేంద్రాలు ఓపెన్ చేసేశారు. ఎంపిక చేసిన హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ఊరి బయట పొలాల్లో అనధికార పేకాట క్లబ్బులు వెలిశాయి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే దాదాపు 100కుపైగా అధికారిక, అనధికారిక పేకాట క్లబ్బులు దందా సాగిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పోలీసులను కాపలా పెట్టి మరీ పేకాట దందా సాగిస్తుండటం విస్మయ పరుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పేకాట క్లబ్బుల జోరు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఒక్కోక్లబ్బులో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు సగటున రూ.3 కోట్ల వరకు.. శని, ఆదివారాల్లో రోజుకు రూ.12 కోట్ల వరకు దందా సాగుతున్నట్లు సమాచారం. ఆ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో రూ.1500 కోట్లు.. శని, ఆదివారాల్లో రూ.2,400 కోట్ల వరకు పేకాట దందా సాగుతోంది. పేకాట క్లబ్బుల నిర్వహణకు కొమ్ముకాస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇందులో 10 శాతం చొప్పున కమీషన్ తీసుకుంటున్నారు. ఆ ప్రకారం టీడీపీ కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు వారానికి కమీషన్ల రూపంలోనే దాదాపు రూ.400 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్లబ్బుల సంఖ్య, టీడీపీ నేతల కమీషన్ కూడా పెరగనుంది. ‘అనంత’లో దందాకు ఎక్కడా నో డ్రాప్అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ హెడ్‌కానిస్టేబుల్ పేకాట నిర్వహణకు రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పై అధికారులకు ఆదాయంలో వాటా ఇస్తున్నారని సమాచారం. ఇదే నియోజకవర్గంలోని కూడేరులోనూ పేకాట జోరుగా సాగుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టపగలే యథేచ్ఛగా పేకాట ఆడుతున్నా పట్టించుకునే వారు లేరు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు మండలాల్లో టీడీపీ నేతల కనుసన్నల్లో అటవీ ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఇక్కడికి కర్ణాటక నుంచి సైతం పేకాటరాయుళ్లు భారీగా వస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో రాత్రింబవళ్లు జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒక్కో స్థావరంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. పుట్టపర్తిలో టీడీపీకి చెందిన రామ్– లక్ష్మణ్ సోదరులు గోవా నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు జూద నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఒక్కో స్థావరం నుంచి రోజుకు రూ.3 లక్షల చొప్పున కమీషన్ రూపంలో పోలీసులకు వెళ్తోంది. రూ.లక్షకు రూ.2 వేల కమీషన్ తీసుకుంటూ అప్పుగా ఇస్తున్న వారు కూడా పెరిగిపోయారు. చాలా మంది టీడీపీ నేతలు జూద కేంద్రాలను ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నారు. ప్రతి జూద కేంద్రం నుంచి 20 శాతం కమీషన్ తీసుకుని నడిపిస్తున్నారు. ఇటీవల పెనుకొండ మండలం శెట్టిపల్లి సమీపంలో 15 మంది పేకాటరాయుళ్లు దొరికారు. వారి వద్ద నుంచి రూ.17 లక్షలు, ఐదు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.కుప్పంలో రోజూ రూ.2 కోట్లుచిత్తూరు జిల్లా కేంద్రంలో నెల రోజులుగా పేకాట స్థావరాలు మొదలయ్యాయి. తుమ్మిందపాళ్యం–మాపాక్షి మార్గం, గంగనపల్లె, చర్చీవీధిలో జూదం నిర్వహిస్తున్నారు. ఓ టీడీపీ ప్రధాన నాయకుడి తమ్ముడి ఆదేశాలతో ఈ శిబిరాలు నడుస్తున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం అతడికి రోజుకు రూ.2 లక్షలు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. పూతలపట్టులోని బంగారుపాళ్యం అటవీ ప్రాంతంలో, పలమనేరు కౌండిన్య అడవుల్లో రోజుకు రూ.లక్ష చొప్పున పోలీసులు మామూళ్లు తీసుకుని పేకాట జరుపుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. గంగాధరనెల్లూరులో ఓ కీలక నాయకుడి తమ్ముడి ఆదేశాలతో పేకాట నిర్వహిస్తున్నారు. నగరిలో తడుకుపేట–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న జూదానికి ఓ మండల టీడీపీ నేత ఇటీవల పచ్చజెండా ఊపారు. పుంగనూరులో నక్కగుంట, బోయకొండ ప్రాంతాలు నిత్యం పేకాటరాయుళ్లతో కనిపిస్తున్నాయి. రోజూ జరిగే మొత్తంలో 20 శాతం స్థానిక టీడీపీ నాయకులకు ఇస్తున్నారు. కుప్పంలో గుడివంక సరిహద్దు ప్రాంతాల్లో, శాంతిపురం–కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆటకు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు వస్తున్నారు. నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ టీడీపీ నేత, పోలీసులతో కలిసి ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజూ రూ.2 కోట్ల వరకు లావాదేవీలు నడుస్తున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి పుత్తూరు, రేణిగుంట, వెంకటగిరి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. తిరుపతిలో ఇద్దరు టీడీపీ నేతల కనుసన్నల్లో దందా సాగుతోంది. లాడ్జి ఓనర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆట సాగిస్తున్నారు. పోలీసుల నుంచి ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తున్నారు. శ్రీకాళహస్తిలో టీడీపీ ప్రధాన నాయకుడు రోజుకు ఒక పల్లెలో పేకాట శిబిరాన్ని విస్తరిస్తున్నాడు. కర్నూలు జిల్లాలో పెద్ద మొత్తాలే!బనగానపల్లి నియోజకవర్గం ఇస్రేనాయక్ తండా పరిధిలోని కంబగిరి స్వామి సమీపంలోని ఎర్రమలలో పేకాట నడుస్తోంది. ఇక్కడ ‘హైస్టేక్స్’ ఆడతారు. రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున ఆడతారు. ఇక్కడి నుండి నంద్యాలలోని ఓ జిల్లా పోలీసు అధికారికి రోజూ రూ.2 లక్షలు పంపేవారు. ఇటీవల ఆయన బదిలీ అయ్యారు. అయినా పేకాట ఆగలేదు. ఇక్కడికి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, పులివెందుల తదితర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి అలంపూరు, గద్వాల ప్రాంతాల్లో జోరుగా పేకాట ఆడిస్తున్నారు. కొణిదెల పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో పేకాటరాయుళ్లను సభ్యులుగా చేర్చి జూద శిబిరం నిర్వహించే ప్రాంతం, సమయం మెసేజ్ రూపంలో పంపి జోరుగా పేకాట ఆడిస్తున్నారు. ఇటీవల తెలంగాణ పోలీసులు దాడి చేసి రూ.20 లక్షల దాకా నగదు స్వాధీనం చేసుకున్నారు. నెలన్నరగా కర్నూలు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పేకాట శిబిరాలు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఆలూరు నియోజకవర్గం అగ్రహారం, హత్తి బెళగల్, కల్లెవంక పరిధిలో రోజుకో చోట పేకాట ఆడిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఆరుగురు ప్రధాన అనుచరులు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు సిటీలో వెంకటరమణ కాలనీ, జొహరాపురంలోని ఓ ఇంట్లో, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వైపు ఉన్న విల్లాలో, కర్నూలు–నంద్యాల ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో కొండకు దగ్గరగా ఉన్న ఓ వెంచర్లో, మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని బసాపురంలో, నంద్యాల పరిధిలోని పులిమద్దిలో, ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆదోని వద్ద ఉన్న శిబిరానికి బళ్లారి నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తున్నారు. జూలై 18న ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడులో ‘భూమా గోడౌన్’లో అఖిలప్రియ చిన్నాన్న భూమా బ్రహ్మానందరెడ్డి పేకాట ఆడిస్తుంటే పోలీసులు దాడి చేశారు. 20 మంది టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. జూలై 29న శిరివెళ్ల మండలం బోయిలకుంట వద్ద శిబిరంపై పోలీసులు దాడి చేసి, కేవలం ఏడుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. భారీగా పట్టుపడినప్పటికీ, కొంత డబ్బు మాత్రమే దొరికినట్లు చూపారు. పేకాట కేంద్రాల అడ్డాగా రేపల్లెబాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మద్దతుతో పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల నగరం మండలం వెలమవారిపాలెం వద్ద ఆటగాళ్ల వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండేలా దాదాపు ఎకరం స్థలంలో పేకాట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటగాళ్లను రప్పిస్తున్నారు. రోజూ రూ.కోట్లలోనే ఆట నడుస్తోంది. ఈ ఒక్క కేంద్రం నుంచే ముఖ్యనేత బంధువుకు రోజూ రూ.లక్షల్లో కమీషన్ వెళుతోంది. రేపల్లె ఓల్డ్‌టౌన్‌లో గుడ్డికాయలంక, పద్మావతీ టాకీస్ సెంటర్, బస్టాండ్ ఏరియాలో పేకాట కేంద్రాలు నడుపుతున్నారు. చెరకుపల్లి మండల కేంద్రంలోని భవానీపురం, నిజాంపట్నం మండల కేంద్రం సమీపంలోని ఒక గ్రామంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్క రేపల్లె నియోజకవర్గంలోనే 20 కేంద్రాలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మద్దతులో వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరులోనూ పేకాట నడుస్తోంది. కొందరు అధికార పార్టీ నేతల గెస్ట్‌హౌస్‌లు సైతం పేకాట కేంద్రాలుగా మారాయి. పర్చూరు మండలం కారంచేడు, స్వర్ణ, ఆదిపూడి, దగ్గుపాడు గ్రామాల పరిధిలో నిత్యం పేకాట నడుస్తోంది. ఇక్కడ పొలాల్లోనే ఆట నడిపిస్తున్నారు. అద్దంకి, బాపట్ల నియోజకవర్గాల్లోనూ పేకాటలు నిత్యం నడుస్తున్నాయి. పేకాట శిబిరాలకు మంత్రి మద్దతు ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదు.గుంటూరు, కృష్ణాలో సకల సౌకర్యాల మధ్య..గుంటూరు నగరంలో నిత్యం పేకాట రూ.కోట్లలో నడుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్లబ్‌లలో యథేఛ్చగా సాగుతోంది. కొరిటెపాడు వద్ద గల ఎల్వీఆర్ క్లబ్లో నెలన్నరగా పేకాట ప్రారంభించారు. పేకాట ఆడే వారికి అన్ని రకాల సదుపాయాలు, మద్యం, బిర్యానీలతో పాటు వడ్డీ వ్యాపారులు సైతం సిద్ధంగా ఉండేలా క్లబ్ నిర్వాహకులు శ్రద్ధ తీసుకుంటున్నారు. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా కూడా లావాదేవీలు జరుపుతున్నారు. ఈ క్లబ్‌ను ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో నడిపిస్తున్నారని సమాచారం. ఇక్కడికి అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ క్లబ్లో 40 టేబుళ్లపై ఆట సాగుతోందని సమాచారం. తద్వారా క్లబ్‌కు రోజూ రూ.20 లక్షలకు పైగానే ఆదాయం వస్తున్నట్లు తెలిసింది. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి, ఇటు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న నార్త్ క్లబ్లో, పలకలూరులోని గుంటూరు క్లబ్లో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. నగర శివారులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పలుచోట్ల పేకాట ఆడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామర్రులోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. జూద కేంద్రంగా మారిన పుట్టపర్తిప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని జూద కేంద్రంగా మార్చిన కవల సోదరులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవాలి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జూద కేంద్రాలను ప్రోత్సహించడం సరికాదు. జూదం కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయనే విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు గుర్తుంచుకుంటే మంచిది. ఆ ఇద్దరినీ నియంత్రిస్తే పుట్టపర్తి ప్రశాంతంగా ఉంటుంది.– ఆడపాల వేమనారాయణ, సీపీఐ జిల్లా సమితి సభ్యుడుకుటుంబాలు నలిగిపోతాయిరాష్ట్ర ప్రభుత్వం పేకాటను ఇలా ప్రోత్సహిస్తూ పోతే వేల కుటుంబాలు వీధిన పడతాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పేకాటలను ఇంతలా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం పేకాటను అధికారికం చేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు సంపన్న కుటుంబాలు సైతం ఆర్థికంగా నలిగిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే మహిళా లోకం పోరాటానికి దిగడం ఖాయం. ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన మహిళలే తిరిగి గద్దె దించే పరిస్థితి వస్తుంది.– లాస్య, మచిలీపట్నం, కృష్ణాజిల్లాపోరాటానికి ఐద్వా సిద్ధమవుతోందిరాష్ట్రంలో పేకాట క్లబ్‌లకు, పేకాట స్థావరాలకు ఇంత విచ్చలవిడిగా ప్రభుత్వం అనధికార అనుమతులివ్వడం దారుణం. సమాజాన్ని నాశనం చేసే పేకాట పట్ల ఈ ప్రభుత్వం ఇలా మద్దతు ఇవ్వడం సరికాదు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి, పేకాట వంటి అంశాలకు ప్రాధాన్యత నివ్వటం తగదు. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమించటానికి ఐద్వా సిద్ధమవుతోంది.– గాదె ఆదిలక్ష్మి, కార్యదర్శి, ఐద్వా విజయవాడ పశ్చిమంసంపద ఇలా సృష్టిస్తారా? రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే పేకాటను ప్రోత్సహించడం దారుణం. ఇప్పటి వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్ నోరు మెదపటం లేదు. సంపద సృష్టించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించారు. పేకాల క్లబ్‌లను ఏర్పాటు చేసి అందులో యువతకు ఉద్యోగాలు కల్పిస్తారా? క్లబ్‌ల నుంచి వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పిల్లల స్కూల్ ఫీజులు సైతం చెల్లించలేని స్థితిలోకి ఎందరో వెళ్లిపోతారు. ఏ గృహిణి మెడలోనూ పుస్తెలు ఉండవు. – కోట సామ్రాజ్యం, గృహిణి, విజయవాడ -
ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా?
ఆటలో ప్రత్యర్థిని ఓడించాలంటే మేదస్సుకు పని పెట్టాల్సిందే. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టి గెలవడం మజాను పంచుతుంది. కానీ గెలవడం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతారు. ప్రత్యర్థిని తమ కవ్వింపు చర్యలతో బుట్టలో వేసుకొని మ్యాచ్‌లు గెలవడం చూస్తుంటాం. తాజాగా పోకర్ గేమ్‌లో భాగంగా ఒక యువతి స్తనాలు చూపిస్తూతన ప్రత్యర్థులను రెచ్చగొట్టి ఆటను గెలవాలని ప్రయత్నించింది. అసలు విషయం తెలిశాకా మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. షషీమీ.. పోకర్ గేమ్‌లో స్పెషలిస్ట్. ఎప్పటిలాగే పోకర్ ఆడడానికి ఒక క్లబ్‌కు వచ్చింది. అయితే షషీమీ స్తనాలు కనిపించేలా డ్రెస్‌ను వేసుకొని వచ్చింది. అంతే.. ఆట మొదలైనప్పటి నుంచి ఆమె కన్ను పోకర్‌పై ఉంటే.. ప్రత్యర్థుల కళ్లు మాత్రం ఆమె స్తనాలపై ఉండేలా చూసుకుంది. ఈ క్రమంలోనే గేమ్‌లో అందరిని చిత్తు చేసి బాగా డబ్బులు సంపాదించింది. గేమ్ ముగిసిన తర్వాత షషీమీ చిన్నపాటి షాక్ ఇచ్చింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత తాను వేసుకొచ్చిన డ్రెస్‌ను అదే టేబుల్‌పై విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె స్తనాలు కనిపించేలా డ్రెస్ వేసుకురాలేదు.. అసలు ఆమె తన స్తనాలను చూపించడం అంతా కల్పితమే. కళ్లను మోసం చేసేలా ఆమె డ్రెస్ ఉండడంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగింది. కానీ గేమ్ ఏదైనా నిజాయితీగా ఆడాలి కానీ.. గెలవడం కోసం ఇంతలా దిగజారడం కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
Hyderabad Police: జోకులేస్తే షాకులిస్తారు!
సాక్షి, హైదరాబాద్: ఓ నెటిజనుడు ట్విట్టర్ వేదికగా పోలీసులపై జోకు పేల్చాడు. దీనికి తమదైన శైలిలో స్పందించిన నగర పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. ఈ పోస్టు ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. చికోటి ప్రవీణ్ వ్యవహారంతో గడిచిన కొన్ని రోజులుగా పేకాట, క్యాసినోలు వార్తల్లో నిలిచాయి. రాష్ట్రంలో అన్ని రకాలైన జూదాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు నెటిజనుడు ట్విట్టర్లో నగర పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి ఓ ప్రశ్న సంధించాడు. ‘సర్ మా ఇంట్లో మేము పేకాట ఆడుకోవచ్చా? అది చట్టబద్ధమేనా? నియమ నిబంధనలు వివరిస్తారా?’ అని పోస్టు చేశాడు. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసు సోషల్‌మీడియా టీమ్ నగర పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘సర్ మీ ఇంటికి సంబంధించిన పక్కా లొకేషన్ తెలుసుకోవచ్చా?’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో.. కొద్దిసేపటికే సదరు నెటిజనుడు తన హ్యాండిల్ నుంచి పోస్టును తొలగించాడు. చదవండి: ఒకే మహిళను రెండోసారి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు, కట్నం వద్దంటూనే -
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో పేకాట
ఉరవకొండ: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్లలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పలువురు టీడీపీ నేతలతో సహా 56 మందిని అరెస్ట్ చేశారు. రూ.10.51 లక్షల నగదు, ఐదు కార్లు, 14 బైక్‌లు, 54 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండలో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, సీఐ శేఖర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున పేకాట సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సీఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. వై.రాంపురం గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు, రౌడీషీటర్ ఎర్రిస్వామి, కౌకుంట్ల టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు శీనా సహా 56 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా బెళుగుప్ప, కౌకుంట్ల, వై.రాంపురం తదితర గ్రామాలకు చెందిన వారు. టీడీపీ ముఖ్య నేత బోయ మారెప్ప ఆధ్వర్యంలో పేకాట స్థావరం కొనసాగుతున్నట్టు గుర్తించారు. చదవండి: (ఈ పాపం బాబుది కాదా?) -
పేరుకే స్పోర్ట్స్ క్లబ్.. లోపల పేకాట హబ్
సాక్షి, మంచిర్యాల: పత్తాలాట రాష్ట్రంలో పత్తాలేకుండా పోయినా సరిహద్దుల్లో దాని జాడలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేకాట, మట్కా వంటి జూదాలను ప్రభుత్వం నిషేధించడంతో సరిహద్దుల్లో పేకాట స్థావరాలు వెలిశాయి. మన రాష్ట్రంలో రహస్యంగా ఎక్కడైనా ఆడితే పోలీసు, టాస్క్‌ఫోర్స్‌కు చిక్కే ప్రమాదముందని భయపడిన జూదరులు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర సరిహద్దుల్లో ‘చేతివాటం’ప్రదర్శిస్తున్నారు. చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో స్పోర్ట్స్ క్లబ్‌ల పేరుతో పేకాట దందా సాగుతోంది. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా అంకీసా, దుబ్బపల్లి, నందిగాంలో, నిర్మల్ జిల్లా సరిహద్దు నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్టణం, బాసర సమీప గ్రామం నవీపేటలో పేకాట జోరుగా నడుస్తోంది. రోజూ వందలాది మంది జూదరులు రూ.లక్షలు పెట్టి పేకాట ఆడుతున్నారు. జూదరుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, సినీప్రముఖులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. క్లబ్లో సకల సౌకర్యాలు పత్తాలాట నిర్వాహకులు ఏసీ గదుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆడిఆడి అలసిపోతే అక్కడే పడుకోవచ్చు. టాయిలెట్లు, బాత్రూముల వసతి కూడా ఉంది. తాగునీరు, టీ, స్నాక్స్, జ్యూస్‌లు, చికెన్, మటన్‌తో కోరిన భోజనం అందిస్తుంటారు. కొందరైతే రోజుల తరబడి అక్కడే బస చేస్తున్న సందర్భాలున్నాయి. జూదరుల జేబులు ఖాళీ అయితే నమ్మకస్తులకు ఒంటి మీది బంగారం, వాహనం కుదవ పెట్టుకుని అప్పులు కూడా ఇస్తుంటారు. ఆటలో నగదుతోపాటు గూగుల్ పే, ఫోన్ పే తోనూ చెల్లిస్తున్నారు. జూదరులకు రానుపోను వాహన ఖర్చులు, ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఇస్తున్నారు. సిరోంచకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా, ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి జూదరులు వస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన జూదరులు సరిహద్దు ఉన్న ధర్మాబాద్ వైపు వెళ్తున్నారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఓ క్లబ్ వెలిసినప్పటికీ మావోయిస్టుల ప్రభావంతో దానిని మూసివేశారు. మహారాష్ట్రలో మైండ్ గేమ్‌గా.. దేశంలో ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867’ప్రకారం నేరుగా డబ్బులతో ఆటలు ఆడటం నిషేధం. చాలా రాష్ట్రాలు పేకాటను పూర్తిగా నిషేధించాయి. మహారాష్ట్ర, గోవా లో షరతులతో కూడిన మైండ్‌గేమ్‌గా పిలిచే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ, డబ్బులు పెట్టి ఆడటం నిషేధం. మహారాష్ట్రలో ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్‌ల సభ్యులకు పేకాట అనుమతి ఉన్నా డబ్బులు పెట్టి ఆడరాదు. దీనిని ఆసరా చేసుకుని మహారాష్ట్రలో చట్టబద్ధమైన ఆట అని ప్రచారం చేస్తూ తెలంగాణ పేకాట రాయుళ్లకు వల వేస్తున్నారు. గడ్చిరోలి జిల్లా సిరోంచ, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్ట ణం, శివారు నవీపేటలో గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాలకు చెం దిన వాళ్లే క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. ఇటీవల చంద్రాపూర్ జిల్లా రాజురా, పోడ్సా క్లబ్‌లను అక్కడి అధికారులు మూసివేశారు. రోజుకు రూ. లక్షల్లో ఆర్జన పేకాట నిర్వాహకులకు రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. క్లబ్లో కనీసం రూ.5 వేలు నుంచి రూ.20 వేలతో పేకాట ఆడే టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్‌కు తొమ్మిది మంది చొప్పున ఉంటారు. ఇందులో ఒకరి డబ్బులు నిర్వాహకులు తీసుకుంటారు. ఐదువేల టేబుల్‌కు రూ.ఐదు వేలు, రూ.20 వేల టేబుల్‌కు రూ.20 వేలు తీసుకుంటారు. ఆటలో గెలిచినవారికి మిగతా డబ్బులు ఇస్తారు. ఒక్కో క్లబ్లో కనీసం ఆరు నుంచి పది టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్‌కు ఓ డీలర్ ఉంటాడు. అతడు పేక ముక్కలు పంచడం, లెక్కలు వేయడం, డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. రోజూ మధ్యాహ్నం మొదలై తెల్లవారు జామున 4 గంటల వరకు పత్తాలాట సాగుతోంది. గతంలో నిమిషాల్లో రూ.లక్షలు ఆవిరి చేసే కట్ పత్తా లాంటి ఆటలు ఆడగా, ప్రస్తుతం రమ్మీ మాత్రమే నడుస్తున్నాయి. ఈ దందాకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు దండిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
భీమిలి హయగ్రీవ రిసార్ట్స్‌లో పేకాట
తగరపువలస (విశాఖ): విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలోని హయగ్రీవ రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడిచేసి 22 మందిని అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వీరి నుంచి రూ.5,70,270 నగదు, ఎనిమిది కార్లు, 23 సెల్ఫోన్లు, నగదుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న రూ.21.53 లక్షల విలువైన 323 ప్లాస్టిక్ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ జోన్ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు, సీఐ జి.వి.రమణ ఆదివారం భీమిలి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్స్పెక్టర్లు పి.అప్పలరాజు, నమ్మి గణేష్, జగదీష్, ఎస్ఐలు సంతోష్, ఖగేష్, అమాన్రావు, జ్ఞానేశ్వరి, పద్మావతి దాడులు జరిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య కూడా ఉండడం గమనార్హం. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు, నగదు, ప్లాస్టిక్ కాయిన్లు వీరే సూత్రధారులు విశాఖ నగరానికి చెందిన దాట్ల కృష్ణంరాజు, చేబోలు శ్రీనివాస్‌పై పేకాట నిర్వహణ, క్రికెట్ బుకీలుగా నగరంలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వీరే బెంగళూరు తదితరచోట్ల ఉన్న పరిచయాలతో వివిధ జిల్లాలకు చెందిన వారితో వీకెండ్లలో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారు. అరెస్టు అయింది వీరే.. అరెస్టైన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాగిరాజు శ్రీనివాసరాజు(జక్కవరం, కాళ్ల మండలం), కుంచంపూడి రామకృష్ణంరాజు(గణపవరం మండలం), గాదిరాజు శరత్ (భీమవరం), సాగిరాజు హరివర్మ(జువ్వలపాలెం, కాళ్ల మండలం), వేగేశ్న ఆదిత్య (భీమవరం), మంతెన నాగరాజు (మలవని దిబ్బ, కాళ్ల మండలం), నరహరిశెట్టి రాధాకృష్ణ (మేడవల్లి, ఏలూరు), అడ్డాడ సోమరాజు (ఏఎస్ఆర్ నగర్, భీమవరం) ఉన్నారు. విశాఖకు చెందిన వారిలో దాట్ల కృష్ణంరాజు(విశాలాక్షినగర్), సప్పా రవి(మాధవధార), కంతేటి శేషుబాబు(రామ్‌నగర్), చేబోలు శ్రీనివాస్(విశాలాక్షినగర్), కొల్లిమల్ల నాగ అప్పలరాజు (అనకాపల్లి), ఆడారి జగ్గారావు(చింతల అగ్రహారం), ఆడారి వేణుగోపాలకృష్ణ(అక్కయ్యపాలెం) ఉన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన వారిలో చల్లగుల్ల శ్రీకృష్ణ (పెద పాలపర్రు, ముదినేపల్లి మండలం), బలుసు హరికిరణ్ (అడ్డాడ, పామర్రు మండలం), పొట్లూరి మురళీధర్ (దొండపాడు, గుడివాడ మండలం), కొర్ని నాగరాజు(భూషణగుళ్ల, పెద్దపారుపూడి మండలం), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిలో యడ్ల రాజారమేష్(వేమగిరి, కడియం మండలం), కూనదరాజు సత్యనారాయణరాజు(మణికిపురం, రాజోలు మండలం) ఉన్నారు. రిసార్ట్స్ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు, మేనేజర్ పాతూరి కృష్ణకాంత్‌లను అరెస్ట్ చేయాల్సి ఉంది. -
ప్రాణం తీసిన పేకాట.. దీపావళి రోజు పోలీసులకు చిక్కి..
సాక్షి, కామారెడ్డి: పేకాట ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తుండగా.. తామెమరినీ కొట్టలేదని పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో ఈ నెల 4న (దీపావళి పండుగ రోజు) కొందరు పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ తొమ్మిది మంది పోలీసులకు చిక్కారు. అందులో భూమబోయి (55) అనే వ్యక్తి అక్కడే పడిపోయి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని బాన్సువాడ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు కొట్టడం మూలంగానే తలకు గాయమై భూమబోయి అస్వస్థతకు గురయ్యాడని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తూ 5వ తేదీన పోలీసు స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళనకు దిగారు. రోజంతా అక్కడే ఆందోళన చేశారు. తామెవరినీ కొట్టలేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందిన భూమబోయి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాన్ని ఇవ్వాలన్నా, పోస్టుమార్టం చేయాలన్నా ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులు కొట్టడం మూలంగానే చనిపోయాడని ఫిర్యాదు చేయడాని కి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు, మృతుడి బంధువుల మధ్య గురు, శుక్రవారాల్లో రెండు రో జుల పాటు చర్చలు జరిగాయి. పోలీసుల తప్పిదం ఏమీలేదని, కొట్టలేదని పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు తలదూర్చి మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించినట్టు సమాచారం. అనారోగ్యంతో చనిపోయినట్టు ఫిర్యాదు ఇవ్వడానికి మృతుడి బంధువులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు కొట్టారన్నది అవాస్తవం శాంతాపూర్ గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో ఈ నెల 4న పోలీసు పార్టీ గ్రామానికి వెళ్లింది. అక్కడ పేకాడుతున్న వారిని పట్టుకున్నారు. అందులో భూమబోయి ఉన్నారు. ఆయనకు ఏదో అనారోగ్య సమస్య ఉండడంతో పడిపోయారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. పేకాడుతున్న వారిలో ఏ ఒక్కరినీ పోలీసులు కొట్టలేదు. భూమబోయి మరణానికి పోలీసులు కారణం కాదు. – శోభన్, సీఐ, బిచ్కుంద గుండెపోటుతోనే మరణించాడు కామారెడ్డి అర్బన్: శాంతాపూర్ గ్రామానికి చెందిన భూమబోయి(55) గుండెపోటు కారణంగా మృతి చెందారని ఎస్పీ శ్వేత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన డెత్ సమ్మరీలో భూమబోయి గుండెపోటుతో మరణించినట్టు ఉందని పేర్కొన్నారు. మృతుడు భూమబోయి వైద్య చరిత్ర, పేకాట వీడియోగ్రఫీ వివరాలు, అక్కడి సంఘటన వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పేకాటలో ప్రజాప్రతినిధులు?
సాక్షి, హైదరాబాద్: అది పేరుకు దీపావళి పార్టీ.. కానీ అక్కడ జరిగింది మాత్రం పేకాట. ఓవైపు అంతటా టపాసుల మోత మోగుతుంటే.. ఆ అపార్ట్మెంట్ టెర్రస్‌పై మాత్రం పత్తాలాట జోరుగా సాగింది. ఆ పేకాట పార్టీలో ఉన్నది మామూలు వాళ్లు కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బేగంపేట సమీపంలోని మోతీలాల్ నెహ్రూనగర్‌లో ఉన్న మారుతి బసేరా అపార్ట్మెంట్ టెర్రస్‌పై జరిగిన ఈ తతంగం సంచలనంగా మారింది. ఆ పార్టీకి ఓ మంత్రి కూడా హాజరయ్యారని, ఆ మంత్రి సహకారంతోనే సదరు ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీకి వీఐపీలు సహా అంత మంది హాజరైనా.. పోలీసులు కేవలం ఐదుగురు మాత్రమే పట్టుబడినట్టు చూపడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో.. దీపావళి రోజున బసేరా అపార్ట్మెంట్ టెర్రస్‌పై జరిగిన పార్టీలో.. పదుల సంఖ్యలో ఉన్నవారి అరుపులు, కేకలతో అపార్ట్మెంట్ వాసులతోపాటు పక్కనున్న ఇళ్లవారు గందరగోళానికి గురయ్యారు. కాలనీకి వచ్చే రోడ్డు బ్లాక్ అవడం, మొత్తం వీవీఐపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు, ఉన్నతాధికారులు, వ్యాపారస్తుల హడావుడి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇదేమిటని ఆరా తీసి.. పార్టీ చాటున పేకాట హంగామా సాగుతోందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా వీఐపీలే.. స్థానికులు ఫిర్యాదు చేయడంతో బేగంపేట పోలీసులు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి బసేరా అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అసలేం జరుగుతోందని తేల్చేందుకు ఒకరిద్దరు మామూలుగా పైకి వెళ్లి చూశారు. అక్కడ ఓ మంత్రితోపాటు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది. మంత్రిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించి.. వెంటనే దాడి చేసినట్టు సమాచారం. అయితే పట్టుబడ్డ వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, హైదరాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతోపాటు పాలవ్యాపార నిర్వహణలో పేరు గడించిన ఓ ప్రముఖ వ్యక్తి, నిజామాబాద్‌కు చెందిన ఓ నేత, వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో సదరు మంత్రి ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీలను వదిలేశారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో 30 మందికిపైగా పట్టుబడినా కేవలం ఐదుగురిని చూపడం ఏమిటని మండిపడుతున్నారు. దాడికి ముందే ఉన్నతాధికారులు! అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు సదరు పార్టీకి వెళ్లిన ముగ్గురు సీనియర్ అధికారులు.. పోలీసుల దాడికి కొద్దినిమిషాల ముందే హడావుడిగా వెళ్లిపోవడం మరో రకమైన చర్చకు తావిస్తోంది. అందులో ఓ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ, మరో ఇద్దరు సెక్రటరీ హోదా అధికారులు, ముగ్గురు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆరితేరిన వాడే.. బసేరా అపార్ట్‌మెంట్‌పై పేకాట పార్టీ నిర్వాహకుడు, వ్యాపారవేత్తగా పేరు పొందిన అరవింద్ అగర్వాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పరిచయాలున్నాయి. క్యాసినో, పోకర్, మూడు ముక్కలాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తిగా పేరుంది. ఈయన కస్టమర్లలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులేనని, అన్ని రాజకీయ పార్టీల కీలక నాయకులతోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీస్ వర్గాలే చెప్తున్నాయి. పేకాటలో పోలీసులకు చిక్కినా బాధ్యత తనదే అంటూ భరోసా కల్పించడం అతడి నైజమని పేర్కొంటున్నాయి. వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంకలకు తీసుకెళ్లి కోట్ల రూపాయలు క్యాసినోలు ఆడిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాంటిదేమీ లేదు: బేగంపేట పోలీసులు పేకాట వ్యవహారంపై బేగంపేట పోలీసులను వివరణ కోరగా.. తమకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశామని, పార్టీకి వచ్చిన 85 మందిలో అందరూ వెళ్లిపోయారని తెలిపారు. దాడి సమయంలో అక్కడున్న ఐదుగురు ఓ టేబుల్‌పై పోకర్ గేమ్ ఆడుతున్నారని, టేబుల్‌పై ఉన్న రూ.10 వేలను స్వాధీనం చేసుకొని.. వారిని తనిఖీ చేయగా రూ.12.56 లక్షలు దొరికాయని వెల్లడించారు. 53 ప్లేకార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేతప్ప తమకు పట్టుబడ్డ వారిలో ప్రజాప్రతినిధులు గానీ, ఇతర ప్రముఖులు గానీ ఎవరూ లేరని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అరవింద్ అగర్వాల్‌తోపాటు డబీర్‌పురాకు చెందిన జాఫర్ యూసఫ్, బేగంపేటకు చెందిన సిద్ధార్థ్ అగర్వాల్, మలక్‌పేటకు చెందిన భగేరియా సూర్యకాంత్, కరీమాబాద్‌కు చెందిన అబ్దుల్ అలీ జిలానీ ఉన్నట్టు తెలిపారు. -
అటవీ ప్రాంతంలో పేకాట..
నెల్లూరు(క్రైమ్): ఓ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేసి వారినుంచి రూ.10,45,500 స్వాధీనం చేసుకున్న ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) జేడీ కె.శ్రీలక్ష్మి మంగళవారం వివరాలను వెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం అటవీ ప్రాంతంలో పేకాట సాగుతోందన్న సమాచారం సెబ్ కమిషనర్ వినీత్‌బ్రిజ్‌లాల్, జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావుకు అందింది. వారి ఆదేశాల మేరకు జేడీ, నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఈబీ (సెబ్) బృందం, బుచ్చిరెడ్డిపాళెం సీఐ సీహెచ్ కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఈ నెల 20వ తేదీన పేకాట కేంద్రంపై దాడులు చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన హరిబాబు, పి.జవహర్‌ఖాన్, షేక్ జమాల్, పి.కొండయ్య, జి.బాబు, పి.సత్తిబాబు, జి.గుర్రప్ప, కె.వెంకట్రావు, గుంటూరుకు చెందిన కె.హనుమంతరావు, ఎం.తులసీకృష్ణ, ఒ.రాంబాబు, విజయవాడకు చెందిన షేక్ మౌలాలీ, డి.వరప్రసాద్, వి.సంజీవ్, పి.అర్జున్, ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్ పిచ్చయ్య, కె.శ్రీను, ప్రొద్దుటూరుకు చెందిన వై.మల్లికార్జునను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,45,500, 16 సెల్ఫోన్లు, తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై త్వరలో సస్పెక్టెడ్ షీట్లు తెరవనున్నట్లు జేడీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పేకాట కేంద్రంపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసిన సెబ్, పోలీసులను జేడీ శ్రీలక్ష్మి అభినందించారు. సెబ్ జేడీ టీమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కమ్యూనిటీ హాల్: ముక్కేసి..పెగ్గేయ్రా!
సాక్షి, ముషీరాబాద్: బాగ్‌లింగంపల్లిలోని ఓ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ పేకాట క్లబ్‌గా మారింది. మందుకు, విందుకు నిలయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు ఎస్ఐలు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేశారు. డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం వెనుకగల ఎల్ఐజీ క్వార్టర్స్‌లో ఇటీవల 75 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నైబర్‌హుడ్ కమ్యూనిటి హాల్‌ను ప్రారంభించింది. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి జన్మదినం సందర్భంగా స్నేహితులు, నాయకులు కొందరు విందును ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ రెండు గేట్లకు తాళం వేసి మందు, విందు, పేకాట ఆడుతూ జల్సాలు చేసుకంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ అడ్మిన్ ఎస్సై వెంకట్రమణ, నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, కోటేష్‌ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ గోడలు దూకి పేకాట ఆడుతున్న వీడియోలను చిత్రీకరించారు. పోలీసులు వచి్చన విషయాన్ని గుర్తించిన పేకాట రాయుళ్ళు కొంతమంది గోడదూకి పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి డబ్బు స్వా«దీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కొంత మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి విడుదల చేయాలని కోరారు. అనంతరం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అధికార పారీ్టకి చెందిన నాయకులే జనావాసాల మధ్య ఉండే ఓ ప్రభుత్వ కమ్యూనిటి హాల్లో పేకాట ఆడటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ: రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం
సాక్షి, అమరావతి: సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా.. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించింది. వెలగడిపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. ♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకానికి ఆమోదం. ♦ అక్టోబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించాలని మంత్రి వర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తదుపరి కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోనుంది. ♦ పంచాయితీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీడీవో) పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ♦ జాయింట్ కలెక్టర్లకు కింద ఎంపీడీవో (మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్)లకు పైన డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో డీడీవో పోస్టుల ఏర్పాటు. ఎంపీడీవోలకు పదోన్నతుల ద్వారా డీడీవో పోస్టుల భర్తీ. రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ విధించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకు విధి విధానాలు రూపొందిం చాల్సిందిగా మంత్రివర్గం అధికారులను అదేశించింది. ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం గతంలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ పేరిట రూ.3,000 కోట్లు అప్పు చేసి ఇతర అవసరాలకు మళ్లించారు. దీంతో ఇప్పటి ప్రభుత్వ హయాంలో రహదారులు నిర్వహణకు నిధుల లభ్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక సెస్ విధించి ఆ మొత్తాన్ని ఖజానాకు మళ్లించకుండా కార్పొరేషన్ దగ్గరే ఉంచాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్డీసీకి ఆమోదం ♦ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 80కి ఆమోదం. వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏపీఎస్డీసీ ఏర్పాటు. ♦ నాడు–నేడు (మనబడి), నాడు–నేడు (వైద్యం), అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల అమలుకు ప్రణాళిక, ఫండింగ్ (నిధుల సమీరణ)తోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన ప్రణాళికను ఈ కార్పొరేషన్ రూపొందిస్తుంది. వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు ♦ గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమి కేటాయింపు. ♦ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయింపు. మావోయిస్టుపార్టీపై మరో ఏడాది నిషేధం ♦ మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మీద మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ♦ రాడికల్ యూత్ లీగ్ (ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం (ఆర్సీఎస్) లేదా గ్రామీణ పేదల సంఘం (జీపీఎస్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్)లపై మరో ఏడాదిపాటు నిషేధం. మత్స్య విశ్వవిద్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020కి మంత్రివర్గం ఆమోదం. ♦ మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు. దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయం. ♦ ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు నష్టపోతున్నామని, వర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ నష్టాన్ని నివారించవచ్చని అంచనా. తద్వారా సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆంచనా. కృష్ణాపై రూ.2,565 కోట్లతో మరో రెండు బ్యారేజీలు ♦ కృష్ణా డెల్టా చౌడు బారకుండా పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సముద్రపు నీరు ఎగదన్నదు. కృష్ణా డెల్టాను పరిక్షించవచ్చు. తాగునీటికి ఇబ్బందులకు పరిష్కారం. రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రూ.2,565 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య కృష్ణా నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,215 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి ఎగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య కృష్ణా నదిపై 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,350 కోట్ల వ్యయం. ♦ పల్నాడు తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం వరికపూడిశెల ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయం. ఈ పథకం ద్వారా గుంటూరు జిల్లా వెల్ధుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.1,273 కోట్ల వ్యయం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్ సిగ్నల్ ♦ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ♦ 63.2 టీఎంసీల నీటిని తరలించి.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించాలని నిర్ణయం. ఈ పథకానికి రూ.15,389.80 కోట్ల వ్యయం అవుతుంది. ♦ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం. రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో భాగంగా ఈ పనులు చేపట్టాలని నిర్ణయం. (మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం) -
రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు
బెంగళూర్ : ఆన్లైన్ గేమ్‌లో నష్టాలతో అప్పుల్లో మునగడంతో కంపెనీ నిధుల నుంచి రూ 38 కోట్ల సొమ్మును తన ఖాతాల్లోకి మళ్లించిన గోల్డ్‌మన్‌శాక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అశ్వని ఝంఝన్‌వాలాను తొలగించామని కంపెనీ బుధవారం వెల్లడించింది. అశ్వని ఝంఝన్‌వాలాను తక్షణమే డిస్మిస్ చేశామని, అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు పోలీసు అధికారులకు సహకరిస్తామని గోల్డ్‌మన్ శాక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఇండియన్ సబ్సిడరీ ఫిర్యాదుపై అశ్వనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 420 కేసు నమోదు చేశారు. ఛీటింగ్ కేసులో నిందితుడిని స్ధానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిందని మరథహల్లి సీఐ ఎస్పీ గిరీష్ తెలిపారు. కాగా, తన కింది ఉద్యోగులు గౌరవ్ మిశ్రా, అభిషేక్ యాదవ్, సుజిత్ అప్పయ్యల సహకారంతో అశ్వని కంపెనీ డబ్బును స్వాహా చేశాడు. శిక్షణ పేరుతో వారి ఆఫీస్ సిస్టమ్స్‌లో అశ్వని లాగిన్ అయ్యేవాడని, వారిని మంచినీళ్లు తీసుకురమ్మని, ఇతర పనులను అప్పగించి నిధుల దోపిడీకి పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండస్ర్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాకు అక్రమంగా రూ 38 కోట్ల సంస్థ నిధులను బదిలీ చేశాడని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. చదవండి : అప్పుల్లో మునిగి పనిచేసే సంస్థకు కన్నం -
రండి..పేకాట ఆడుకోండి!
కోరుట్ల(జగిత్యాల జిల్లా): ‘రండి మా దగ్గర నిశ్చింతగా పేకాట ఆడుకోండి. విమాన చార్జీలు మేమే ఇస్తాం. హైక్లాస్ భోజన వసతి కల్పిస్తాం. 3 రోజుల పాటు మా దగ్గర హాయిగా పేకాట ఆడుకుంటూ ఉండొచ్చు. కేవలం రూ. 25–50 వేలు తెచ్చుకోండి’.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పేకాట రాయుళ్లకు పొరుగు రాష్ట్రాల క్లబ్‌లు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఈ ప్రాంతం నుంచి పేకాటరాయుళ్లను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు ఏకంగా కమీషన్ ఏజెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సాగని ఆటలు! ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 3 జిల్లాల్లో పోలీసులు నిత్యం పదుల సంఖ్యలో పేకాటరాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. లక్షల్లో నగదు స్వాధీనం చేసుకుంటూ 10 నుంచి 20కి మించి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో స్థానికంగా పేకాట ఆడేందుకు పేకాటరాయుళ్లు సుతరామూ ఇష్టపడటం లేదు. మూడు ముక్కలాటకు అలవాటుపడ్డ కొందరు తమ అడ్డాలను గ్రామశివారుల్లోని అటవీ ప్రాంతాలు, మామిడి తోటలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆ స్థావరాలనూ కనిపెట్టి దాడులు చేస్తుండటంతో స్థానికంగా పేకాట ఆడి కేసులు పాలుకావడం కన్నా.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి పేకాటరాయుళ్లు మొగ్గుచూపుతున్నారు. కమీషన్ ఏజెంట్ల హవా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు మహారాష్ట్రలోని పేకాట క్లబ్‌ల కన్నా కర్ణాటకలోని క్లబ్‌లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న క్లబ్‌లకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి నిత్యం 350–500 మంది పేకాట ఆడేందుకు వెళ్తున్న ట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాలోని కీలక పట్టణాల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన క్లబ్‌ల నిర్వాహకులు కమీషన్లు ఇస్తూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పేకాట ఆడేందుకు ఒకరిని బెంగళూరుకు తీసుకెళ్తే రూ.1000 నుంచి రూ.2,500 కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే వారిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్లడానికి కొందరు అద్దెకార్ల డ్రైవర్లు ఉండటం.. వీరికి ఎంతో కొంత కమీషన్ ముట్టడం విశేషం. ఆట తప్ప అంతా ఫ్రీ పేకాటరాయుళ్లను బెంగళూరుకు తరలించే కమీషన్ ఏజెంట్లు పేకాటరాయుళ్లను హైదరాబాద్ వరకు కార్లలో ఫ్రీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి విమాన టికెట్లు బుక్‌చేసి బెంగళూరుకు పంపుతున్నారు. కొందరు ఏజెంట్లు పేకాటరాయుళ్లతోపాటే ఉండి బెంగళూరులోని పేకాట క్లబ్‌లకు తీసుకెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు బెంగళూరులోని హైక్లాస్ లాడ్జీల్లో వసతి, ఖరీదైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి క్లబ్‌లలో ఉన్న హాలులో పది నుంచి పన్నెండు టేబుళ్లు ఏర్పాటు చేసి రమ్మీ, త్రీ కార్డ్స్ (మూడు ముక్కలు) ఆడిస్తున్నారు. ఒక్కో ఆటకు రూ.3,000–రూ.5,000 వరకు డబ్బులు పెట్టి ఆడాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్ నుంచి క్లబ్ నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.5 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పేకాట ఆడుతున్న వ్యసనపరులు కొందరు జేబులు గుల్లచేసుకుని వస్తుండటం గమనార్హం. మొత్తంమీద పేకాట వ్యసనం ఇతర రాష్ట్రాల్లోని క్లబ్‌లకు లాభాల పంట పండిస్తోంది. -
జీవితాలతో పేకాట!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు జూదక్రీడకు స్వర్గధామంగా విలసిల్లుతున్నాయి. పేద, మధ్య తరగతి జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. విచ్చల విడిగా జూదాలు నిర్వహిస్తూ కొందరు లక్షలాది రూపాయలను అప్పనంగా సంపాదిస్తున్నారు. పట్టణంలోని కొన్ని చోట్ల నిత్యం జూదం జరుగుతున్నా పోలీసులు, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా కొంతమంది బడాబాబులు, నాయకు లు లోపాయికారీగా ‘మేనే జ్’ చేస్తున్నట్టు తెలిసింది. ఎప్పటి నుంచో సాగుతున్న ఈ దందా గురించి కొందరు పోలీసు అధికారులకు తెలిసినా చూసీ చూడకుండా వ్యవహరిస్తూ నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారని సమాచారం. జూదం ద్వారా ఎన్నో కుటుంబాల ఆస్తులను లాగేసుకుంటున్న నిర్వాహకులు.. ఆటలో గెల్చిన వారిపైనా అల్లరిమూకలతో దాడులు చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. పరువు పోతుందన్న భయంతో బాధితులు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా గత ఆదివారం అర్ధరాత్రి వర కు పట్టణ శివార్లలో జూదం జరిగింది. కొవ్వొత్తుల లైటింగ్‌లో మట్టిరోడ్డుకు సమీపంలోని గుడారాల్లో ఇదంతా జరిగినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే మామూలు రోజులు కన్నా వారాంతాల్లో జరుగుతున్న ఆటల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇవే జూదానికి అడ్డాలు పట్టణంలో రోజూ కొన్ని లాడ్జీలు, హోటళ్లలోని గదులు ప్రత్యేకంగా జూదం కోసమే బుక్ అవుతున్నాయి. పేకాట కోసం తీసుకునే గదులకు సాధారణ రేటు మీద రెట్టింపు వసూలు చేస్తూ చతుర్ముఖ పారాయణానికి అవసరమైన సరాంజామా సమకూరుస్తున్నట్టు కొందరు జూదప్రియులే చెబుతున్నారు. ఇక పట్టణంలోని పి.ఎన్.కాలనీ, అంబేద్కర్ కూడలి, దమ్మల వీధి, మంగువారితోట ప్రాంతాల తోపాటు సమీపంలోని ఫరీదుపేట, చల్లపేట తోటలు, తోటపాలెం, కిళ్లిపాలెం గ్రామ ప్రాంతాల్లో రోజూ సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పేకాట జరుగుతున్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. గతంలో మండలవీధిలో పేకాట జరుగుతున్నప్పుడు తలెత్తిన ఘర్షణ లో ఓ వ్యక్తి మృతి చెందడంతో కొన్నాళ్లపాటు అక్కడ జూదం ఆపేశారని, మరికొన్నాళ్లు పెదపాడు రోడ్డులో రహస్యంగా జూదగృహం నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల రెండు వర్గాల మధ్య జూదం విషయమై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తిపై దుండగులు మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన కూడా ఉంది. ‘సూట్’లదే హవా.. పేకాట నిర్వహించాలంటే దమ్మూ ధైర్యంతో పాటు పోలీసుల రాకను పసిగట్టగలిగే నిఘా నెట్వర్క్ కూడా అవసరం. పట్టణానికి కొంతమంది గ్రూపుగా ఏర్పడి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి జూదగృహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రూపులను ‘సూట్’లుగా వ్యవహరిస్తుంటారు. ఎక్కడ ఆట జరిగినా ఈ గ్రూపు సభ్యులుంటారు. తెలియని వ్యక్తుల్లా జూదంలో చేరి సిండికేట్‌గా ఏర్పడి కొత్తగా ఆటకు వచ్చిన వారి నుంచి డబ్బు రప్పించుకోవడంలో వీరు కీలకపాత్ర వహిస్తుంటారు. కొత్తవ్యక్తులను రెచ్చగొట్టి ముగ్గులోకి దించడమే వీరి ప్రధాన విధి. పేకాటకు వచ్చే వారికి కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. కార్లలో వచ్చే వారికి కనీసం రూ.3 వేలు, ద్విచక్ర వాహనంపై వచ్చే వారికి రూ.500 నజరానాగా ఇస్తున్నారు. అదే విధంగా లైటింగ్, టెంట్ ఏర్పాటు చేయడం, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడడం కూడా వీరి బాధ్యతగా పేకాట రాయుళ్లు చెబుతున్నారు. వాహనాల్లో తరలింపు ఇతర ప్రాంతాల నుంచి జూదానికి రప్పించేందుకు హైటెక్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. పేకాట స్థావరం వివరాలను ఎస్సెమ్మెస్ రూపంలో జూదరులకు పంపిస్తున్నారు. అక్కడికి కొంత దూరంలో ఓ వాహనాన్ని ఉంచుతారు. ఆ సమాచారం కూడా పంపిస్తారు. సాయంత్రం వచ్చే జూదరులను వాహనాల్లో స్థావరానికి తరలిస్తున్నారు. ఇలా తరలించేందుకు ఒక్కో ఆటోకూ రూ.500 చెల్లిస్తున్నారు. పోలీసుల రాకను పసిగట్టే కాపలాదారులకు కూడా రోజుకు రూ. 500 చొప్పున చెల్లిస్తున్నారు. వచ్చిన మొత్తానికి మరింత కలిపి డ్రైవర్లు కూడా ఆటలో దిగుతున్నారు. లొసుగులే ఆధారం చట్టంలోని లొసుగుల ఆధారంగానే జిల్లాలో భారీగా జూదం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పేకాట సమయంలో డబ్బు దొరక్కుండా నిర్వహకులు జాగ్రత్త పడుతుంటారు. కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టి గెలిచినవారికి డబ్బు చెల్లించడం రహస్యంగా జరుగుతోంది. పోలీసులకు పట్టుబడితే ‘సూట్’దారులే బెయిల్ తెప్పించడం, వాహనాల్ని విడిపించడం కూడా చేస్తుంటారు. నాయకులతో అధికారులపై ఒత్తిళ్లు తెస్తుంటారు. అవసరమైతే ముందస్తు బెయిల్‌కూ ప్రయత్నిస్తుంటారు. ఇదంతా జరగకుండా ఉం డాలంటే స్థానిక పోలీసులకు నెలవారీ మామూళ్లు చాలు అన్న ధోరణి కనిపిస్తోంది. పోలీస్ కేసు అం టే.. వీరి దృష్టిలో కోర్టులో జరిమానా కట్టడం వ రకే అన్నట్టుగా ఉంటోంది. ‘కాయిన్లే’ కాసులు పేకాట జరిగే చోట డబ్బు అసలు ఉండదు. ప్లాస్టిక్ కాయిన్లనే డబ్బుగా ఉపయోగిస్తుంటారు. రంగు ఆధారంగా కాయిన్‌కు వెలకడుతుంటారు. పోలీసులొస్తే కాయిన్లే చూపిస్తారు తప్పితే సొమ్ము దొరకదు. అయితే వేరే చోట డబ్బు సంచులతో నిర్వాహకులు ఉంటారు. గెలిచిన వ్యక్తులు అక్కడికి వెళ్లి తమ వద్ద ఉన్న కాయిన్లు ఇస్తే వాటి విలువ ఆధారంగా సొమ్ము చెల్లిస్తుంటారు. ఒక కాయిన్ విలువ కనీసం రూ.1000 ఉంటుంది.