సాక్షి, హైదరాబాద్: ఓ నెటిజనుడు ట్విట్టర్ వేదికగా పోలీసులపై జోకు పేల్చాడు. దీనికి తమదైన శైలిలో స్పందించిన నగర పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. ఈ పోస్టు ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. చికోటి ప్రవీణ్ వ్యవహారంతో గడిచిన కొన్ని రోజులుగా పేకాట, క్యాసినోలు వార్తల్లో నిలిచాయి. రాష్ట్రంలో అన్ని రకాలైన జూదాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు నెటిజనుడు ట్విట్టర్‌లో నగర పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి ఓ ప్రశ్న సంధించాడు.
‘సర్ మా ఇంట్లో మేము పేకాట ఆడుకోవచ్చా? అది చట్టబద్ధమేనా? నియమ నిబంధనలు వివరిస్తారా?’ అని పోస్టు చేశాడు. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసు సోషల్‌మీడియా టీమ్ నగర పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘సర్ మీ ఇంటికి సంబంధించిన పక్కా లొకేషన్ తెలుసుకోవచ్చా?’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో.. కొద్దిసేపటికే సదరు నెటిజనుడు తన హ్యాండిల్ నుంచి పోస్టును తొలగించాడు.
చదవండి: ఒకే మహిళను రెండోసారి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు, కట్నం వద్దంటూనే
Comments
Please login to add a commentAdd a comment