ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? | Poker Player Hilariously Suffered Wardrobe Malfunction End Twist-In-Tale | Sakshi
Sakshi News home page

ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా?

Published Fri, Dec 9 2022 8:46 AM | Last Updated on Tue, Dec 13 2022 12:09 PM

Poker Player Hilariously Suffered Wardrobe Malfunction End Twist-In-Tale - Sakshi

ఆటలో ప్రత్యర్థిని ఓడించాలంటే మేదస్సుకు పని పెట్టాల్సిందే. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టి గెలవడం మజాను పంచుతుంది. కానీ గెలవడం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతారు. ప్రత్యర్థిని తమ కవ్వింపు చర్యలతో బుట్టలో వేసుకొని మ్యాచ్‌లు గెలవడం చూస్తుంటాం. తాజాగా పోకర్‌ గేమ్‌లో భాగంగా ఒక యువతి స్తనాలు చూపిస్తూతన ప్రత్యర్థులను రెచ్చగొట్టి ఆటను గెలవాలని ప్రయత్నించింది. అసలు విషయం తెలిశాకా మీ మైండ్‌ బ్లాక్‌ అవ్వడం ఖాయం.

షషీమీ.. పోకర్‌ గేమ్‌లో స్పెషలిస్ట్‌. ఎప్పటిలాగే పోకర్‌ ఆడడానికి ఒక క్లబ్‌కు వచ్చింది. అయితే షషీమీ స్తనాలు కనిపించేలా డ్రెస్‌ను వేసుకొని వచ్చింది. అంతే.. ఆట మొదలైనప్పటి నుంచి ఆమె కన్ను పోకర్‌పై ఉంటే.. ప్రత్యర్థుల కళ్లు మాత్రం ఆమె స్తనాలపై ఉండేలా చూసుకుంది. ఈ క్రమంలోనే గేమ్‌లో అందరిని చిత్తు చేసి బాగా డబ్బులు సంపాదించింది. గేమ్‌ ముగిసిన తర్వాత షషీమీ చిన్నపాటి షాక్‌ ఇచ్చింది.

మ్యాచ్‌ అయిపోయిన తర్వాత తాను వేసుకొచ్చిన డ్రెస్‌ను అదే టేబుల్‌పై విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె స్తనాలు కనిపించేలా డ్రెస్‌ వేసుకురాలేదు.. అసలు ఆమె తన స్తనాలను చూపించడం అంతా కల్పితమే. కళ్లను మోసం చేసేలా ఆమె డ్రెస్‌ ఉండడంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగింది. కానీ గేమ్‌ ఏదైనా నిజాయితీగా ఆడాలి కానీ.. గెలవడం కోసం ఇంతలా దిగజారడం కరెక్ట్‌ కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement