Breasts
-
ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా?
ఆటలో ప్రత్యర్థిని ఓడించాలంటే మేదస్సుకు పని పెట్టాల్సిందే. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టి గెలవడం మజాను పంచుతుంది. కానీ గెలవడం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతారు. ప్రత్యర్థిని తమ కవ్వింపు చర్యలతో బుట్టలో వేసుకొని మ్యాచ్‌లు గెలవడం చూస్తుంటాం. తాజాగా పోకర్ గేమ్‌లో భాగంగా ఒక యువతి స్తనాలు చూపిస్తూతన ప్రత్యర్థులను రెచ్చగొట్టి ఆటను గెలవాలని ప్రయత్నించింది. అసలు విషయం తెలిశాకా మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. షషీమీ.. పోకర్ గేమ్‌లో స్పెషలిస్ట్. ఎప్పటిలాగే పోకర్ ఆడడానికి ఒక క్లబ్‌కు వచ్చింది. అయితే షషీమీ స్తనాలు కనిపించేలా డ్రెస్‌ను వేసుకొని వచ్చింది. అంతే.. ఆట మొదలైనప్పటి నుంచి ఆమె కన్ను పోకర్‌పై ఉంటే.. ప్రత్యర్థుల కళ్లు మాత్రం ఆమె స్తనాలపై ఉండేలా చూసుకుంది. ఈ క్రమంలోనే గేమ్‌లో అందరిని చిత్తు చేసి బాగా డబ్బులు సంపాదించింది. గేమ్ ముగిసిన తర్వాత షషీమీ చిన్నపాటి షాక్ ఇచ్చింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత తాను వేసుకొచ్చిన డ్రెస్‌ను అదే టేబుల్‌పై విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె స్తనాలు కనిపించేలా డ్రెస్ వేసుకురాలేదు.. అసలు ఆమె తన స్తనాలను చూపించడం అంతా కల్పితమే. కళ్లను మోసం చేసేలా ఆమె డ్రెస్ ఉండడంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగింది. కానీ గేమ్ ఏదైనా నిజాయితీగా ఆడాలి కానీ.. గెలవడం కోసం ఇంతలా దిగజారడం కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
Electric Breast Massager: మీకు నచ్చినరీతిలో బాడీ షేప్‌ను మలచుకోండిలా!
Wireless Dual Breast Enhancement Massager For Women: స్కిన్ టోన్, ఫేస్ కట్‌తో పాటు.. బాడీ షేప్ కూడా అందానికిచ్చే నిర్వచనంలో భాగమని అందరికీ తెలిసిందే. అందులో ఎద ఆకృతి ప్రత్యేకమని చాలామంది భావిస్తుంటారు. అందుకే తక్కువ కొలతలున్నా, పిల్లలు పుట్టిన తర్వాతనో లేక వయసు పైబడుతున్న కొలదో కొలతల్లో మార్పులు వస్తున్నా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యను స్నేహితుల దగ్గర షేర్ చేసుకోవడానిక్కూడా సిగ్గు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వైర్లెస్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ మసాజర్. ఆడవారు ఈ ప్యాడ్స్(చిత్రంలో ఉన్న కప్స్)ని లోదుస్తుల లోపల అమర్చుకుంటే.. స్మాల్ అండ్ ఫ్లాట్ చెస్ట్ (చిన్నగా లేదా చదునుగా ఉండే బ్రెస్ట్ పెరిగేందుకు), చెస్ట్ సాగ్గింగ్ (జారిన బ్రెస్ట్ పునఃయవ్వనంగా మారేందుకు), చెస్ట్ పెయిన్ తగ్గేందుకు ఇవి దోహదపడతాయి. సిలికాన్‌తో రూపొందిన, హాట్ కంప్రెస్ టెక్నాలజీ కలిగిన 2 సెట్స్ హీటింగ్ మాడ్యూల్స్.. వెచ్చదనాన్ని, వైబ్రేషన్‌ని అందిస్తాయి. పోర్టబుల్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన ఈ మసాజ్ కప్స్‌ని.. వినియోగించడం చాలా సులభం. 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 65 డిగ్రీల వరకూ పెంచుకోవచ్చు. ఒక్కో ప్యాడ్‌లో 11 మసాజ్ హెడ్స్ చొప్పున మొత్తంగా 22 మసాజ్ హెడ్స్ ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే 24 గంటలు పనిచేస్తుంది. ఒక ప్యాడ్ రెడ్ కలర్లో మరో ప్యాడ్ బ్లూ కలర్లో వెలుగుతూ.. చర్మం పునఃయవ్వనంగా మారడానికి, సరికొత్త మెరుపుని సంతరించుకోవడానికి సహకరిస్తాయి. దీని ధర సుమారు 74 డాలర్లు. అంటే 5,497 రూపాయలు. చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!! -
మా కొబ్బరి నీళ్లు తాగితే.. ఓ మురికి యాడ్ వైరల్
బీజింగ్ : సెక్సీయెస్ట్ యాడ్లకు పెట్టింది పేరైన చైనా కంపెనీ కోకోనట్ మిల్క్ బ్రాండ్ కంపెనీ కోకోపామ్ మరోసారి వార్తల కెక్కింది. 2017లో కొబ్బరి నీళ్లు తాగితే అందమైన తెల్లని శరీరం మీ సొంతమంటూ ప్రకటన రూపొందించి వివాదాల్లో ఇరుక్కున్న సంస్థ తాజాగా మరో వివాదంలో వేలుపెట్టింది. ఈసారి మా కొబ్బరి నీళ్లు తాగితే బ్రెస్ట్ సైజ్ పెరిగిపోతుందంటూ అందమైన మోడల్స్‌తో ప్రకటనను మార్కెట్లో విడుదల చేసింది. ఇది తీవ్ర చర్చకు దారితీయడంతోపాటు చైనా సోషల్ మీడియాలో దుమారం రేగింది. వైబో యూజర్లు ఈ యాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి నీళ్ల ప్రకటన నాకు వాంతి తెప్పిస్తోంది (కోకోనట్ మిల్క్ యాడ్ మేక్స్మి వామిట్) అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతోంది. దీంతో కొబ్బరినీళ్లను అమ్మేందుకు ఇలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తుండటంతో చైనాలోని అధికారులు రంగంలోకి దిగారు. తప్పుడు ప్రకటనలపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు తమ ఉద్దేశం అది కాదంటూ సదరు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కాగా 1988లో తొలిసారిగా డ్రింక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ కంపెనీ. -
పాలివ్వడం మా జన్మహక్కు
అది అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం. ఒక ఆఫీసుకు ఒక తల్లి తన నాలుగు నెలల బిడ్డతో పాటు పని ఉండి వచ్చింది. ఆఫీసు రిసెప్షన్ ఏరియాలో కూర్చుని పాలు ఇవ్వడానికి పూనుకుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అభ్యంతర పెట్టాడు. ‘మీ వక్షోజాలు కనపడకుండా కప్పుకోండి’ అన్నాడు. ‘బహిరంగంగా పాలు ఇచ్చే హక్కు నాకుంది’ అని చెప్పిందామె. ‘కాని మీరిక్కడ ఇలా ఇవ్వడానికి లేదు. చాటుకు వెళ్లండి’ అన్నాడతను. మరి కాసేపటిలో ఆమెను అక్కడినుంచి పంపించేశాడు. కాని వెళ్లినతల్లి ఊరుకోలేదు. ఈ విషయాన్ని నలుగురికీ చెప్పింది. తనలా బిడ్డల తల్లులైన మరో పదిహేనుమందితో అదే ఆఫీసుకు చేరుకుంది. వాళ్లంతా ఆ ఆఫీసు రిసెప్షన్లో పిల్లలకు అందరూ చూస్తుండగా పాలు ఇవ్వడం మొదలుపెట్టారు. పిల్లల ఏడుపు, తల్లుల నిరసన... వీటి దెబ్బకు ఆఫీసు వారు దిగి వచ్చారు. ‘ఇంతకు మునుపు జరిగింది తప్పే. పాలు ఇవ్వడం మీ హక్కు’ అని క్షమాపణ పత్రం రాసి ఇచ్చారు. ఈ గోలంతా తెలియని పసికూనలు తల్లి పాలను కమ్మగా గుటకలు వేస్తూ కునుకు తీశారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఒక ఊరు.అక్కడి చర్చ్‌లో ఒక బాలింత ప్రార్థనకు వచ్చింది.చర్చ్‌లో తన బిడ్డకు పాలు ఇవ్వబోయింది.కాని దీనిని చర్చ్ బాధ్యులు అంగీకరించలేదు.ఆమె పాలిచ్చే పద్ధతి వల్ల ఇతరుల ఏకాగ్రత భంగమవుతుంది కనుక ఆమెను చర్చ్ నుంచి బయటకు వెళ్లిపోమ్మన్నారు. లేదా లేడీస్ బాత్రూమ్కు వెళ్లి పాలు ఇవ్వమన్నారు. ఇది ఆమెకు చాలా కోపం తెప్పించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే 1600 మంది దానిని షేర్ చేశారు. ‘పోప్ అంతటివారే స్వయంగా చర్చ్‌లో బిడ్డలకు పాలు ఇవ్వవచ్చునని చెప్పారు. మరి ఎందుకు మమ్మల్ని పాలివ్వకుండా నిరోధిస్తున్నారు?’ అని వారు ప్రశ్నించారు.‘పిల్లలు పాలు తాగడం అంటే వారు భోజనం చేయడం లాంటిది. మనల్ని ఎవరైనా బాత్రూమ్లో భోజనం చేయమని అంటారా? మరి నా బిడ్డ బాత్రూమ్లో ఎందుకు పాలు తాగాలి?’ అని ఆ తల్లి ప్రశ్నించింది.చివరకు ఈ గొడవ మరీ పెద్దదవక ముందే చర్చ్వారు రాజీకి వచ్చారు. తమ చర్చ్‌లో తల్లులు పిల్లలు పాలివ్వవచ్చునని ప్రకటించారు. ఇటీవల అర్జెంటైనాలో మరో సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక బాలింత ఫుట్ పాత్ మీద తన బిడ్డకు పాలివ్వబోయింది.దానిని అక్కడి పోలీస్ వారించాడు. ‘పాలిచ్చేటప్పుడు నీ వక్షం కనపడుతోంది. ఇవ్వొద్దు’ అని వారించాడు. అంతేకాదు ‘చెప్పినా వినకుండా ఇచ్చావంటే నిన్ను అరెస్ట్ చేస్తాను’ అని కూడా హెచ్చరించాడు. అర్జెంటీనాలో బహిరంగంగా చనుబాలు ఇవ్వడం నేరం అని చెప్పే చట్టం ఏదీ లేదు. అయినా కాని ఆ పోలీస్ అలా బెదిరించడంతో ఆ బాలింత ఫేస్‌బుక్‌ను ఆశ్రయించింది. అది పెద్ద ప్రకంపననే సృష్టించింది. దాంతో వందలాది మంది తల్లులు అక్కడి పార్కులో తమ బిడ్డలతో సహా వచ్చి సామూహిక స్తన్యమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో తల్లిపాలు ఇవ్వడం నామోషీగా భావించే ఒక ధోరణి ఉన్న సందర్భంలో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికాలలో స్తన్యమిచ్చే హక్కు కోసం తల్లులు నిరసనలకు దిగడం ఎక్కువయ్యింది. నిన్నగాక మొన్న అంటే నవంబర్ 3వ తేదీన కొలంబియాలోని బొగొటా నగరంలోని ఒక పార్కులో రెండు వేల మంది తల్లులు ఒక పార్కులో చేరి కొన్ని గంటల పాటు బహిరంగంగా (వక్షం కనిపించేలాగా) బిడ్డలకు పాలు ఇస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.‘పిల్లలకు పాలు ఇవ్వడం బూతు కాదు’ అని వారు చేస్తున్న ప్రచారం.‘మర్యాదస్తులు’ పెరిగిపోవడం, ‘సంస్కారాన్ని’ వ్యాఖ్యానించడం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో ఒక తల్లి తన బిడ్డకు ఏ ఆచ్ఛాదన లేకుండా పాలు ఇవ్వడం ఒక ‘కుసంస్కారం’గా భావించడానికి ఆయా దేశాలలోని తల్లులు సహించడం లేదు.‘మన నాగరికత ఎంత వరకూ చేరిందంటే స్తన్యానికి మాతృత్వ భావన పోయి కేవలం శృంగారభావన మాత్రమే మిగిలింది’ అని ఒక తల్లి వ్యాఖ్యానించింది.భారతదేశంలో పల్లెల్లో అందరూ చూస్తుండగా పాలివ్వడం తల్లులు, చూపరులు తప్పుగా భావించరు. కాని పట్టణాల్లో, నగరాల్లో ‘బ్రెస్ట్‌ఫీడ్ రూమ్స్’ అని కొన్ని తయారయ్యాయి. లేదంటే చాటుగా ఇచ్చే పరిస్థితి అలిఖితంగానే ఉంది. లేదా మనకు చీరకట్టు వల్ల పవిట ఒక సౌలభ్యం కావడంతో పవిట చాటు నుంచి పాలు ఇచ్చే సౌకర్యం ఉంది. కాని పాశ్చాత్య వస్త్రధారణలో వక్షాన్ని చాటు చేసుకోవడం అన్నిసార్లు సాధ్యం కాదు. వక్షం కనపడుతుండగా పాలు ఇవ్వడానికి బహిరంగ ప్రదేశాలలో కొందరు తప్పు పట్టడం, అభ్యంతరం వ్యక్తం చేయడం తల్లులు సహించలేకపోతున్నారు. పాలివ్వడం మా జన్మహక్కు అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగి వెళ్లడం మనిషి అలవాటు చేసుకున్నాడు. తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుంటే ఆమెకు సౌకర్యాన్ని కలిగిస్తూ తన దారిన తాను ఎందుకు వెళ్లలేకపోతున్నాడు?‘బిడ్డకు ఆకలి వేసే టైమే పాలిచ్చే టైమ్. అది ఎక్కడ ఎలా ఉంటే అక్కడ ఇచ్చి తీరాల్సిందే’ అని ఒక పసిబిడ్డ తండ్రి పాలిస్తున్న తన భార్యను చూస్తూ అన్నాడు బొగొటా నగరం పార్కులో.బిడ్డ ఆకలితో ఉన్నా వక్షం కనిపిస్తుందన్న భయంతో పాలు పట్టకుండా ఉండటం కంటే దారుణమైన సంగతి మరొకటి లేదని తల్లులు వాదిస్తున్నారు.‘వక్షం కనిపించేలా పాలు ఇచ్చే మా హక్కును ఎవరూ కాదనలేరు’ అని వారు నినదిస్తున్నారు.అయినా కొన్ని రెస్టారెంట్లు, పబ్లిక్ ప్లేసుల నిర్వాహకులు, ప్రయాణ సాధనాల ఆపరేటర్లు ఈ విషయంలో తమ సంస్కార స్థాయిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి.భారతదేశంలోని నగరాలలో ఉన్న తల్లులు ఇంకా ఈ సమస్యను సమస్యగా చెప్పే పరిస్థితిలో లేరు. ‘సాంస్కృతిక రక్షణ’ పెచ్చు మీరితే వారూ గొంతెత్తే రోజు దూరంలో లేదు.ఒక్కటి మాత్రం నిజం– తన బిడ్డకు పాలివ్వకుండా తల్లిని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉండదు. కరెక్ట్ అవ్వాల్సింది మనమే... తల్లులు కాదు. ఫేస్‌బుక్‌కు బడితెపూజ ఫేస్బుక్లో కొన్నిసార్లు తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చే ఫొటోలను పోస్ట్ చేస్తే ఫేస్బుక్ తన నియమావళిలో భాగంగా వాటిని తొలిగించడం కొంతమంది తల్లులకు నచ్చలేదు. ‘అవి అశ్లీలం కిందకే వస్తాయి’ అనే ఫేస్బుక్ వాదనను వారు తిరగ్గొట్టారు. ‘ఒక డేటింగ్ కంపెనీవాళ్ల యాడ్‌లో అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని మీరెందుకు తీసేయలేదు’ అని వారు ప్రశ్నించారు. అంతే కాదు వేలాది మంది తల్లులు ఒక విజ్ఞాపనను సంతకం చేసి ఫేస్‌బుక్‌కు పంపారు. దాని సారాంశం ‘బిడ్డలకు పాలు ఇవ్వడం ఆశ్లీలం కాదు’ అని చెప్పడమే. -
పెరిగే వయసు... తగ్గే అవకాశాలు
సందేహం నా వయసు 29. ఈ మధ్యనే పెళ్లయ్యింది. నాకు కొన్నాళ్లు సంతోషంగా ఎంజాయ్ చేసి, తర్వాత పిల్లల్ని కనాలని ఉంది. కానీ త్వరగా బిడ్డని కనకపోతే ఇబ్బందులు వస్తాయని మావాళ్లు అంటున్నారు. అది నిజమేనా? ఇంకొక సంవత్సరం ఆగవచ్చా? లేక వెంటనే పిల్లల్ని కనేయమంటారా? ఒకవేళ ఆగవచ్చు అంటే ప్రత్యేక జాగ్రత్తలేమైనా తీసుకోవాలా? - పి.సారిక, ఖమ్మం సాధారణంగా ఆడవారిలో 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు పిల్లల్ని కనడానికి కావలసిన ప్రక్రియకు సంబంధించిన హార్మోన్స్, అవయవాలు, అండాశయాల పనితీరు.. అన్నీ సక్రమంగా ఉంటాయి. 30 సంవత్సరాలు దాటే కొద్దీ ప్రక్రియ మెల్లగా మందగించడం ప్రారంభమవుతుంది. దాంతో హార్మోన్ల తేడాలు, అండం నాణ్యత కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. దానివల్ల అబార్షన్లు, పిండంలో అవయవ, జన్యుపరమైన లోపాలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. 33 సంవత్సరాలు దాటితే ఈ సమస్యలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఇప్పుడు 29 సంవత్సరాలు కాబట్టి, మీకు సంతోషంగా గడపాలని ఉంటే ఆరునెలలు గ్యాప్ తీసుకుని త్వరగా గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. ఇంకా ఎక్కువ అంటే ఒక సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలం ఆగకపోవడమే మంచిది. ఈ గ్యాప్ కోసం మీరు low dose oral contraceptive pillsప్రతినెలా పీరియడ్ మొదలైన మూడో రోజు నుంచి 21 రోజుల వరకు వాడొచ్చు. లేదా మీవారు కండోమ్స్‌ను జాగ్రత్తగా వాడుకోవచ్చు. కానీ కండోమ్స్ ఫెయిలై గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఫెయిలైనా.. గర్భం ఉంచుకునే ఉద్దేశం ఉంటే కండోమ్స్ వాడొచ్చు. నా వయసు 20. ఆరోగ్యంగానే ఉంటాను. అయితే ఈ మధ్య నా రొమ్ముల్లో తేడా గమనించాను. ఎడమ రొమ్ము కాస్త చిన్నగా ఉంది. అలాగే అందులో చిన్న చిన్న గడ్డలు రెండు ఉన్నాయి. దాంతో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లాను. పరీక్షలు చేసి ఏ సమస్యా లేదు, క్యాన్సర్ కాదని చెప్పారు. అయితే పిల్లలు పుట్టినప్పుడు పాలు రాకపోతే వేరే పరీక్షలు చేస్తాం అన్నారు. అంటే ఏంటి? ఒకవేళ పాలే రాకపోతే ఏం పరీక్షలు చేస్తారు? అదేమైనా ప్రమాదకరమైన సమస్యా? - చంద్రకళ, మెయిల్ కొందరిలో రొమ్ములు పెరిగే క్రమంలో, ఒకటి పెద్దదిగా మరొకటి చిన్నదిగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి సమస్యా ఉండదు. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరి రొమ్ముల్లో అటు ఇటు కదలాడే నొప్పి లేని చిన్న గడ్డలు ఏర్పడుతుంటాయి (హార్మోన్ల తేడా వల్ల ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి - ఇవి క్యాన్సర్ గడ్డలు కావు). వాటినే ఫైబ్రో అడినోమా (Fibro adenoma)అంటారు. అవి పెరగకుండా ఉంటే ఫర్వాలేదు. కానీ అవి మరీ పెద్దగా పెరిగిపోతుంటే మటుకు ఆపరేషన్ చేసి తీసివేయవలసి వస్తుంది. ఆ గడ్డలు చిన్నగా ఉంటే పాలు రావటానికి ఎలాంటి సమస్యా ఉండదు. రొమ్ము చిన్నదైనా బిడ్డ దాన్ని చీకే కొద్దీ, పాలగ్రంథులు ప్రేరణకు గురై పాల ఉత్పత్తి జరుగుతుంది. అంతేకానీ పాలు రాకపోతే ప్రత్యేకంగా దానికోసమంటూ ఎలాంటి పరీక్షలు లేవు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డా.వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
కుటుంబ నియంత్రణ... ఆడవాళ్లే పాటించాలా?
సందేహం నా వయసు 32. నాకు చాలాకాలంగా వక్షోజాల్లో గడ్డలు ఉన్నాయి. పట్టుకుంటే చాలా పెద్దగా తగులుతాయి. నెలసరి రావడానికి పది రోజుల ముందు నుంచీ చాలా నొప్పిగా ఉంటాయి. నెలసరి మొదలవగానే తగ్గిపోతాయి. అయితే ఈ మధ్య ఎప్పుడూ నొప్పిగానే అనిపిస్తున్నాయి. కలయిక సమయంలో కూడా కాస్త గట్టిగా ఒత్తినా తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఈ గడ్డల వల్ల ఏదైనా ప్రమాదమా? అలాగే నాకు చంకల్లో కూడా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ గడ్డలో కాదో ఎలా తెలుసుకోవాలి? క్యాన్సర్ గడ్డలకి ఏవైనా ప్రత్యేక లక్షణాలు ఉంటాయా? - పి.రోహిణి, కాకినాడ చాలామందికి వక్షోజాల్లో ఫైబ్రో అడినోమా అనే క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి. ఇవి చిన్న బఠాణి గింజ అంత సైజు మొదలుకొని నిమ్మకాయంత సైజు వరకు పెరుగుతుంటాయి. ఇవి ముట్టుకుంటే గట్టిగా ఉండి లోపల అటూ ఇటూ కదులుతుంటాయి. వీటివల్ల ప్రమాదముండదు. కాకపోతే సైజు పెరిగేకొలదీ రొమ్ములో నొప్పి, బిగుతుగా ఉండటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. రొమ్ములో వచ్చే అన్ని గడ్డలూ క్యాన్సర్ గడ్డలు కావు. కొన్ని రకాల గడ్డలు చాలా త్వరత్వరగా సైజు పెరుగుతూ లోపల కదలకుండా ఉండి, పైన చర్మం కూడా లోపలికి లాక్కునట్టుగా ఉంటే అవి క్యాన్సర్ గడ్డలు కావచ్చు. కొందరికి చంకల్లో లింఫ్‌నోడ్స్ ఉంటాయి. అవి సాధారణంగా చేతికి తగలవు. రొమ్ములో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లగాని, టీబీ వల్లగాని చాలా అరుదుగా క్యాన్సర్ వల్లకానీ ఇవి ఉబ్బి... చిన్న చిన్న గడ్డల్లాగా తగులుతుంటాయి. కాబట్టి మీరు ఓసారి డాక్టర్‌ను సంప్రదించి పరీక్ష చేయించు కోండి. అల్ట్రా సౌండ్ బ్రెస్ట్, మామోగ్రామ్ చేయించుకుని వాటిలో ఏదైనా సందేహం ఉంటే నిర్ధారణ కోసం ఊూఅఇ లేదా బయాప్పీ చేయించుకోండి. అప్పుడు అవి క్యాన్సర్ గడ్డలా కాదా అనే నిర్ధారణ అయిపోతుంది. దాన్ని బట్టి చికిత్స చేయించుకోవచ్చు. పీరియడ్స్‌కి పది నుంచి పదిహేను రోజుల ముందు నుంచీ చాలామందిలో హార్మోన్ల లోపం వల్ల, కొన్ని మినరల్స్ తక్కువ ఉండటం వల్ల రొమ్ముల్లో నీరు చేరి బరువుగా ఉండటం, నొప్పిగా ఉండటం జరుగుతుంది. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ మాస్టాల్జియా అంటారు. మీరు కంగారు పడకుండా, ఇంకా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. తగిన పరీక్షలు చేయించుకుని గడ్డలు ఎలాంటివో నిర్ధారించుకుంటే, దానిబట్టి తగిన చికిత్స తీసుకోవచ్చు. నా వయసు 23. ఈ మధ్యనే పెళ్లి అయ్యింది. అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. దానికోసం మాత్రలు వాడుతున్నాను. అయితే ఈ మాత్రలు ఎక్కువ వాడితే ప్రమాదం, లూప్ వేయించు కొమ్మని నా ఫ్రెండ్ చెప్తోంది. నిజమేనా? ఇంకో విషయం ఏమిటంటే... విదేశాల్లో పురుషులకు కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయని ఆ మధ్య ఇంటర్నెట్లో చదివాను. అది నిజమేనా? అలాంటివి మన దగ్గర లేవా? - వీణాసాగర్, సికింద్రాబాద్ కుటుంబ నియంత్రణ కోసం పురుషులు వాడటానికి మాత్రలు, ఇంజెక్షన్లు ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. శుక్రకణాలు తయారవ్వకుండా ఉండటానికి, బయటకు విడుదల కాకుండా ఉండటానికి, కదలిక లేకుండా ఉండటానికి రకరకాల హార్మోన్లు, ఇతర కాంబినేషన్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి కోసం ఎదురు చూడకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం మంచిది. ఇరవై నుంచి ముప్ఫై సంవత్సరాల వారు వేరే ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ రెండు నుంచి మూడేళ్ల పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడవచ్చు. లూప్ సాధారణంగా ఒక కాన్పు అయినవారికే వేస్తారు. అలా వేయడం మంచిది కూడా. కాబట్టి మీరు కంగారు పడకుండా డాక్టర్ని సంప్రదించండి. వారి సూచన మేరకు మాత్రలు వాడండి. ఇప్పుడు వచ్చే అతి తక్కువ మోతాదు హార్మోన్ పిల్స్ వల్ల సమస్యలేమీ ఉండవు. నా వయసు 26. పెళ్లై రెండేళ్లవుతోంది. ఏడు నెలల బాబు ఉన్నాడు. డెలివరీ అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నిజానికి నేను చాలా యాక్టివ్. చకచకా తిరుగుతూ నా పనులన్నీ నేనే చేసేసుకుంటాను. అందరితో కలివిడిగా ఉంటాను. కానీ ఇప్పుడలా లేదు. ఎందుకో తెలియదు కానీ దేని మీదా ఆసక్తి లేదు. ఏ పనీ చేయబుద్ధి కావడం లేదు. ఎవరితోనైనా మాట్లాడటం కూడా నచ్చట్లేదు. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. దిగులుగా అనిపిస్తోంది. ఎందుకు నాలో ఈ మార్పు వచ్చిందో అర్థం కావడం లేదు. మా ఆయన కూడా నేను చాలా మారిపోయాను అంటున్నారు. ఇది డెలివరీ వల్లే అయ్యిందా లేక ఏదైనా మానసిక సమస్యా? - లతాశ్రీ, ఇస్నాపూర్, మెదక్ డెలివరీ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, మానసిక శారీరక సమస్యలు, ఇంకా మరెన్నో కారణాల వల్ల కొంతమంది డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. చికాకు, కోపం, టెన్షన్, బాధ, ఏడుపు రావడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, దేని మీదా ఆసక్తి లేకపోవడం, త్వరగా అలసిపోవడం, కన్ఫ్యూజన్, మతిమరుపు వంటి ఎన్నో లక్షణాలు రకరకాల తీవ్రతలో ఉంటాయి (అయితే అందరికీ అన్ని లక్షణాలూ ఉండవు). కొంతమందికి కాన్పు తర్వాతి నుంచి రెండు మూడు వారాల వరకు ఉంటాయి. దానినే పోస్ట్‌పార్టమ్ బేబీ బ్లూస్ అంటారు. కొందరిలో ఆరు నెలల వరకూ లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనిని పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఇంకా తీవ్రమై చాలాకాలం పాటు కొనసాగుతుంది. కాన్పు తర్వాత ఆక్ట్రోజిన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు ఉన్నట్టుండి తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలు రావచ్చు. బిడ్డతో నిద్ర లేకపోవడం, బిడ్డ పనులు ఎక్కువ ఉండటం, ఇంట్లో పనులతో అలసిపోవడం, శరీరంలో వచ్చిన మార్పుల వల్ల భర్త తనని పట్టించుకోడేమోనన్న భావన వంటి ఎన్నో కారణాల వల్ల కూడా ఈ లక్షణాలు తలెత్తవచ్చు. ఆర్థిక సమస్యలు, ఇంట్లో సపోర్ట్ కరువైనప్పుడు కూడా రావచ్చు. వీటి నుంచి బయటపడాలంటే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. అందరూ మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. కొద్దిరోజుల పాటు బిడ్డకు పాలు పట్టడం ఇతరత్రా పనుల్లో సహాయంగా ఉండాలి. మీరు మీ సమస్యను మీ భర్తతోను, మిగతా వాళ్లతోనూ చర్చించండి. వాళ్ల సహాయం తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. వాకింగ్, ప్రాణాయామం వంటివి అలవర్చుకోండి. తగినంత ఆహారం తీసుకోండి. అప్పటికీ తగ్గకపోతే సైకియాట్రిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. అవసరమైతే సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కొంతకాలం మందులు కూడా వాడాల్సి ఉంటుంది. నా వయసు 36 సంవత్సరాలు. నాకు ఇరవై యేళ్లకే పెళ్లయ్యింది. కానీ కొన్ని నెలలు తిరక్కుండానే నా భర్త చనిపోయారు. తర్వాత ఒంటరిగానే ఉండిపోయాను. పెళ్లి చేసుకోవాలని లేదు. అయితే ఈ మధ్య ఎందుకో ఓ బిడ్డ ఉంటే బాగుణ్ను అనిపిస్తోంది. భర్తతో సంబంధం లేకుండా బిడ్డను కనడానికి ఏయే పద్ధతులు ఉన్నాయి? ఎంత ఖర్చవుతుంది? నా వయసు దృష్ట్యా అది వీలవుతుందా? దయచేసి సలహా ఇవ్వండి. - సుమిత్ర, రాజమండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాలంటే డోనర్ ఐయూఐ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. అంటే మీకు అండం విడుదలయ్యే సమయంలో దాత నుంచి సేకరించిన వీర్యకణాలను గర్భాశయంలోకి పంపడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు ఈ పద్ధతిని మూడు నుంచి ఆరుసార్ల వరకూ ప్రయత్నించవచ్చు. తర్వాత కూడా గర్భం రాకపోతే డోనర్ వీర్యకణాలతో టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. కాని భర్త లేకుండా ఈ పద్ధతుల ద్వారా బిడ్డను కనడానికి మన దేశంలో చట్టరీత్యా అనుమతి లేదు. అయినా జీవితాంతం మీకూ ఓ తోడు కావాలి కాబట్టి మరోసారి పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించండి. 36 సంవత్సరాలైనా ఫర్వాలేదు. పెళ్లి చేసుకుని, మూడు నుంచి ఆరు నెలల వరకూ సాధారణ గర్భం గురించి ప్రయత్నం చేయవచ్చు. ఫలితం లేకపోతే ఐయూఐ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా కూడా ప్రయత్నించవచ్చు. కాకపోతే 35 యేళ్లు దాటిన తర్వాత పుట్టే పిల్లల్లో అవయవ లోపాలు, జన్యుపరమైన సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. వాటికి తగ్గ పరీక్షలు చేయించుకుంటూ గర్భాన్ని కొనసాగించవచ్చు. ఇవన్నీ ఇష్టం లేకపోతే, ఇంక పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నట్లయితే అనాథ శరణాలయం నుంచి ఎవరైనా ఓ చిన్నబిడ్డను దత్తత తీసుకోండి. ఓ అనాథ బిడ్డకు బతుకునిచ్చినవారు అవుతారు. నా వయసు 23. పెళ్లై రెండేళ్లయ్యింది. రెండు నెలలకే గర్భం దాల్చాను. కవలలు పుట్టారు. నార్మల్ డెలివరీనే. ఆ తర్వాత మళ్లీ నెలసరి మొదలయ్యింది. అయితే సమస్య ఏమిటంటే నాకు మొదట్నుంచీ కూడా పీరియడ్స్ సమస్యలేమీ లేవు. కానీ డెలివరీ అయ్యాక పీరియడ్స్‌లో మార్పు వచ్చింది. బ్లీడింగ్ విపరీతంగా అవుతోంది. ఇంతకుముందు మూడు రోజులకే తగ్గేది ఇప్పుడు ఐదారు రోజుల తర్వాత గానీ తగ్గట్లేదు. పైగా భరించలేనంత కడుపునొప్పి వస్తోంది. ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనేం చేయాలి? - యు.మేరీమణి, కడపర్తి కొంతమందికి కాన్పు తర్వాత హార్మోన్లలో మార్పులు వస్తాయి. వాటి వల్ల లేదా హార్మోన్లలో లోపాలు, బరువు పెరగడం వంటి వాటి వల్ల పీరియడ్స్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ప్రతినెలా మూడు రోజుల పాటు ట్రనెక్సమిక్ యాసిడ్, మెఫినమిల్ యాసిడ్ కలిసిన మాత్రలు రోజుకు రెండు నుంచి మూడు వాడి చూడండి. అయినా ఫలితం లేకపోతే గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్ తీయించుకుంటే... గర్భాశయంలో లేదా అండాశయాల్లో నీటి తిత్తుల వంటివి ఉన్నాయేమో తెలుస్తుంది. సమస్యను బట్టి చికిత్స తీసుకోవచ్చు. ఒకవేళ బరువు పెరిగివుంటే తగ్గడానికి ప్రయత్నించండి. థైరాయిడ్ వంటి హార్మోన్లలో మార్పులు ఉంటే వాటికి కూడా తగిన చికిత్స తీసుకోండి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
ఆరోగ్యంగానే ఉన్నా...టెస్ట్ ఎందుకు?
సందేహం నా వయసు 24. మరో రెండు నెలల్లో నా పెళ్లి. నా వక్షోజాలు చాలా చిన్నగా ఉంటాయి. వక్షోజాలు పెద్దగా ఉండేవాళ్లనే పురుషులు ఇష్టపడతారని ఎక్కడో చదివాను. మరి నా స్తనాల సైజు పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఇంజెక్షన్ ఉందని విన్నాను. నిజమేనా? - దీపిక, రాజమండ్రి మీ బరువు ఎంతో రాయలేదు. ఛాతీ అనేది శరీర బరువును బట్టి కూడా ఉంటుంది. వక్షోజాల్లో కొవ్వు, పాల గ్రంథులు, కనె క్టివ్ టిష్యూ ఉంటాయి. బరువు తక్కువగా ఉంటే బ్రెస్ట్‌లో కూడా కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి వక్షోజాల సైజు కూడా తక్కువే ఉంటుంది. మీరు కనుక సన్నగా ఉంటే పాలు, పండ్లు, సోయాబీన్స్, డ్రైఫ్రూట్స్ వంటి పౌష్టికాహా రాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల శరీరంతో పాటు వక్షోజాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్లో దొరికే ఇంజెక్షన్లు, క్రీములు, జెల్స్ తాత్కాలికంగా మార్పును చూపిస్తాయి తప్ప వాడటం మానేయగానే వక్షోజాలు మామూలు సైజుకే వచ్చేస్తాయి. పైగా వాటివల్ల అలర్జీ, దురదలు, బొబ్బలు వంటి దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ ఇంప్లాంట్స్ లాంటివి ఉన్నా వాటి వల్ల కూడా దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైన ప్రయోగాల జోలికి పోకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ బ్రెస్ట్ మసాజ్, బ్రెస్ట్ ఎక్సర్సైజులు చేయండి. అంతవరకూ కావాలంటే ప్యాడెడ్ బ్రాలు వాడండి. నా వయసు 30. మా వారికి 35. పెళ్లయ్యి 6 నెలలు అవుతుంది. నాకు పీరియడ్స్ కరెక్టుగానే వస్తాయి. మా ఇద్దరి వయస్సు ఎక్కువగా ఉంది కదా. తొందరగా గర్భం దాల్చితే బాగుంటుంది అను కుంటున్నాం. రోజూ రెగ్యులర్‌గానే కలుస్తాం. కానీ కలిసిన తర్వాత వీర్యం అంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదేమోనని సందేహం. డాక్టర్ని సంప్రదించాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - విజయ, గుంటూరు సాధారణంగా, ఎటువంటి సమస్యా లేనప్పుడు, 80 శాతం దంపతులు పెళ్లైన సంవత్సరం లోపే గర్భం దాలుస్తారు. మిగతా 20 శాతం మందిలో 15 శాతం - 2 సంవత్సరాలలో గర్భం దాలు స్తారు. 5 శాతం మందిలోనే సమస్యలు ఉండవచ్చు. మీకు పెళ్లయ్యి 6 నెలలే కాబట్టి, ఇంకా ఆర్నెల్లు ప్రయత్నించవచ్చు. సాధారణంగా కలయిక తర్వాత, భర్త నుంచి విడుద లయ్యే వీర్యం 3-5 ఎం.ఎల్. యోని భాగంలో చేరుతుంది. వీర్యం, దానిలో ఉండే కదిలే వీర్యకణాలు మాత్రమే యోనిలో నుంచి, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భా శయంలోకి ప్రవేశిస్తాయి. మిగతా ద్రవం, నీళ్లలా ఉండే వీర్యం బయటకు వస్తుంది. కొంత మందిలో ఎక్కువగా విడుదలైనప్పుడు వెంటనే వస్తుంది, కొందరిలో కొంతసేపటి తర్వాత జెల్లాగా ఏర్పడి మెల్లగా వస్తుంది. దాని వల్ల సమస్య ఏమీలేదు. కలయిక ముందు ఆడవాళ్ల నడుం కింద దిండు పెట్టుకుంటే, యోనిలో వీర్యం ఎక్కువసేపు ఉండి, వీర్యకణాలు ఎక్కువగా సర్విక్లో నుంచి గర్భాశయం లోకి వెళ్తాయి. వీర్యం అయితే మెల్లగా బయటికే వస్తుంది. వెంటనే పైకి లేవ కుండా, 10-15 నిమిషాలు పడుకొనే ఉండటం మంచిది. అలా ఇంకొక ఆర్నెల్లు ప్రయత్నించవచ్చు. లేదు వయసు పెరుగు తోందని ఆందోళనగా ఉంటే, సిగ్గు పడ కుండా డాక్టర్ని కలిసి వేరే సమస్యలున్నా యేమో పరీక్ష చేయించుకుంటే మంచిది. నా వయసు 26. పెళ్లయ్యి మూడేళ్లయింది. పీరియడ్స్ 45 రోజులకొకసారి వస్తాయి. పిల్లలు లేరు. డాక్టర్ని సంప్రదిస్తే రక్తపరీక్షలు, స్కానింగ్ చేసి, అండం తయారవటం లేదని మందులిచ్చారు. ఆరు నెలల నుంచి వాడుతు న్నాను. మూడు నెలల నుంచి ఫాలిక్యులర్ స్టడీ చేసి మందుల వల్ల అండం తయారవుతుందని చెప్పారు. మా ఆయనకు వీర్య పరీక్ష చేయించ మన్నారు. మా ఆయన, నేను ఆరోగ్యంగానే ఉన్నాం. మరి టెస్ట్ ఎందుకు? - నాగశ్రీ, కర్నూలు గర్భం రాకపోవటానికి, 100లో 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, 30 శాతం ఇద్దరిలో లోపాలుండవచ్చు. గర్భం దాల్చని ఆడవారిలో 70 శాతం మందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం తయారు కాదు. మిగతా 30 శాతంలో ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం, ఇన్ఫెక్షన్లు, ఎండో మెట్రియో సిస్, ఇంకా ఇతర కారణాల వల్ల కావచ్చు. ఇప్పుడు మీకు మందుల వల్ల అండం విడుదలవుతుంది కాబట్టి, మీ ఆయన వీర్యపరీక్ష తప్పనిసరిగా చేయించాలి. వీర్యకణాలు సరిపడా ఉన్నాయా, వాటి కదలిక సరిగా ఉందా లేదా వంటివాటిని చూడాలి. మగవారు ఆరోగ్యంగా ఉండటానికి, వీర్యకణాలకు సంబంధం లేదు. వారు ఆరోగ్యం గానే ఉన్నా, హార్మోన్ల అసమతుల్యత వల్ల, వీర్యకణాలు వచ్చే దారిలో ఏదైనా అడ్డంకి ఉన్నా, వీర్యకణాల ఉత్పత్తిలో తేడా ఉన్నా ఇబ్బందే. అలాగే ఇన్ఫెక్షన్లు, వీర్యకణాలు తక్కువ ఉండటం, కదలిక తక్కువ ఉండటం లేదా అసలే లేకపోవడం కూడా జరగొచ్చు. కాబట్టి వీర్యపరీక్ష కచ్చితంగా చేయించు కోవాలి. మీరు ఇన్ని పరీక్షలు చేయించు కుని, ఇన్ని మందులు వాడుతున్నప్పుడు మీ ఆయన చిన్న, సులువైన వీర్యపరీక్ష చేయించుకోవడంలో తప్పులేదు కదా. ఒకవేళ, వీర్యకణాలు సరిగా లేనప్పుడు, మీరు ఒక్కరే మందులు వాడినా లాభం లేదు కదా. మందులు ఊరకనే వాడి, డబ్బులు కూడా వృథా! - డా॥వేనాటి శోభ