
Wireless Dual Breast Enhancement Massager For Women: స్కిన్ టోన్, ఫేస్ కట్‌తో పాటు.. బాడీ షేప్ కూడా అందానికిచ్చే నిర్వచనంలో భాగమని అందరికీ తెలిసిందే. అందులో ఎద ఆకృతి ప్రత్యేకమని చాలామంది భావిస్తుంటారు. అందుకే తక్కువ కొలతలున్నా, పిల్లలు పుట్టిన తర్వాతనో లేక వయసు పైబడుతున్న కొలదో కొలతల్లో మార్పులు వస్తున్నా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యను స్నేహితుల దగ్గర షేర్ చేసుకోవడానిక్కూడా సిగ్గు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వైర్‌లెస్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ మసాజర్.
ఆడవారు ఈ ప్యాడ్స్(చిత్రంలో ఉన్న కప్స్)ని లోదుస్తుల లోపల అమర్చుకుంటే.. స్మాల్ అండ్ ఫ్లాట్ చెస్ట్ (చిన్నగా లేదా చదునుగా ఉండే బ్రెస్ట్ పెరిగేందుకు), చెస్ట్ సాగ్గింగ్ (జారిన బ్రెస్ట్ పునఃయవ్వనంగా మారేందుకు), చెస్ట్ పెయిన్ తగ్గేందుకు ఇవి దోహదపడతాయి.
సిలికాన్‌తో రూపొందిన, హాట్ కంప్రెస్ టెక్నాలజీ కలిగిన 2 సెట్స్ హీటింగ్ మాడ్యూల్స్.. వెచ్చదనాన్ని, వైబ్రేషన్‌ని అందిస్తాయి. పోర్టబుల్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన ఈ మసాజ్ కప్స్‌ని.. వినియోగించడం చాలా సులభం. 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 65 డిగ్రీల వరకూ పెంచుకోవచ్చు. ఒక్కో ప్యాడ్‌లో 11 మసాజ్ హెడ్స్ చొప్పున మొత్తంగా 22 మసాజ్ హెడ్స్ ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే 24 గంటలు పనిచేస్తుంది. ఒక ప్యాడ్ రెడ్ కలర్‌లో మరో ప్యాడ్ బ్లూ కలర్‌లో వెలుగుతూ.. చర్మం పునఃయవ్వనంగా మారడానికి, సరికొత్త మెరుపుని సంతరించుకోవడానికి సహకరిస్తాయి. దీని ధర సుమారు 74 డాలర్లు. అంటే 5,497 రూపాయలు.