Massage Therapy
-
హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్!
ఏ డ్రెస్ వేసుకున్నా.. అతికినట్టు సరిపోవాలంటే బాడీ సరైన షేప్‌లో ఉండాలి. అందుకే స్లిమ్ అండ్ ఫిట్ షేప్ కోసం నానాతంటాలు పడేది! ఆ కష్టాన్నించి గట్టెక్కించేదే ఈ మసాజర్. ఇది చక్కటి శరీరాకృతిని అందిస్తుంది. దీన్ని సాధారణ సమయాల్లోనే కాదు.. స్నానం చేస్తున్నప్పుడూ వాడుకోవచ్చు. సాధారణంగా మెషిన్స్‌కి వాటర్ తగిలితే పనిచేయవు. కానీ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందిన మెషిన్ కాబట్టి.. వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దాంతో స్నానం చేస్తూ కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. మొదట ఏదైనా ఆయిల్ లేదా స్కిన్ టైటెనింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకుని.. ఈ మసాజర్‌తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మొత్తం 8 రోలర్లు, 13 ప్రోట్రూషన్ లతో కూడిన ఈ బ్యూటీ మసాజర్.. ఒత్తిడిని దూరం చేస్తుంది. డివైస్‌కి అమర్చుకునే రోలర్స్.. నాలుగు నాలుగు చొప్పున రెండు పార్ట్స్‌గా అమర్చి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. మసాజ్ సమయంలో స్పీడ్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇది కొవ్వును తగ్గిస్తూ యవ్వనంగా మారుస్తుంది. ఈ డివైస్‌తో పాటు.. ఎసిటినో 5డి డిజైనింగ్ క్రీమ్ కూడా లభిస్తుంది. దీన్ని విడిగా కూడా మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫిట్నెస్ సెంటర్స్‌కి వెళ్లాల్సిన పని లేకుండానే.. ఈ డివైస్ మిమ్మల్ని నాజూగ్గా, స్లిమ్‌గా మారుస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే.. సుమారు 30 గంటల పాటు పని చేస్తుంది. కాళ్లు, చేతులు, నడుము, మెడ, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని మెత్తటి క్లాత్ లేదా టిష్యూ సాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వినియోగించడం.. ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం అంతా సులభమే. దీని ధర 207 డాలర్లు. అంటే 17,167 రూపాయలు. ఇవి చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే! -
ఈ రోలర్‌తో నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతం!
ఈ ఫేస్ లిఫ్టింగ్ రోలర్. కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మం, మృదువైన పెదవులతో పాటు బుగ్గలు, మెడ చుట్టూ.. నుదుటి పైన.. చేతులు, కాళ్లు, తొడలు, నడుము ఇలా ప్రతి పార్ట్‌లోనూ ఈ రోలర్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కిన్ టోన్ – లిఫ్ట్ జెర్మేనియం కాంటౌరింగ్ మసాజ్ రోలర్‌కి కిందవైపు జెర్మేనియం మసాజ్ హెడ్ అటాచ్ అయ్యి ఉంటుంది. పైభాగంలో అమర్చుకోవడానికి.. 2 చిన్నచిన్న స్టోన్ మసాజర్లు, ఒక చిన్న జెర్మేనియం మసాజ్ హెడ్ అదనంగా లభిస్తాయి. అవసరాన్ని బట్టి ఆ మూడింటిలో ఒకదాన్ని మార్చుకుంటూ, మసాజ్ చేసుకోవచ్చు. ఇది ముఖవర్చస్సును పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే వయసుతో వచ్చే వృద్ధాప్య ఛాయలను మాయం చేస్తుంది. ముడతలను ఇట్టే పోగొడుతుంది. ఇందులోని రెండు జెర్మేనియం మసాజ్ రోలర్స్ మీదున్న ఆక్యుప్రెషర్ ప్యాడ్స్.. శరీరకణజాలలను ఉత్తేజపరచేందుకు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తాయి. దాంతో చర్మం బిగుతుగా మారుతుంది. ఆరోగ్యంగా నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. దీనితో ఒక్కో భాగం వద్ద సుమారు 30 నుంచి 60 సెకన్స్ పాటు.. క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవచ్చు. సాధారణ మసాజ్ ప్రోసెస్‌ని ఫాలో అవుతూ.. కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించిన అనంతరం నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ టూల్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉంది. ధర 21 డాలర్లు (1,742 రూపాయలు) ఉంటుంది. (చదవండి: నటి మల్లికా అరోరా ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే..!) -
క్లెన్సింగ్ నుంచి ఫేషియల్ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్ ఉంటే చాలు
ఇప్పుడు టెక్నాలజీ అందిస్తున్న సౌందర్య సాధనాలకు కొదవలేదు. అలాంటి వాటిల్లో ఒకటే.. త్రీడీ వైబ్రేషన్‌తో ఎల్ఈడీ థెరపీ.. స్లైడ్ టచ్ పాడ్‌తో రూపొందిన ఈ అత్యాధునిక ఫేషియల్ మసాజర్. ఇది ఆరు రకాల స్కిన్ కేర్ మోడ్స్‌ని అందిస్తోంది.ఇందులోని ఎల్ఈడీ లైట్స్ 5 కలర్స్‌లో వైబ్రేషన్స్‌ను ఇస్తాయి. దీనిలోని క్లీనప్ మోడ్‌తో మేకప్ తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది మూడు నిమిషాల పాటు పనిచేస్తుంది. ఐ జోన్ మోడ్‌తో కళ్ల చుట్టూ ఉండే ముడతలను, నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు. ఇది 2 నిమిషాల పాటు పనిచేస్తుంది. మాయిశ్చర్ మోడ్‌తో చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనికి మూడు నిమిషాల సమయం పడుతుంది. లిఫ్టింగ్ మోడ్‌తో వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీనికి కూడా మూడు నిమిషాల సమయం పడుతుంది. మాస్క్ మోడ్‌తో ఫేషియల్ మాస్క్ షీట్స్‌పై మసాజ్ చేయడంతో.. చర్మానికి అదనపు సౌందర్యం వస్తుంది. దీనికి 5 నిమిషాల సమయం పడుతుంది. విటమిన్ సి మోడ్‌తో చర్మం కాంతిమంతంగా వెలిగిపోతుంది. దీనికి సుమారు 6 నిమిషాలు పడుతుంది. ఈ త్రీడీ వైబ్రేషన్ మసాజర్‌ని వినియోగించడం చాలా సులువు. చార్జింగ్‌కి బేస్ డివైస్ వేరేగా ఉంటుంది. ఈ మసాజర్‌ని అందులో పెట్టి.. ముందుగానే చార్జింగ్ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఈ మెషిన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ టూల్‌తో పాటు అదనంగా రెండు ఫేషియల్ షీట్స్ కూడా లభిస్తాయి. అదనపు సౌకర్యాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
మసాజ్ కోసం పిలిచి వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్ కొట్టి...
సాక్షి, హైదరాబాద్: వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్ కొట్టి... మసాజ్ థెరపిస్టును హింసించిన వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలి నుంచి డయల్– 100 ద్వారా ఫిర్యాదు అందుకుని వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఆ అయిదుగురు విటుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. నాలుగు రోజులు పూర్తయినా ఈ విషయంపై విచారణ, బాధ్యులపై చర్యల విషయంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బాధితురాలితో పైశాచికంగా ప్రవర్తించిన ఆమె స్నేహితురాళ్లు ముగ్గురినీ ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో చాప కింద నీరులా ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్న ముఠాలు మరికొన్ని ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘పరిష్కరించడ’మంటే ఏంటో? కోల్‌కతాకు చెందిన బాధితురాలు (26) తన స్నేహితురాలు సంజన సూచనలతో బంజారాహిల్స్ రోడ్ నం.11లోని స్పా సెంటర్లో థెరపిస్ట్‌గా పని చేయడానికి ఈ నెల 9న వచ్చింది. మసాజ్ ముసుగులో ఆమెతో వ్యభిచారం చేయించడానికి సంజనతో పాటు కోమతి, సునీత ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం బాధితురాలిని క్యాబ్‌లో జూబ్లీహిల్స్ రోడ్ నం. 25లోని ఫ్లాట్‌కు సంజన పంపింది. అప్పటికే అక్కడ కోమతి, సునీతలతో పాటు అయిదుగురు యువకులు ఉన్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో మెసలుకోనే విషయంలో తలెత్తిన వివాదం బాధితురాలిపై దాడి చేసే వరకు వెళ్లింది. దీంతో ఆమె 100కు ఫోన్ చేయగా... ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లిన పెట్రోలింగ్ అధికారులు విషయం ‘పరిష్కరించారు’. ఈ పరిష్కారమే బాధితురాలిపై హత్యాయత్నం వరకు వెళ్లింది. నిందితుల్ని ఎలా వదిలిపెడతారు? ఈ ఉదంతంలో బాధితురాలితో పాటు కోమతి, సునీత తదితరులతో వ్యభిచారం జరుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ విషయం అక్కడకు వెళ్లిన పోలీసులకు అర్థం కాకపోవడం గమనార్హం. అలాంటి కేసులను పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ (పీటా) కింద నమోదు చేస్తారు. దీని ప్రకారం ఆ ఫ్లాట్‌లో ఉన్న యువతులను బాధితులుగా, యువకులను విటులుగా పరిగణించాలి. బాధితురాళ్లను రెస్యూ హోమ్ తరలించి విటులను అరెస్టు చేయడం లేదా సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇదేమీ జరగకుండా కేవలం విషయం ‘పరిష్కారమైంది’. అధికారుల ఈ నిర్లక్ష్యం కారణంగానే బాధితురాలు కొన్ని గంటల పాటు చిత్రహింసలు అనుభవించాల్సి రావడంతో పాటు నగ్నంగా అపార్ట్మెంట్ బయట పరుగుపెట్టాల్సి వచ్చింది. చర్యలకు ఎందుకో వెనుకడుగు? ఈ వ్యవహారంలో డయల్–100 ద్వారా సమాచారం అందుకుని, జూబ్లీహిల్స్ రోడ్ నం. 25లోని ఫ్లాట్ వద్దకు వెళ్లిన పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోజు అక్కడ ఉన్న ఐదుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా సమాచారం. దీనిపై ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బాధితురాలితో అమానుషంగా ప్రవర్తించి, నిర్బంధించి, హత్యాయత్నం చేసిన సంజన, కోమతి, సునీతలపై కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేశారు. బాధితురాలికి తెలియకపోయినా.. వీరిని విచారిస్తే ఆ అయిదుగురు ఎవరన్నది తెలిసే అవకాశం ఉంది. అలా ఈ వ్యవహారం మొత్తానికి కారణమైన విటులపై చర్యలు తీసుకోవచ్చు. దీంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకూ విషయం ‘బోధపడేలా’ చెప్పాల్సి ఉంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. చదవండి: ప్లాటు బదులు పైసలివ్వు.. లేదంటే చావు -
Electric Breast Massager: మీకు నచ్చినరీతిలో బాడీ షేప్‌ను మలచుకోండిలా!
Wireless Dual Breast Enhancement Massager For Women: స్కిన్ టోన్, ఫేస్ కట్‌తో పాటు.. బాడీ షేప్ కూడా అందానికిచ్చే నిర్వచనంలో భాగమని అందరికీ తెలిసిందే. అందులో ఎద ఆకృతి ప్రత్యేకమని చాలామంది భావిస్తుంటారు. అందుకే తక్కువ కొలతలున్నా, పిల్లలు పుట్టిన తర్వాతనో లేక వయసు పైబడుతున్న కొలదో కొలతల్లో మార్పులు వస్తున్నా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యను స్నేహితుల దగ్గర షేర్ చేసుకోవడానిక్కూడా సిగ్గు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వైర్లెస్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ మసాజర్. ఆడవారు ఈ ప్యాడ్స్(చిత్రంలో ఉన్న కప్స్)ని లోదుస్తుల లోపల అమర్చుకుంటే.. స్మాల్ అండ్ ఫ్లాట్ చెస్ట్ (చిన్నగా లేదా చదునుగా ఉండే బ్రెస్ట్ పెరిగేందుకు), చెస్ట్ సాగ్గింగ్ (జారిన బ్రెస్ట్ పునఃయవ్వనంగా మారేందుకు), చెస్ట్ పెయిన్ తగ్గేందుకు ఇవి దోహదపడతాయి. సిలికాన్‌తో రూపొందిన, హాట్ కంప్రెస్ టెక్నాలజీ కలిగిన 2 సెట్స్ హీటింగ్ మాడ్యూల్స్.. వెచ్చదనాన్ని, వైబ్రేషన్‌ని అందిస్తాయి. పోర్టబుల్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన ఈ మసాజ్ కప్స్‌ని.. వినియోగించడం చాలా సులభం. 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 65 డిగ్రీల వరకూ పెంచుకోవచ్చు. ఒక్కో ప్యాడ్‌లో 11 మసాజ్ హెడ్స్ చొప్పున మొత్తంగా 22 మసాజ్ హెడ్స్ ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే 24 గంటలు పనిచేస్తుంది. ఒక ప్యాడ్ రెడ్ కలర్లో మరో ప్యాడ్ బ్లూ కలర్లో వెలుగుతూ.. చర్మం పునఃయవ్వనంగా మారడానికి, సరికొత్త మెరుపుని సంతరించుకోవడానికి సహకరిస్తాయి. దీని ధర సుమారు 74 డాలర్లు. అంటే 5,497 రూపాయలు. చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!! -
ప్రకృతి వైద్యం రోగం నయం
ఆల్వాల్‌కు చెందిన జగదీశ్వర్‌కు పక్షవాతం వచ్చింది. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే వారం రోజులకే లక్ష రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. సరే... జబ్బు నయం అయ్యిందా అంటే అదీ లేదు. నేచురోపతితో ఫలితం ఉంటుందని దగ్గర బంధువు చెప్పడంతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 లోని రెడ్‌క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్‌లో చేరాడు. పది రోజుల్లోనే ఎవరి సహాయం లేకుండా నడుస్తున్నాడు. దీనికి ఆయనకు అయిన ఖర్చు ఐదు వేలు. జీడిమెట్లకు చెందిన సుమిత్ర కొద్దిసేపు నడిచినా, మాట్లాడినా ఆయాసం కమ్మేసి నిస్సాహాయస్థితిలోకి వెళ్తుంది. పలు ఆస్పత్రులు తిరిగి రూ. 70 వేల వరకు ఖర్చు చేసింది. ప్చ్...ప్రయోజనం లేదు. తెలిసిన వారి ద్వారా అదే రెడ్‌క్రాస్‌లో చేరింది. నాలుగు రోజుల తరువాత సోమవారం సాధారణ మనిషిలా డిశ్చార్జ్ అయ్యింది. అందుకు ఆమెకు అయిన ఖర్చు మూడు వేలు. ఇవి జగదీశ్వర్, సుమిత్రల జీవితాల్లో ఎదురైన అనుభవాలు. వీరిద్దరికే కాదు... నిత్యం ఎందరికో రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్ సెంటర్ ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యానికి చిరునామాగా నిలుస్తోంది. బంజారాహిల్స్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ప్రకృతి చికిత్సకు సమాంతరంగా యోగా శిక్షణ ఇస్తూ నగరవాసుల ఒత్తిడిని దూరం చేసే కేంద్రంగా విరాజిల్లుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 (ఎల్వీ ప్రసాద్ మార్గ్)లో 1994 సెప్టెంబర్ 15న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా ప్రారంభమైన యోగా అండ్ నేచర్‌క్యూర్ సంస్థ పేద ప్రజలకు సంజీవనియే అయ్యింది. 30 పడకల వసతితో అటు ఇన్ పేషెంట్స్‌కు, మరోవైపు ఔట్ పేషెంట్స్‌కు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి ప్రకృతి చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. చికిత్సలివే... డైట్ థెరపీ (ఆహార చికిత్స): ఫలానా జబ్బుతో వచ్చిన వారికి ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి. ఏది తింటే వారికి త్వరగా క్యూర్ అవుతుందనే అంశాలను పరిగణనలోకి ఈ థెరపీని అందిస్తారు. ముఖ్యంగా పండ్లు, గ్రీన్ వెజిటెబుల్స్ అందిస్తుంటారు. మసాజ్ థెరపీ (మర్ధన చికిత్స): ట్యూబర్క్యులసిస్, ట్యూమర్ ఆఫ్ ది స్పైన్, ఆస్టియోమిలిటీ తదితర వ్యాధులతో బాధపడేవారికి ఈ చికిత్స ద్వారా ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లేమేషన్‌ను తగ్గిస్తారు. హైడ్రో థెరపీ (జల చికిత్స): ప్రధానంగా బ్యాక్ పెయిన్‌తో బాధపడే వారికి హాట్ స్పైనల్ బాత్, స్టీమ్ బాత్ (ఆవిరి స్నానం) ద్వారా తగ్గిస్తారు. మాగ్నిటో థెరపీ (అయస్కాంత థెరపీ): పవర్ఫుల్ అయస్కాంతం ద్వారా వెన్నెముక, కాళ్లు, చేతులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తారు. ఏయే జబ్బులకు చికిత్స అధిక రక్తపోటు, పెరాలసిస్, గుండె జబ్బులు, ఒత్తిడిని తగ్గిం చడం, వెన్నెముక నొప్పులు, హెపటైటిస్, అన్ని రకాల చర్మ వ్యా ధులు, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, సెర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలిటిస్, ఆస్టియో ఆర్ధరిటిక్స్, యాక్సైటిక్-న్యూరోసిస్, మైగ్రేన్ తదితర వాటికి సంబంధించి ఇక్కడ ప్రకృతి చికిత్సను అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా శిక్షణకు దాదాపు 500 మంది హాజరవుతున్నారు. శిక్షణ వేళలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు బ్యాచ్‌లు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో బ్యాచ్ చొప్పున యోగా శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు రెండు బ్యాచ్‌ల్లో శిక్షణ ఇస్తున్నారు. వార్డుల సమాచారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇన్‌పేషెంట్‌గా చేరే వారి కోసం జనరల్ వార్డు, షేరింగ్ రూమ్ (ముగ్గురు లేక నలుగురు), స్పెషల్ రూమ్(ఒకరు లేక ఇద్దరు)లను కేటాయిస్తారు. జనరల్ వార్డుకు ట్రీట్మెంట్తో కలిపి రూ.400, షేరింగ్ రూమ్‌కు రూ. 500, స్పెషల్ రూమ్‌కు రూ. 700 ప్రకారం ఫీజు వసూలు చేస్తారు. పది రోజుల కోర్సుకు రూ. 2500, 15 రోజుల కోర్సుకు రూ. 3500 వసూలు చేస్తారు. శరీరం చాలా తేలికైంది మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతూ ఇక్కడికి వచ్చాను. నాలుగు రోజుల క్రితం చేరాను. ఇక్కడ చికిత్సతో శరీరం చాలా తేలికయ్యింది. ఇక్కడ స్నేహపూరిత వాతావరణం ఉంది. 15 రోజుల కోర్సులో చేరాను. ట్రీట్మెంట్ బాగుంది. రీజినబుల్ రేట్లు ఉన్నందున అందరికీ అందుబాటులో ఉంది. - కె.మంజుల, గృహిణి బాగా కోలుకున్నా కడుపునొప్పితో బాధపడుతూ ఇక్కడ చేరాను. మల విసర్జన కూడా కష్టంగా ఉండేది. 15 రోజుల క్రితం చేరి డైట్, మసాజ్, యోగా చికిత్సలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా కోలుకున్నాను. మలమూత్ర విసర్జనలు తేలికయ్యాయి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటంతో త్వరగా కోలుకుంటున్నారు. - జి.శరత్‌బాబు ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి చికిత్స ఎంతో మేలు ప్రకృతి చికిత్స ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరితగతిన వ్యాధి నయం చేయవచ్చు. వ్యాధిని బట్టి వారికి ఆహారం అందిస్తూ నయం అయ్యేవరకు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు అయ్యే ఖర్చు ఇక్కడ వందలు, వేలల్లోనే అయిపోతుంది. అయితే డాక్టర్లు చెప్పిన విధంగా ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. - టి.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్, రెడ్‌క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్ వ్యాధి మూలాల్లోకి... ఇక్కడ వ్యాధికి సంబంధించిన మూలాల్లోకి వెళ్లడం జరుగుతుంది. రోగ మూలాలను తీసివేస్తేనే వ్యాధి నయమవుతుంది. అందుకే ఇక్కడ ప్రకృతి చికిత్స అందిస్తున్నాం. తక్కువ రేట్లలో నాణ్యమైన చికిత్సలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు నేర్పిస్తాం. - డాక్టర్ దినేష్ రాజ్, డెరైక్టర్