![This Massager Is Must Buy Product For Anti Aging - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/08/30/massager_650x400.jpg.webp?itok=NxolSBcO)
ఇప్పుడు టెక్నాలజీ అందిస్తున్న సౌందర్య సాధనాలకు కొదవలేదు. అలాంటి వాటిల్లో ఒకటే.. త్రీడీ వైబ్రేషన్‌తో ఎల్‌ఈడీ థెరపీ.. స్లైడ్ టచ్ పాడ్‌తో రూపొందిన ఈ అత్యాధునిక ఫేషియల్ మసాజర్. ఇది ఆరు రకాల స్కిన్ కేర్ మోడ్స్‌ని అందిస్తోంది.ఇందులోని ఎల్‌ఈడీ లైట్స్ 5 కలర్స్‌లో వైబ్రేషన్స్‌ను ఇస్తాయి. దీనిలోని క్లీనప్ మోడ్‌తో మేకప్ తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది మూడు నిమిషాల పాటు పనిచేస్తుంది. ఐ జోన్ మోడ్‌తో కళ్ల చుట్టూ ఉండే ముడతలను, నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు. ఇది 2 నిమిషాల పాటు పనిచేస్తుంది.
మాయిశ్చర్ మోడ్‌తో చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనికి మూడు నిమిషాల సమయం పడుతుంది. లిఫ్టింగ్ మోడ్‌తో వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీనికి కూడా మూడు నిమిషాల సమయం పడుతుంది. మాస్క్ మోడ్‌తో ఫేషియల్ మాస్క్ షీట్స్‌పై మసాజ్ చేయడంతో.. చర్మానికి అదనపు సౌందర్యం వస్తుంది. దీనికి 5 నిమిషాల సమయం పడుతుంది.
విటమిన్ సి మోడ్‌తో చర్మం కాంతిమంతంగా వెలిగిపోతుంది. దీనికి సుమారు 6 నిమిషాలు పడుతుంది. ఈ త్రీడీ వైబ్రేషన్ మసాజర్‌ని వినియోగించడం చాలా సులువు. చార్జింగ్‌కి బేస్ డివైస్ వేరేగా ఉంటుంది. ఈ మసాజర్‌ని అందులో పెట్టి.. ముందుగానే చార్జింగ్ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఈ మెషిన్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ టూల్‌తో పాటు అదనంగా రెండు ఫేషియల్ షీట్స్ కూడా లభిస్తాయి. అదనపు సౌకర్యాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment