beauty products
-
అందానికి ఏఐ టచ్!
రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో వెతుకుతోంది. ఒక కంపెనీ వెబ్‌సైట్‌లోని టూల్ ఆకట్టుకుంది. రకరకాల యాంగిల్స్‌లో సెల్ఫిలను క్యాప్చర్ చేసి పంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్టులను సిఫార్సు చేయడం.. వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్ బాగా పనిచేయడంతో చాన్నాళ్లుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ) రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్ గేమ్ చేంజర్‌గా మారుతోంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రొడక్టుల వాడకానికి డిమాండ్ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఇతరత్రా అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వన్నెలద్దుతున్నాయి. వినియోగదారులకు కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెగ నచ్చేస్తుండటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. దీంతో బ్యూటీ బ్రాండ్స్‌లో స్టార్టప్‌లు మొదలు.. ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫిలను తీసి పంపితే చాలు.. ఏఐ మోడల్ వాటిని ప్రాసెస్ చేసి, అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబారడం, ఎగుడుదిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి, రియల్ టైమ్‌లో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది.డేటా ఎనలిటిక్స్ దన్ను... బ్యూటీ స్టార్టప్‌లు గత రెండు మూడేళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలుపెడుతుంది. వినియోగదారులు పంపించే తాజా ఫేస్ ఇమేజ్‌లను ఇప్పటికే గుర్తించి, విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక్క చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి, తదనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రాయా, రావెల్ వంటి హెయిర్ కేర్ స్టార్టప్‌లు క్విక్ ఆన్లైన్ సర్వే నిర్వహించి, మెషీన్ లెరి్నంగ్ ద్వారా ఎవరికి ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టు అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్పు చేస్తుండడం విశేషం!స్మార్ట్ టూల్స్..ఆన్లైన్ బ్యూటీ స్టోర్ పర్పుల్.. సొంతంగా పర్పుల్ స్కిన్ ఎనలైజర్ అనే ఏఐ ఇమేజ్ రికగి్నషన్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) టూల్ మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించి హైపర్ పర్సనలైజ్డ్ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజినీరింగ్ హెడ్ వివేక్ పరిహార్ చెబుతున్నారు. ఇక లోరియల్ ప్రొడక్టులను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్ టెక్నాలజీ ‘మోడిఫేస్’ను ఉపయోస్తోంది. వినియోగదారులు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రొడక్టులను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ దాదాపు 88 శాతం ఖచ్చితత్వంతో ఫేస్ ఆకారం, స్కిన్ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్డ్ డిజిటల్ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్ షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ వినీతా సింగ్ పేర్కొన్నారు. ‘యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఫేస్ ఫౌండేషన్ కొన్న వారు మస్కారాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాస్మిన్ గోహిల్ పేర్కొన్నారు.ఫీడ్ బ్యాక్, సందేహాలు, డెలివరీలోనూ...కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, సందేహాలు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కరకొస్తోంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి, విశ్లేషించేందుకు పెప్ బ్రాండ్స్ క్యాప్చర్ అనే ఏఐ ఆధారిత టూల్‌ను ఉపయోగిస్తోంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్ ఇంజిన్‌ను పర్పుల్ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని జీపీటీ ఆధారిత టూల్ వల్ల యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలా మందికి ఇంగ్లిష్‌లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారికోసం పర్పుల్ స్థానిక భాషలో సెర్చ్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్‌హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ స్టార్టప్‌లకు ఏఐ, ఎంఎల్ టూల్స్ తోడ్పడుతున్నాయి. 34 బిలియన్ డాలర్లు 2028 నాటికి భారత బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ విలువ అంచనా. 25శాతంఆన్లైన్ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా (ఆఫ్‌లైన్ స్టోర్లలో 14 శాతమే).– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
బ్యూటీ విత్ నేచర్!
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్‌లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్‌గా దొరుకుతుందేమోనని ఆన్లైన్లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.కాస్త జాగ్రత్త మరి.. సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.అందరికీ అన్నీ సెట్ కావు.. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్ఇన్స్టాలో వీడియోలు చూసి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. -
J-బ్యూటీకి సై అంటున్న యువత, అసలేంటీ జే బ్యూటీ?
చర్మం జిడ్డుగా లేకుండా ఉండడానికి ఏంచేయాలి? కంటి కింద నల్ల వలయాలను ఎలా తప్పించాలి? ఎండ నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? చర్మం మెరవాలంటే ఏం చేయాలి? చర్మసంరక్షణ నుంచి సౌందర్యం వరకు సందేహాల సముద్రంలో ఈదులాడుతున్న యువతరానికి నిన్నా మొన్నటి వరకు ‘కె–బ్యూటీ’ లేదా కొరియన్ బ్యూటీ చుక్కానిగా కనిపించింది. అయితే ఇప్పుడు యూత్ దృష్టి జె–బ్యూటీ(జపనీస్ బ్యూటీ)పై మళ్లింది. ఇది జపాన్ బ్యూటీ బ్రాండ్ల మార్కెటింగ్ మాయాజాలమా? సహజమైన పరిణామమా? అనే చర్చను పక్కనపెడితే ‘జె–బ్యూటీ’లోని సహజత్వాన్ని, వాబీ–సాబీ తత్వాన్ని యువతరం బాగా ఇష్టపడుతోంది... మృదువైన చర్మం కోసం కలలు కనే యువతరానికి చిరపరిచితమైన ట్రెండ్ కె–బ్యూటీ( కొరియన్–బ్యూటీ) బ్యూటీ ఇండస్ట్రీపై భారీ ప్రభావాన్ని చూపించింది. మైండ్ – బాగ్లింగ్ ప్రొడక్ట్స్, మల్టీ–స్టెప్ రొటీన్స్‌తో ‘కె–బ్యూటీ’ గ్లోబల్ సెన్సేషన్‌గా నిలిచింది. యువ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంది. తాజా విషయానికి వస్తే ‘జె–బ్యూటీ’ లేదా జపనీస్ బ్యూటీ యువతరం ఫేవరెట్‌గా మారింది. ‘పవర్ఫుల్ సిస్టర్ ఆఫ్ కె–బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న ‘జె–బ్యూటీ’ కె–బ్యూటీని అధిగమించేలా దూసుకుపోతోంది. ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి జపనీస్ బ్యూటీ బ్రాండ్లు కలిసి పనిచేయడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’ పాపులారిటీకి కారణం అయింది. ‘జె–బ్యూటీ’కి ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చింది... అనే విషయానికి వస్తే... నిపుణుల మాటల్లో చెప్పాలంటే...‘జె–బ్యూటీ’లోని ప్రధాన ఆకర్షణ సింప్లిసిటీ, ఎఫెక్టివ్‌నెస్. ‘ప్రివెన్షన్ రాదర్ దేన్ కరెక్షన్ ’ తత్వంతో కూడిన ఈ విధానం హ్యాపీగా, హెల్తీగా ఉండేలా చర్మ సంరక్షణతో΄ాటు పర్యావరణ ఒత్తిళ్ల నుంచి రక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది, గ్రీన్ టీ, రైస్ బ్రాన్, సీవీడ్లాంటి ΄ ఇన్‌గ్రేడియెంట్స్ ‘జె–బ్యూటీ’లో భాగం అయ్యాయి. ‘ఘుమఘుమలతో కూడిన ఖరీదైన వంటకాల కంటే సాదాసీదా పప్పన్నం ఎంచుకోవడం లాంటిదే జె–బ్యూటీ. దీనిపై జపనీస్ తత్వం వాబీ–సాబీ ప్రభావం ఉంది. ఇంపర్ఫెక్షన్, సింస్లిపిటీ నుంచి అందాన్ని దర్శించడమే వాబీ –సాబీ తత్వం. జె–బ్యూటీ ప్రాథమికంగా రెండు విషయాలపై దృష్టి పెడుతుంది. వర్తమానంలో చర్మ సౌందర్యం. రెండోది భవిష్యత్తులో చర్మ సమస్యలు రాకుండా నివారించడం’ అంటుంది ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శిఖా షా. జపనీస్ కల్చర్ అండ్ లైఫ్‌స్టైల్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’పై ఆసక్తి కలిగించే కారణాలలో ఒకటి. ‘ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం 11–12 స్టెప్ స్కిన్‌కేర్ రొటిన్ అవసరం అనే అ΄ోహను జె– బ్యూటీ బ్రేక్ చేసింది’ అంటుంది డాక్టర్ మోనికా బాంబ్రూ. ‘కె–బ్యూటీ’తో పోల్చితే ‘జె–బ్యూటీ’ని ప్రత్యేకంగా ఉంచుతున్నదేమిటి? అనే విషయానికి వస్తే... చర్మసంరక్షణ విషయంలో రెండిటికీ పేరు ఉన్నప్పటికీ వాటి విధానాలు, తత్వం వేరు. ‘కె–బ్యూటీ’ అనేది ఇన్నోవేషన్, ఎక్స్పెరిమెంటేషన్పై దృష్టి పెడుతుంది. మల్టీ–స్టెప్ రొటిన్స్, ట్రెండ్–డ్రైవన్ ఫార్ములేషన్స్ ఉంటాయి. ఇక ‘జె–బ్యూటీ’ అనేది సింప్లిసిటీ, మినిమలిజం, సహజపదార్థాలపై దృష్టి పెడుతుంది. ‘జె–బ్యూటీకి తిరుగులేదు’ అని అంటుంది ముంబైకి చెందిన అద్విక శ్రీవాస్తవ. ‘జె–బ్యూటీ’పై కొండంత ఇష్టంలోనూ ఆచితూచి ఆలోచించేవారు లేకపోలేదు. ఇందుకు ఉదాహరణ బెంగళూరుకు చెందిన చైత్ర. ‘కె–బ్యూటీతో పోల్చితే జె–బ్యూటీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలా అని వేలంవెర్రిగా జె–బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలనుకోవడం లేదు. జె–బ్యూటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది చైత్ర. క్లీన్ బ్యూటీ ట్రెండ్ గతంలో పోల్చితే జపనీస్ బ్యూటీ కంపెనీలపై యువత ఆసక్తి పెరిగింది. దీనికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు మారుతున్నాయి...అంటుంది గ్లోబల్ డేటా ర రిపోర్ట్ ‘కె–బ్యూటీ అనేది ట్రెండీ ఇన్‌గ్రేడియెంట్స్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, క్విక్ రిజల్ట్కు ప్రాధాన్యత ఇస్తుంటే జె–బ్యూటీ ఇందుకు భిన్నంగా సహజమైన పదార్థాలతో శాశ్వత ప్రభావంపై దృష్టి పెడుతుంది’ అంటున్నాడు ‘గ్లోబల్ డేటా’ కన్జ్యూమర్ అనలిస్ట్ మణి భూషణ్ శుక్లా. ‘సహజ’ ‘సేంద్రియ’ ‘అలెర్జీరహిత’ మాటలతో ‘జె–బ్యూటీ’ ‘క్లీన్ బ్యూటీ’ ట్రెండ్‌గా పేరు తెచ్చుకుంది. -
నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్!
కొరియన్ అమ్మాయిలు ఎంత తెల్లగా ఉంటారో తెలిసిందే. వారి ముఖం చక్కగా కాంతివంతంగా ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదు. గ్లాస్ మాదిరిగా ముఖం మెరిసిపోతుంది. చిన్న మచ్చ కూడా ఉండదు. అలాంటి అందం సొంతం చేసుకోవాలంటే కొరియన్ బ్యూటి ప్రోక్ట్స్లో వాడే వాటి గురించి తెలసుకోవాల్సిందే. కొరియన్ పురుషులు, స్త్రీలు గ్లామర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ల చర్మ సంరక్షణ ఉత్పత్తులో వాడే వాటిని చూస్తే షాకవ్వతాం. ఎందుకంటే వాళ్లు చాలా విభన్నమైన వాటితో ఫేస్క్రీంలు తయారు చేస్తారు. బహుశా అందుకే కాబోలు వారు అంత అందంగా ఉంటారు. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం ఉపయోగిస్తారో చూస్తే షాకవ్వుతారు. నతల విసర్జకాలు లేదా నత్తల జిగురు నత్తల విసర్జకాల్లో అల్లాంటోయిన్, కొల్లాజెన్, ఎలాస్టిన్, గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సీలు, యాంటీబయాటిక్ పెప్టైడ్స్ తదితరాలు ఉంటాయి. నత్త విసర్జకాలు లేదా నత్త జిగురు వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేటడ్గా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ మొటిమల వల్ల అయ్యే గాయాలను నయం చేయడమే గాక మృతకణాలను తొలగిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో జింక్ కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా మృదువుగా చేస్తుంది. నత్త విసర్జకాలతో తయారు చేసిన కొరియన్ ప్రొడక్ట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉందట. వీటిని వాడితే కచ్చితంగా కొరియన్ అమ్మాయిల్లా తెల్లగా ఉంటారని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. తేనెటీగల జిగురు తేనెటీగల నుంచి లభించే ఈ రెసిన్ని ఆంగ్లంలో ప్రొపోలిస్ అంటారు. పుప్పొడి అనేది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధం. ఇది ముడుతలను తగ్గించే లక్షణాలతో పాటు మొటిమల బారిన పడే చర్మం, బ్రేక్అవుట్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, పుప్పొడి చర్మానికి కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. పుప్పొడి చర్మంపై సున్నితమైన మెరుపును వదులుతుంది. ఇది క్రమం తప్పకుండా అప్లై చేస్తే చర్మంలోని మృతకణాలను తొలగించి యవ్వన రూపాన్ని ఇస్తుందని కొరియన్లు గట్టిగా విశ్వసిస్తారట. రంధ్రాలను తగ్గించేందుకు "ముత్యం".. కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో ముత్యాలు చాలా కాలంగా ముఖ్యమైన పదార్ధంగా ఉన్నాయి.ముత్యాలు మొటిమలను తొలగించడంలో ఉపయోగపడతాయని చెబుతారు. అలాగే ముఖంపై విస్తరించిన రంధ్రాలను తగ్గిస్తాయని, చర్మం వృద్ధాప్యం బారిన పడకుండా నివారిస్తుందని విశ్వసిస్తారు. తేనెటీగ విషం తేనెటీగ విషం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. తేనెటీగలు బెదిరినప్పుడు వాటిని స్రవిస్తాయి. అనేక చర్మ సంరక్షణ సంస్థలు సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వంటి ఉత్పత్తులకు తేనెటీగ విషాన్ని వాడతాయి.ఈ పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను అందిస్తుంది, ముడతలను తగ్గిస్తుంది.అదే విధంగా వెదురు, యుసా (ఒక రకమైన పండు), సెంటెల్లా ఆసియాటికా, బిర్చ్ సాప్ వంటి అనేక పదార్థాలు కొరియన్ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. (చదవండి: పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా? ) -
క్లెన్సింగ్ నుంచి ఫేషియల్ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్ ఉంటే చాలు
ఇప్పుడు టెక్నాలజీ అందిస్తున్న సౌందర్య సాధనాలకు కొదవలేదు. అలాంటి వాటిల్లో ఒకటే.. త్రీడీ వైబ్రేషన్‌తో ఎల్ఈడీ థెరపీ.. స్లైడ్ టచ్ పాడ్‌తో రూపొందిన ఈ అత్యాధునిక ఫేషియల్ మసాజర్. ఇది ఆరు రకాల స్కిన్ కేర్ మోడ్స్‌ని అందిస్తోంది.ఇందులోని ఎల్ఈడీ లైట్స్ 5 కలర్స్‌లో వైబ్రేషన్స్‌ను ఇస్తాయి. దీనిలోని క్లీనప్ మోడ్‌తో మేకప్ తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది మూడు నిమిషాల పాటు పనిచేస్తుంది. ఐ జోన్ మోడ్‌తో కళ్ల చుట్టూ ఉండే ముడతలను, నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు. ఇది 2 నిమిషాల పాటు పనిచేస్తుంది. మాయిశ్చర్ మోడ్‌తో చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనికి మూడు నిమిషాల సమయం పడుతుంది. లిఫ్టింగ్ మోడ్‌తో వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీనికి కూడా మూడు నిమిషాల సమయం పడుతుంది. మాస్క్ మోడ్‌తో ఫేషియల్ మాస్క్ షీట్స్‌పై మసాజ్ చేయడంతో.. చర్మానికి అదనపు సౌందర్యం వస్తుంది. దీనికి 5 నిమిషాల సమయం పడుతుంది. విటమిన్ సి మోడ్‌తో చర్మం కాంతిమంతంగా వెలిగిపోతుంది. దీనికి సుమారు 6 నిమిషాలు పడుతుంది. ఈ త్రీడీ వైబ్రేషన్ మసాజర్‌ని వినియోగించడం చాలా సులువు. చార్జింగ్‌కి బేస్ డివైస్ వేరేగా ఉంటుంది. ఈ మసాజర్‌ని అందులో పెట్టి.. ముందుగానే చార్జింగ్ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఈ మెషిన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ టూల్‌తో పాటు అదనంగా రెండు ఫేషియల్ షీట్స్ కూడా లభిస్తాయి. అదనపు సౌకర్యాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ప్లాటినం బాడీ మసాజర్.. అందంతో పాటు ఆరోగ్యం కూడా
అందం, ఆరోగ్యం రెండింటినీ అందించే డివైస్‌లకు ఈ రోజుల్లో గిరాకీ ఎక్కువ. చిత్రంలోని ఈ మసాజర్ బ్యూటీ ప్రొడక్ట్‌తో పాటు హెల్త్ టూల్ కూడా. ఈ డ్యూయల్ రోలర్ ప్లాటినం బాడీ మసాజర్.. రెండు రోలర్లను కలిగి ఉంటుంది. ఈ రోలర్స్ను పక్కపక్కనే ఉంచుకుని వినియోగించుకోవచ్చు లేదా ‘వి’ షేప్‌లా మార్చుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. దాంతో ముఖం, మెడ, నడుము, తొడలు, కాళ్లు, చేతులు ఇలా అన్ని భాగాల్లో మసాజ్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది మహిళలు తమ చర్మ సంరక్షణను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అలాంటి వారు రోజుకి కొన్ని నిమిషాల పాటు బాడీ మొత్తాన్ని ఈ మసాజర్‌తో మసాజ్ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కండరాల్లో ఉత్తేజం కలిగించడానికి, ముడతలు, నొప్పులు పోగొట్టడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. చర్మం కూడా కాంతిమంతమవుతుంది. దీనికి చార్జింగ్‌తో పని లేదు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ సెట్‌ని జాగ్రత్త చేయడానికి ప్రత్యేకమైన పర్స్‌తో పాటు.. రోలర్ని శుభ్రం చేయడానికి మెత్తటి క్లాత్ కూడా లభిస్తుంది.అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్, ప్లాటినం పౌడర్, జర్మేనియం పౌడర్ వంటి మెటీరియల్స్‌తో రూపొందిన ఈ టూల్ నాణ్యమైనది.. మన్నికైనది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం తేజోవంతమవుతుంది. బాడీ ఎనర్జిటిక్‌గా మారుతుంది. బాగుంది కదూ! -
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా? ఇందులోని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల..
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల వస్తువులు వాడుతుంటారు. ముఖ్యంగా కాస్మొటిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.వాటికోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. బ్యూటీ ఉత్పత్తులపై రోజూ కొన్ని కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంటుంది. అందులో ఒకటి లిప్‌స్టిక్. ఈరోజుల్లో లిప్‌స్టిక్ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు అయితే లిప్‌స్టిక్ లేనిదే కాలు కూడా బయట పెట్టరు. లిప్‌స్టిక్ లేకుండా అసలు మేకప్ పూర్తి అవదు. ముఖాన్ని మరింత కాంతివంతంగా, అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్ వాడుతుంటారు. కొందరైతే డ్రెస్ కలర్‌కి తగ్గట్లు రకరకాల లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు. అయితే అందాన్ని పెంచే లిప్స్టిక్స్ రోజూ వాడితే ప్రమాదం పొంచిఉన్నట్లే..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ♦లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా తిన్నా, తాగినా ఎంతోకొంత మన నోట్లోకి వెళుతుంది. లిప్‌స్టిక్‌లలో శరీరానికి హాని కలిగించే అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ♦ లిప్‌స్టిక్‌లో ఉండే అల్యూమినియం,క్రోమియం,కాడ్మియం వంటి హానికారమైన పదార్థాలు అనేక విధాలుగా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ ముఖ్యంగా లిప్‌స్టిక్‌లోని అల్యూమినియం పొట్టలోకి చేరితే అల్సర్‌కు దారి తీస్తుంది.లిప్‌స్టిక్‌లోని సీసం సామర్థ్యం, జ్ఞాపకశక్తి స్థాయిని తగ్గిస్తుంది. ♦ అరుదైన సందర్భాల్లో, లిప్‌స్టిక్ వల్ల కళ్ల కింద దురద, ఉక్కిరిబిక్కిరి చేయడం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ♦ లిప్‌స్టిక్స్‌లో వాడే సీసం వల్ల హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు వస్తాయి. ♦ బిస్మత్ ఆక్సిక్లోరైడ్‌ను లిప్‌స్టిక్‌లో ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల అలర్జీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ♦ కొన్ని చవక లిప్‌స్టిక్‌లను వాడితే చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ లిప్స్టిక్స్ వాడాలనుకునేవారు ఖరీధైన, హెర్బల్ ఉత్పత్తులను వాడితే మంచిది. లిప్స్టిక్స్ వాడేముందు ఇలా చేయండి.. ► కొందరు తెలిసో తెలియకనో డైరెక్ట్‌గా లిప్స్‌కు లిప్‌స్టిక్‌ను వేసేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు. ముందుగా లిప్‌బామ్ రాసుకొని దానిపైన లిప్‌స్టిక్ వాడాలి. ► లిప్‌బామ్ అందుబాటులో లేకపోతే పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె లాంటివి కూడా వాడొచ్చు. ► లిప్స్టిక్స్ ప్రతిరోజూ వాడటం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. అందువల్ల పాలతో రబ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ► పడుకునేముందు కశ్చితంగా లిప్‌స్టిక్‌ను తొలగించిన తర్వాతే నిద్రపోవాలి. లేదంటే లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్ పెదాలను డ్యామేజ్ చేస్తాయి. ► పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదా పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది -
14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా..
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి.. అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారవి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం. ఈ మేరకు ఏప్రిల్‌లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్‌గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది. View this post on Instagram A post shared by @forestessentials కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్ మీ పేజ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2, 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. -
‘మార్కెట్’లో సౌందర్యలహరి
అందానికి దాసోహమవని వారు ప్రపంచంలో ఉంటారా? సౌందర్యారాధన లేని వారు ఉంటారా? అందుకే సౌందర్య ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ బ్యూటీ పార్లర్లు, స్టైలిష్ హబ్‌లు వెలుస్తున్నాయి. ఫేస్వా ష్లు, మాయిశ్చరైజర్ల నుంచి కంటి క్రీమ్‌లు, ఫేస్ మాస్‌్కలు, సన్‌స్క్రీన్ లోషన్‌తో అన్నింటినీ మహిళలు, పురుషులు, పిల్లల కోసం కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. 2018లో ప్రపంచ వ్యాప్తంగా సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 134.8 బిలియన్ డాలర్లు ఉంటే, 2021 నాటికి 532 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024 నాటికి 893 బిలియన్ డాలర్లకు చేరుతుందని జియాన్ మార్కెట్ రీసెర్చ్(జీఎంఆర్) విభాగం అంచనా వేసింది. 2020 నుంచి భారతదేశంలో ప్రీమియం సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నట్టు గుర్తించింది. ప్రస్తుతం చర్మ, సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో పురుషుల సౌందర్య, గ్రూమింగ్ ఉత్పత్తులు కూడా భారీగా పెరుగుతాయని, దాంతో యునిసెక్స్ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తుందని జీఎంఆర్ అంచనా వేసింది. చర్మ సౌందర్య ఉత్పత్తులే అధికం ♦ 2021లో మొత్తం సౌందర్య ఉత్పత్తుల కొనుగోళ్లలో 148.3 బిలియన్ డాలర్లు కేవలం చర్మ రక్షణ ఉత్పత్తులదే. ♦ పర్సనల్ కేర్ మార్కెట్లో 42 శాతం స్కిన్ కేర్ ఉత్పత్తులే ఉన్నాయి. తర్వాత స్థానంలో హెయిర్ కేర్ 22 శాతం, బ్యూటీ అండ్ మేకప్ కేర్ 16 శాతం ఉన్నాయి. ♦ ప్రపంచ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్లో ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న భారత్.. వచ్చే మూడేళ్లలో 4వ స్థానానికి చేరుతుందని అంచనా. ♦ సర్వే ప్రకారం భారత్‌లో సహజ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 2022లో 15 బిలియన్ డాలర్లు ఉండగా, 2024 నాటికి 22 బిలియన్ల డాలర్లకు, 2028 నాటికి 38 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని జీఎంఆర్ తెలిపింది. -
నైకా దూకుడు కళ్లు చెదిరేలా లాభం, ఏకంగా 330 శాతం జూమ్
న్యూఢిల్లీ: బ్యూటీ, ఫ్యాషన్ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 5.2 కోట్లను తాకింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 330శాతం ఎక్కువ కావడం విశేషం. నైకా బ్రాండు కంపెనీ గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 1.2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 1,231 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 885 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఈ కాలంలో స్థూల వ్యాపార విలువ(జీఎంవీ) 45 శాతం జంప్‌చేసి రూ. 2,346 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో నైకా షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం బలపడి రూ. 1,180 వద్ద ముగిసింది. అయితే బుధవారం మాత్రం లాభాలను కోల్పోయి స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. -
ఈ గాడ్జెట్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే
ఆకట్టుకునే ప్రతీది అందమే. అందులో కాళ్లూ.. చేతులూ భాగమే. కాలి గోళ్లు, చేతి వేళ్లు.. నాజూగ్గా మారడానికి క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్లి.. పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటూంటారు. అయితే ఆ శ్రమను తప్పిస్తుంది ఈ రీచార్జబుల్ ట్రిమ్మర్. పెద్దలకే కాదు అప్పుడే పుట్టిన పిల్లలక్కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది. నొప్పి తెలియకుండా.. శ్రమ లేకుండా ఈజీగా కాలి, చేతి గోళ్లను చక్కగా శుభ్రపరచుకోవచ్చు. అందుకు కావల్సిన మినీ కిట్ ఈ డివైజ్‌తో పాటు లభిస్తుంది. ఈ మెషిన్‌కి చార్జింగ్ పెట్టుకోవచ్చు. పైగా ఇందులో లిథియం బ్యాటరీ ఉండటంతో.. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. 3 స్పీడ్ సెట్టింగ్ ఉండటంతో.. పిల్లలు, పెద్దలు సురక్షితంగా వాడొచ్చు. గోళ్లు షేప్ చేసుకోవడంతో పాటు.. డెడ్ స్కిన్ తొలగించడం, మృదువుగా మార్చడం.. వంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు. మెటల్ గ్రౌండింగ్ హెడ్, ఎడ్జ్ ఎక్స్ఫోలియేషన్ హెడ్, నెయిల్ సర్ఫేస్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్, పాయింటెడ్ ఫ్రాస్టెడ్ గ్రౌండింగ్ హెడ్, డిస్క్ ఫ్రాస్టింగ్ పాలిషింగ్ హెడ్.. ఇలా 5 ప్రత్యేకమైన హెడ్స్‌తో పాటు 3 ప్రత్యేకమైన రోలర్స్ లభిస్తాయి. ఈ డివైజ్‌కి ఎడమవైపు చార్జింగ్ పాయింట్ ఉంటుంది. మరోవైపు.. హెడ్స్ అమర్చుకునే స్క్రూ ఉంటుంది. అలాగే డివైజ్ ముందువైపు.. రోలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతో మడమల పగుళ్లు, మృతకణాలు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్ ఉన్నట్లే. ధర సుమారు వెయ్యి రూపాయలు. అయితే రివ్యూలను గమనించి కొనుగోలు చేయడం మంచిది. -
ఒకసారి టర్నోవర్ కోట్లలో.. ఒకసారి పుస్తెలతాడు కూడా తాకట్టులో..!
ఏమీ లేని చోట కూడా వనరుల కల్పనకు కృషి చేయవచ్చు అని నిరూపించారు సాకా శైలజ. బీడీ కార్మికులను బ్యూటీషియన్లుగా తీర్చిదిద్దారు. వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి లేని రోజుల నుంచి కోటి రూపాయల టర్నోవర్ చేరేవరకు కృషి చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్లో రోజాస్ ఇండస్ట్రీ పేరుతో సినోవ్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్న సాకా శైలజ జీవన ప్రయాణం ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పూర్తిగా మహిళా ఉద్యోగులు మాత్రమే పని చేసే సంస్థను నడుపుతున్నారు శైలజ. ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్, కెమికల్ హౌస్ క్లీనర్స్‌ను తయారుచేసే కంపెనీయే కాదు, బ్యూటిషియన్ కోర్సులనూ ఇస్తున్నారు. ఇరవై ఏళ్లలో 30 వేల మంది మగువలను బ్యూటీషియన్లుగా తీర్చిద్దారు. పాతికేళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యాపారం గురించి శైలజ వివరిస్తూ.. అడవిలో ఇంగ్లిషు పాఠాలు ‘‘నాకు పంతొమ్మిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారికి టీచర్‌గా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పోస్టింగ్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, డిగ్రీ చేసిన నేను పెళ్లవగానే ఓ అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఖాళీ టైమ్‌లో అక్కడి పిల్లలను చేరదీసి, ఇంగ్లిష్ నేర్పించేదాన్ని. దానినే ట్యూషన్‌గా మార్చుకున్నాను. అలా ఆర్నెళ్లు తిరిగేసరికి మా వారికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదించేదాన్ని. తర్వాత పిల్లలు పుట్టడం, వారి పెంపకంలో హైదరాబాద్ వచ్చినప్పుడు బ్యూటిషియన్ కోర్సు నేర్చుకున్నాను. మా వారికి సిరిసిల్ల ట్రాన్స్ఫర్ అయితే, అక్కడ బ్యూటీపార్లర్ ఏర్పాటుకు ప్రయత్నించా. చాలా మంది విమర్శించారు ఊళ్లో బ్యూటీపార్లరా అని. ఇల్లు కూడా ఎవరూ అద్దెకు ఇవ్వలేదు. దళిత్ అనే వివక్ష కూడా చాలా చోట్ల ఎదుర్కొన్నాను. చివరకు అద్దె వరకు ఆదాయం వచ్చినా చాలని ఒక రూమ్‌లో పార్లర్ ప్రారంభించాను. ఉచితంగా శిక్షణ పార్లర్లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిలు ఇంటి వద్ద బీడీలు చుడతామని చెప్పారు. అలా వచ్చే ఆదాయం వారికేం సరిపోతుందని, బ్యూటిషియన్ పని నేర్పించాను. అలా మరికొంత మంది అమ్మాయిలు చేరారు. వారికీ ఉచితంగా శిక్షణ ఇచ్చాను. హైదరాబాద్‌లోని బ్యూటీ సెలూన్ వారితో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాను. ఆ తర్వాత కరీంనగర్‌కు ట్రాన్స్ఫర్. ఇక్కడా మరో బ్రాంచ్ ప్రారంభించి, బ్యూటీపార్లర్ నడుపుతూ, మహిళలకు శిక్షణ ఇస్తూ వచ్చాను. అలా బ్యూటీ కోర్సులో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఉత్పత్తుల తయారీ ఒక డాక్టర్ని కలిసినప్పుడు, ‘మీ వర్క్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరమో మీకు బాగా తెలుసు కాబట్టి వాటిని మీరే తయారుచేయవచ్చు కదా’ అన్నారు. అప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసి, బ్యాంక్‌కు వెళ్లాను. అది కోటి రూపాయల ప్రాజెక్ట్. నేనెప్పుడూ చూడని అంకె అది. కానీ, ప్రయత్నించాను. నెల రోజులకు బ్యాంక్ లోన్ వచ్చింది. అప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ప్రారంభించాను. మార్కెట్ పెద్ద టాస్క్ ఉత్పత్తుల తయారీ చాలా బాగుంది. మా పార్లర్స్‌లోనే వాటిని ఉపయోగిస్తున్నాం. బయట కూడా మార్కెట్ చేయాలి అని సెర్చ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్లో స్లాట్ ఓకే అయ్యింది. అక్కడ నా ప్రొడక్ట్స్ పెట్టినప్పుడు, ఫారినర్స్ చూసి ఆర్డర్ ఇచ్చారు. మా యూనిట్‌కి వచ్చి, చూసి, ప్రతీది తెలుసుకున్నారు. ప్రతి యేడాది కోటి రూపాయల మార్కెట్ చేస్తున్నాను. కరోనా వేసిన వేటు ఈ యేడాది మార్చ్ వరకు 70 లక్షల టర్నోవర్ చేశాను. మార్కెట్ పెరగడానికి కరోనా ఓ అడ్డంకి అయ్యింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూసి వేశారు. కానీ, నేను ఆగకుండా నడిపించాను. కరోనా టైమ్‌లోనే చైనా బార్డర్లో ఉన్న ప్రాంతానికి ఆరు రోజుల ఆలశ్యంగా ప్రొడక్ట్ డెలివరీ అయ్యింది. లేట్ అయ్యిందనే కారణంతో ప్రొడక్ట్‌ని రిజక్ట్ చేశారు. దానిని వెళ్లి తీసుకురాలేక వదిలేయాల్సి వచ్చింది. కరోనా సీజన్లో నా దగ్గర డబ్బు లేదు. దీంతో బంగారం తాకట్టు పెట్టాను. అదే సమయంలో రా మెటీరియల్ సప్లయ్ చేసే అతని ఆరోగ్యం బాగోలేక, డబ్బు వెంటనే కావాలన్నారు. ఆ సమయంలో వేరే దారిలేదు. నా మెడలో పుస్తెలతాడు, గాజులు, చెవి కమ్మలు తీసి మా అబ్బాయితో బ్యాంక్‌కు పంపించాను. బిజినెస్‌లో చాలా సవాళ్లు ఉంటాయి, డీలా పడిపోకూడదు. నా సంస్థ ఎప్పుడూ మంచి ఆదాయాన్ని ఇచ్చేదే. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. నాకున్న లక్ష్యం ముందు మిగతా సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. బ్యాలెన్స్ ఒక సవాల్ ఇటీవల మా వారికి గుండెపోటు వచ్చింది. ఇదే సమయంలో కంపెనీ స్థలం ఓనర్ ఆ భూమిని వేరొకరికి అమ్మారు. దీంతో ఎటూ తేల్చుకోలేక, లాయర్ సలహా తీసుకున్నాను. మా వారి ఆరోగ్యం, పిల్లలు, కంపెనీ.. దేనినీ వదులుకోలేను. అలాగే, సమస్య అంటూ ఇంటికి వచ్చే అమ్మాయిలకు కౌన్సెలింగ్, సాయం ఎలాగూ ఉంటుంది. వ్యాపారంలో ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటుంది. దానిని అధిగమిస్తేనే విజయం. వర్కింగ్ క్యాపిటల్ పెరిగితే ఐదు కోట్ల బిజినెస్ చేయాలన్నది ఈ యేడాది ప్లానింగ్. బ్యూటిషియన్ స్కూల్‌తో పాటు, ప్రొడక్ట్స్ తయారీలోనూ అంతా మహిళలే. ఒక్కోసారి ఇంతమందికి ఉపాధి కల్పించాం కదా అని గర్వంగా ఉంటుంది. నా దగ్గర పనిచేసే మహిళలు కూడా సొంతంగా చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాను’’ అని వివరించారు శైలజ. – నిర్మలారెడ్డి -
మునగను పొడి చేసి అమ్ముతూ.. లాభాలు గడిస్తున్న దీపిక!
తల్లిదండ్రులు చెప్పేమాటలను పెడ చెవిన పెట్టే వారు కొందరైతే, తమ పేరెంట్స్ పడుతోన్న కష్టాలు, వారి ఆలోచనలను మనసుపెట్టి అర్థం చేసుకుని గౌరవించేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే దీపిక రవి. ఓ రైతు కడుపున పుట్టిన దీపిక రైతుల కష్టాలను చాలా దగ్గర నుంచి చూసింది. సామాన్య రైతు ఏం కోరుకుంటాడో తన తండ్రి మాటల ద్వారా తెలుసుకుని ఏకంగా ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఈ స్టార్టప్ ద్వారా మునగ ఆకు, ములక్కాడలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసి విక్రయిస్తూ, తనతోపాటు రైతులకు ఉపాధి కల్పిస్తోంది. తమిళనాడులోని కరూర్ జిల్లా కరూర్ గ్రామంలో పుట్టిపెరిగింది 26 ఏళ్ల దీపిక రవి. చదువురీత్యా పట్నం వెళ్లినప్పటికి సెలవుల్లో గ్రామంలో ఉన్న ఇంటికి తప్పకుండా వచ్చేది. తండ్రితోపాటు పొలాల్లో తిరుగుతూ వ్యవసాయం ఎలా చేస్తారు, రైతులు ఎదుర్కొనే సమస్యలు, పంట.. పొలం నుంచి మార్కెట్‌కు చేరేనాటికి రైతుకు ఏ మాత్రం లాభం వస్తుందో తండ్రి మాటల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకునేది. ఎండనకా వాననకా శ్రమటోడ్చి కష్టపడితే దళారులకు తప్ప రైతులకు మిగిలేది ఏమిలేదని అర్థమైంది దీపికకు. అంతేగాకుండా పంటలన్నీ రసాయన ఎరువులతో పండించడం వల్ల, స్వచ్ఛమైన ఆహారానికి బదులు రసాయనాలు తినాల్సి వస్తోందని గ్రహించింది. అప్పటినుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి, వాటిని లాభసాటిగా మార్కెట్లో ఎలా విక్రయించాలో పరిశోధించడం మొదలు పెట్టింది. సూపర్ ఫుడ్ మొరింగా... ఒక పక్క లాభసాటి పంటల గురించి ఆలోచిస్తూనే ఎమ్ఎస్సీ పూర్తిచేసిన దీపిక తన పరిశోధనలో... ‘‘మునగ (మొరింగా)లో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధి గా ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమని తన అవ్వతాతల మాటలు, కొన్ని శాస్త్రీయ ఆధారాల ద్వారా తెలుసుకుంది. ఇదే సమయంలో తన పొలంతోపాటు, చుట్టుపక్కల పొలాల్లో పండిస్తోన్న మునగ పంటకు సరైన ధర లేకపోవడంవల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడాన్ని చూసింది. వెంటనే మునగను పొడి చేసి అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో 2017లో మునగాకుతో రెండు రకాల పొడులు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. ది గుడ్ లీఫ్... రెండు ఉత్పత్తులకు మంచి స్పందన లభించడంతో మరుసటి ఏడాది తండ్రి రవి వేలుసామితో కలిసి ‘ద గుడ్ లీఫ్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. గ్రామంలోని చుట్టుపక్కల రైతులతో సేంద్రియ పద్దతిలో మునగను పండించి, వారి దగ్గరే మునగ ఆకు, మునక్కాడలను కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఈ రెండింటితో రైస్మిక్స్, చట్నీ పొడి, ములగ టీ, ములగ క్యాప్యూల్స్, ములగ ఫేస్‌ప్యాక్స్, ఫేస్ స్క్రబ్స్, సబ్బులు, చర్మసంరక్షణ ఉత్పత్తులేగాక, ములగ హెయిర్ ఆయిల్, హెయిర్సిరమ్ వంటివాటిని కూడా తయారు చేసి విక్రయిస్తోంది. దీపిక తల్లిదండ్రులతోపాటు మరో పదిమంది ఉద్యోగులు స్టార్టప్‌లో పనిచేస్తున్నారు. ఒక్క కరూర్‌లోనే గాక దిండిగల్, తేని వేలూర్ వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోని 200కుపైగా రైతుల నుంచి ములగ పంటను సేకరించి, రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండిన మునగతో ఉత్పత్తులు తయారు చేయడం వల్ల గుడ్ లీఫ్‌కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు దీపిక ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. గుడ్ లీఫ్ ద్వారా తన తండ్రితోపాటు ఇతర రైతుల జీవితాల్లో లాభాలు పండిస్తూ, నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది దీపిక. ‘‘ఇప్పుడున్న తీరికలేని జీవన శైలిలో పోషకాహారం తీసుకోవడం కష్టం. అందువల్ల మేము అందించే ఉత్పత్తులు కస్టమర్ల శ్రమను తగ్గించి ఆరోగ్యాన్నీ పెంపొందించేవిగా ఉండడంతో మా ప్రోడక్ట్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొ చ్చేందుకు కృషిచేస్తున్నాను’’. – దీపిక రవి -
సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!
ఫిన్‌టెక్ రంగంలో భారత్‌పే సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్, ఆయన సతీమణి మాధురీ మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అష్నీర్‌ను సెలవుల మీద పంపించి.. అంతర్గత విచారణ ద్వారా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అష్నీర్‌కు తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత్‌పే. ఆయన భార్య మాధురీ జైన్‌ను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాదు ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కంట్రోలర్ హోదాలో ఆర్థికపరమైన అవకతవకలకు మాధురి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మాధురీ జైన్.. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు, దుస్తులు, ఎలక్ట్రిక్ సామాన్లు, అమెరికా.. దుబాయ్‌కి ఫ్యామిలీ ట్రిప్స్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అల్వరెజ్ అండ్ మార్షల్ కంపెనీ నిర్వహించిన దర్యాప్తులో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యాయి. ఫేక్ ఇన్వాయిస్లతో కంపెనీని ఆమె మోసం చేయాలని ప్రయత్నించినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. అష్నీర్ గ్రోవర్ ఆరోపణలన్నింటిని ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను కంపెనీని వీడాలంటే.. తన వాటాగా ఉన్న 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తన నాయకత్వంలోనే కంపెనీ ముందుకెళ్లాలని చెప్తున్నాడు. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుండడం విశేషం. సంబంధిత వార్తలు: భర్తతో కలిసి బండబూతులు తిట్టిన మాధురీ! -
ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్‌కి భలే గిరాకీ! ..ఆడవాళ్లకు వెరీ స్పెషల్ అట..!
సౌందర్య పోషణలో ఆవిరిది ప్రధాన పాత్ర. వారానికి రెండు సార్లు అయినా మొహానికి ఆవిరి పట్టిస్తే.. మృతకణాలతో పాటు ట్యాన్ కూడా తొలగిపోయి.. ముఖం ప్రకాశవంతంగా మారుతుందనేది నిపుణుల మాట. అందుకే కొంతకాలంగా మార్కెట్లో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఫేషియల్ స్టీమర్స్కి గిరాకీ బాగా పెరుగుతోంది. వాటికి మించిన సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ఫేషియల్ స్టీమర్ ఇది. ముఖానికి చక్కగా పైనుంచి మాస్క్ తొడిగినట్లుగా తొడిగి.. బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కళ్లు, ముక్కు, నోరు ప్రతిభాగం చెక్కినట్లుగా ఫేస్ ఆకారంలోనే ఉంటుంది ఈ స్టీమర్. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ముక్కు ఉండే భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఇక దీని పైభాగంలో ఉన్న చిన్నపాటి నీళ్ల ట్యాంక్‌లో నీళ్లు నింపి పెట్టుకోవాలి. పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం.. ఇలా చర్మం తీరు ఏదైనా దాని తత్వానికి సరిపడా ట్రీట్ చేసి ప్రత్యేకమైన గ్లో అందిస్తుంది. వదులుగా లేదా ముడతలు పడిన చర్మాన్ని పునర్యవ్వనంగా మార్చేస్తుంది. మచ్చలు, మొటిమలు ఇట్టే పొగొడుతుంది. నానో స్ప్రే, యునిక్ హీటింగ్ టెక్నాలజీ కలిగిన ఈ స్టీమర్.. ఆన్ చేసిన ఒక్క నిమిషంలోనే ఆవిరిని అందిస్తుంది. ఇందులో స్మార్ట్ స్ప్రే మోడ్స్ ఉంటాయి. నొప్పి, ఇబ్బంది లాంటివి ఏమీ ఉండవు. సాధారణ స్టీమర్స్ అయితే వాటికి తగ్గట్టుగానే ఒకే పొజిషన్లో కూర్చుని.. ఆవిరి పట్టించుకోవాలి. కానీ దీన్ని ముఖానికి పెట్టుకుని ఎక్కడైనా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అలాగే సాధారణంగా ఆవిరి పట్టే పద్ధతిలో వేడి గాలికి సుర్రుమనేలా, చర్మం కందిపోయే సమస్య ఉండనే ఉంటుంది. కానీ ఈ ఫేషియల్ స్టీమర్ ముఖానికి అతుక్కుని, సమతుల్యమైన వేడితో సౌకర్యవంతంగా ఆవిరిని అందిస్తుంది. దీని ధర సుమారు 119 డాలర్లు. అంటే 8,865 రూపాయలు. ఇలాంటి వాటిని క్వాలిటీ, రివ్యూలను చూసి కొనుగోలు చేసుకోవడం మంచిది. చదవండి : మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! -
రిహాన్నా ఫోర్బ్స్ సంపన్న గాయని
ప్రతిభ ఉండాలేగానీ ఏ రంగంలోనైనా ఎదగవచ్చు అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పాప్ సింగర్ రిహాన్నా. అమెరికన్ పాప్ సింగర్‌గా ప్రపంచానికి తెలిసిన రిహాన్నా ‘బ్యూటీ ప్రోడక్ట్స్’ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తూ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఓ నివేదికలో ఫోర్బ్స్ ‘రిచెస్ట్ లేడీ మ్యూజీషియన్’గా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఎప్పడూ హాట్ హాట్ డ్రెస్సులతో హాట్ ఐకాన్‌గా నిలిచే రిహాన్నా తన ప్రతిభతో సింగర్గానేగాక, మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ ఏకంగా ప్రపంచంలోనే ‘అత్యంత సంపన్న సంగీత విద్వాంసురాలిగా’ నిలిచింది. కేవలంసం గీతంతోనే ఆమెకు వందల కోట్ల ఆదాయం రాలేదు. ఆమె ఎంత చక్కగా పాడగలదో అంతే సమర్థవంతంగా వ్యాపారం చేస్తూ.. రిచెస్ట్ మ్యూజీషియన్‌గా నిలిచింది సంగీత ప్రపంచంలో బాగా పాపులర్ అయిన రాబిన్ రిహాన్నా ఫెంటీ 1988లో బార్బడాస్లోని మోనికా ఫేంటీ, రోనాల్డ్ దంపతులకు మూడో సంతానంగా పుట్టింది. ఆమెకు పద్నాలుగేళ్లున్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే రిహన్నా అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ పుట్టుకతో వచ్చిన మధురమైన గొంతుతో ఈ స్థాయికి ఎదిగింది. రిహాన్నా స్కూల్లో చదివేటప్పుడు తన స్నేహితులతో కలిసి సరదాగా పాటలు పాడేది. 2003లో క్రిస్టమస్ వెకేషన్లో భాగంగా ప్రముఖ మ్యూజిక్ నిర్మాత ఇవాన్ రోజర్స్ కుటుంబంతో బార్బడోస్ సందర్శించారు. ఆ సమయంలో రిహాన్నా గొంతు విన్న ఆయన ఆమెతో కలిసి కొన్ని పాటలు రికార్డు చేద్దామని న్యూయార్క్ ఆహ్వానించాడు. అప్పుడు న్యూయార్క్ వెళ్లి రోజర్స్‌తో కలిసి డజన్ల సంఖ్యలో పాటలను కంపోజ్ చేసింది. తరువాత తన పాటలను ఎవరు కొనుగోలు చేస్తారా అని ఎదురుచూస్తున్న సమయంలో ఈ రిహాన్నా పాటలు, పనితీరు నచ్చడంతో బాగా పేరొందిన జేజడ్ రికార్డింగ్స్ కంపెనీవారు .. ‘పొన్డి రిప్లే’ పేరిట డెబ్యూ ఆల్బమ్‌ను 2005లో విడుదల చేశారు. అది బాగా హిట్ అవడంతో.. మరిన్ని పాటలను పాడి ఆల్బమ్స్ రూపంలో విడుదల చేసింది. ఈ క్రమంలో రిçహాన్నా పాడిన 50 మిలియన్ల ఆల్బమ్స్, 190 మిలియన్ల సింగిల్ ఆల్బమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. రిహాన్నా పాటలు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ సింగిల్స్‌గా నిలిచాయి. వీటిలో ‘అంబ్రెల్లా’, ‘టేక్ ఏ బౌ’, ‘డిస్టర్బియా’, ‘లవ్ ద వే యూ లై’ లు చాలా పాపులర్ అయ్యాయి. డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్ రిహాన్నా పాటలకు ఆడియెన్స్ ఆదరణతోపాటు అనేక అవార్డులు వరించాయి. వీటిలో గ్రామీ, అమెరికన్ మ్యూజిక్, బిల్బోర్డ్ మ్యూజిక్, బీఆర్‌ఐటీ వంటి అవార్డులను పదుల సంఖ్యలో అందుకుంది. బిల్బోర్డ్ రిహాన్నాకు 2000 దశాబ్దపు ‘డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్’ అనే బిరుదును ప్రదానం చేసింది. ఫెంటీ బ్యూటీ... ప్రముఖ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న రాబిన్ రిహాన్నా ఫెంటీ 2017లో ‘ఫెంటీæ బ్యూటీ’ పేరిట కంపెనీని ప్రారంభించింది. మహిళలు ఎక్కడకు వెళ్లినా వాడుకోగల బ్యూటీ ఉత్పత్తులను విక్రయించడంతో ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 1.7 బిలియన్ డాలర్లుగా ఉండడంతో, ఫోర్బ్స్ జాబితాలో ఓప్రా విన్ఫ్రే తరువాత రిహాన్నా రెండో స్థానంలో నిలిచింది. ఫెంటీ బ్యూటీలో ఆమెకు యాభై శాతం వాటా ఉంది. అదే 1.4 బిలియన్ డాలర్లకు సమానం అని ఫోర్బ్స్ అంచనా. మిగతా విలువంతా ‘సావెజ్ ఎక్స్ ఫెంటీ’ అనే లోదుస్తుల బ్రాండ్ వల్ల వస్తోంది. సావెజ్ కంపెనీ మార్కెట్ అంచనా విలువ 270 మిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ రకాల బ్యూటీ ఉత్పత్తులు, లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లల్లో విక్రయిస్తూ సక్సెస్‌పుల్ బ్యూటీ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 101 మిలియన్ ఫాలోవర్స్, ట్విటర్లో 102.5 మిలియన్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. -
సేంద్రియ బ్యూటీ
తీవ్రమైన చర్మ సంబంధ సమస్యలతో తల్లి చనిపోయింది. తల్లికి అన్నీ తానై సేవలందించిన కృతికకు తల్లి చనిపోయాక ఏం చేయాలో తోచలేదు. దీంతో తన తల్లిపడిన కష్టం మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో చర్మానికి హానికరం కానీ కూరగాయలు, మేకపాలతో సబ్బులు, బ్యూటీ ఉత్పత్తులను తయారు చేసింది. వాటిని విల్వా పేరుతో విక్రయిస్తోంది తమిళనాడుకు చెందిన కృతిక. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో కృతిక కుమరన్ పచ్చని పంటపొలాల మధ్య పెరిగింది. 21 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. దీంతో ఎçప్పుడూ రాష్ట్రం దాటి బయటకు వెళ్లింది లేదు. చిన్నప్పటినుంచి అమ్మ మంజులాదేవితో అనుబంధం ఎక్కువ. మంజులా దేవికి చర్మ సంబంధ సమస్య వచ్చింది. అది తగ్గడానికి వివిధ రకాల స్టెరాయిడ్స్ వాడడంతో అవి చర్మసమస్యను తగ్గించకపోగా కిడ్నీలు పాడయేలా చేశాయి. దీంతో మంజులాదేవి 2016లో మరణించారు. ఎప్పుడూ తనతో ఉండే అమ్మ దూరం కావడాన్ని కృతిక తట్టుకోలేకపోయింది. నిరాశానిస్పృహలకు గురవుతుండేది. ఎలాగైనా వీటి నుంచి బయటపడాలనుకుంది. ఈ క్రమంలోనే... వివిధరకాల సబ్బులు, బ్యూటీ ఉత్పత్తుల వల్ల చర్మసంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో అమ్మను దగ్గరనుంచి చూసిన కృతికకు మార్కెట్లో దొరికే వాటికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో వాటిని తయారు చేయాలనుకుంది. కానీ వాటిని ఎలా రూపొందించాలో తెలిసేది కాదు. మేకపాలతో సబ్బు.. వివిధ రకాల పదార్థాలతో సహజసిద్ధంగా సబ్బులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే.. నేచురల్ కాస్మటాలజీ కోర్సు చేసింది. మేకపాలకు కొన్ని ఇతర రకాల పదార్థాలు కలిపి సబ్బులు తయారు చేసి తెలిసిన వారికి, స్నేహితులకు ఇచ్చేది. ఆ సబ్బులు తామరవ్యాధితో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతున్నట్లు చెప్పడంతో కృతికకు మంచి ప్రోత్సాహంగా అనిపించింది. ఈ ప్రోత్సాహంతో మరిన్ని ఉత్పత్తులను తయారు చేసేది. విల్వా.. అమ్మ చనిపోయిన ఏడాది తరువాత 2017లో ‘విల్వా’ పేరుతో స్టోర్‌ను ప్రారంభించింది. బిల్వపత్రం పేరుమీదగా ఈ పేరుపెట్టింది. ప్రారంభంలో కృతిక తయారు చేసే ఉత్పత్తులను ఫేస్బుక్ పేజిలో పోస్టు చేసి అందరికీ తెలిసేలా చేసింది. సబ్బులతోపాటు, స్కిన్‌కేర్, బ్యూటీ ఉత్పత్తులను సహజసిద్ధ పదార్థాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, వెన్నను ఉపయోగించి తయారు చేసేది. క్లెన్సర్స్, టోనర్స్, ఫేస్‌మాస్క్‌లు, సీరమ్స్, కండీషనర్లు, మాయిశ్చరైజర్, జెల్, పెదవులు, కళ్లకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, షాంపులు, హెయిర్ ఆయిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. మహిళలకేగాక, పురుషులకు సైతం బ్యూటీ ఉత్పత్తులను అందించడం విశేషం. ఇండియాలోనేగాక, యూకే, యూఎస్, మలేసియా, సింగపూర్, గల్ఫ్‌దేశాలకు సైతం కృతిక తన విల్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. వివిధ ఆన్లైన్ వేదికలపై విల్వా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. -
Falguni Nayar: నైకా నాయిక
నైకా... సౌందర్య సాధనాల దిగ్గజం.. అందంతో పాటు మహిళా సాధికారత కూడా ఈ కంపెనీ లక్ష్యం... చిన్నస్థాయిలో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించి, కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు నైకా సిఈవో ఫల్గుణీ నాయర్. ‘పెద్దగా ఆలోచించు, చిన్నగా ప్రారంభించు’ అనే వ్యాపార సూత్రాన్ని ఆచరించి చూపారు నైకా కంపెనీ సిఈవో ఫల్గుణీ నాయర్. బ్యూటీ ప్రాడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ‘మంచి శిక్షణ, ఉన్నత విద్య, అండగా నిలిచేవారు... ఈ మూడు అంశాలు ఒక స్త్రీని ఉన్నత స్థానం మీద కూర్చోబెడతాయి’ అంటారు ఫల్గుణీ నాయర్. చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించిన ఫల్గుణీ, అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లారు. ఫల్గుణీ నాయర్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాక, 19 సంవత్సరాల పాటు కొటక్ మహీంద్రా గ్రూప్‌కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. 2005లో ఆ బ్యాంక్‌కి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్. ‘‘నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్ మార్కెట్, ట్రేడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు. బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. యుటీవీకి చెందిన రోనీ స్క్రూవాలా, పీవీఆర్ సినిమాస్‌కి చెందిన అజయ్ బిజిలీల నుంచి నాయకత్వ లక్షణాలతో పాటు, ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి కావలసిన ఆత్మవిశ్వాసం అలవర్చుకున్నారు. విజయగాథ... ఎవరు ఏ ఉత్పత్తులు వాడితే మంచిదనే విషయాన్ని వివరిస్తూ 2012లో నైకా స్థాపించారు ఫల్గుణీ నాయర్. ఈ ఆలోచన రావటానికి కారణం... పలురకాల ఉత్పత్తులు తయారుచేస్తున్న సెఫోరా కంపెనీ. ఎన్నడూ సౌందర్య సాధనాలు ఉపయోగించని ఫల్గుణీ, వారి ఉత్పత్తులను వాడటం ప్రారంభించారు. అప్పుడే తను కూడా ఒక కంపెనీ ప్రారంభించి, భారతదేశ సౌందర్య సాధనాలను ప్రపంచానికి చూపాలనుకున్నారు. అదేవిధంగా భారతీయ మహిళలు ఆత్మవిశ్వాసంతో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడాలని కలలు కన్నారు. ‘‘ఉత్తమ సౌందర్య సాధనాలు తయారుచేస్తూ, భారతదేశాన్ని సౌందర్య సాధనాలకు ప్రతిరూపంగా చూపుతూ, వినియోగదారులకు వాటి మీద అవగాహన కలిగించాలనుకున్నాను’’ అంటారు ఫల్గుణీ నాయర్. అందంగా కనిపించాలనే కోరిక ఉన్న మహిళలకు ఈ సాధనాలు ఉపయోగపడాలనుకున్నారు. అలా వారంతా నైకాకి అతి త్వరగా కనెక్ట్ అయ్యారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు దూసుకుపోవాలి.. అంటారు ఫల్గుణీ నాయర్. నైకా ప్రారంభించినప్పుడు అదొక ఈ కామర్స్ వెబ్సైట్ మాత్రమే. ఇప్పుడు ఈ కంపెనీ మహిళా సాధికారతకు కావలసిన అంశాలను వివరించటం మీద దృష్టి పెట్టింది. ‘బ్యూటీ అండ్ వెల్నెస్’ మీద ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల బ్యూటీ అడ్వైజర్ కావటానికి అవకాశం ఉంటుంది... అంటారు ఫల్గుణీ నాయర్. -
బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయాల్లోకి ‘లువీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయాల్లోకి కొత్త బ్రాండ్ ‘లువీ’ ఎంట్రీ ఇచ్చింది. యాంకర్, నటి శ్రీముఖి నేతృత్వంలో ఈ బ్రాండ్ ఏర్పాటైంది. లువీ అంటే సంస్కృతంలో అందం అని అర్థం. తొలుత పర్ఫ్యూమ్స్ను ప్రవేశపెట్టి దశలవారీగా బ్యూటీ, గ్రూమింగ్, హెయిర్ కేర్ వంటి ఉత్పత్తులను లువీ స్టోర్లలో పరిచయం చేస్తారు. 40 అంతర్జాతీయ బ్రాండ్స్‌తో కలిపి మొత్తం 80 కంపెనీల సుగంధ పరిమళాలు ఇక్కడ కొలువుదీరాయి. వీటి ధరలు రూ.299తో ప్రారంభమై రూ.7,500 వరకు ఉంది. ‘వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని కొన్నేళ్లుగా భావిస్తున్నాను. నా ఆలోచనలకు తగ్గ భాగస్వాములు దొరికారు. వారికి ఉన్న రిటైల్ అనుభవం లువీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పర్ఫ్యూమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం పల్లెల్లోనూ పెరిగింది. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ ద్వారా నిరుద్యోగులకు తోడ్పాటు అందించాలన్నది నా ఆలోచన’ అని లువీని ప్రమోట్ చేస్తున్న రస్గో ఇంటర్నేషనల్ డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్ శ్రీముఖి ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. తిరుపతి రావు వొజ్జా, శ్రీకాంత్ అవిర్నేని, విజయ్ అడుసుమల్లి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. తొలి ఏడాది 150 స్టోర్లు.. షాప్ ఇన్ షాప్ విధానంలో స్టోర్ల ఏర్పాటుకు లినెన్ దుస్తుల విక్రయంలో ఉన్న లినెన్ హౌజ్‌తో లువీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. లినెన్ హౌజ్‌కు చెందిన 23 దుకాణాల్లో షాప్ ఇన్ షాప్స్ ఏర్పాటు చేసింది. ఏడాదిలో 150 స్టోర్లను సొంతంగా ప్రారంభించనున్నారు. -
ఉమెన్స్ డే.. సన్నీ బంపర్ ఆఫర్
ప్రముఖ నటి సన్నీ లియోన్ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంపై కూడా దృష్టిసారించారు. స్టార్ స్టక్ పేరిట సన్నీ సౌందర్య ఉత్పత్తుల కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సన్నీ స్టార్ స్టక్ ప్రొడక్ట్స్ గురించి ప్రచారం చేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్ స్టక్ ప్రొడక్ట్స్‌పై సన్నీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ముందుగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సన్నీ.. ఈ అద్భుతమైన రోజున తన స్టార్ స్టక్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. మీ గ్లామర్ కోసం త్వరపడండి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సన్నీ బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భర్త, పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ విశేషాలను కూడా సన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలిసింది. -
అరవైలోనూ స్వీట్ సిక్స్‌టీన్‌గా మెరిసిపోవచ్చు..
ఆడవాళ్లకైనా.. మగవాళ్లకైనా మూడుపదులు దాటాయంటే.. ముఖం మీద ముడతలు మొదలయిపోతాయి. మొదట కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలు బయటపడుతుంటాయి. అందుకే.. ‘అందం చందం అంటే.. ఇరవై నుంచి ముప్ఫై వరకే’ అనేది అనాదిగా నమ్మే నానుడి. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేదు. మెయిన్టెనెన్స్ ఉంటే చాలు. అరవైలోనూ స్వీట్ సిక్స్‌టీన్‌గా మెరిసిపోవచ్చనేది టెక్నాలజీ మాట. కళ్లకింద ముడతలు, వయసు తెలిపే నల్లటి చారలు కనిపించకుండా పౌండేషన్ క్రీమ్స్, ఐలైన్, మస్కారా, ఐబ్రో పెన్సిల్ ఇలా కళ్లని హైలైట్ చేసే మేకప్ వేసి కవర్ చేస్తుంటారు చాలా మంది. కానీ వాటికంటే ముందు కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలు పోయేలా చిత్రంలోని మెషిన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కళ్ల కింద వచ్చిన మచ్చలను పోగొట్టడంతో పాటూ వయసుతో వచ్చే చారలను కూడా మటుమాయం చేసేస్తుంది. దీన్ని రోజుకు మూడు నిమిషాలు పెట్టుకుంటే చాలు. కళ్ల కింద చర్మం మెరుగవుతుంది. ఇది పెట్టుకోగానే కంపనాలు వస్తూ వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. దీనికి హార్డ్ లేదా సాప్ట్ అని రెండు మూడ్స్ ఉంటాయి. హార్ట్ మూడ్ ఆన్ చేసుకుంటే విద్యుత్ ప్రకంపనాలు వేగం పెరిగి ఫలితం త్వరగా ఉంటుంది. పింక్ కలర్లో ఉన్న పైభాగంతో పాటూ నాలుగు వైట్ ప్యాడ్స్, రెండు బ్యాటరీలు ఈ ప్రొడక్ట్‌ని కొనుగోలు చేసినప్పుడే లభిస్తాయి. రెండు వైపు ప్యాడ్స్ కలిపి ఉంచేందుకు చిన్న ఎలాస్టి్టక్ ఉంటుంది. అది ముక్కు మీద నుంచి పట్టి ఉంచుతుంది. దీన్ని ‘ఐ స్లాక్ హరుకా’ అని పిలుస్తారు. మార్కెట్ ధరల ప్రకారం సుమారుగా 82 డాలర్ల (5,895 రూపాయలు) కు ఇది అమ్ముడుపోతుంది. జపాన్‌లో రూపొందిన ఈ బ్యూటీ గాడ్జెట్ వయసు తెలియని అందాన్ని నిమిషాల్లో చేయనుంది. భలే ఉంది కదూ! -
అమెజాన్ సరికొత్త ప్లాన్ : వాటిపై కన్నేసింది
బెంగళూరు : దేశీయ ఆన్లైన్ ఫ్యాషన్ షాపింగ్ వేదికగా ఉన్న మింత్రాను ఫ్లిప్‌కార్ట్ దక్కించుకున్న అనంతరం, అమెజాన్ ఇండియా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. సొంతంగా బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల బ్రాండును లాంచ్ చేయాలని సన్నద్ధమవుతోంది. ఆధిపత్య స్థానంలో ఉన్న చిన్న స్టార్టప్‌లను వెనక్కి నెట్టేస్తూ... వేగవంతమైన ఈ కాస్మోటిక్స్ మార్కెట్లో ఈ రెండు డిజిటల్ రిటైలర్లు పోటీ పడబోతున్నాయి. కాంట్రాక్ట్ మానుఫాక్ట్ర్చర్స్తో అమెజాన్ ఇండియా చర్చలు జరుపుతుందని, స్కిన్ కేర్, మేకప్‌లో కొన్ని కేటగిరీల్లో ప్రైవేట్ లేబుల్స్‌ను లాంచ్ చేస్తుందని ఈ విషయం తెలిసిన వర్గాలు చెప్పాయి. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ రెండూ ఎక్కువ మార్జిన్లు అందించే కాస్మోటిక్స్ కేటగిరీపై దృష్టిసారించాయని తెలిపాయి. అయితే సొంత బ్రాండులను ప్రవేశపెట్టేముందు ఈ కేటగిరీల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెజాన్ ఇండియా ఇప్పటికే 19వేల బ్రాండ్స్‌లో 20 లక్షల బ్యూటీ ప్రొడక్ట్‌లను రిటైల్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా 100కు పైగా బ్రాండుల్లో బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా రిటైల్ చేయడం కంటే అంతర్జాతీయ బ్రాండులతో కలిసి కొత్తగా బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండులను లాంచ్ చేయాలని కూడా మింత్రా చూస్తోంది. అంతర్జాతీయ బ్రాండులతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తున్నట్టు మింత్రా, జబాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనంత్ నారాయణన్ తెలిపారు. 2020 వరకు మొత్తం రెవెన్యూలో బ్యూటీ సెగ్మెంట్ సహకారం 8 శాతం ఉంచుకోవాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 1 శాతంగా మాత్రమే ఉంది. -
పురుషులు వేలం వెర్రిగా కొంటున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : గతంలో ఆడపిల్లల్ని ఆకర్షించడం కోసం పురుష పుంగవులు నెత్తికింత నూనె పెట్టుకొని ముఖానికి ఇంత పౌడరేసుకొని వీధుల్లోకి వెళ్లేవారు. ఆ తర్వాత నీటుగా గడ్డం గీసుకొని లేదా ట్రిమ్ముగా గడ్డం చేసుకొని, తెల్లగా పౌడరేసుకొని ‘షి’కారుకెళ్లేవారు. అప్పట్లో అందంగా కనిపించడం కోసం ఆడవాళ్లు వాడే సౌందర్య ఉత్పత్తులనే వాడేవారు. ఆ తర్వాత పరిస్థితులతోపాటు సౌందర్య ఉత్పత్తులు మారిపోయాయి. ఆడవారి సౌందర్య ఉత్పత్తులతోపాటు మగవారి కోసం ప్రత్యేక సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఉత్పత్తులు మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయని, వాటి మార్కెట్ ఇప్పుడు ఏటా ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకుందని ‘నీల్సన్’ డిసెంబర్17 పేరిట విడుదల చేసిన ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. పురుషులు ఇంత వేలం వెర్రిగా సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తున్నది ఆడపిల్లలను ఆకర్షించడానికి కాదట. ఉద్యోగం చేస్తున్న చోట నీట్‌గా కనిపించి మంచి మార్కులు కొట్టేయటానికట. ఆడపిల్లలకు అందంగా కనిపించాలని వెంటబడేది పెళ్లయ్యేంత వరకేగదా! గతంలో మగవాళ్ల అందం కోసం షేవింగ్ జెల్, షేవింగ్ క్రీమ్లతోపాటు ఆఫ్టర్ షేవ్ లోషన్లు, డియోడోరాంట్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ప్రత్యేక షాంపూలు, నూనెలు, ఫెయిర్‌నెస్ క్రీమ్స్, బియర్డ్ బామ్స్, మత్తునిచ్చే సెంట్స్ ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. ఆరేడేళ్ల క్రితంతోని ఇప్పుడు పోలిస్తే వీటి వినియోగం ఊహించలేనంత పెరిగింది. 2009 నుంచి 2016 మధ్య పురుష సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ను 60 రెట్లు పెరిగిందని నీల్సన్ సర్వే తెలియజేసింది. ఈ ఉత్పత్తుల్లో హిందుస్థాన్ లీవర్, ఎల్ వోరియల్, నీవియా, మారికో కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఉత్పత్తులకు 2017 సంవత్సరం బాగా కలసివచ్చిందని చెప్పవచ్చు. సెట్‌వెట్ హేర్ జెల్‌ను విక్రయిస్తున్న ముంబై కంపెనీ మారికో గత మార్చి నెలలో బియర్డో కంపెనీలో 45 శాతం వాటాను కొనుగోలు చేసింది. కోల్‌కతాలోని ఎమామి కంపెనీ గత డిసెంబర్ నెలలో ‘ది మేన్ కంపెనీ’లో 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
ఇంట్లోనే తయారీ...
హోమ్మేడ్ ప్రస్తుతం మనం తీసుకునే ఆహారమే కలుషితమైందని బాధపడుతుంటే మరోవైపు బ్యూటీ ప్రాడక్ట్స్, హెల్త్ ప్రాడక్ట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా ఆరోగ్యం మరింత చెడిపోతోంది. దానికి పరిష్కారంగా ఇంట్లో కొన్ని వస్తువులను తయారు చేసుకోవచ్చు. అలా ఆర్గానిక్ ప్రాడక్ట్స్‌ను నిశ్చింతగా ఉపయోగించుకోవచ్చు.. టూత్ పేస్ట్: మార్కెట్లో దొరికే టూత్‌పేస్ట్‌లలో సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఉండటం వల్ల దీర్ఘకాలం వాటిని వాడితే అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ఇంట్లోనే ఆరోగ్యవంతమైన టూత్ పేస్ట్‌ను తయారు చేసుకోండి. కావాల్సినవి: బేకింగ్ సోడా-1 టీ స్పూన్, మెత్తని ఉప్పు- 1/2 టీ స్పూన్, పెప్పర్మెంట్ ఆయిల్- 1 చుక్క, లవంగ నూనె- 1 చుక్క, శుద్ధమైన నీరు- కొన్ని చుక్కలు తయారీ: పైన పదార్థాలన్నింటినీ ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేయాలి. వాటిని మెత్తగా అయ్యేవరకు బాగా కలపాలి. నీళ్లు సరిపోకపోతే మరి కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. అంతే! ఆరోగ్యవంతమైన టూత్ పేస్ట్ రెడీ.. హెయిర్ డై: ఇప్పుడు చిన్నా పెద్దా అని వయసుతో పరిమితం లేకుండా అందరికీ జుట్టుకు తెల్లగా మారుతోంది. దాంతో చాలామంది హెయిర్ డై వేసుకుంటున్నారు. ఆ డైలోని అమోనియా కారణంగా జుట్టు రాలడం, డ్రై స్కాల్ప్ కావడం లాంటివి జరుగుతాయి. వాటిని దూరం చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే హెయిర్ డైను తయారు చేసుకోండి. కావాల్సినవి: బ్లాక్ వాల్నట్ పౌడర్- 1/4 కప్పు, నీళ్లు- 3 కప్పులు, బ్లాక్ టీ బ్యాగులు- 2-3, ఖాళీ టీ బ్యాగ్-1 తయారీ: ఒక ప్లాస్టిక్ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఖాళీ టీ బ్యాగ్‌లో బ్లాక్ వాల్నట్ పౌడర్‌ను నింపి దాన్ని ఓ ఆరు గంటల పాటు నీళ్ల గిన్నెలో నానబెట్టాలి. తర్వాత ఆ నీటితో జుట్టును కడుక్కొని ఆరే వరకు గాలికి కూర్చోండి. తర్వాత మరో నీళ్ల గిన్నెలో నానబెట్టిన బ్లాక్ టీ బ్యాగ్‌లను తీసుకోవాలి. ఆ ఆరిన జుట్టును ఇప్పుడు రెండో గిన్నెలోని నీళ్లతో కడుక్కోవాలి. అంతే! మీ జుట్టు డార్క్ గ్రే కలర్లోకి మారుతుంది. ఇలా తరచూ చేస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఇందులో ఏ రసాయనాలు లేకపోవడం వల్ల అవసరమైతే వారానికి మూడుసార్లైనా ఈ నేచురల్ హెయిర్ డై వేసుకోవచ్చు. షేవింగ్ క్రీమ్: కొన్ని షేవింగ్ క్రీముల కారణంగా చాలా మందికి సున్నితమైన చర్మంపై ర్యాషెస్ అవుతుంటాయి. అలాగే రేజర్ బర్న్స్‌ను కొన్ని క్రీములు రెట్టింపు చేస్తాయి. అదే ఆర్గానిక్ షేవింగ్ క్రీమ్ ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుంది. కావాల్సినవి: కాస్టైల్ సోప్ (ఆలివ్ ఆయిల్, సోడాతో చేసింది)-1/4 కప్పు, కరిగించిన కోకో బట్టర్-1/4 కప్పు, ఆల్మండ్ ఆయిల్- 1/2 కప్పు, ఎస్సెన్షియల్ ఆయిల్ ఏదైనా..ఉదా: లావెండర్ ఆయిల్-5 చుక్కలు, తేనె-1/4 కప్పు, గోరు వెచ్చని నీళ్లు-3/4 కప్పు తయారీ: ఒక మూకుడులో కొన్ని నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. దానిపైన మరో మూకుడు పెట్టి అందులోనూ కొన్ని నీళ్లు పోయాలి. తర్వాత ఆ పైన మూకుడులో కోకో బట్టర్ వేయాలి. అది కరుగుతున్నప్పుడు అందులో ఆల్మండ్ ఆయిల్, సోప్, తేనె వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఎస్సెన్షియల్ ఆయిల్‌తో కలిపి ఓ ప్లాస్టిక్ గిన్నెలో తీసుకోవాలి. తర్వాత అది క్రీమ్‌లా కావడానికి కొన్ని నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపితే నేచురల్ షేవింగ్ క్రీమ్ రెడీ అవుతుంది. -
ఫౌండేషన్ వాడుతుంటే...!
మేకప్ సీజన్ మారింది...మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో వచ్చే మార్పులను తట్టుకుంటూ చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి తడి, చలి తట్టుకునేలా లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచు కోవాలి. మాయిశ్చైరె జర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్స్, నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడితే చర్మం పొలుసు లుగా అవదు కాలానుగుణంగా చర్మవైద్య నిపుణులను సంప్రదించి చర్మంలో వచ్చే మార్పులను దానికి తగ్గ ఫౌండేషన్‌ని సూచించమని కోరవచ్చు పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఫౌండేషన్ లోషన్లను ఎంచుకోవాలి ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం తెల్లగా, మెడ నలుపుగా కనిపించే అవకాశాలున్నాయి.