సౌందర్య పోషణలో ఆవిరిది ప్రధాన పాత్ర. వారానికి రెండు సార్లు అయినా మొహానికి ఆవిరి పట్టిస్తే.. మృతకణాలతో పాటు ట్యాన్ కూడా తొలగిపోయి.. ముఖం ప్రకాశవంతంగా మారుతుందనేది నిపుణుల మాట. అందుకే కొంతకాలంగా మార్కెట్‌లో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఫేషియల్ స్టీమర్స్‌కి గిరాకీ బాగా పెరుగుతోంది. వాటికి మించిన సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ఫేషియల్ స్టీమర్ ఇది. ముఖానికి చక్కగా పైనుంచి మాస్క్ తొడిగినట్లుగా తొడిగి.. బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
కళ్లు, ముక్కు, నోరు ప్రతిభాగం చెక్కినట్లుగా ఫేస్ ఆకారంలోనే ఉంటుంది ఈ స్టీమర్. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ముక్కు ఉండే భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఇక దీని పైభాగంలో ఉన్న చిన్నపాటి నీళ్ల ట్యాంక్‌లో నీళ్లు నింపి పెట్టుకోవాలి. పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం.. ఇలా చర్మం తీరు ఏదైనా దాని తత్వానికి సరిపడా ట్రీట్ చేసి ప్రత్యేకమైన గ్లో అందిస్తుంది. వదులుగా లేదా ముడతలు పడిన చర్మాన్ని పునర్‌యవ్వనంగా మార్చేస్తుంది. మచ్చలు, మొటిమలు ఇట్టే పొగొడుతుంది.
నానో స్ప్రే, యునిక్ హీటింగ్ టెక్నాలజీ కలిగిన ఈ స్టీమర్.. ఆన్ చేసిన ఒక్క నిమిషంలోనే ఆవిరిని అందిస్తుంది. ఇందులో స్మార్ట్ స్ప్రే మోడ్స్ ఉంటాయి. నొప్పి, ఇబ్బంది లాంటివి ఏమీ ఉండవు. సాధారణ స్టీమర్స్ అయితే వాటికి తగ్గట్టుగానే ఒకే పొజిషన్‌లో కూర్చుని.. ఆవిరి పట్టించుకోవాలి. కానీ దీన్ని ముఖానికి పెట్టుకుని ఎక్కడైనా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అలాగే సాధారణంగా ఆవిరి పట్టే పద్ధతిలో వేడి గాలికి సుర్రుమనేలా, చర్మం కందిపోయే సమస్య ఉండనే ఉంటుంది. కానీ ఈ ఫేషియల్ స్టీమర్ ముఖానికి అతుక్కుని, సమతుల్యమైన వేడితో సౌకర్యవంతంగా ఆవిరిని అందిస్తుంది. దీని ధర సుమారు 119 డాలర్లు. అంటే 8,865 రూపాయలు. ఇలాంటి వాటిని క్వాలిటీ, రివ్యూలను చూసి కొనుగోలు చేసుకోవడం మంచిది.
చదవండి : మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...!
Comments
Please login to add a commentAdd a comment