Facial skin
-
కాస్మొటిక్ సర్జరీతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి
-
ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్‌కి భలే గిరాకీ! ..ఆడవాళ్లకు వెరీ స్పెషల్ అట..!
సౌందర్య పోషణలో ఆవిరిది ప్రధాన పాత్ర. వారానికి రెండు సార్లు అయినా మొహానికి ఆవిరి పట్టిస్తే.. మృతకణాలతో పాటు ట్యాన్ కూడా తొలగిపోయి.. ముఖం ప్రకాశవంతంగా మారుతుందనేది నిపుణుల మాట. అందుకే కొంతకాలంగా మార్కెట్లో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఫేషియల్ స్టీమర్స్కి గిరాకీ బాగా పెరుగుతోంది. వాటికి మించిన సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ఫేషియల్ స్టీమర్ ఇది. ముఖానికి చక్కగా పైనుంచి మాస్క్ తొడిగినట్లుగా తొడిగి.. బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కళ్లు, ముక్కు, నోరు ప్రతిభాగం చెక్కినట్లుగా ఫేస్ ఆకారంలోనే ఉంటుంది ఈ స్టీమర్. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ముక్కు ఉండే భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఇక దీని పైభాగంలో ఉన్న చిన్నపాటి నీళ్ల ట్యాంక్‌లో నీళ్లు నింపి పెట్టుకోవాలి. పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం.. ఇలా చర్మం తీరు ఏదైనా దాని తత్వానికి సరిపడా ట్రీట్ చేసి ప్రత్యేకమైన గ్లో అందిస్తుంది. వదులుగా లేదా ముడతలు పడిన చర్మాన్ని పునర్యవ్వనంగా మార్చేస్తుంది. మచ్చలు, మొటిమలు ఇట్టే పొగొడుతుంది. నానో స్ప్రే, యునిక్ హీటింగ్ టెక్నాలజీ కలిగిన ఈ స్టీమర్.. ఆన్ చేసిన ఒక్క నిమిషంలోనే ఆవిరిని అందిస్తుంది. ఇందులో స్మార్ట్ స్ప్రే మోడ్స్ ఉంటాయి. నొప్పి, ఇబ్బంది లాంటివి ఏమీ ఉండవు. సాధారణ స్టీమర్స్ అయితే వాటికి తగ్గట్టుగానే ఒకే పొజిషన్లో కూర్చుని.. ఆవిరి పట్టించుకోవాలి. కానీ దీన్ని ముఖానికి పెట్టుకుని ఎక్కడైనా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అలాగే సాధారణంగా ఆవిరి పట్టే పద్ధతిలో వేడి గాలికి సుర్రుమనేలా, చర్మం కందిపోయే సమస్య ఉండనే ఉంటుంది. కానీ ఈ ఫేషియల్ స్టీమర్ ముఖానికి అతుక్కుని, సమతుల్యమైన వేడితో సౌకర్యవంతంగా ఆవిరిని అందిస్తుంది. దీని ధర సుమారు 119 డాలర్లు. అంటే 8,865 రూపాయలు. ఇలాంటి వాటిని క్వాలిటీ, రివ్యూలను చూసి కొనుగోలు చేసుకోవడం మంచిది. చదవండి : మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! -
ఎలక్ట్రోథెరపీ డివైజ్.. కాంతివంతమైన చర్మం కోసం
కలువ కన్నుల కోసం, మెరిసే పెదవుల కోసం ఐలైనర్లు, ఐలాష్‌లు, లిప్ స్టిక్స్, లిప్ కేర్స్ ఉండనే ఉన్నాయి. కానీ చర్మంలో మృదుత్వం, కాంతి లేకపోతే.. ఎంత మేకప్ వేసినా ఆ అందం అసహజంగానే కనిపిస్తుంది. చర్మం ముడతలు పడినా, మచ్చలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలతో అందహీనంగా మారినా.. అన్నింటినీ మాయం చేసేందుకు ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మ్యాజిక్ స్టిక్‌లా పనిచేస్తుంది. పైగా ఈ డివైజ్.. జుట్టుకోసం ప్రత్యేకమైన దువ్వెనను కూడా అందిస్తోంది. ఈ అల్టిమేట్ హై ఫ్రీక్వెన్సీ బ్యూటీ ఎక్విప్మెంట్ అందించే థెరపీ.. సౌందర్య ప్రియులకు అద్భుతమైన వరమనే చెప్పాలి. మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలను పూర్తిగా తొలగించే ఈ ఎలక్ట్రోథెరపీ డివైజ్.. చర్మంపై పడిన ముడతలనూ శాశ్వతంగా పోగొడుతుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. మష్రూమ్ ట్యూబ్, బెంట్ ట్యూబ్, టంగ్ ట్యూబ్, కూంబ్ ట్యూబ్.. అనే నాలుగు ప్రత్యేకమైన ట్యూబ్స్ ఈ మెషిన్‌తో పాటు లభిస్తాయి. మష్రూమ్ ట్యూబ్‌ను గాడ్జెట్‌కి అటాచ్ చేసి, స్విచ్ ఆన్ చేస్తే.. ముడతలు, గీతలు, మృతకణాలను తొలగిపోతాయి. బెంట్ ట్యూబ్.. మొటిమలను పోగొడుతుంది. టంగ్ ట్యూబ్.. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను రూపుమాపుతుంది. దీన్ని కళ్లు, పెదవులు, ముక్కు వంటి సున్నితమైన ప్రదేశాల్లోనూ ఉపయోగించాలి. ఇక కూంబ్ ట్యూబ్.. తలలోని రక్తప్రసరణ బాగా జరిపి, కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది. ట్యూబ్స్ అన్నింటినీ భద్రంగా పెట్టుకోవడానికి ప్రత్యేకమైన బాక్స్ ఉంటుంది. దీనికి చార్జింగ్ పెట్టుకోవడం, తలకి లేదా ముఖానికి థెరపీ అందించడం చాలా తేలిక. చదవండి: క్రైమ్ స్టోరీ: ది స్పై కెమెరా -
బ్యూటిప్స్
నాచురల్ ఫేస్ మాస్క్ పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డు సొన, ఐదు గ్రాముల పాలపొడి కాని ఒక టేబుల్ స్పూన్ తాజా పాలు కాని తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఆ మిశ్రమాన్ని ఫేషియల్ బ్రష్‌తో కళ్ల చుట్టూ, పెదవులను మినహాయించి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోడిగుడ్డుసొన చర్మానికి పోషణనిస్తుంది. తేనె చక్కని నిగారింపునిస్తుంది. ఈ ప్యాక్ వేయడం వల్ల చర్మం బాల్యపు సుకుమారాన్ని సంతరించుకుంటుంది. ఇది నాచురల్ స్కిన్‌కూ పొడిచర్మానికీ కూడా చక్కగా పని చేస్తుంది.ఆయిలీ స్కిన్ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్ పౌడర్ లేదా పుల్లటి పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్ క్లెన్సర్‌గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. మెరిసే కేశాలకోసం.. తలస్నానం పూర్తయ్యాక చివరగా ఒక లీటరునీటిలో ఒక నిమ్మకాయను పిండి, రెండు టీ స్పూన్ల తేనె కలిపి జుట్టంతా తడిసేలా పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మీద పోసి కనీసం రెండు నిమిషాల సేపు అలాగే ఉంచిన తర్వాత చన్నీటిని పోసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమంగా పట్టించి జుట్టును ముడి చుట్టేసి క్యాప్ పెట్టేయాలి. అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత షాంపూతో లేదా షీకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మెరుస్తూ, గాలికి అలల్లా ఎగిరిపడతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉంటే అవసరాన్ని బట్టి తేనె మోతాదును పెంచుకోవచ్చు.తేనె, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ కేశాలను ఆరోగ్యంగా ఉంచి మెరుపులీనేటట్లు చేస్తుంది. పావు కప్పు తేనెలో అంతే మోతాదు ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది డీప్ కండిషనర్‌గా పనిచేసి పోషణ లేక నిర్జీవంగా, పాలిపోయినట్లున్న జుట్టును అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. -
మేనిచాయ కోసం...
∙ఆపిల్ స్లైస్ ఆయిల్ కంట్రోల్ సొల్యూషన్ ఆపిల్ ఒక్కటి ఉంటే చాలు ఏమయినా చేయొచ్చు. ఆపిల్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి. ఆయిలీ స్కిన్‌కు ఇది ఇంట్లో చేసుకోగలిగిన సింపుల్ ట్రీట్మెంట్. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాల్లో దాగిన అదనపు ఆయిల్ పోతుంది. జిడ్డు రావడాన్ని కంట్రోల్ చేస్తుంది కూడా. ∙బనానా ఫేషియల్ క్రీమ్ బాగా పండిన అరటిపండును పావు భాగం తీసుకుని మెత్తగా చిదిమి మెత్తగా అయ్యేవరకు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పదిహేను లేదా ఇరవై నిమిషాల తర్వాత ముందుగా వేడినీటితోనూ తరువాత చల్లటి నీటితోనూ కడగాలి. కడిగిన తర్వాత ముఖాన్ని తుడవకుండా గాలికి ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరవడంతో పాటు పాటు ముడతలను కూడా నివారిస్తుంది. -
రూపురేఖలు మార్చేస్తారు..
ముఖ భాగంలో ఎముక వంకరగా ఉన్నా, నుదుటి భాగం ఎత్తుగా ఉన్నా, ప్రమాదాల్లో ముఖానికి గాయమైనా, గ్రహణం మొర్రి ఉన్న ఇక బాధ పడనవసరంలేదు. అందవిహీనంగా ఉన్నామన్న ఆందోళన అంతకన్నా అవసరంలేదు. మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లను సంప్రదించి ముఖానికి సరికొత్త అందాలను సమకూర్చుకోవచ్చు. ఫిబ్రవరి13వ తేదీన జాతీయ, అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లబ్బీపేట (విజయవాడ తూర్పు): మారుతున్న కాలానికి అనుగుణంగా మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు కొత్త ఒరవడిని సృష్టిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తల, ముఖం, దవడ ఎముకలు విరిగిన వారికి అభయహస్తం అందిస్తున్నారు. ట్రామాకేర్ బృందంలో ప్రముఖ పాత్ర పోషించనున్నారు. మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 60 మంది వరకూ ఉన్నారు. అరుదైన ఫేషియల్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తూ రోగుల రూపురేఖలను మార్చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2017లో 400 మందికి పైగా ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరి గాయి. శస్త్ర చికిత్సతో వారి ముఖ అందాలను కాపాడారు. పొగాకు ఉత్పత్తుల కారణంగా నోటి క్యాన్సర్‌కు గురైన 500 మందికిపైగా శస్త్ర చికిత్స చేసి కాపాడారు. ప్రమాదాల్లో దవడ ఎముకలతో పాటు, ఫేషియల్ కాస్మోటిక్ సర్జరీలు, ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలు, ఫేస్‌లిప్ట్, రైనో ఫ్లాస్టీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బోటాక్స్, డెర్మో ఫిల్లర్స్ ద్వారా ముఖంపై ముడతలను తొలగించడం వంటి సర్జరీలను సైతం సమర్థంగా నిర్వహిస్తున్నారు. మరో వైపు ఫేషియల్ అంకాలజీ, గ్రహణ మొర్రి ఆపరేషన్లు, ప్రమాదాలలో దవడ ఎముకలు విరిగిన వారిని ఆధునిక పద్ధతుల్లో రీకన్స్ట్రక్షన్ సర్జరీతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. పుట్టుకతో ముఖం అందవిహీనంగా ఉన్న వారిని అందంగా మారుస్తున్నారు. ముఖ భాగంలో ఎముక వంకరగా ఉన్నా, నుదుటి భాగం ఎత్తుగా ఉన్నా, ముక్కు వంకరగా ఉన్నా శస్త్ర చికిత్సతో సరిదిద్దుతున్నారు. ట్రామా బృందంలో సభ్యులుగా ట్రామాకేర్ బృందంలో న్యూరోసర్జన్స్, ఆర్థోపెడిక్ సర్జన్లతో పాటు, మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు కూడా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూడా ప్రతి ప్రభుత్వ బోధనాస్పత్రిలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు ట్రామా బృందంలో ఉండేలా ఆదేశాలు ఇస్తే అత్యవసర సమయాల్లో రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు జాతీయ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ డేని పురస్కరించుకుని మంగళవారం విజయవాడ పీబీ సిద్ధార్థ గ్రౌండ్స్‌లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఫేషియల్ సర్జరీల్లో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సులో నగరంలో ఉన్న మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు పాల్గొంటారు. ఫేషియల్ సర్జన్ల ప్రాధాన్యత పెరిగింది ప్రస్తుతం వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్ల పాత్ర కీలకంగా మారింది. ప్రమాదాల్లో దవడ, ముఖ ఎముకలు విరి గిన వారికి శస్త్ర చికిత్సచేసి, వారి అందాన్ని కాపాడుతున్నారు. తెలంగాణ తరహాలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని ట్రామా కేర్ బృందంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లను నియమించాలి. ఫేషియల్ సర్జన్ల సేవలు పేద, మధ్యతరగతి వర్గాలకు చేరువలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, అధ్యక్షుడు,మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ -
మొటిమల మచ్చలు తగ్గాలంటే..
బ్యూటిప్స్ * వేసవిలో ముఖ చర్మం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్‌లు ఇవి... * పది వేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. * బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి. * సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు. * బంతిపువ్వును కొద్దిగా పాలు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. * టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. అర గంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి. -
మొటిమల మచ్చలు తగ్గాలంటే..
బ్యూటిప్స్ * వేసవిలో ముఖ చర్మం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్‌లు ఇవి... * పది వేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. * బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి. * సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు. * బంతిపువ్వును కొద్దిగా పాలు కలిపి మెత్తగా రుబ్బాయిలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. మొటిమలు, తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. * టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. అర గంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి.