గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.చవితి ప.12.09 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఆశ్లేష తె.4.25 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి మఖ, వర్జ్యం: సా.4.45 నుండి 6.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు, తదుపరి ప.2.31 నుండి 3.15 వరకు, అమృతఘడియలు: రా.2.46 నుండి 4.24 వరకు
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం : 5.26
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం: సన్నిహితులతో కలహాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. అనుకోని ఖర్చులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు.
కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు, ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త మార్పులు.
సింహం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యసమస్యలు. చర్చలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
మకరం: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి. మిత్రుల సహాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
కుంభం: పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి లాభం. దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment