
కర్నూలు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ బుధవారం కర్నూలులో పర్యటించారు. జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరయ్యారు.

నూతన వధూవరులు డాక్టర్ కె. చతుర, డాక్టర్ కె. నిఖిల్‌లకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. జగన్ రాకతో కర్నూలు కోలాహలంగా మారింది. ఆయన్ని ఫొటో తీసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారందరికీ అభివాదం చేసి ముందుకు కదిలారాయన.


Comments
Please login to add a commentAdd a comment