మొటిమల మచ్చలు తగ్గాలంటే..
బ్యూటిప్స్
* వేసవిలో ముఖ చర్మం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్‌లు ఇవి...
* పది వేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.
* బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి.
* సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు.
* బంతిపువ్వును కొద్దిగా పాలు కలిపి మెత్తగా రుబ్బాయిలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. మొటిమలు, తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి.
* టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. అర గంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి.