వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి.
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.
మ్యాజిక్ క్యూర్
పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్‌గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం.
నిపుణుల మాట
► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి.
► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది
► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి.
►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.
నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు.
Comments
Please login to add a commentAdd a comment