Beau Tips
-
గోళ్లు పలచబడి విరిగిపోతుంటే...
గోళ్లు పొడవుగా పెంచుకొని, మంచి షేప్ చేయించుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ కొందరిలో గోళ్ల పెరుగుదల అంతగా ఉండదు. పైగా కొద్దిగా పెరిగినా త్వరగా విరిగిపోతుంటాయి. దీనికి ప్రధాన కారణం... కాల్షియం, ఐరన్ లోపం. దీంతో పాటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. రోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలిపి గోళ్ల మీద రాసి, మసాజ్ చేయాలి. లేదా బాదం నూనెను వేలితో అద్దుకొని, గోరు చుట్టూ రాసి మృదువుగా మర్దనా చేయాలి. కొబ్బరినూనెను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది. త్వరగా విరిగిపోవు. నెల రోజులకోసారి ఇంట్లోనే గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. దీనికి ఉప్పు, షాంపూ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు వేళ్లు మునిగేలా ఉంచి, తర్వాత మెనిక్యూర్ టూల్‌తో గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. గోళ్లను ఒక షేప్‌లో కత్తిరించి, పెట్రోలియమ్ జెల్లీ లేదా బాదం నూనెతో మర్దనా చేయాలి.వీటితో పాటు.. ∙ఆహారంలో కాల్షియం, ఐరన్ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. తాజా ఆకుకూరలు, నువ్వులు, పల్లీలు, బెల్లం.. మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. -
నునుపైన వీపు కోసం...
బ్యూటిప్స్ అందం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వాళ్లు కూడా వీపును నిర్లక్ష్యం చేస్తారు. వీపు గురించి శ్రద్ధ తగ్గితే క్రమంగా ఆ భాగంలో చర్మం ఛాయతగ్గి నిర్జీవంగా తయారవుతుంది. చలి కాలంలో ఈ చర్మం పొడిబారి తెల్లగా పొట్టు రాలుతుంది. ఇలాంటప్పుడు మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్ రాసి సరిపెట్టుకుంటారు. వీపు కూడా అందంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పని సరి. స్క్రబ్బర్‌తో: చర్మం మీద మృతకణాలను తొలగించడానికి స్క్రబ్బర్ బాగా పని చేస్తుంది. మార్కెట్లో దొరికే రెడీమేడ్ స్క్రబ్ వాడవచ్చు. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.కొంచెం గరుకుగా ఉండే బియ్యప్పిండి, సున్నిపిండితో రుద్దితే మృత కణాలు పోయి చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. రెడీమేడ్ స్క్రబ్బర్లు బ్రాండెడ్వే వాడాలి. కొంతమందికి వీపు మీద మొటిమలు, కురుపులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు స్క్రబ్బర్ బదులుగా బాడీ బ్రష్ వాడాలి. బ్లీచ్‌తో: సూర్యరశ్మికి ముఖంతోపాటు ఎక్కువగా ఎక్స్ పోజ్ అయ్యేది వీపుభాగమే. డీప్ నెక్, స్ట్రిప్స్ ఉన్న బ్లౌజ్‌లు, చుడీదార్లు వేసుకుంటే ఎండకు వీపు నల్లబడుతుంది. వారానికి ఒకసారి బ్లీచ్ చేయిం చుకుంటే నలుపు పోతుంది. వీపు మీద కమిలిన ప్రదేశమంతా పచ్చిపాలతో రోజూ మసాజ్ చేసుకున్నా కూడా నలుపు వదులుతుంది. -
మొటిమల మచ్చలు తగ్గాలంటే..
బ్యూటిప్స్ * వేసవిలో ముఖ చర్మం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్‌లు ఇవి... * పది వేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. * బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి. * సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు. * బంతిపువ్వును కొద్దిగా పాలు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. * టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. అర గంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి. -
వానా వానా... అలంకరణ
బ్యూటిప్స్ వర్షాకాలం వాతావరణంతో పాటు మన జీవనశైలి కూడా పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా వస్త్రధారణ. ఇప్పటి వరకు వేసిన కాటన్స్ మూలన చేరిపోతాయి. కొత్త కట్టుతో పరిసరాలనున ఆకట్టుకునేలా, సౌకర్యవంతంగా ఈ సీజన్‌ని ఆనందించాంటే.. * తేలికపాటి ఫ్యాబ్రిక్స్ అంటే వర్షం పడినా త్వరగా ఆరిపోయే షిఫాన్స్, పాలియస్టర్, జార్జెట్స్ చక్కగా అమరిపోతాయి. * బాటమ్స్ విషయానికి వస్తే నీలెంగ్త్ కెప్రీస్ సరైన ఎంపిక. మంచి రంగు గల ప్యాంట్స్, షార్ట్స్ ఈ కాలానికి హుషారు తెప్పిస్తాయి. * నీటిలో తడిసినా పాడవనివి కాంతిమంతమైన రంగుల్లో ఉండే రెండు జతల రబ్బర్ బూట్లు, ఫ్లిప్ ప్లాప్స్ తీసుకోండి. నీళ్లలో ఎంచక్కా తిరిగేయండి. * గొడుగుతో మీదైన స్టైల్‌ని కళ్లకు కట్టవచ్చు. రంగు రంగులు గొడుగులు.. వాటి మీద చిన్న చిన్న మోటిఫ్స్ ఈ సీజన్‌ని బ్రైట్‌గా మార్చేస్తాయి. * ఇంటి నుంచి బయటకు వచ్చాక కానీ గుర్తుకు రాదు వర్షంలో వాచీ తడిసిపోతుందని. వెంటనే దాన్ని తీసి బ్యాగ్‌లోకి చేరవేయడం చేస్తుంటారు. అలాంటి అవసరం లేకుండా వాటర్ ఫ్రూఫ్ వాచీలు రంగురంగుల ఆకట్టుకునేవి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. * వాటర్ ఫ్రూఫ్ బ్యాగ్స్, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్స్ ఈ సీజన్లో అత్యవసరమైన అలంకరణలు. * ఇంట్లోనే ముఖచర్మాన్ని కాపాడుకునే ప్యాక్స్ తేనె, దోస రసం. తేనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడితే, దోస క్లెన్సింగ్‌లా పనిచేస్తుంది. * వానలో తడిసిన రోజున గోరువెచ్చని నీళ్లు, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల మురికినీటి సమస్య నుంచి జుట్టును కాపాడుకోవచ్చు. -
మొటిమల మచ్చలు తగ్గాలంటే..
బ్యూటిప్స్ * వేసవిలో ముఖ చర్మం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్‌లు ఇవి... * పది వేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. * బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి. * సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు. * బంతిపువ్వును కొద్దిగా పాలు కలిపి మెత్తగా రుబ్బాయిలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. మొటిమలు, తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. * టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. అర గంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి. -
బ్యూటీ ఇన్ మినిట్స్..
బ్యూటిప్స్ రెండు స్ట్రాబెర్రీ పండ్లను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖంపై ప్యాక్ వేసుకొని, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్ట్రాబెర్రీలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ను నివారిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం ఎప్పుడూ నిగనిగలాడుతుంది. * డార్క్ లిప్స్‌తో బాధ పడేవారికి ఇది సులువైన చిట్కా. మార్కెట్లో దొరికే లిప్‌బామ్స్ కంటే ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోండి. తయారీకి గ్లిజరిన్, బీట్రూట్ పౌడర్, పెట్రోలియం జెల్లీ చాలు. ఒక చిన్న గిన్నెలో పెట్రోలియం జెల్లీని వేసి వేడి చేయాలి. అది ద్రవంగా మారగానే, అందులో టీ స్పూన్ గ్లిజరిన్, అర టీ స్పూన్ డ్రై బీట్రూట్ పౌడర్ వేసి కలపాలి. చల్లారాక దాన్ని ఒక చిన్న బాటిల్లో తీసుకొని రోజూ అప్లై చేసుకుంటే పింక్ లిప్స్ మీ సొంతం. * కొందరి జుట్టు నల్లగా కాకుండా రాగి రంగులో కనిపిస్తుంది. అలాంటి వారు పావుకప్పు కొబ్బరి నూనెలో మూడు స్పూన్ల మందార రేకుల పొడిని వేసి మరిగించాలి. ఆ వేడి చల్లారక ముందే, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలపాలి. గోరువెచ్చని ఆ నూనెను రాత్రి నిద్రపోయే ముందు తలకు పట్టించాలి. ఉదయం లేచిన వెంటనే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. వారానికి మూడు సార్లైనా ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.