వానా వానా... అలంకరణ | Beau Tips OF Rainy season | Sakshi
Sakshi News home page

వానా వానా... అలంకరణ

Published Thu, Jun 30 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

వానా వానా... అలంకరణ

వానా వానా... అలంకరణ

బ్యూటిప్స్
వర్షాకాలం వాతావరణంతో పాటు మన జీవనశైలి కూడా పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా వస్త్రధారణ. ఇప్పటి వరకు వేసిన కాటన్స్ మూలన చేరిపోతాయి. కొత్త కట్టుతో పరిసరాలనున ఆకట్టుకునేలా, సౌకర్యవంతంగా ఈ సీజన్‌ని ఆనందించాంటే..
 
* తేలికపాటి ఫ్యాబ్రిక్స్ అంటే వర్షం పడినా త్వరగా ఆరిపోయే షిఫాన్స్, పాలియస్టర్, జార్జెట్స్ చక్కగా అమరిపోతాయి.
* బాటమ్స్ విషయానికి వస్తే నీలెంగ్త్ కెప్రీస్ సరైన ఎంపిక. మంచి రంగు గల ప్యాంట్స్, షార్ట్స్ ఈ కాలానికి హుషారు తెప్పిస్తాయి.
* నీటిలో తడిసినా పాడవనివి కాంతిమంతమైన రంగుల్లో ఉండే రెండు జతల రబ్బర్ బూట్లు, ఫ్లిప్ ప్లాప్స్ తీసుకోండి. నీళ్లలో ఎంచక్కా తిరిగేయండి.
* గొడుగుతో మీదైన స్టైల్‌ని కళ్లకు కట్టవచ్చు. రంగు రంగులు గొడుగులు.. వాటి మీద చిన్న చిన్న మోటిఫ్స్ ఈ సీజన్‌ని బ్రైట్‌గా మార్చేస్తాయి.
* ఇంటి నుంచి బయటకు వచ్చాక కానీ గుర్తుకు రాదు వర్షంలో వాచీ తడిసిపోతుందని. వెంటనే దాన్ని తీసి బ్యాగ్‌లోకి చేరవేయడం చేస్తుంటారు. అలాంటి అవసరం లేకుండా వాటర్ ఫ్రూఫ్ వాచీలు రంగురంగుల ఆకట్టుకునేవి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి.
* వాటర్ ఫ్రూఫ్ బ్యాగ్స్, ట్రాన్స్‌పరెంట్ రెయిన్ కోట్స్ ఈ సీజన్‌లో అత్యవసరమైన అలంకరణలు.
* ఇంట్లోనే ముఖచర్మాన్ని కాపాడుకునే ప్యాక్స్ తేనె, దోస రసం. తేనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడితే, దోస క్లెన్సింగ్‌లా పనిచేస్తుంది.
* వానలో తడిసిన రోజున గోరువెచ్చని నీళ్లు, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల మురికినీటి సమస్య నుంచి జుట్టును కాపాడుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement