సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. తాజా పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. విజిబులిటి 500 మీటర్లకు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది.
ఢిల్లీలో కాలుష్యం, పొగ మంచు కారణంగా విజిబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. దీంతో, వాయు కాలుష్యం సీవియర్ ప్లస్ కేటగిరిలో కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్‌లో గ్రాఫ్-4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్దులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.
#WATCH | A layer of fog covered parts of Delhi this morning as the minimum temperature dropped to 7°C, as per IMD.
Drone visuals from the Akshardham area shot around 7.30 am pic.twitter.com/shhFO3xpRm— ANI (@ANI) December 19, 2024
#WATCH | Uttar Pradesh | A dense layer of fog engulfs Ghaziabad city as the temperature dips to 8°C, as per IMD. pic.twitter.com/wsVLqdVq5o
— ANI (@ANI) December 19, 2024
మరోవైపు.. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం అక్షర్‌ధామ్ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకుంది. దీంతో, దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో, ప్రజలు వణికిపోతున్నారు.
#WATCH | Madhya Pradesh | Dense fog and cold wave engulfs Gwalior city as the temperature dips to 7°C, as per IMD. pic.twitter.com/d5tCRWpjdJ
— ANI (@ANI) December 19, 2024
Comments
Please login to add a commentAdd a comment