సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఢిల్లీ సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ.. ఉత్తర్‌ప్రదేశ్‌పై 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (44), యశ్ ధుల్ (42) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు.
అనంతరం ఆయుశ్ బదోని (25) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. ఆతర్వాత వచ్చిన అనుజ్ రావత్ చెలరేగిపోయాడు. అనుజ్ కేవలం 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనుజ్ విధ్వంసం ధాటికి యూపీ బౌలర్లు విలవిలలాడిపోయారు. యూపీ బౌలర్లలో మొహిసిన్ ఖాన్, వినీత్ పన్వర్, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.
194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. ఢిల్లీ బౌలర్లు తలో చేయి వేయడంతో 174 పరుగలకే ఆలౌటైంది. ప్రిన్స్ యాదవ్ 3, ఆయుశ్ బదోని, సుయాశ్ శర్మ చెరో 2, ఇషాంత్ శర్మ, సిమ్రన్‌జీత్ సింగ్, హర్ష్ త్యాగి తలో వికెట్ పడగొట్టారు.
యూపీ ఇన్నింగ్స్‌లో ప్రియం గార్గ్ (54) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సమీర్ రిజ్వి 26, భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు చేశారు. టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
సెమీస్‌లో బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్
ఇవాళ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరాయి. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో బరోడా, ముంబై.. అదే రోజు జరిగే రెండో సెమీఫైనల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment