Anuj Rawat
-
RCB Vs PBKS: వారెవ్వా అనూజ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుతమైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సామ్ కుర్రాన్ పెవిలియన్ పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన యశ్ దయాల్ ఐదో బంతిని సామ్ కుర్రాన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఈ క్రమంలో కుర్రాన్ హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ పై నుంచి వెళ్లింది. ఈ క్రమంలో అనూజ్ రావత్ అద్బుతంగా జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరి బ్యాటర్ సామ్ కుర్రాన్ సైతం నేను ఔటా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రావత్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. Athletic Anuj! A sharp catch behind the stumps from @RCBTweets wicketkeeper-batter as #PBKS reach 154/6 with 8 balls to go Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/3snw3syupr — IndianPremierLeague (@IPL) March 25, 2024 -
IPL2024 : బెంగళూరుపై చెన్నై విజయం (ఫొటోలు)
-
IPL 2024- CSK Vs RCB: చెన్నై జోరు
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో శుభారంభం చేసింది...ఐపీఎల్ కొత్త సీజన్ తొలి పోరులో సమష్టి ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై పైచేయి సాధించింది...ముందుగా బౌలింగ్‌లో పదునైన బంతులతో చెలరేగిన ముస్తఫిజుర్ బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేశాడు. ఆపై ఛేదనలో ఎలాంటి ఆటంకం లేకుండా చెన్నై సులువుగా పని పూర్తి చేసింది. కెప్టెన్ గా రుతురాజ్ తొలి పోరులో తన పేరిట విజయాన్ని నమోదు చేసుకోగా...ఐపీఎల్లో తన మొదటి మ్యాచ్‌లోనే రచిన్ రవీంద్ర ఆకట్టుకోవడం హైలైట్. చెన్నై: ఐపీఎల్–2024ను సూపర్ కింగ్స్ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్ రహమాన్ (4/29) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (15 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... బెంగళూరు ఇన్నింగ్స్‌లో 11.4 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78/5...ఈ స్థితినుంచి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగిందంటే రావత్, కార్తీక్ భాగస్వామ్యమే కారణం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో బెంగళూరు ఇన్నింగ్స్ మెరుగ్గానే మొదలైంది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 21; 1 సిక్స్) పెద్దగా ప్రభావం చూపకపోయినా తొలి వికెట్‌కు 27 బంతుల్లో 41 పరుగులు వచ్చాయి. అయితే ముస్తఫిజుర్ చెలరేగడంతో పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ చక్కటి ఫీల్డింగ్‌కు డుప్లెసిస్ వెనుదిరగ్గా, రహానే ఫీల్డింగ్ నైపుణ్యంతో కోహ్లి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ (0) తొలి బంతికే అవుట్ కాగా, గ్రీన్ (18)ను ముస్తఫిజుర్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో 28 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా ఆర్సీబీ ఖాతాలో చేరలేదు! అయితే కుదురుకున్న తర్వాత రావత్, కార్తీక్ దూకుడు పెంచి బౌండరీలతో పరుగులు రాబట్టారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో రావత్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టగా, కార్తీక్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 71 పరుగులు సాధించింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు అంతా తలా ఓ చేయి వేశారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో రుతురాజ్ (15) విఫలమైనా...ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రచిన్ చక్కటి షాట్లతో అలరిస్తూ బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత రహానే (19 బంతుల్లో 27; 2 సిక్స్‌లు), డరైల్ మిచెల్ (18 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) కీలక పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా...దూబే, రవీంద్ర జడేజా (17 బంతుల్లో 25 నాటౌట్; 1 సిక్స్) కలిసి 8 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 21; డుప్లెసిస్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 35; పటిదార్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 0; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) చహర్ 0; గ్రీన్ (బి) ముస్తఫిజుర్ 18; రావత్ (రనౌట్) 48; కార్తీక్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–42, 4–77, 5–78, 6–173. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–37–1, తుషార్ 4–0–47–0, తీక్షణ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–29–4, జడేజా 4–0–21–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) గ్రీన్ (బి) దయాళ్ 15; రచిన్ (సి) పటిదార్ (బి) కరణ్ 37; రహానే (సి) మ్యాక్స్‌వెల్ (బి) గ్రీన్ 27; మిచెల్ (సి) పటిదార్ (బి) గ్రీన్ 22; దూబే (నాటౌట్) 34; జడేజా (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–38, 2–71, 3–99, 4–110. బౌలింగ్: సిరాజ్ 4–0–38–0, యశ్ దయాళ్ 3–0–28–1, జోసెఫ్ 3.4–0–38–0, కరణ్ శర్మ 2–0–24–1, డాగర్ 2–0–6–0, గ్రీన్ 3–0–27–2, మ్యాక్స్‌వెల్ 1–0–7–0. అలరించిన ఆరంభ వేడుకలు తొలి మ్యాచ్‌కు ముందు చిదంబరం స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ నేతృత్వంలో గాయకులు సోనూ నిగమ్, మోహిత్ చౌహాన్, నీతి మోహన్ తమ పాటలతో అలరించారు. అంతకు ముందు నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు లేజర్ షోతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగియి. పెద్ద సైజు ఐపీఎల్ ట్రోఫీ రెప్లికాను ఈ సందర్భంగా మైదానంలో ప్రదర్శించారు. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ఢిల్లీ వేదిక: ముల్లన్పూర్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్‌కతా X హైదరాబాద్ వేదిక: కోల్‌కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీమిండియాలో చోటు గురించి ఆలోచించడం లేదు.. నా ధ్యేయం అదే!
I am not thinking about an India call-up: టీమిండియాలో చోటు కోసం తాను ఎదురుచూడటం లేదని, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రాణించడమే ధ్యేయమని ఆర్సీబీ బ్యాటర్ అనూజ్ రావత్ అన్నాడు. దేశీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల అనూజ్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లో కలిపి 91 పరుగులు చేయగలిగాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఈ మేరకు రన్స్ రాబట్టాడు. ఉత్తమంగా ఆడొచ్చు ఇక తాజాగా స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూజ్ రావత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడే జాతీయ జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు. ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాలి. ఈ టీ20 టోర్నీలో మెరుగైన ప్రదర్శన వల్ల ఐపీఎల్లో మరింత ఉత్తమంగా ఆడే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ సీనియర్ జట్టు నుంచి తనను తప్పించడంపై అనూజ్ ఈ సందర్భంగా స్పందించాడు. ఆలస్యంగానైనా ‘‘ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనపుడు మానసికంగా మరింత దృఢంగా ఉండాలి. ఒక్కరోజులో ఏమీ మారిపోదు. తిరిగి జట్టులో చేరే రోజు కోసం ఓపికగా ఎదురుచూడాలి. ఐపీఎల్ కూడా ఉంది. అక్కడ బాగా ఆడితే మున్ముందు మరిన్ని అవకాశాలు వస్తాయి. మా రాజ్‌కుమార్ సర్ ప్రతిసారి ఓ మాట చెబుతారు. మన ఆట తీరు బాగుంటే కాస్త ఆలస్యంగానైనా అవకాశాలు దక్కుతాయి. నేను అండర్-14, అండర్-16 జట్లకు ఆడేటపుడు షార్ట్‌లిస్ట్‌లో ఉండేవాడిని. కానీ తుదిజట్టులో మాత్రం నా పేరు ఉండేది కాదు. కానీ నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. కఠినంగా శ్రమించి అండర్-19 స్థాయిలో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాను’’ అని అనూజ్ రావత్ చెప్పుకొచ్చాడు. కాగా అనూజ్ రావత్ ఇప్పటి వరకు 19 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 220 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ డెబ్యూ మ్యాచ్‌లో అసోం మీద 71 పరుగులు సాధించాడు అనూజ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడి సగటు 40. చదవండి: జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు! ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా.. -
ధోనిని గుర్తుకుతెచ్చిన అనూజ్ రావత్.. అశ్విన్ డైమండ్ డక్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో సూపర్ విజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు కదా.. ఆర్సీబీ బౌలర్ల దాటికి బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ నేపథ్యంలో 59 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. ఇక మ్యాచ్‌లో రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బంతులు ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం ఎంఎస్ ధోనిని గుర్తుకుతెచ్చింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి బంతిని హెట్‌మైర్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో హెట్‌మైర్ అశ్విన్‌కు రెండో పరుగు కోసం కాల్ ఇచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న సిరాజ్ కీపర్ అనూజ్ రావత్‌కు త్రో వేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లిన రావత్.. బంతిని అందుకొని వెనుక వైపు నుంచి వికెట్లవైపు విసిరాడు. గతంలో ధోని కూడా ఇలాగే బ్యాక్ఎండ్ నుంచి వికెట్లను గిరాటేసి బ్యాటర్‌ను ఔట్ చేశాడు. ఇప్పుడు అచ్చం ధోని స్టైల్‌ను కాపీ కొట్టిన అనూజ్ రావత్ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇక ఐపీఎల్లో ఒక బ్యాటర్ డైమండ్ డక్ అవ్వడం ఇది ఏడోసారి. ఇందులో ఐదుసార్లు సదరు జట్ల కెప్టెన్లు డైమండ్ డక్ కాగా.. రెండుసార్లు బ్యాటర్లు డైమండ్ డకౌట్ అయ్యారు. డైమండ్ డకౌట్ అయిన ఆటగాళ్లు ఎవరంటే షేన్ వార్న్ వర్సెస్ ముంబై ఇండియన్స్(2009) షేన్ వార్న్ వర్సెస్ సీఎస్కే(2010) గౌతమ్ గంభీర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(2013) ఇయాన్ మోర్గాన్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(2021) కేఎల్ రాహుల్ వర్సెస్ కేకేఆర్(2022) ఉమ్రాన్ మాలిక్(ఎస్ఆర్హెచ్) రవిచంద్రన్ అశ్విన్(రాజస్తాన్ రాయల్స్) వర్సెస్ ఆర్సీబీ 2023 Anuj Rawat channelling a bit of Dhoni? 🤯 Superb presence of mind from the #RCB gloveman 🤩#IPLonJioCinema #RRvRCB #TATAIPL #IPL2023 pic.twitter.com/WXrBSyhQds — JioCinema (@JioCinema) May 14, 2023 చదవండి: పరుగులే కాదు క్యాచ్‌ల విషయంలోనూ రికార్డులే -
#AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ బ్యాటర్ అనూజ్ రావత్ తొలిసారి మెరిశాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 11 బంతుల్లో 29 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. అతని మెరుపుల వల్లే ఆర్సీబీ 170 పరుగుల స్కోరు చేయగలిగింది. అంతకముందు డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు అర్థశతకాలతో రాణించినప్పటికి స్కోరును పెంచే యత్నంలో ఇద్దరు ఒకేసారి ఔట్ అయ్యారు. ఈ క్రమంలో అనూజ్ రావత్ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన అనూజ్ రావత్ కేవలం 39 పరుగులే చేశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 4 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి కీలకసమయంలో వెనుదిరిగి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం కీలకసమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడి అభిమానులు మెచ్చుకునేలా చేశాడు. 0,4,2,1,4,1,1,0,6,6,4 - WHAT A FINISH BY ANUJ RAWAT. He smashed 29*(11) with the strike rate 263.6. Incredible Anuj Rawat. pic.twitter.com/3M6WZ4nhaN — CricketMAN2 (@ImTanujSingh) May 14, 2023 చదవండి: డుప్లెసిస్ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా -
చెత్తగా ఆడుతున్నావు.. మారవా ఇక? వెంటనే అతడిని తప్పించి! వీడియో వైరల్
IPL 2023- RCB Vs DC- Prithvi Shaw- Anuj Rawat: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా అతడిని ట్రోల్ చేస్తూ మండిపడుతున్నారు. ‘‘అసలు నీ ఆట తీరు ఎలా ఉందో చూసుకుంటున్నావా? మొన్నటిదాకా అలా.. ఈసారేమో మళ్లీ ఇలా డకౌట్’’ అంటూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పృథ్వీ షా నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 12, 7, 0, 15. అనూజ్ సంచలన ఫీల్డింగ్ తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు ఈ యువ ఓపెనర్. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి షా పరుగుకు యత్నించాడు. కానీ.. మైదానంలో పాదరసంలా కదిలిన ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్ ఏమాత్రం పొరపాటు చేయకుండా బాల్‌ను అందుకుని వికెట్లకు గిరాటేశాడు. సంచలన ఫీల్డింగ్‌తో ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ పృథ్వీ షాను రనౌట్ చేశాడు. క్రీజులో అడుగుపెట్టేందుకు పరిగెత్తురావడంలో జాప్యం చేసిన పృథ్వీ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. దీంతో ఢిల్లీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఇకనైనా తప్పించండి ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై మండిపడుతున్నారు అభిమానులు. ‘‘నీకేమైంది పృథ్వీ షా.. ఇదేం చెత్త ఆట. షాట్ల ఎంపిక విషయంలో పొరపాట్లు. ఇప్పుడేమో రనౌట్‌గా వెనుదిరిగడం. ఇందుకేనా నీకు ఓపెనర్‌గా అవకాశాలు ఇస్తోంది ఢిల్లీ మేనేజ్మెంట్. ఇకనైనా అతడిని తప్పించి వేరే వాళ్లకు అవకాశాలు ఇవ్వండి’’ అని మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. పృథ్వీ షా రనౌట్.. వీడియో వైరల్ ఇక ఇంకొంతమంది నెటిజన్లేమో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చిన అనూజ్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్రమంలో పృథ్వీ షా రనౌట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. వీరిద్దరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. కాగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. చదవండి: టీమిండియాకు శుభవార్త.. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు బిగ్‌బూస్ట్! బీసీసీఐ కీలక ప్రకటన Talk about creating an 𝙄𝙈𝙋𝘼𝘾𝙏! Anuj Rawat gets the opposition impact player Prithvi Shaw out with a terrific direct-hit 🎯#TATAIPL | #RCBvDC pic.twitter.com/Nd8pNum9mo — IndianPremierLeague (@IPL) April 15, 2023 Prithvi Shaw😢 pic.twitter.com/WjneYYvJrJ — Pulkit🇮🇳 (@pulkit5Dx) April 15, 2023 Prithvi Shaw every match in IPL2023#RCBvsDC #DCvRCB pic.twitter.com/XgS9nd4gGr — The Dude (@PuntingDude) April 15, 2023 -
ఎవరీ అనుజ్ రావత్... ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు!
ఐపీఎల్-2022లో భాగంగా శనివారం(ఏప్రిల్ 9)న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ యువ ఆటగాడు అనుజ్ రావత్ అదరగొట్టాడు. 47 బంతుల్లో 66 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా రావత్‌ను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన అనుజ్ రావత్ దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ తరుపున ఆడుతున్నాడు. ఎవరీ అనుజ్ రావత్? ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ రైతు కుటంబంలో అనుజ్ రావత్ జన్మించాడు. కాగా చిన్నతనం నుంచే రావత్‌కు క్రికెట్ అంటే మక్కువ. అయితే రామ్‌నగర్‌లో క్రికెట్ అకాడమీలు లేకపోవడంతో అతడి తండ్రి ఢిల్లీకు పంపాడు. ఇక అక్టోబరు 2017లో అనుజ్ రావత్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి రావత్ దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు తన మొదటి రెండు రంజీ మ్యాచ్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. అదే విధంగా 2018 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్‌పై రావత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక ఇటీవలి జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, జయ్ హజారే ట్రోఫీలోను రావత్ అదరగొట్టాడు. ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అనూజ్ రావత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. చదవండి: IPL 2022: సమస్య బయటపెట్టిన మాజీ క్రికెటర్.. ముంబై ఓటములకు బ్రేక్ పడేనా! -
IPL 2022: అతడు భవిష్యత్ ఆశా కిరణం: డుప్లెసిస్
అర్ధ శతకంతో రాణించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ అనూజ్ రావత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి ఆట తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, కోచ్ సంజయ్ సైతం అనూజ్ అద్భుత ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు. కాగా ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేధనకు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 24 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మాజీ సారథి విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ అనూజ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. కోహ్లి(48), అనూజ్ రాణించడంతో 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ముంబై వంటి పటిష్టమైన జట్టుపై గెలుపొందడం సంతోషంగా ఉంది. మా బౌలర్లు అత్యుత్తమంగా రాణించారు. 18వ ఓవర్ల పాటు మా బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. అనూజ్ రావత్‌కు మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది. భవిష్యత్ ఆశాకిరణం అతడు. మ్యాచ్‌కు ముందు అనూజ్‌తో ఎన్నో విషయాలు చర్చించాను. ఇక ఆకాశ్ దీప్ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతంగా బౌలింగ్ చేశాడు’’ అని అనూజ్, ఆకాశ్‌లను కొనియాడాడు. ఇక కోచ్ సంజయ్ అనూజ్గురించి చెబుతూ.. ‘‘ఆరంభ మ్యాచ్‌లలో తడబడ్డా ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో అద్భుతమైన షాట్లు ఆడాడు. ఫాఫ్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నాడు. తనది చాలా కష్టపడే తత్వం. అనూజ్ ఇన్నింగ్స్ పట్ల మేము సంతోషంగా ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ వర్సెస్ ముంబై స్కోర్లు ముంబై-151/6 (20) ఆర్సీబీ-152/3 (18.3) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అనూజ్ రావత్ చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం! Captain Faf and Coach Sanjay heap praises on Anuj Rawat and Akash Deep, after our commanding win against MI last night. Watch what Anuj, Akash and S Sriram had to say about this win.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvMI pic.twitter.com/zBT6sAVlT4 — Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2022 -
దేవుని దయవల్ల ఏం కాలేదు.. అంతా బాగానే ఉంది
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ అనూజ్ రావత్‌కు కొంచెంలో ప్రమాదం తప్పింది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో డుప్లెసిస్, అనూజ్‌రావత్ నిలకడగా ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ కీరన్ పొలార్డ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని అనూజ్ రావత్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్ సింగిల్‌కు కాల్ ఇయ్యడంతో అనూజ్ పరిగెత్తాడు. ఇంతలో ముంబై ఫీల్డర్ పొలార్డ్‌కు త్రో వేశాడు. దానిని అందుకునే క్రమంలో పొలార్డ్ అనూజ్ రావత్ పరిగెత్తుతున్న వైపు వచ్చాడు. దీంతో ఇద్దరు ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకోవడంతో అనూజ్ కిందపడ్డాడు. అయితే హెల్మెట్ గ్రౌండ్‌కు బలంగా గుద్దుకున్నప్పటికి.. రావత్ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత పొలార్డ్ అతని వద్దకు వచ్చి బాగానే ఉందిగా అని అడిగాడు.. దానికి రావత్.. ఐయామ్ ఫైన్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''పెద్ద గండం తప్పింది.. దేవుని దయవల్ల ఏం కాలేదు.. అంతా బాగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Surya Kumar Yadav: అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం Abhishek Sharma: కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు మెరిశాడు.. #AnujRawat pic.twitter.com/WG8OAsCYYw — Raj (@Raj93465898) April 9, 2022 -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్