Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 112 పరుగుల తేడాతో సూపర్ విజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు కదా.. ఆర్‌సీబీ బౌలర్ల దాటికి బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ నేపథ్యంలో 59 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది.
ఇక మ్యాచ్‌లో రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బంతులు ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం ఎంఎస్ ధోనిని గుర్తుకుతెచ్చింది.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి బంతిని హెట్‌మైర్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో హెట్‌మైర్ అశ్విన్‌కు రెండో పరుగు కోసం కాల్ ఇచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న సిరాజ్ కీపర్ అనూజ్ రావత్‌కు త్రో వేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లిన రావత్.. బంతిని అందుకొని వెనుక వైపు నుంచి వికెట్లవైపు విసిరాడు. గతంలో ధోని కూడా ఇలాగే బ్యాక్‌ఎండ్ నుంచి వికెట్లను గిరాటేసి బ్యాటర్‌ను ఔట్ చేశాడు. ఇప్పుడు అచ్చం ధోని స్టైల్‌ను కాపీ కొట్టిన అనూజ్ రావత్ ట్రెండింగ్‌లో నిలిచాడు.
ఇక ఐపీఎల్‌లో ఒక బ్యాటర్ డైమండ్ డక్ అవ్వడం ఇది ఏడోసారి. ఇందులో ఐదుసార్లు సదరు జట్ల కెప్టెన్లు డైమండ్ డక్ కాగా.. రెండుసార్లు బ్యాటర్లు డైమండ్ డకౌట్ అయ్యారు. డైమండ్ డకౌట్ అయిన ఆటగాళ్లు ఎవరంటే
షేన్ వార్న్ వర్సెస్ ముంబై ఇండియన్స్(2009)
షేన్ వార్న్ వర్సెస్ సీఎస్‌కే(2010)
గౌతమ్ గంభీర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(2013)
ఇయాన్ మోర్గాన్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(2021)
కేఎల్ రాహుల్ వర్సెస్ కేకేఆర్(2022)
ఉమ్రాన్ మాలిక్(ఎస్‌ఆర్‌హెచ్)
రవిచంద్రన్ అశ్విన్(రాజస్తాన్ రాయల్స్) వర్సెస్ ఆర్‌సీబీ 2023
Anuj Rawat channelling a bit of Dhoni? 🤯
— JioCinema (@JioCinema) May 14, 2023
Superb presence of mind from the #RCB gloveman 🤩#IPLonJioCinema #RRvRCB #TATAIPL #IPL2023 pic.twitter.com/WXrBSyhQds
Comments
Please login to add a commentAdd a comment