ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడం ద్వారా డుప్లెసిస్ ఐపీఎల్‌లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
ఇక డుప్లెసిస్ కంటే ముందు ముగ్గురు బ్యాటర్లు ఈ ఫీట్ సాధించారు. మొదటిస్థానంలో డేవిడ్ వార్నర్ 174 మ్యాచ్‌ల్లో 6265 పరుగులతో ఉండగా.. 184 మ్యాచ్‌ల్లో 5162 పరుగులుతో ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో, క్రిస్‌గేల్ 142 మ్యాచ్‌ల్లో 4965 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక డుప్లెసిస్ మాత్రం 128 మ్యాచ్‌ల్లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
ఈ సీజన్‌లో డుప్లెసిస్ సూపర్‌ఫామ్ కనబరుస్తున్నాడు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్థశతకం సాధించిన డుప్లెసిస్‌కు ఇది ఏడోది. 12 మ్యాచ్‌ల్లో 608 పరుగులతో లీడింగ్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: #DC:ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్.. ఆరంభం నుంచి అన్ని మైనస్‌లే
Comments
Please login to add a commentAdd a comment