Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. తాను డైరెక్ట్ త్రో వేశాడంటే ప్రత్యర్థి బ్యాటర్ ఔట్ అవ్వాల్సిందే అన్నట్లుగా గురి ఉంటుంది. తాజాగా గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని సూపర్ రనౌట్‌తో మెరిశాడు. హెట్‌మైర్‌ను రనౌట్ చేసే చాన్స్ మిస్సయినప్పటికి ద్రువ్ జురేల్‌ను స్టన్నింగ్ త్రో విసిరి రనౌట్ చేసి ఆ లెక్కను సరిచేశాడు ధోని.
విషయంలోకి వెళితే.. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతిని పతీరానా వైడ్ వేశాడు. అయితే లో ఫుల్‌టాస్ అయిన బంతి లెగ్‌స్టంప్ అవతల పడగా పడిక్కల్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మిస్ అయింది. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి ద్రువ్ జురేల్ పరిగెత్తుకురావడంతో పడిక్కల్ కూడా ముందుకు కదిలాడు.
కానీ అప్పటికే బంతిని అందుకున్న ధోని అక్కడినుంచే నేరుగా డైరెక్ట్ త్రో వేశాడు. అంతే జురేల్ క్రీజుకు చాలా దూరంలో ఉన్నప్పుడే బంతి వికెట్లను గిరాటేసింది. అంపైర్ డౌట్‌తో థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. కానీ జురేల్ తన ఔట్ విషయంలో క్లారిటీ ఉండడంతో నిర్ణయం వచ్చేలోపే డగౌట్‌కు వెళ్లిపోయాడు.
Cheetah ki chaal, baaz ki nazar aur MS Dhoni ki throw par kabhi sandeh nahi karte, Kabhi bhi maat de sakte hai..🔥#MSDhoni #RRvCSKpic.twitter.com/yq7Dr5z21F
— 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 (@SwaraMSDian) April 27, 2023
WHAT A THROW BY DHONI.
— Johns. (@CricCrazyJohns) April 27, 2023
AGE IS JUST A NUMBER FOR MS. pic.twitter.com/umut4GPWqs
Comments
Please login to add a commentAdd a comment