IPL 2023 RR Vs CSK: Ashwin Holds Record For Dismissing Most Batters For Duck In IPL - Sakshi
Sakshi News home page

IPL 2023 RR Vs CSK: అశ్విన్ అరుదైన రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!

Published Fri, Apr 28 2023 1:46 PM | Last Updated on Fri, Apr 28 2023 1:58 PM

Ashwin holds record for dismissing most batters for duck in IPL - Sakshi

PC:IPL.com

ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 20 మంది బ్యాటర్లను డకౌట్‌ చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడును డకౌట్‌ చేసిన అశ్విన్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 32 పరుగుల తేడాతో సీఎస్‌కేపై రాజస్తాన్‌ విజయం సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది.

సీఎస్‌కే బ్యాటర్లలో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(47), దుబే(52) పరుగులతో రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్‌(77) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్‌కు దొరికిన ఆణిముత్యం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement