CSK Vs MI In IPL 2023 Final: Ravichandran Ashwin Has All Reasons To Predict The Summit Clash - Sakshi
Sakshi News home page

IPL 2023: గుజరాత్‌, లక్నో కాదు.. చెన్నైతో ఫైనల్లో ఆడేది ఆ జట్టే!

Published Wed, May 24 2023 11:40 AM | Last Updated on Wed, May 24 2023 1:07 PM

CSK vs MI in IPL 2023 Final: R Ashwin has all reasons to predict the summit clash - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023 ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అడుగుపెట్టిన సంగతి తెలిసిం‍ది. చెపాక్‌ వేదికగా జరిగిన క్వాలిఫియర్‌-1లో 15 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించిన సీఎస్‌కే.. 10వ సారి ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ ఫైనల్‌కు చేరుకుంది. మే28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌పోరుకు చెన్నై సిద్దమైంది. ఈ ఫైనల్‌ పోరులో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడే ఛాన్స్‌ ఉంది.

ఈ క్రమంలో సీఎస్‌కేతో తలపడే జట్టును టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు. ఫైనల్లో చెన్నైతో ముంబై ఇండియన్స్‌ తలపడతుంది అని అశ్విన్‌ జోస్యం చెప్పాడు. "నరేంద్ర మోడీ స్టేడియంలో సీఎస్‌కేతో ముంబై ఇం‍డియన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది" అశ్విన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.

కాగా ఈ ఏడాది సీజన్‌ ఆరంభంలో ముంబై తడబడనప్పటికీ.. సెకెండ్‌ హాఫ్‌ సీజన్‌లో మాత్రం అదరగొడుతుంది. వరుస మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మే24న చెపాక్‌ వేదికగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నోతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో లక్నోకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే.. క్వాలిఫియర్‌-2లో గుజరాత్‌తో తాడోపేడో తెల్చుకోనుంది.
చదవండి: CSK Vs GT: ఓడిపోయాం అంతే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు! మళ్లీ సీఎస్‌కేతోనే: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement