అంబటి రాయుడు- ఆకాశ్ అంబానీ (PC: MI Twitter)
IPL 2023- Ambati Rayudu: తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గత కొన్నేళ్లుగా సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. బుధవారం నాటి మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్‌కేతో పాటు ముంబై ఇండియన్స్ కూడా అంబటి రాయుడు అరుదైన ఘనతను గుర్తిస్తూ ట్రిబ్యూట్ ఇచ్చింది.
మూడు ట్రోఫీలు
కాగా గతంలో ముంబై ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించిన రాయుడు ఆ జట్టు తరఫున 114 మ్యాచ్‌లు ఆడాడు. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ట్రోఫీలు గెలిచిన మూడు సందర్బాల్లో జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్ అంబానీ రాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు.
ఆ రెండు ఇన్నింగ్స్ నా ఫేవరెట్
ఇందుకు సంబంధించిన వీడియోను ఎంఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘హాయ్ అంబటి.. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ముంబై ఇండియన్స్ విజయాల్లో నీకూ భాగం ఉంది. ముంబై తరఫున నువ్వు ఆడిన ఇన్నింగ్స్‌లో రెండు నా ఫేవరెట్.
ఒకటి.. రాజస్తాన్ రాయల్స్ మీద 10 బంతుల్లో 30 పరుగులు చేశావు. 2014 నాటి ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన అత్యుత్తమ మ్యాచ్‌లలో అదీ ఒకటి అని కచ్చితంగా చెప్పగలను.
ఇక రెండోది.. బెంగళూరులో మ్యాచ్‌లో నువ్వూ, పొలార్డ్ కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ ఇన్నింగ్స్ కూడా నాకిష్టం. ముంబై ట్రోఫీలు గెలిచిన ప్రతీ సందర్భంలో నీ వంతు పాత్ర పోషించావు.
కెరీర్‌లో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నీకు మరోసారి శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి’’ అని ఆకాశ్ అంబానీ.. అంబటి రాయుడుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
థాంక్యూ ఆకాశ్
ఇక ముంబై ఇండియన్స్ తనపై కురిపించిన ప్రేమకు బదులిస్తూ.. ‘‘నాపై నమ్మకం ఉంచి 2010 నుంచి నాకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించారు. ముంబైతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ట్రోఫీ గెలిచిన సందర్భాలు ఎల్లప్పుడూ నా మదిలో మెదులుతూ ఉంటాయి.
థాంక్యూ సో మచ్ ఆకాశ్. ఎంఐ పల్టన్’’ అంటూ అంబటి రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో అంబటి రాయుడు 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఎదుర్కొన్న రాయుడు 23 పరుగులు సాధించాడు. ఇక చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఢిల్లీపై 27 పరుగుల తేడాతో గెలుపొందింది.
Thank you so much Akash and mi paltan..it really means a lot and have immense gratitude for giving me an opportunity and believing in me from 2010..I have such great memories with mi and I have cherished each and every trophy win that I have been a part of… 😊😊😊🙏🙏 https://t.co/BLuAEn8A5p
— ATR (@RayuduAmbati) May 10, 2023
ATR going double the Ton Distance!🔥#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/HbwBr8vRM4
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
Comments
Please login to add a commentAdd a comment