గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా- చెన్నై సారథి ఎంఎస్ ధోని (PC: IPL/BCCI)
IPL 2023 Playoffs: ఐపీఎల్-2023 తుది అంకానికి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లతో లీగ్ దశ ముగిసింది. రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముంబై ప్లే ఆఫ్స్ చేరుకోగా.. గుజరాత్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీ ఇంటిబాట పట్టింది.
డిఫెండింగ్ చాంపియన్ లెక్కే వేరు!
ఇక అన్ని జట్ల కంటే ముందుగానే ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న గుజరాత్.. బెంగళూరుపై ఘన విజయం నేపథ్యంలో సీజన్‌లో పదో గెలుపు నమోదు చేసింది. ఈ డిఫెండింగ్ చాంపియన్ 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపుతో లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
తాజా విజయంతో ముంబై టాప్-4లో నిలిచి గత ఎడిషన్ తాలుకు చేదు అనుభవాల నుంచి తేరుకుంది. ఆడిన 14 మ్యాచ్‌లలో ఎనిమిదింట గెలుపొందిన రోహిత్ సేన.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో(మూడో స్థానం)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం.
ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ షెడ్యూల్
మే 23: క్వాలిఫయర్–1
►గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
►వేదిక: చెన్నై- - ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్)
►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి
మే 24: ఎలిమినేటర్
►లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
►వేదిక: చెన్నై- ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్)
►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి
మే 26: క్వాలిఫయర్–2
►క్వాలిఫయర్–1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత
►వేదిక: అహ్మదాబాద్- నరేంద్ర మోదీ స్టేడియం
►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి
మే 28: ఐపీఎల్-2023 ఫైనల్
►క్వాలిఫయర్–1 విజేత వర్సెస్ క్వాలిఫయర్–2 విజేత
►వేదిక: అహ్మదాబాద్- నరేంద్ర మోదీ స్టేడియం
►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి ఆరంభం.
చదవండి: ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు
కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే!
Comments
Please login to add a commentAdd a comment