Playoffs
-
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్ -
RCB: ఇంకా రేసులోనే ఆర్సీబీ! అలా అయితే ప్లే ఆఫ్స్‌లో!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు జట్టులో ఉన్నా వరుస వైఫల్యాలతో చతికిలపడింది.ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఒక రకంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ దాదాపుగా నిష్క్రమించినట్లే! అయితే, తిరిగి పుంజుకుంటే మాత్రం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. అందుకు సాధ్యమయ్యే కొన్ని సమీకరణలు గమనిద్దాం!మరోమాట లేదు.. గెలవాల్సిందేమరోమాట లేకుండా ఆర్సీబీ ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాలి. నెట్ రన్‌రేటు -1.046 మరీ దారుణంగా ఉంది కాబట్టి కచ్చితంగా భారీ విజయాలు సాధించాలి.అదే జరిగితే.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు చేరి మొత్తం 14 అవుతాయి. అదే విధంగా.. నెట్ రన్‌రేటు కూడా మెరుగుపరచుకుంటే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా ఆర్సీబీకి తదుపరి సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్(రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ భారీ తేడాతో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.టాప్‌లో ఉన్న ఆ మూడు జట్లు..పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఎన్ని గెలిస్తే(తమపై మినహా) ఆర్సీబీకి అంత మంచిది. లక్నో, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, ముంబై, పంజాబ్ కింగ్స్ ఈ జట్లు భారీ తేడాతో విజయం సాధించడం ఆర్సీబీకి ముఖ్యం.ఇంకెలా అంటే..►తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు.►ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన ఐదింటిలో రెండు కంటే.. ముంబై ఇండియన్స్ ఆరింటిలో మూడు కంటే ఎక్కువ గెలవకూడదు.►చెన్నై మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు కంటే.. గుజరాత్ ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ గెలవద్దు.►లక్నో మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.►కేకేఆర్, సన్‌రైజర్స్ మిగిలిని ఏడు మ్యాచ్‌లలో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తే చాలు!►ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరేందుకు కొన్ని సమీకరణలు మాత్రమే ఇవి. ఇంతా జరిగినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందా అంటే? ఏమో గుర్రం ఎగరావచ్చు! లేదంటే గురువారం నాటి సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓడి పూర్తిగా నిష్క్రమించనూవచ్చు!!చదవండి: నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్ -
WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్‌కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్‌లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మ్యాచ్‌పై ఆశలు రేపారు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్‌లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలి. -
#IPL2023: 292 డాట్‌బాల్స్.. లక్షకు పైగా మొక్కలు
ఐపీఎల్ 16వ సీజన్లో ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు స్పాన్సర్ టాటాతో కలిసి బీసీసీఐ సరికొత్త కార్యచరణ రూపొందించింది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నయోదయ్యే ప్రతీ డాట్‌బాల్‌కు 500 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్కే విజేతగా నిలిచి ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. కాగా ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. మరి ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో నమోదైన డాట్‌బాల్స్‌కు ఎన్ని మొక్కలు నాటనున్నారో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 40 ఓవర్లలో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు చేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ వచ్చాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే 292 x 500 లెక్కన బీసీసీఐ మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడం విశేషం. పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. డాట్ బాల్‌కు మొక్కలు నాటాలన్న నిర్ణయంతో క్రికెట్ అభిమానుల మెప్పు పొందుతోంది బీసీసీఐ. చదవండి: '45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు' లండన్ చేరుకున్న రోహిత్ శర్మ.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ -
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వివరాలు ఇవే
IPL 2023 Playoffs: ఐపీఎల్-2023 తుది అంకానికి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లతో లీగ్ దశ ముగిసింది. రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముంబై ప్లే ఆఫ్స్ చేరుకోగా.. గుజరాత్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. డిఫెండింగ్ చాంపియన్ లెక్కే వేరు! ఇక అన్ని జట్ల కంటే ముందుగానే ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న గుజరాత్.. బెంగళూరుపై ఘన విజయం నేపథ్యంలో సీజన్లో పదో గెలుపు నమోదు చేసింది. ఈ డిఫెండింగ్ చాంపియన్ 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపుతో లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో ముంబై టాప్-4లో నిలిచి గత ఎడిషన్ తాలుకు చేదు అనుభవాల నుంచి తేరుకుంది. ఆడిన 14 మ్యాచ్‌లలో ఎనిమిదింట గెలుపొందిన రోహిత్ సేన.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో(మూడో స్థానం)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం. ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ మే 23: క్వాలిఫయర్–1 ►గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ►వేదిక: చెన్నై- - ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్) ►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి మే 24: ఎలిమినేటర్ ►లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ►వేదిక: చెన్నై- ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్) ►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి మే 26: క్వాలిఫయర్–2 ►క్వాలిఫయర్–1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత ►వేదిక: అహ్మదాబాద్- నరేంద్ర మోదీ స్టేడియం ►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి మే 28: ఐపీఎల్-2023 ఫైనల్ ►క్వాలిఫయర్–1 విజేత వర్సెస్ క్వాలిఫయర్–2 విజేత ►వేదిక: అహ్మదాబాద్- నరేంద్ర మోదీ స్టేడియం ►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి ఆరంభం. చదవండి: ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే! -
ఐపీల్ లో ప్లే ఆఫ్ కు చేరుకునేది ఎవరు?
-
APL 2022: ప్లే ఆఫ్స్‌నకు చేరిన తొలి జట్టుగా బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ టోర్నీ తొలి సీజన్ ప్లేఆఫ్‌కు బెజవాడ టైగర్స్ జట్టు చేరుకుంది. టోర్నీలో తలపడుతున్న ఆరుజట్లు నాలుగేసి మ్యాచ్‌లు పూర్తిచేయగా.. బెజవాడ టైగర్స్ జట్టు 12 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాయలసీమ కింగ్స్,కోస్టల్‌రైడర్స్, వైజాగ్ వారియర్స్ ఎనిమిదేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర లయిన్స్, గోదావరి టైటాన్స్ ఆరేసి పాయింట్లతో టోర్నిలో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా బెజవాడ టైగర్స్ ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించగా.. మిగిలిన మూడు జట్లు చివరి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి ప్లేఆఫ్‌కు అర్హత సాధించనున్నాయి. కాగా ఏపీఎల్‌లో మరోసారి వరుణుడి రాకతో సోమవారం జరగాల్సిన మధ్నాహ్నం మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగాల్సిన మ్యాచ్ తొమ్మిది ఓవర్లకు కుదించారు. వైఎస్ఆర్ స్టేడియంలో మధ్యాహ్నం రాయలసీమ కింగ్స్‌తో బెజవాడ టైగర్స్‌తో తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు రెండేసి పాయింట్లు కేటాయించారు. కాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు 4 పాయింట్లు లభిస్తాయి. ఫలితం తేలనట్లయితే రెండు పాయింట్లు వస్తాయి. ఐదు వికెట్ల తేడాతో రైడర్స్ విజయం ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్‌పై కోస్టల్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్ వారియర్స్ ఓపెనర్ గిరినాథ్ ఒక పరుగే చేసి వెనుదిరగ్గా మరో ఓపెనర్ అశ్విన్ 28 పరుగులు చేశాడు. ఓపెనర్లతో పాటు అర్జున్ సైతం ఆశిష్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. సాయికృష్ణ(13), సిద్ధార్థ(18) మినహా మిగిలిన వారంతా వేగంగా పరుగులు చేయడానికే ప్రయత్నించి సింగిల్ డిజిట్ స్కోర్ల్తోనే పెవిలియన్‌కు చేరారు. 34 పరుగుల వద్ద రెండో వికెట్ కూలగా.. చివరికి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 80 పరుగులతో వారియర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 81 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్లు తపస్వి, కెప్టెన్ జ్ఞానేశ్వర్ చెరో నాలుగేసి పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. మునీష్ 9 పరుగులు చేయగా లేఖజ్ తొలిబంతికే లేని పరుగుకు రనౌటయ్యాడు. 24పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో శ్రీనివాస్ (38 పరుగులు)కు హర్ష తోడై స్కోర్‌ను పరిగెత్తించారు. హర్ష రెండు ఫోర్లతో 16 పరుగులతోనూ, అబ్బాస్ ఒక ఫోర్‌తో ఆరు పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. మరో రెండు బంతులుండగానే రైడర్స్ విజయలక్ష్యాన్ని ఛేదించారు. చదవండి: Ind Vs Eng 1st ODI Details: ముఖాముఖి రికార్డులు, తుది జట్ల అంచనా.. పూర్తి వివరాలు! ఇక టాస్ గెలిచిన జట్టు తొలుత.. Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! -
IPL 2022: బట్లర్ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం!
జోస్ బట్లర్.. ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన ఈ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన పరుగులు 824! అత్యధిక స్కోరు 116! నాలుగు శతకాలు.. నాలుగు అర్ధ శతకాలు! 78 ఫోర్లు.. 45 సిక్సర్లు! రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-2లో ఈ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజస్తాన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో సాధించిన బట్లర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. శతకంతో మెరిసి రాజస్తాన్‌కు మధుర జ్ఞాపకం అందించాడు. ఈ క్రమంలో ఈ ఇంగ్లండ్ ఆటగాడు అరుదైన రికార్డు నమోదు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ ప్లే ఆఫ్స్‌లో సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. క్వాలిఫైయర్-2లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, మురళీవిజయ్ బట్లర్ కంటే ముందున్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో సెంచరీలు నమోదు చేసింది వీరే! ►వీరేంద్ర సెహ్వాగ్(పంజాబ్)- 122 పరుగులు- 2014 క్వాలిఫైయర్-2 సీఎస్కేపై ►షేన్ వాట్సన్(సీఎస్కే)-117 పరుగులు- నాటౌట్- 2018 సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్లో ►వృద్ధిమాన్ సాహా(పంజాబ్ కింగ్స్)- 115 పరుగులు- నాటౌట్- 2014 కేకేఆర్‌తో ఫైనల్లో ►మురళీ విజయ్(సీఎస్కే)- 113 పరుగులు- 2012 క్వాలిఫైయర్-2- ఢిల్లీతో మ్యాచ్‌లో ►రజత్ పాటిదార్(ఆర్సీబీ)- 112 నాటౌట్- ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ►జోస్ బట్లర్(రాజస్తాన్ రాయల్స్)- 106 పరుగులు నాటౌట్- క్వాలిఫైయర్-2లో ఆర్సీబీతో మ్యాచ్‌లో చదవండి 👇 IPL 2022: ఐపీఎల్లో మహ్మద్ సిరాజ్ చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..! Dussen Wife Joke On Jos Buttler: 'బట్లర్ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు ! WHAT. A. WIN for @rajasthanroyals! 👏 👏 Clinical performance by @IamSanjuSamson & Co. as they beat #RCB by 7⃣ wickets & march into the #TATAIPL 2022 Final. 👍 👍 #RRvRCB Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Sca47pbmPX — IndianPremierLeague (@IPL) May 27, 2022 .@josbuttler slammed his 4th ton of the season and was our top performer from the second innings of the #RRvRCB Qualifier 2 of the #TATAIPL 2022. 👌 👌 @rajasthanroyals Here's a summary of his batting brilliance 🔽 pic.twitter.com/cfiInPqb5c — IndianPremierLeague (@IPL) May 27, 2022 -
IPL 2022 Playoffs: ఫైనల్‌కు చేరిన గుజరాత్.. రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం..
ఐపీఎల్-2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్‌ను డేవిడ్ మిల్లర్ ఒంటి చేత్తో గెలిపించాడు. కేవలం 38 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా 40 పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్కాయ్ తలా వికెట్ సాధించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 56 బంతుల్లో బట్లర్ 89 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ శాంసన్ 47 పరుగులతో రాణించాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, సాయికిషోర్, యశ్ దయాల్, హార్ధిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు. 17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 155/3 17 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. క్రీజులో హార్ధిక్ పాండ్యా(37),మిల్లర్(35) పరుగులతో ఉన్నారు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 129/3 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. క్రీజులో హార్ధిక్ పాండ్యా(32),మిల్లర్(14) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 97/3 గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన వేడ్.. మెక్కాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 97/3 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 79/2 72 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన గిల్ రనౌట్ అయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 79/2 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 64/1 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో మథ్యూ వేడ్(27),శుభ్‌మాన్ గిల్(31) పరుగులతో ఉన్నారు. మూడు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/1 మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. క్రీజులో వేడ్(18), గిల్(6) పరుగులతో ఉన్నారు తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ అదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా డకౌటయ్యాడు. చేలరేగిన బట్లర్.. గుజరాత్ టార్గెట్ 189 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 56 బంతుల్లో బట్లర్ 89 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ శాంసన్ 47 పరుగులతో రాణించాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, సాయికిషోర్, యశ్ దయాల్, హార్ధిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు. 161 పరుగులు వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెట్‌మైర్.. షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 172/4 17 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 145/3 17 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(56), హెట్‌మైర్(2) పరుగులతో ఉన్నారు. 6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 55/1 ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(16),శాంసన్(30) పరుగులతో ఉన్నారు. నాలుగు ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 28/1 నాలుగు ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(14),శాంసన్(10) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన జైశ్వాల్.. యష్ దయాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 11/1 ఐపీఎల్-2022లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెద్ మెక్కాయ్ గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ -
హోరా హోరీ ఐపీఎల్: నిలిచేదెవరు..? గెలిచేదెవరు..?
-
డికాక్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం
ముంబై: ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం... ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లూ ఆడిన జోడీ... ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు... ఈ ఘనతలన్నీ ఒక్క మ్యాచ్‌లోనే వచ్చాయి. విధ్వంసకర బ్యాటింగ్‌తో క్వింటన్ డికాక్ రికార్డులు కొల్లగొట్టగా, కేఎల్ రాహుల్ సహాయక పాత్రలో నిలిచాడు. వీరిద్దరి జోరుతో 2022 సీజన్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సగర్వంగా ‘ప్లే ఆఫ్స్’లోకి అడుగు పెట్టింది. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగులతో కేకేఆర్‌పై విజయం సాధించింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ సెంచరీకి రాహుల్ (51 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ తోడైంది. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్ రాణా (22 బంతుల్లో 42; 9 ఫోర్లు), రింకూ సింగ్ (15 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్యామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అభేద్య భాగస్వామ్యం... డికాక్, రాహుల్ భాగస్వామ్యం సాధారణంగానే ప్రారంభమైంది. ఇద్దరూ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నా... లక్నో అసలు ఆట చివరి 5 ఓవర్లలో కనిపించింది. 15 ఓవర్లు ముగిసేసరికి టీమ్ స్కోరు 122 పరుగులు కాగా, తర్వాతి 5 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు వచ్చాయి! ఇందులో చాలా వరకు రాహుల్ ప్రేక్షక పాత్రకు (16 పరుగులు) పరిమితం కాగా... డికాక్ (71 పరుగులు) రెచ్చిపోయాడు. 59 బంతుల్లోనే డికాక్ శతకం పూర్తయింది. డికాక్‌కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. ఆ తర్వాత సౌతీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ లక్నో బ్యాటింగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో రాహుల్ ఒక సిక్స్ కొట్టగా, డికాక్ వరుసగా మూడు బంతుల్లో 6, 6, 6తో చెలరేగాడు. రసెల్ వేసిన ఆఖరి ఓవర్లో డికాక్ వరుస బంతుల్లో 4, 4, 4, 4 కొట్టడం విశేషం. చివరి వరకు పోరాడినా... మొహసిన్ తన వరుస ఓవర్లలో వెంకటేశ్ (0), తోమర్ (4)లను అవుట్ చేయడంతో కోల్‌కతా ఛేదన పేలవంగా మొదలైంది. చివర్లో రింకూ, నరైన్ 19 బంతుల్లోనే 58 పరుగులు జోడించి జట్టు గెలుపు అవకాశాలు పెంచారు. స్టొయినిస్ వేసిన ఆఖరి ఓవర్లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2తో గెలుపునకు చేరువగా తెచ్చాడు. 2 బంతుల్లో 3 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఐదో బంతికి లూయిస్ అద్భుత క్యాచ్‌తో రింకూ ఆట ముగియగా, చివరి బంతికి ఉమేశ్ బౌల్డయ్యాడు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (నాటౌట్) 140; రాహుల్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 210. బౌలింగ్: ఉమేశ్ 4–0–34–0, సౌతీ 4–0–57–0, నరైన్ 4–0–27–0, వరుణ్ 4–0– 38–0, రసెల్ 3–0–45–0, రాణా 1–0–9–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) డికాక్ (బి) మొహసిన్ 0; అభిజిత్ తోమర్ (సి) రాహుల్ (బి) మొహసిన్ 4; రాణా (సి) స్టొయినిస్ (బి) గౌతమ్ 42; శ్రేయస్ (సి) హుడా (బి) స్టొయినిస్ 50; బిల్లింగ్స్ (స్టంప్డ్) డికాక్ (బి) బిష్ణోయ్ 36; రసెల్ (సి) హుడా (బి) మొహసిన్ 5; రింకూ (సి) లూయీస్ (బి) స్టొయినిస్ 40; నరైన్ (నాటౌట్) 21; ఉమేశ్ (బి) స్టొయినిస్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–65, 4–131, 5–142, 6–150, 7–208, 8–208. బౌలింగ్: మొహసిన్ 4–0– 20–3, హోల్డర్ 4–0–45–0, అవేశ్ 4–0–60–0, గౌతమ్ 2–0–23–1, బిష్ణోయ్ 4–0–34–1, స్టొయినిస్ 2–0–23–3. ఆ క్యాచ్ పట్టి ఉంటే... డికాక్ వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద అతను కొట్టిన షాట్ థర్డ్‌మాన్ దిశగా వెళ్లగా, తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అభిజిత్ తోమర్ ఒత్తిడిలో బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేక క్యాచ్ వదిలేశాడు. ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ X బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో. -
ముంబై ఇండియన్స్ జట్టులో ధవళ్ కులకర్ణి
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆడిన 8 మ్యాచ్‌లు ఓడి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. అయితే మిగిలున్న మ్యాచ్‌ల కోసం 33 ఏళ్ల పేస్ బౌలర్ ధవళ్ కులకర్ణిని తీసుకుంది. ఈ సీజన్లో ముంబై పేస్ దళం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ప్రధాన సీమర్ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)సహా, జైదేవ్ ఉనాద్కట్ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు), సామ్స్ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) తేలిపోయారు. -
MI Vs SRH: పాపం ముంబై... 235 పరుగులు చేసినా...
‘అంకెలు నన్ను భయపెడుతున్నాయి’... టాస్ సమయంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. 171 పరుగులతో గెలవడం దాదాపు అసాధ్యమనే స్థితిలో అతను ఈ మాట అన్నా... మ్యాచ్ తొలి భాగంలో తాము చేయగలిగిన ప్రయత్నం ముంబై చేసింది. ఇషాన్, సూర్యకుమార్ రెచ్చిపోవడంతో ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరు 235 పరుగులను నమోదు చేసింది. హైదరాబాద్‌ను 65 లేదా అంతకంటే తక్కువ స్కోరుకు ఆపితే ప్లే ఆఫ్స్ అవకాశం ఉండగా... 5.5 ఓవర్ వద్ద రైజర్స్ 66వ పరుగు తీయడంతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. చివరకు మ్యాచ్‌లో గెలుపు దక్కగా... సన్‌రైజర్స్ ఆఖరి స్థానంతో లీగ్‌ను ముగించింది. అబుదాబి: ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయినా... అద్భుత ఆటతో ముంబై ఇండియన్స్ అభిమానులను అలరించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 84; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 82; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. హోల్డర్‌కు 4 వికెట్లు దక్కగా... నబీ 5 క్యాచ్‌లు అందుకొని ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఫీల్డర్‌గా నిలిచాడు. అనంతరం రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడిపోయింది. కెపె్టన్ మనీశ్ పాండే (41 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు) రాణించారు. ఇషాన్, సూర్య సూపర్... 72 బంతుల్లో (12 ఓవర్లు) ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిపి 230.56 స్ట్రయిక్‌రేట్‌తో 166 పరుగులు చేయగా, మిగతా ముంబై జట్టు 48 బంతుల్లో (8 ఓవర్లు) 120.83 స్ట్రయిక్‌రేట్‌తో 58 పరుగులు చేసింది... ఇదీ వీరిద్దరు ఎంత దూకుడుగా ఆడారో చూపిస్తోంది. కనీసం 250 పరుగులు చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై దాదాపుగా ఆ స్కోరుకు చేరువగా వచ్చింది. రోహిత్ శర్మ (18)ను మరో ఎండ్‌లో నిలబెట్టి ఇషాన్ చెలరేగిపోయాడు. తొలి ఓవర్లో సిక్స్‌తో మొదలు పెట్టిన అతను కౌల్ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు కొట్టాడు. నబీ వేసిన మూడో ఓవర్లో మళ్లీ మూడు ఫోర్లు బాదగా... హోల్డర్ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌లతో ముంబై 22 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో 2021 సీజన్లో వేగవంతమైన అర్ధసెంచరీ (16 బంతుల్లో)ని ఇషాన్ నమోదు చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 83 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా మరో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన ఇషాన్‌ను ఎట్టకేలకు ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేయడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ తర్వాత సూర్యకుమార్ జోరు మొదలైంది. ఏ బౌలర్‌నూ వదిలి పెట్టకుండా అతను కూడా చెలరేగిపోయాడు. కౌల్ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో 24 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. ఇంత విధ్వంసం తర్వాత హోల్డర్ వేసిన చివరి ఓవర్లో ముంబైకి ఐదు పరుగులే వచ్చాయి! రాణించిన పాండే... అనూహ్యంగా ఆసక్తి రేపిన పోరులో ఒక్కసారిగా ముంబై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలకు తెర పడిన తర్వాత మిగిలింది లాంఛనమే అయిపోయింది. రాయ్, అభిõÙక్ కొన్ని చక్కటి షాట్లతో 32 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు. ఆపై రైజర్స్ ఎప్పటిలాగే మిడిలార్డర్లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఓపెనర్లు వెంటవెంటనే వెనుదిరగ్గా, మూడు పరుగుల వ్యవధిలో నబీ (3), సమద్ (2) కూడా అవుటయ్యారు. ఈ దశలో పాండే, గార్గ్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) 36 బంతుల్లోనే 56 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయితే రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మరో ఎండ్‌లో పాండే పోరాడినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నబీ (బి) రషీద్ 18; ఇషాన్ కిషన్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 84; హార్దిక్ (సి) రాయ్ (బి) హోల్డర్ 10; పొలార్డ్ (సి) రాయ్ (బి) అభిషేక్ 13; సూర్యకుమార్ (సి) నబీ (బి) హోల్డర్ 82; నీషమ్ (సి) నబీ (బి) అభిõÙక్ 0; కృనాల్ (సి) నబీ (బి) రషీద్ 9; కూల్టర్‌నైల్ (సి) నబీ (బి) హోల్డర్ 3; చావ్లా (సి) సమద్ (బి) హోల్డర్ 0; బుమ్రా (నాటౌట్) 5; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–80, 2–113, 3–124, 4–151, 5–151, 6–184, 7–206, 8–230, 9–230. బౌలింగ్: నబీ 3–0–33–0, కౌల్ 4–0–56–0, హోల్డర్ 4–0–52–4, ఉమ్రాన్ 4–0–48–1, రషీద్ 4–0–40–2, అభిõÙక్ 1–0–4–2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: రాయ్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 34; అభిõÙక్ (సి) కూల్టర్ నైల్ (బి) నీషమ్ 33; పాండే (నాటౌట్) 69; నబీ (సి) పొలార్డ్ (బి) చావ్లా 3; సమద్ (సి) పొలార్డ్ (బి) చావ్లా 2; గార్గ్ (సి) హార్దిక్ (బి) బుమ్రా 29; హోల్డర్ (సి) బౌల్ట్ (బి) కూల్టర్ నైల్ 1; రషీద్ (సి అండ్ బి) బుమ్రా 9; సాహా (సి అండ్ బి) కూల్టర్‌నైల్ 2; కౌల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–64, 2–79, 3–97, 4–100, 5–156, 6–166, 7–177, 8–182. బౌలింగ్: బౌల్ట్ 4–0–30–1, బుమ్రా 4–0–39–2, చావ్లా 4–0–38–1, కూల్టర్ నైల్ 4–0–40–2, నీషమ్ 3–0–28–2, కృనాల్ 1–0–16–0. -
పరుగు పరుగున ప్లే ఆఫ్స్‌కు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించి చూపించింది. 10 రోజుల క్రితం 127 పరుగులు కూడా ఛేదించలేక చేతులెత్తేసి ముందంజ వేసే అవకాశాలు చేజార్చుకున్నట్లు కనిపించిన ఆ జట్టు... ఇప్పుడు మరొక జట్టు సహకారం లేకుండా... రన్‌రేట్ లెక్కల అవసరం రాకుండా... తమ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముందంజ వేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బృందం అన్ని రంగాల్లో చెలరేగింది. టాప్‌లో దూసుకుపోయిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిలువరించిన హైదరాబాద్... ఆ తర్వాత వార్నర్, సాహాల మెరుపు బ్యాటింగ్‌తో 17 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. ముంబై గెలుపుపై ఆశలు పెంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... చివరి లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. 2016 నుంచి ప్రతీ ఏటా హైదరాబాద్ టాప్–4లో నిలవడం విశేషం. షార్జా: మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–2020లో లీగ్ దశను విజయవంతంగా అధిగమించింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టుగా నిలిచే ప్రయత్నంలో చెలరేగిన జట్టు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. సందీప్ శర్మకు 3 వికెట్లు దక్కగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాబాజ్ నదీమ్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో సన్‌రైజర్స్ తలపడుతుంది. పొలార్డ్ మెరుపులు... ఛేదనలో కాకుండా తొలుత బ్యాటింగ్ చేస్తూ ముంబై ఈ సీజన్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. విరామం తర్వాత బరిలోకి దిగిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు డికాక్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొంత జోరు కనబర్చాడు. అయితే సందీప్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన డికాక్, తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన సూర్యకుమార్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. సూర్యతో పాటు కృనాల్ పాండ్యా (0)ను ఒకే ఓవర్లో నదీమ్ అవుట్ చేయగా, రషీద్ బౌలింగ్‌లో సౌరభ్ తివారి (1) వెనుదిరిగాడు. అనంతరం దూకుడుగా ఆడబోయిన ఇషాన్‌ను సందీప్ వెనక్కి పంపించాడు. ఈ దశలో పొలార్డ్ బ్యాటింగ్ ముంబైని మెరుగైన స్థితికి చేర్చింది. రషీద్ బౌలింగ్‌లో ఆరు పరుగుల వద్ద ఎల్బీ అయినట్లు రివ్యూలో స్పష్టంగా కనిపిస్తున్నా... ‘అంపైర్స్ కాల్’తో బతికిపోయిన అతను చెలరేగిపోయాడు. నటరాజన్ ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన అతను, అదే బౌలర్ తర్వాతి ఓవర్లో 6, 6, 6 బాదాడు. ఈ క్రమంలో మరో రెండు సార్లు రివ్యూలు పొలార్డ్‌కు అనుకూలంగా రావడం విశేషం. చివరి ఓవర్లో మరో సిక్స్ తర్వాత హోల్డర్ అతడిని బౌల్డ్ చేశాడు. అలవోకగా... లక్ష్య ఛేదనలో వార్నర్, సాహా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. బుమ్రా, బౌల్ట్ లేని ముంబై బౌలింగ్ బలగం వీరిద్దరిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. అలవోకగా, చూడచక్కటి షాట్లతో రైజర్స్ ఓపెనర్లు చెలరేగారు. కూల్టర్‌నైల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సాహా, ధావల్ వేసిన మరుసటి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత వార్నర్ తన వంతుగా ప్యాటిన్సన్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్ జోరు తగ్గించలేదు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ముందుగా వార్నర్ (35 బంతుల్లో), ఆ తర్వాత సాహా (34 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, అదే ఓవర్లో భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఆ తర్వాత లక్ష్యంవైపు హైదరాబాద్ మరింత వేగంగా దూసుకెళ్లింది. ముంబై బౌలర్లు పేలవ ప్రదర్శనతో ఒక్క వికెట్ తీయలేకపోయారు. ► 6- వార్నర్ తాను ఆడిన ఆరు వరుస ఐపీఎల్‌లలో (2014నుంచి) కనీసం 500కు పైగా పరుగులు సాధించాడు. కోహ్లిని (5 సార్లు) అతను అధిగమించాడు. 2018లో వార్నర్ ఐపీఎల్ ఆడలేదు. ► 2- ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇది రెండోసారి. 2016లో గుజరాత్ లయన్స్‌పై తొలిసారి ఈ ఘనత సాధించిన హైదరాబాద్ ఆ ఏడాది ఐపీఎల్ చాంపియన్‌గా నిలువడం విశేషం. ► 3- చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడటంద్వారా ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయడం ముంబై ఇండియన్స్కిది (2010, 2019, 2020) మూడోసారి కావడం గమనార్హం. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వార్నర్ (బి) సందీప్ 4; డికాక్ (బి) సందీప్ 25; సూర్యకుమార్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 36; ఇషాన్ కిషన్ (బి) సందీప్ 33; కృనాల్ (సి) విలియమ్సన్ (బి) నదీమ్ 0; సౌరభ్ తివారి (సి) సాహా (బి) రషీద్ 1; పొలార్డ్ (బి) హోల్డర్ 41; కూల్టర్‌నైల్ (సి) గార్గ్ (బి) హోల్డర్ 1; ప్యాటిన్సన్ (నాటౌట్) 4; ధావల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–12; 2–39; 3–81; 4–81; 5–82; 6–115; 7–116; 8–145. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–34–3; హోల్డర్ 4–0–25–2; నదీమ్ 4–0–19–2; నటరాజన్ 4–0–38–0; రషీద్ 4–0–32–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (నాటౌట్) 85; సాహా (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 151. బౌలింగ్: ధావల్ కులకర్ణి 3–0–22–0; కూల్టర్‌నైల్ 4–0–27–0; ప్యాటిన్సన్ 3–0–29–0; రాహుల్ చహర్ 4–0–36–0; కృనాల్ 3.1–0–37–0. -
పంజాబ్ ఆశలు గల్లంతు
ఐపీఎల్ ప్లేఆఫ్స్ స్థానం ఊరిస్తున్న వేళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉసూరుమనిపించింది... గెలిస్తే మెరుగైన స్థితికి చేరి ముందంజ వేసే అవకాశం ఉన్నా, పేలవ ప్రదర్శనతో చేజేతులా ఓటమి తెచ్చి పెట్టుకుంది. ఐదు వరుస విజయాలతో ఒక్కసారిగా జూలు విదిల్చినట్లు కనిపించిన ఆ జట్టు, బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్ ఓడి నిష్క్రమించింది. లీగ్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్ల జాబితాలో ఉన్న ఈ టీమ్, మళ్లీ అదే నిరాశతో సీజన్‌ను ముగించింది. మరో వైపు ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత గత రెండు మ్యాచ్‌లలో బెంగళూరు, కోల్‌కతా జట్ల లెక్కలు మార్చిన చెన్నై సూపర్ కింగ్స్ మరో జట్టును దెబ్బ కొట్టి తమతో పాటు తీసుకెళ్లింది. ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించి కొంత సంతృప్తితో ధోని సేన తమ ఆటను ముగించింది. అబుబాది: ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మరో భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు సాధించింది. దీపక్ హుడా (30 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లుంగి ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) హ్యాట్రిక్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ (34 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (30; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. హుడా మినహా... తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో మయాంక్ జోరు కనబరచగా, ఆ తర్వాత సిక్సర్‌తో రాహుల్ అలరించాడు. మరో మూడు బౌండరీలు బాదిన మయాంక్‌ను అద్భుత బంతితో ఇన్‌గిడి పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్ 53/1తో నిలిచింది. కాసేపటికే రాహుల్ కూడా ఇన్గిడికే దొరికిపోయాడు. భారీ హిట్టర్లు గేల్ (12), పూరన్ (2)ను చెన్నై బౌలర్లు సమర్థంగా నిలువరించారు. నాలుగు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేసి చెన్నై బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. అయితే మరో ఎండ్‌నుంచి దీపక్ హుడా ఎదురుదాడికి దిగాడు. మన్దీప్ (14)తో ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించి జట్టు స్కోరు 100 పరుగులు దాటించాడు. ఇన్‌గిడి ఓవర్లో రెండు సిక్సర్లతో 18 పరుగులు పిండుకున్నాడు. తర్వాత మరో ఫోర్ బాదిన అతను 26 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అదే జోరులో 4, 6తో చివరి ఓవర్లో 14 పరుగులు రాబట్టాడు. అతని ధాటికి పంజాబ్ చివరి 30 బంతుల్లో 58 పరుగులు చేసింది. ఆడుతూ పాడుతూ... సాధారణ లక్ష్యఛేదనను చెన్నై దూకుడుగా ప్రారంభించింది. డుప్లెసిస్, గైక్వాడ్ అంచనాలకు తగినట్లు ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు సాధించింది. తర్వాత కూడా నింపాదిగా ఆడుతోన్న ఈ జోడీని డుప్లెసిస్‌ను అవుట్ చేయడం ద్వారా జోర్డాన్ విడదీశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 బంతుల్లో 82 పరుగుల్ని జోడించారు. తర్వాత రాయుడు సహకారంతో రుతురాజ్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో బౌండరీతో 38 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అతనికిది వరుసగా మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం. అదే జోరులో వీరిద్దరూ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ఇన్‌గిడి 29; మయాంక్ (బి) ఇన్‌గిడి 26; గేల్ (ఎల్బీ) (బి) తాహిర్ 12; పూరన్ (సి) ధోని (బి) శార్దుల్ 2; మన్దీప్ (బి) జడేజా 14; హుడా (నాటౌట్) 62; నీషమ్ (సి) రుతురాజ్ (బి) ఇన్‌గిడి 2; జోర్డాన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–48, 2–62, 3–68, 4–72, 5–108, 6–113. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–30–0, స్యామ్ కరన్ 2–0–15–0, శార్దుల్ ఠాకూర్ 4–0–27–1, ఇన్‌గిడి 4–0–39–3, తాహిర్ 4–0–24–1, జడేజా 3–0–17–1 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (నాటౌట్) 62; డుప్లెసిస్ (సి) రాహుల్ (బి) జోర్డాన్ 48; రాయుడు (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 154. వికెట్ల పతనం: 1–82. బౌలింగ్: నీషమ్ 3–0–26–0, షమీ 4–0–29–0, జోర్డాన్ 3–0–31–1, రవి బిష్ణోయ్ 4–0–39–0, మురుగన్ అశ్విన్ 4–0–17–0, గేల్ 0.5–0–5–0. -
భారత మహిళల టెన్నిస్ జట్టు కొత్త చరిత్ర
దుబాయ్: టెన్నిస్ అభిమానులకు భారత మహిళల జట్టు తీపి కబురు అందించింది. ఫెడ్ కప్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. శనివారం ముగిసిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి ఈ ఘనత సాధించింది. చైనా టాప్ ర్యాంక్‌లో నిలిచి భారత్‌తో కలిసి ప్లే ఆఫ్ దశకు బెర్త్ దక్కించుకుంది. శనివారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా 3–6, 6–0, 3–6తో ప్రిస్కా చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 6–3, 6–3తో అల్దీలా సుత్‌జియాదిపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా ద్వయం 7–6 (7/4), 6–0తో సుత్జియాది–నుగ్రోహో జంటను ఓడించి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్‌లో జరిగే ప్లే ఆఫ్‌లో లాత్వియా లేదా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడుతుంది. -
ప్లే ఆఫ్స్‌కు చేరువగా ముంబా
పంచకుల: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ ప్లే ఆఫ్స్‌కు యు ముంబా మరింత చేరువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబా 36–32తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. దీంతో 59 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై రైడర్ అభిషేక్ సింగ్ సూపర్ ‘టెన్’తో ఆకట్టుకున్నాడు. తలైవాస్ రైడర్ అజిత్ (16 పాయింట్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యు ముంబాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో... ఒక్క మ్యాచ్ గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది. ఒక వేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ 42–33తో దబంగ్ ఢిల్లీపై నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరాయి. -
‘సన్’ బెర్త్ వారి చేతుల్లోనే...
ఐపీఎల్ లీగ్ దశ ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించాయి. చివరిదైన నాలుగో బెర్త్ కోసం రసవత్తర పోరు జరగనుంది. అయితే మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ప్లే ఆఫ్ బెర్త్ పొందే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయి. ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్‌నకు అర్హత సాధించకపోతే మాత్రం అది స్వీయ తప్పిదమే అవుతుంది. ఈ సీజన్లో పలుమార్లు గెలిచే దశ నుంచి ఓటమి వైపునకు వెళ్లిన హైదరాబాద్ సరైన కూర్పును ఎంచుకోవడం లేదు. బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్లాంటి స్టార్ ఆటగాళ్ల సేవలు కీలకదశలో ఆ జట్టుకు అందుబాటులో లేకపోయినా... వారిద్దరు ఎప్పుడు వెళ్లిపోతున్నారనే విషయం జట్టు యాజమాన్యానికి ముందే తెలిసిన నేపథ్యంలో సరైన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాల్సింది. వార్నర్ లేని లోటు భర్తీ చేయలేకపోయినా దేశీయ ఆటగాళ్ల ఎంపిక కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. కొందరైతే ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడంలేదు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వరుసగా ఆరు పరాజయాల తర్వాత మళ్లీ విజయాలబాట పట్టింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ రసెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించి తెలివైన నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రసెల్ వీరవిహారం చేసి కోల్‌కతా పరువు కాపాడాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ 2012 తర్వాత ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. ప్రస్తుతం తమ అద్వితీయ ప్రదర్శనతో ఆ జట్టు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా కనిపిస్తోంది. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మలాంటి అనుభవజ్ఞులతోపాటు యువ ఆటగాళ్లు కూడా తమవంతు పాత్రను పోషించాలి. మొత్తానికి ఈ వారాంతం క్రికెట్ అభిమానులకు పసందుగా గడవనుంది. -
ప్లే ఆఫ్ టికెట్ల ద్వారా రూ. 20 కోట్లు!
న్యూఢిల్లీ: ఐపీఎల్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయం యేటికేడు పెరుగుతూనే ఉంది. ఈ సీజన్ ప్లేఆఫ్ మ్యాచ్‌ల టికెట్లతోనే రూ. 20 కోట్లు ఆర్జించనుంది. గతేడాదితో పోలిస్తే రూ. 2 కోట్ల ఆదాయం ఈసారి పెరిగింది. సాధారణంగా లీగ్ దశలో టికెట్ల రూపేణా వచ్చే ఆదాయం ఫ్రాంచైజీ హోమ్ టీమ్‌కు దక్కుతుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల ఆదాయం మాత్రం బోర్డు ఖజానాలోకే వెళుతుంది. ఈసారి ఫైనల్ పోరు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వేదికపై కాకుండా హైదరాబాద్ గడ్డపై జరుగనున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని స్టేడియంలో మూడు స్టాండ్లపై ఎప్పటి నుంచో ఆక్యుపెన్సీ వివాదం కొనసాగుతోంది. దీంతో మూడు స్టాండ్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇలా అయితే ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసే భాగ్యం తక్కువ మందికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఫైనల్‌ను నిర్వహిస్తున్నారు. మూడు స్టాండ్లపై నెలకొన్న వివాదాన్ని నగర పాలక సంస్థతో పరిష్కరించుకోవాలని సూచించామని అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫైనల్‌ను చెన్నై నుంచి తరలించామని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ చెప్పారు. అయితే చాంపియన్ జట్టు ప్రేక్షకుల్ని నిరాశపరచరాదనే ఉద్దేశంతో తొలి క్వాలిఫయర్‌ను చెన్నైలోనే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కోల్‌కతా దర్జాగా...
మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చావోరేవోలాంటి మ్యాచ్‌లో చెలరేగింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య జట్టును చిత్తు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పనిలో పనిగా సొంతగడ్డపై సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. ప్రస్తుత సమీకరణం ప్రకారం చెన్నై మ్యాచ్ తర్వాత కూడా కోల్‌కతా మూడో స్థానంలోనే ఉంటుంది. దీంతో నైట్ రైడర్స్ తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లోనే ఎలిమినేటర్‌తోపాటు గెలిస్తే రెండో క్వాలిఫయర్ కూడా అదే వేదికపై ఆడుతుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–11లో ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఫలితంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), శ్రీవత్స్ గోస్వామి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రసిధ్ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (43 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు రాబిన్ ఉతప్ప (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చివర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఒకే ఓవర్లో నలుగురు ఔట్... తొలి బంతికే ధావన్ కొట్టిన ఫోర్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మరోవైపు సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన గోస్వామి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు వద్ద రసెల్ బౌలింగ్‌లో అంపైర్ ఔట్‌గా ప్రకటించినా... గోస్వామి రివ్యూ కోరిన తర్వాత అది హెల్మెట్‌కు తగిలిందని తేలింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న గోస్వామి అదే ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 60 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో 79 పరుగుల (52 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. అనంతరం విలియమ్సన్ కూడా తన ఫామ్‌ను కొనసాగించడంతో రైజర్స్ దూసుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, ఆ తర్వాత సియర్ల్స్ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అదే ఓవర్లో వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద నరైన్ క్యాచ్ వదిలేసిన అనంతరం ధావన్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తయింది. చివర్లో మనీశ్ పాండే (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి ఆటగాళ్లు అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో ప్రసి«ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మరో రనౌట్ కలిపి హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. లిన్ మెరుపులు... ఛేదనలో ఎప్పటిలాగే తనదైన శైలిలో సునీల్ నరైన్ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో మొదలు పెట్టాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను, చివరి బంతికి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షకీబ్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి నరైన్ ఔటయ్యాడు. లిన్ కూడా ధాటిగా ఆడటంతో కోల్‌కతా రన్‌రేట్ దూసుకుపోయింది. పవర్‌ప్లేలో కేకేఆర్ 66 పరుగులు చేసింది. లిన్, ఉతప్ప మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కోల్‌కతా ఇన్నింగ్స్ చకచకా సాగింది. 11 పరుగుల వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను రషీద్ వదిలేయగా... దీనిని వాడుకున్న ఉతప్ప... షకీబ్ ఓవర్లో 6,4 తో జోరు ప్రదర్శించాడు. సందీప్ బౌలింగ్‌లో కొట్టిన భారీ సిక్స్‌తో 36 బంతుల్లో లిన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే లిన్, ఉతప్పలతో పాటు రసెల్ (4), నితీశ్ రాణా(7) వెనుదిరిగినా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మిగతా పనిని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) ప్రసిధ్ 50; గోస్వామి (సి) రసెల్ (బి) కుల్దీప్ 35; విలియమ్సన్ (సి) రసెల్ (బి) సియర్ల్స్ 36; మనీశ్ పాండే (సి) సబ్–రింకూ సింగ్ (బి) ప్రసిధ్ 25; యూసుఫ్ పఠాన్ (సి) ఉతప్ప (బి) నరైన్ 2; బ్రాత్‌వైట్ (సి) కార్తీక్ (బి) రసెల్ 3; షకీబ్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ 10; రషీద్ ఖాన్ (సి) కార్తీక్ (బి) ప్రసిధ్ 0; భువనేశ్వర్ రనౌట్ 0; కౌల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–79, 2–127, 3–141, 4–147, 5–161, 6–168, 7–172, 8–172, 9–172. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, ప్రసిధ్ 4–0–30–4, రసెల్ 3–0–31–1, నరైన్ 4–0–23–1, చావ్లా 2–0–19–0, కుల్దీప్ 4–0–35–1, సియర్ల్స్ 2–0–24–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) పాండే (బి) కౌల్ 55; నరైన్ (సి) పాండే (బి) షకీబ్ 29; ఉతప్ప(సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 45; కార్తీక్ నాటౌట్ 26; రసెల్ (సి) పాండే (బి) కౌల్ 4; రాణా (సి) భువనేశ్వర్ (బి) బ్రాత్‌వైట్ 7; గిల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–52, 2–119, 3–149, 4–160, 5–172. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0, సందీప్ శర్మ 2–0–30–0, కౌల్ 4–0–26–2, షకీబ్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–31–0, బ్రాత్‌వైట్ 2.4–0–21–2. -
ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా..
►నేడు గుజరాత్‌తో తలపడనున్న హైదరాబాద్ ►నాకౌట్ చేరాలంటే సన్‌రైజర్స్‌కు గెలుపు తప్పనిసరి ►పరువు కోసం బరిలోకి లయన్స్ కాన్పూర్: మిగతా మ్యాచ్‌లతో ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్‌పై చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్ మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు ఇప్పటికే నాకౌట్ దశకు దూరమైన గుజరాత్ ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. సమతూకంగా సన్‌రైజర్స్.. ఈ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తను సాధించిన ఏడు విజయాల్లో ఆరు సొంతగడ్డ హైదరాబాద్‌లో సాధించినవే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఏడు విజయాలు, ఐదు పరాజయాలు వార్నర్‌సేన నమోదు చేయగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దీంతో 15 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే శనివారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. లేకపోతే ఆదివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్–కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఫలితం తనకు అనుకూలంగా ఉండాలి. అంటే ఆ మ్యాచ్‌లో పంజాబ్‌పై పుణే విజయం సాధించాల్సి ఉంటుంది. దీంతో నాలుగోజట్టుగా ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్ అర్హత సాధిస్తుంది. అయితే నాకౌట్ బెర్త్ కోసం అంతవరకు వేచి చూడకుండా గుజరాత్‌పై విజయం సాధించి సగర్వంగా ప్లే ఆఫ్‌కు చేరుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్ గెలుపొందింది. తొలుత బౌలర్లు తక్కువ స్కోరుకే ముంబైని పరిమితం చేయగా.. అనంతరం శిఖర్ ధావన్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ గెలుపొందింది. మరోసారి జట్టు నుంచి ఇలాంటి సమష్టి ప్రదర్శననే జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఓవరాల్‌గా 12 మ్యాచ్‌లాడిన వార్నర్ 535 పరుగులతో టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ను కైవసం చేసుకున్నాడు. తను ఇలాంటి ఫామ్‌నే కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు శిఖర్ ధావన్ (450 పరుగులు) అద్భుతంగా రాణిస్తున్నాడు. మోజెస్ హెన్రిక్స్ (273 పరుగులు), యువరాజ్ సింగ్ (243), కేన్ విలియమ్సన్ (232) ఆకట్టుకుంటున్నారు. అయితే మరోసారి విలియమ్సన్ బెంచ్‌కే పరిమిత కావచ్చు. అతని స్థానంలో అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ జట్టులోకి రావచ్చు. నమన్ ఓజా సత్తా చాటాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ సన్‌రైజర్స్ సొంతమనడంలో సందేహం లేదు. పేసర్ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు. ఓవరాల్‌గా 12 మ్యాచ్‌లాడిన భువీ.. 14 సగటుతో 23 వికెట్లను కైవసం చేసుకుని టోర్నీలోనే అత్యధిక వికెట్లను తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో ‘పర్పుల్ క్యాప్’ను భువీ సొంతం చేసుకున్నాడు. సిద్దార్థ్ కౌల్ (15 వికెట్లు), అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ (14) అదరగొడుతున్నాడు. మహ్మద్ సిరాజ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ లయన్స్ చేతిలో ఒక్కసారీ హైదరాబాద్ ఓడిపోలేదు. గత సీజన్లో రెండుసార్లు, ఈ సీజన్లో ఓ సారి గుజరాత్‌పై వార్నర్‌సేన విజయం సాధించింది. ఈ మూడుసార్లు ఛేదనలోనే హైదరాబాద్ గెలుపొందడం విశేషం. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని భావిస్తోంది. జట్టు ట్రాక్ రికార్డు చూసుకున్నా, ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్నా ఈ మ్యాచ్‌లో హైదరాబాదే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పరువు కోసం పాకులాట.. మరోవైపు గత సీజన్లో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ ఆ ఏడాది అదరగొట్టింది. అద్భుత విజయాలతో మూడోస్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది గుజరాత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యంతో చాలా ఓటములను మూటగట్టుకుంది. ఈ సీజన్లో 13 మ్యాచ్‌లాడిన గుజరాత్ నాలుగు విజయాలు, తొమ్మిది పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా 8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో పుణే, గుజరాత్‌లకు స్థానం లేదు కాబట్టి, సాంకేతికంగా లయన్స్ ఆడుతున్న చివరి మ్యాచ్‌గా దీన్ని భావించవచ్చు. దీంతో చివరి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీ నుంచి సగౌరవంగా తప్పుకోవాలని గుజరాత్ భావిస్తోంది. జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ సురేశ్ రైనా ఆకట్టుకుంటున్నాడు. ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లాడిన రైనా 440 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దినేశ్ కార్తిక్ (361 పరుగులు), బ్రెండన్ మెకల్లమ్ (320), ఆరోన్ ఫించ్ (298), ఇషాన్ కిషన్ (216), డ్వేన్ స్మిత్ (185 పరుగులు)తో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ సత్తా చాటాల్సి ఉంది. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ఢిల్లీతో జరిగిన చివరిమ్యాచ్‌లో రెండు కళ్లు చెదిరే రనౌట్లను చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే బాసిత్ థంప్సి (11 వికెట్లు) ఆకట్టుకుంటున్నాడు. 12 వికెట్లు తీసిన ఆండ్రూ టై జట్టు నుంచి దూరం కావడం లయన్స్ ఎదురుదెబ్బగా పరిణమించింది. జేమ్స్ ఫాల్క్‌నర్, ప్రదీప్ సాంగ్వాన్, ధావల్ కులకర్ణి రాణించాని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఐపీఎల్లో ఇప్పటివరకు హైదరాబాద్‌పై గెలవని గుజరాత్.. ఈ మ్యాచ్‌లో నెగ్గి వార్నర్‌సేన ప్లే ఆఫ్ ఆశలపై దెబ్బ కొట్టాలని వ్యూహాల్ని రచిస్తోంది. -
ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా..
⇒నేడు ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్ ⇒వరుస ఓటముల ఒత్తిడిలో హైదరాబాద్ ⇒నాకౌట్ చేరిన ఉత్సాహంలో రోహిత్‌సేన హైదరాబాద్: వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లే ఆఫ్స్‌లో చోటే లక్ష్యంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో తీవ్ర ఒత్తిడిలో వార్నర్‌సేన ఈ మ్యాచ్ ఆడుతోంది. మరోవైపు ఇప్పటికే నాకౌట్‌పోరుకు అర్హత సాధించిన ముంబై .. జట్టు రిజర్వ్‌బెంచ్‌ను పరిశీలించేందుకు కోసం ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. విజయంతో ముగింపు.. ఈ సీజన్లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా రాణించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఐదింటిలో విజయం సాధించింది. శనివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ మ్యాచ్ ద్వారా సొంతగడ్డపై తొలిఓటమి నమోదు చేసింది. పుణే విధించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నా మిగతా ప్లేయర్లు శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, నమన్ ఓజా తదీతరులు విఫలమవడం జట్టు కొంపముంచింది. ఈ క్రమంలో జట్టు మిడిలార్డర్ మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఆరు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దవడంతో మొత్తం 13 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతుంది. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో వార్నర్‌సేన భారీ విజయాలు నమోదు చేయాల్సిందే. దీంతో సోమవారం మ్యాచ్‌లో విజయంపై హైదరాబాద్ దృష్టి పెట్టింది. మరోవైపు ఈ సీజన్ ఇరుజట్లు పరస్పరం తలపడగా ముంబై నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని వార్నర్‌సేన భావిస్తోంది. బ్యాటింగ్‌లో వార్నర్, ధావన్, యువీ, విలియమ్సన్ ఆకట్టుకుంటుండగా.. నమన్, బిపుల్ శర్మ సత్తా చాటాల్సిన అవసరముంది. బౌలింగ్ విషయానికొస్తే 21 వికెట్లతో టోర్నీలోనే భువనేశ్వర్ అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ (డేవిడ్ వార్నర్)కు ఇచ్చే ‘ఆరెంజ్ క్యాప్’, అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ (భువనేశ్వర్)కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌లు రెండు హైదరాబాద్ సొంతమయ్యాయి. ఇది చాలు హైదరాబాద్ జోరు చెప్పడానికి. ఇదే ఊపును కొనసాగించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. మరోవైపు టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న సన్‌రైజర్స్.. ముంబైతో మ్యాచ్‌లో ఆ స్థాయి ఆటతీరు కనబర్చాలని కృతనిశ్చయంతో ఉంది. ముంబై దూకుడు.. ఈ సీజన్లో అందరింకంటే ముందుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ ఘనత వహించింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన ముంబై తొమ్మిది విజయాలు, రెండు పరాజయాలు నమోదు చేసింది. దీంతో 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన ముంబై కీలకమైన నాకౌట్ సమరానికి ముందు జట్టు రిజర్వ్ బెంచ్ సత్తాను పరిశీలించాలనుకుంటోంది. ఈక్రమంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో లెండిల్ సిమ్మన్స్‌ను బరిలోకి దించింది. ఈ మార్పు సానుకూల ఫలితాన్నిచ్చింది. ఢిల్లీపై 212 పరుగుల భారీస్కోరు చేసిన ముంబై.. ప్రత్యర్థిని కేవలం 66 పరుగులకే పరిమితం చేసి 146 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ముంబై ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహంలేదు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్ శర్మ, సిమన్స్, పోలార్డ్, నితీశ్ రాణా, పార్థివ్ పటేల్‌లతో బలంగా ఉంది. ఆల్‌రౌండర్లు హార్దిక్, కృనాల్ పాండ్య సోదరులు ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్ విషయానికొస్తే మిషెల్ మెక్లీనగన్, హర్భజన్ సింగ్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలతో బలంగా ఉంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కన్పిస్తోన్న ముంబై.. సోమవారం మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. -
కోహ్లి(సేన)ని ఆపతరమా!
► ప్లే ఆఫ్‌లో చోటు ► ఢిల్లీకి తప్పని నిరాశ ► కోహ్లి అజేయ అర్ధ సెంచరీ పోరాటమంటే బెంగళూరుదే... వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అనుకున్నది సాధించింది. అత్యద్భుత ప్రదర్శనతో సగర్వంగా ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు కాస్త ఇబ్బంది పెట్టినా పరిస్థితులకు తగ్గట్టు ఆడిన కోహ్లి మరోసారి అండగా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అటు పేలవ బ్యాటింగ్‌తో ఢిల్లీ మూల్యం చెల్లించుకుని ఐపీఎల్ నుంచి నిష్ర్కమించింది. రాయ్‌పూర్: ఇరు జట్లకిదే చివరి లీగ్ మ్యాచ్.. గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్‌లో చోటు.. కానీ ఒత్తిడిని అధిగమించలేకపోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కీలక మ్యాచ్‌లో చతికిలపడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం తమ లక్ష్యాన్ని అందుకుంది. తొలి మూడు ఓవర్లలోనే గేల్, డివిలియర్స్‌ను కోల్పోయినా విరాట్ కోహ్లి (45 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) మరోసారి జట్టుకు మూలస్తంభంలా నిలిచాడు. ఫలితంగా ఆదివారం షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ బౌలర్లు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ (52 బంతుల్లో 60; 5 ఫోర్లు; 1 సిక్స్) ఒంటరి పోరుకు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. యజువేంద్ర చాహల్‌కు మూడు, గేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 139 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. డి కాక్ ఒంటరి పోరు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డి కాక్ అద్భుత ఇన్నింగ్స్ మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండో ఓవర్లోనే జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రిషబ్ (1)ను శ్రీనాథ్ అవుట్ చేశాడు. అటువైపు డి కాక్ మాత్రం వేగంగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తూ నాలుగో ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్లో ఢిల్లీకి మరో ఝలక్ తగిలింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చివరికంటా నిలబడి జట్టుకు కీలక విజయాన్ని అందించిన కరుణ్ నాయర్ (10 బంతుల్లో 11; 1 సిక్స్)ను చాహల్ వెనక్కి పంపాడు. మిడాఫ్‌లో కొట్టిన భారీ షాట్‌ను కోహ్లి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకున్న ఈ సూపర్బ్ క్యాచ్ టోర్నీలో హైలైట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలుస్తుంది. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 48/2 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ (12 బంతుల్లో 17; 1 ఫోర్; 1 సిక్స్) ఉన్న కొద్దిసేపు వేగంగా ఆడినా చాహల్ అతణ్ని కూడా దెబ్బతీశాడు. డి కాక్‌ను 17వ ఓవర్లో చాహల్ అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. కోహ్లి.. అదే జోరు స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును ఆరంభంలోనే ఢిల్లీ వణికించినా నిలకడైన బ్యాటింగ్‌తో కోహ్లి తుది కంటా క్రీజులో నిలిచి ఆదుకున్నాడు. రెండో ఓవర్లో మోరిస్ బంతికి క్రిస్ గేల్ (1) బౌల్డ్ కాగా మూడో ఓవర్లో డివిలియర్స్ (6)ను జహీర్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి స్కోరు 17 పరుగులు మాత్రమే. ఈ సమయంలో కోహ్లికి జతగా రాహుల్ కలిశాడు. ఇద్దరూ కాసేపు దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో బెంగళూరు జట్టు స్కోరు 49/2కి చేరింది. సమన్వయంతో ముందుకెళుతున్న ఈ జోడిని బ్రాత్‌వైట్ విడదీశాడు. రాహుల్‌ను బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరించడంతో వాట్సన్ (18 బంతుల్లో 14; 1 సిక్స్), కోహ్లి ఆచితూచి ఆడారు. 14వ ఓవర్లో ఓ సిక్స్ బాదిన వాట్సన్‌ను మరుసటి ఓవర్లోనే నేగి అవుట్ చేశాడు. చివరి 30 బంతుల్లో 28 పరుగులు రావాల్సి ఉండగా బిన్నీ (11 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో మరో 11 బంతులుండగానే కోహ్లి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జోర్డాన్ (బి) చాహల్ 60; రిషబ్ పంత్ (సి) రాహుల్ (బి) శ్రీనాథ్ 1; కరుణ్ నాయర్ (సి) కోహ్లి (బి) చాహల్ 11; శామ్సన్ (సి) రాహుల్ (బి) చాహల్ 17; బిల్లింగ్ (సి) గేల్ (బి) జోర్డాన్ 4; నేగి (సి) డివిలియర్స్ (బి) గేల్ 6; బ్రాత్‌వైట్ (సి) వాట్సన్ (బి) గేల్ 1; మోరిస్ నాటౌట్ 27; జయంత్ యాదవ్ రనౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-11, 2-42, 3-71, 4-81, 5-96, 6-98, 7-107, 8-138. బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 2-0-15-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-28-1; జోర్డాన్ 2-0-10-1; వాట్సన్ 4-0-27-0; చాహల్ 4-0-32-3; అబ్దుల్లా 2-0-14-0; గేల్ 2-0-11-2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) మోరిస్ 1; కోహ్లి నాటౌట్ 54; డివిలియర్స్ (సి) రిషబ్ (బి) జహీర్ 6; రాహుల్ (బి) బ్రాత్‌వైట్ 38; వాట్సన్ (సి) బిల్లింగ్స్ (బి) నేగి 14; బిన్నీ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-5, 2-17, 3-83, 4-111. బౌలింగ్: జహీర్ 4-0-30-1; మోరిస్ 3-0-31-1; నేగి 3-0-19-1; మిశ్రా 4-0-33-0; జయంత్ యాదవ్ 1-0-8-0, బ్రాత్‌వైట్ 3.1-0-18-1.