PC: IPL.com
ఐపీఎల్-2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్‌ను డేవిడ్ మిల్లర్ ఒంటి చేత్తో గెలిపించాడు. కేవలం 38 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా 40 పరుగులతో రాణించాడు.
రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్‌కాయ్ తలా వికెట్ సాధించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 56 బంతుల్లో బట్లర్ 89 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ శాంసన్ 47 పరుగులతో రాణించాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, సాయికిషోర్, యశ్ దయాల్, హార్ధిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.
17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 155/3
17 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. క్రీజులో హార్ధిక్ పాండ్యా(37),మిల్లర్(35) పరుగులతో ఉన్నారు.
14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 129/3
14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. క్రీజులో హార్ధిక్ పాండ్యా(32),మిల్లర్(14) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 97/3
గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన వేడ్.. మెక్‌కాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 97/3
9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 79/2
72 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన గిల్ రనౌట్ అయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 79/2
6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 64/1
6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో మథ్యూ వేడ్(27),శుభ్‌మాన్ గిల్(31) పరుగులతో ఉన్నారు.
మూడు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/1
మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. క్రీజులో వేడ్(18), గిల్(6) పరుగులతో ఉన్నారు
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ అదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా డకౌటయ్యాడు.
చేలరేగిన బట్లర్.. గుజరాత్ టార్గెట్ 189 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 56 బంతుల్లో బట్లర్ 89 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ శాంసన్ 47 పరుగులతో రాణించాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, సాయికిషోర్, యశ్ దయాల్, హార్ధిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.
161 పరుగులు వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెట్‌మైర్.. షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 172/4
17 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 145/3
17 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(56), హెట్‌మైర్(2) పరుగులతో ఉన్నారు.
6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 55/1
ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(16),శాంసన్(30) పరుగులతో ఉన్నారు.
నాలుగు ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 28/1
నాలుగు ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(14),శాంసన్(10) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన జైశ్వాల్.. యష్ దయాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 11/1
ఐపీఎల్-2022లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెద్ మెక్‌కాయ్
గుజరాత్ టైటాన్స్
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ
Comments
Please login to add a commentAdd a comment