IPL 2022 Final GT Vs RR Match Watched By Record Crowd 104859, Details Inside - Sakshi
Sakshi News home page

Crowd For IPL 2022 Final: ఐపీఎల్‌-2022 ఫైనల్‌.. అహ్మదాబాద్‌ స్టేడియం.. సరికొత్త రికార్డు

Published Mon, May 30 2022 9:58 AM | Last Updated on Mon, May 30 2022 11:00 AM

IPL 2022 Final: Record Crowd 104859 For GT Vs RR Match - Sakshi

IPL 2022 Final: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ 15వ సీజన్‌ మెగా ఫైనల్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఆదివారం(మే 29) ఈ మ్యాచ్‌​కు మొత్తం 1,04,859 మంది ప్రేక్షకులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు హాజరైన క్రికెట్‌ మ్యాచ్‌గా ఐపీఎల్‌ ఫైనల్‌ గుర్తింపు పొందింది.

ఇక ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ అదిరిపోయే ప్రదర్శనతో రాజస్తాన్‌ను మట్టికరిపించి ఐపీఎల్‌-2022 విజేతగా నిలిచింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రంలోనే ట్రోఫీ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. కాగా 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా తుదిపోరుకు అర్హత సాధించిన మొదటి సీజన్‌ విజేత రాజస్తాన్‌కు భంగపాటు తప్పలేదు. నామమాత్రపు స్కోరుకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి 👇
IPL 2022: గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన ఐపీఎల్‌
IPL 2022 Final - Hardik Pandya: శెభాష్‌.. సీజన్‌ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement