
PC: IPL Twitter
ఐపీఎల్‌లో అదృష్టవంతమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మన విజయ్ శంకర్ మాత్రమే. కాకపోతే చెప్పండి.. వేలంలో విజయ్ శంకర్‌పై ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. మల్టీ డైమన్షల్ ప్లేయర్‌గా ముద్రించుకున్న విజయ్ శంకర్ ఐపీఎల్‌లో ఏన్నాడు పెద్దగా మెరిసింది లేదు. ఈ సీజన్‌లోనూ నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన విజయ్ శంకర్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. తన ఆటతీరుతో జట్టుకు భారమయ్యాడు తప్ప అతని వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు. ఈ విషయాన్ని తొందరగానే గ్రహించిన హార్దిక్.. అతన్ని బెంచ్‌కే పరిమితం చేశాడు.
PC: IPL Twitter
అయితే నుదుటన అదృష్టం రాసిపెట్టి ఉంటే మ్యాచ్‌లు ఆడకపోయినా టైటిల్ కొల్లగొట్టిన జట్టులో సభ్యుడిగా ఉండడం విజయ్ శంకర్‌కు మాత్రమే చెల్లింది. అతని విషయంలో ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2016లోనూ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టులోనూ విజయ్ శంకర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇంకో విచిత్రమేంటంటే ఆ సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2016 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్లో వార్నర్ సేన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది.
2016లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున(PC: IPL Twitter)
దీంతో అభిమానులు విజయ్ శంకర్‌ను తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''అదృష్టమంటే విజయ్ శంకర్‌దే.. సరిగా ఆడకపోయినా ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో భాగస్వామ్యమయ్యాడు.. బహుశా ఇలాంటి రికార్డు విజయ్ శంకర్‌కు మాత్రమే సాధ్యమైందనుకుంటా'' అంటూ కామెంట్స్ చేశారు.ఇక ఐపీఎల్ 15వ సీజన్‌లో ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే టైటిల్ కొల్లగొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది.
చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'