IPL 2022 RR Vs GT: Fans Trolls On Vijay Shankar After He Gets Dismissed For Just 2 Runs, Details Inside - Sakshi
Sakshi News home page

Vijay Shankar: 'జట్టు మారినా ఆటతీరు మారలేదు.. తీసి పారేయండి!'

Published Thu, Apr 14 2022 8:20 PM | Last Updated on Fri, Apr 15 2022 9:22 AM

IPL 2022: Fans Troll Vijay Shankar Failure Vs Rajastan Royals Match - Sakshi

Courtesy: IPL Twitter

ఒకప్పుడు మల్టీ డైమన్షన్‌ ప్లేయర్‌గా పిలవబడిన విజయ్‌ శంకర్‌ ఐపీఎల్‌ 2022లో అదే చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. 2 పరుగులు చేసిన విజయ్‌ శంకర్‌ కుల్దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నాడు.


Courtesy: IPL Twitter
ఇన్నేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నప్పటికి తన బలహీనతను మాత్రం వదల్లేకపోతున్నాడు. అదే రొడ్డకొట్టుడు ఆటతో అభిమానులను విసిగిస్తున్నాడు. గత సీజన్‌ వరకు ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడిన విజయ్‌ శంకర్‌ పెద్దగా ఒరగబెట్టిందేం లేదు. గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో విజయ్‌ శంకర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. కోటి 40 లక్షలకు కొనుగోలు చేసింది.

ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన విజయ్‌ శంకర్‌ 4,13 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. తాజాగా అవకాశం ఇచ్చినప్పటికి విజయ్‌శంకర్‌ మరోసారి విఫలమయ్యాడు. దీంతో అభిమానులు అతన్ని ట్రోల్‌ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు.''ఎన్ని జట్లు మారినా నీ ఆటతీరు మారదు.. అదే నిర్లక్ష్యం.. విఫలమవుతున్న క్రికెటర్‌కు ఎందుకు అవకాశాలిస్తున్నారు.. తీసి పారేయండి'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: Shimron Hetmyer: 'నా టైం వృథా చేస్తున్నావు.. దయచేసి పిజ్జా, బర్గర్‌ తిననివ్వు'

FIFA WC Vs IPL 2022: షాకింగ్‌.. ఫిఫా వరల్డ్‌కప్‌ను దాటేసిన ఐపీఎల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement