IPL 2022: Wasim Jaffer Share Hilarious Meme How-Miller Stole Game From CSK - Sakshi
Sakshi News home page

Wasim Jaffer: 'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్‌కే పరిస్థితి ఇదే

Published Mon, Apr 18 2022 6:16 PM | Last Updated on Mon, Apr 18 2022 6:41 PM

IPL 2022 Wasim Jaffer Share Hilarious Meme How-Miller Stole Game From CSK - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ట్రోల్స్‌ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా ఆదివారం సీఎస్‌కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ లాగేసుకున్న విధానాన్ని జాఫర్‌ తనదైన శైలిలో వివరించాడు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన ఒక ఫేమస్‌ మీమ్‌ను జాఫర్‌ ఉపయోగించాడు.

ఆ మీమ్‌ ఏంటంటే.. ఒక యువతి స్లీవ్‌లెస్‌ డ్రెస్‌తో రోడ్డుపై నిల్చొని తన బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో ఒక 40 ఏళ్ల వ్యక్తి బుజాన సంచి తగిలించుకొని యువతికి ఎదురుగా వస్తాడు. కాగా ఆ యువతి 40 ఏళ్ల వ్యక్తికి హగ్‌ ఇచ్చినట్లు సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆ హగ్‌ తనకే ఇస్తుందేమోనని భ్రమపడి ఆమెను వాటేసుకుంటాడు.. కానీ ఆమె అతని వెనకాల ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌కు హగ్‌ ఇ‍వ్వడానికి వెళుతుంది.. ఇది చూసిన ఆ 40 ఏళ్ల వ్యక్తి.. ''అరె.. మంచి చాన్స్‌ మిస్‌ అయిందే'' అన్నట్లుగా నాలుక కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ మీమ్‌ అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా ఇదే మీమ్‌ను సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌కు ఉపయోగించాడు.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఒక దశలో గుజరాత్‌ 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఇక రెండో గెలుపు ఖాయమని సీఎస్‌కే భావించింది. కానీ మిల్లర్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ను సీఎస్‌కే నుంచి లాగేసుకున్నాడు. 94* పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన మిల్లర్‌కు.. స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌(40) తోడవ్వడంతో మ్యాచ్‌ చేజారింది.  అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్థీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ 73, రాయుడు 48, జడేజా 22* పరుగులతో రాణించారు. కాగా సీఎస్‌కేపై విజయంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానంలో నిలవగా.. సీఎస్‌కే ఆరు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి.. మిగతా ఐదు ఓడి తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది.

చదవండి: IPL 2022: క్యాచ్‌ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన జ‌డేజా.. వీడియో వైర‌ల్‌

IPL 2022: కావ్యా మారన్‌.. ఆ నవ్వు ఇక ఆగేదే లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement