టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి అవమానం జరిగింది. ధోని బాడీ షేప్ గురించి ఆకతాయిలు ట్విటర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2022 సందర్బంగా అందరికంటే ముందే సీఎస్‌కే సూరత్ వేదికగా క్యాంపెయిన్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ ప్రారంభించింది. తాజాగా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను సీఎస్‌కే తన ట్విటర్‌లో పంచుకుంది.
ఇది చూసిన ఒక అభిమాని.. ''శరీరం పూర్తిగా మారిపోయింది.. మునుపటిలా ఫిట్‌గా కనిపించడం లేదు... 40 ఏళ్లు వచ్చాయిగా అందుకే ధోని ఇలా ఉన్నాడు'' అంటూ కామెంట్ చేశాడు. మరొక అభిమాని తలాను చూస్తే ''సీనియర్ రాజనీతిజ్ఞుడిగా'' కనిపిస్తున్నాడు.. అంటూ పేర్కొన్నాడు. ధోని వ్యవహారంలో సీఎస్‌కే యాజమాన్యం కాస్త సీరియస్ అయినట్లు సమాచారం. కాగా ధోనిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన వ్యక్తులను అభిమానులు ఏకిపారేశారు.''40 ఏళ్ల వయసులోనే ధోని మాకు ఫిట్‌గా కనిపిస్తున్నాడు.. మీ కళ్లు దొబ్బాయనుకుంటా.. ఒకసారి చెక్ చేసుకోండి'' అంటూ కామెంట్ చేశారు.
ఈ విషయం పక్కనబెడితే సూరత్‌లో అడుగుపెట్టిన ధోని సేన తమ ప్రాక్టీస్‌లో వేగం పెంచింది. ముఖ్యంగా ధోని ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బ్యాట్స్‌మన్‌గా ధోని ఇప్పటివరకు ఐపీఎల్‌లో 220 మ్యాచ్‌ల్లో 4,746 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్థశతకాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021లో 16 మ్యాచ్‌లు ఆడిన ధోని 114 పరుగులు మాత్రమే చేశాడు. తలైవా బ్యాటింగ్‌లో వేడి తగ్గినప్పటికి కెప్టెన్సీలో మాత్రం అవే మెరుపులు కనిపిస్తున్నాయి. గతేడాది అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సీఎస్‌కే ఫైనల్లో కేకేఆర్‌ను ఓడించి నాలుగోసారి టైటిల్‌ను అందుకుంది. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, కేకేఆర్ తలపడనున్నాయి.
చదవండి: Pak Vs Aus: 'అభిమానులకు ద్రోహం చేశావు.. ఈ వయసులో నువ్వు కూడా'
Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు
MS Dhoni in the practice session on Day 1 at Surat ahead of IPL 2022. pic.twitter.com/QQNVve0q0g
— Johns. (@CricCrazyJohns) March 7, 2022
Comments
Please login to add a commentAdd a comment