డెవన్ కాన్వే(IPL Twitter)
డెవన్ కాన్వే.. సీజన్ ఆరంభంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో వ్యక్తిగత కారణాల రిత్యా లీగ్ విడిచి బయటకు వెళ్లాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకొని మళ్లీ ఏప్రిల్ చివరి వారంలో జట్టుతో కలిశాడు. అయితే కాన్వేకు తుదిజట్టులో అవకాశం మాత్రం రాలేదు. సీజన్‌లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
కెప్టెన్‌గా దారుణంగా విఫలమైన జడేజా నాయకత్వ బాధ్యతలను ధోనికి అప్పగించాడు. ఇక్కడి నుంచి సీన్ కాస్త రివర్స్ అయింది. తన మైండ్‌గేమ్‌తో కాన్వేకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. అంతే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కాన్వే అర్థసెంచరీలతో మెరిశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 85 నాటౌట్, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 56, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 87 పరుగులు సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్థసెంచరీ చేసిన మూడో సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌గా కాన్వే నిలిచాడు. ప్రస్తుతం సీఎస్‌కే 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
తాజాగా కాన్వే తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ''సీఎస్కే కెప్టెన్ ధోని ఇచ్చిన సలహా బాగా ఉపయోగపడిందని తెలిపాడు. ఢిల్లీతో మ్యాచ్ అనంతరం కాన్వే మాట్లాడాడు. గత రెండు మ్యాచ్‌ల్లో రుతురాజ్‌తో మంచి సమన్వయం ఏర్పడింది. మా ఆలోచనను సింపుల్‌గా ఆచరణలో పెట్టాం. రుతురాజ్, నేను కలిసి మొదట ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించి ఆ తర్వాత వేగం పెంచాలని భావించాం. అందుకు తగ్గట్లే మా ప్రణాళికలు రచించాం. కెప్టెన్ ధోని, నేను, రుతురాజ్, హస్సీ.. ఈ విషయమై చాలాసేపు చర్చించుకున్నాం.
గత మూడు మ్యాచ్‌ల్లో సక్సెస్ అవడం వెనుక మా కెప్టెన్ ధోని సలహా బాగా ఉపయోగపడింది. గత మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాను. దీంతో ధోని.. ''గేమ్‌పై ఫోకస్ ఉంచు.. రిస్కీ షాట్స్ వద్దు.. స్రెయిట్ షాట్స్ ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించు.. అదే నిన్ను నిలబెడుతుంది. ధోని చెప్పినట్లే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎలాంటి పొరపాటు చేయకుండా బ్యాటింగ్ ఆడాను. అక్షర్ పటేల్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని 17 పరుగులు సాధించాను. స్పిన్నర్ల బలహీనతను అధిగమించడంలో ధోని సహాయం చేశాడు. మా కెప్టెన్ ధోనికి థాంక్స్'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2022: ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే!
MS Dhoni: ధోని అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు
D One and Only Conway! 🔥#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/PeJkoIuilB
— Chennai Super Kings (@ChennaiIPL) May 8, 2022
Comments
Please login to add a commentAdd a comment