IPL 2022: Ravindra Jadeja Handed Over CSK Captaincy Back to MS Dhoni - Sakshi

IPL 2022: జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Published Sat, Apr 30 2022 7:36 PM | Last Updated on Sun, May 1 2022 8:36 AM

IPL 2022: Ravindra Jadeja Handed Over CSK Captaincy Back To MS Dhoni - Sakshi

PC: IPL Twitter

సీఎస్‌కే కెప్టెన్‌ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఐపీఎల్‌ 2022 సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.ఆ బాధ్యతలను ఎంఎస్‌ ధోనికి అప్పగిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే తన ట్విటర్‌లో ప్రకటించింది. దీంతో సీఎస్‌కే ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు ధోని కెప్టెన్సీ వహించనున్నాడు.

ఇక సీజన్‌లో సీఎస్‌కే 8 మ్యాచ్‌లాడి రెండు గెలిచి.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌ అవకాశాలు కష్టమే అయినప్పటికి ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌ గెలిస్తే సీఎస్‌కేకు అవకాశం ఉంటుంది. మరి గతంలో ధోని నాయకత్వంలోనే సీఎస్‌కే నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.కాగా సీజన్‌ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడంతో జడేజాను కెప్టెన్‌గా నియమించారు.

కానీ కెప్టెన్సీ భారాన్ని జడేజా మోయలేకపోయాడని అర్థమవుతుంది. కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో జడ్డూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ తనవల్ల కాదంటూ ధోనికే ఆ బాధ్యతలు అప్పగించాడు. అయితే ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement