Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోని.. సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ధోని స్థానంలో జడేజాను కెప్టెన్‌గా నియమించడం సంతోషమే అనిపించినప్పటికి.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైంది. తొలి మ్యాచ్ కదా అని సరిపెట్టుకున్నాం.. అయితే గురువారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే భారీ స్కోరు చేసి కూడా పరాజయం పాలవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది రెండో మ్యాచ్ అయినప్పటికి.. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ప్రభావం జట్టుపై కనిపిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. గురువారం లక్నోతో మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ధోనియా లేక జడేజా అనే డౌట్ సగటు ప్రేక్షకుడిలో మెదలింది. ఎందుకంటే మ్యాచ్ ఆద్యంతం జడేజా కెప్టెన్‌గా తన మార్క్‌ను ఎక్కడ చూపించలేదు. మ్యాచ్‌ను లక్నోకు చేజార్చుకున్నప్పటికి హైలెట్ అయ్యింది ధోనినే.
Courtesy: IPL Twitter
మొదట బ్యాటింగ్ ఆర్డర్ పంపడంలోను.. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలోనూ ధోని ఎక్కువ సందర్భాల్లో ఫీల్డింగ్ సెట్ చేస్తున్నట్లు కనిపించడం.. బౌలింగ్ ఎవరు వేయాలనే దానిపై ధోని నిర్ణయాలు ఉండడం వెనుక జడేజా కెప్టెన్‌గా చేతులెత్తేశాడా అన్న అనుమానం కలుగుతుందని పలువురు పేర్కొన్నారు. అందుకే ధోని మరోసారి రంగంలోకి దిగాడని.. జడేజాను సైడ్ చేసి తానే మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడంటూ గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలు నిజమవ్వకుండా ఉండాలంటే జడేజా తన కెప్టెన్సీ మార్క్‌ను స్పష్టంగా చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయాన్ని క్రిక్‌బజ్ ఇంటర్య్వూలో టీమిండియా మాజీ ఆటగాళ్లు అజయ్ జడేజా, పార్థివ్ పటేల్‌లు తమ మాటల్లో ప్రస్తావించారు. కొన్ని క్షణాలు నాకు సీఎస్‌కే కెప్టెన్ ధోనినే అనిపించింది.. అంతలా ధోని మ్యాచ్‌లో తన ఇంపాక్ట్‌ను చూపించాడు. ఒకవేళ జడేజా తానే కెప్టెన్ అని నమ్మినప్పటికి.. అతను గొప్ప కెప్టెన్‌గా రాణించలేడేమోననే అనుమానం వస్తుంది అంటూ తెలిపారు. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన సీఎస్‌కే మూడో మ్యాచ్‌తోనైనా సీజన్‌లో బోణీ చేస్తుందేమో చూడాలి. గత సీజన్‌లోనూ సీఎస్‌కే తొలి మ్యాచ్‌ను ఓటమితోనే ప్రారంభించనప్పటికి విజేతగా నిలిచింది. ఇక సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను(ఏప్రిల్ 3న) ఎదుర్కోనుంది.
చదవండి: Gambhir-Dhoni: అరె ధోని, గంభీర్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
చెన్నై.. 19వ ఓవర్ శివమ్ దూబేతో వేయించడం సరైన నిర్ణయమే
‘#MSDhoni controlling the game over captain #Jadeja not a good sign’
— Cricbuzz (@cricbuzz) March 31, 2022
Ajay Jadeja & @Parthiv9 believe Dhoni's decision to control the game will hamper Jadeja's growth as a captain@Kreditbee#LSGvCSK #IPL2022 pic.twitter.com/3NZwGYhS8V
Comments
Please login to add a commentAdd a comment