
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం సీఎస్‌కేతో మ్యాచ్‌కు గుజరాత్ టైటాన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో రషీద్ ఖాన్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించాడు. కాగా హార్దిక్ మ్యాచ్‌కు దూరంగా ఉండడంపై రషీద్ ఖాన్ టాస్ సమయంలో వివరణ ఇచ్చాడు. '' హార్దిక్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. అయితే అనుకున్నంత సీరియస్‌గా ఏం లేదు. ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉన్నాడు.. తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు. అని పేర్కొన్నాడు.
కాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లోనే హార్దిక్ గజ్జల్లో గాయంతో బాధపడ్డాడు. గాయం కారణంగా బౌలింగ్ చేయడంలో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ మధ్యలో హార్దిక్ కాసేపు మైదానాన్ని వీడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా హార్దిక్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే అదరగొడుతుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక కెప్టెన్‌గా అదరగొడుతున్న పాండ్యా బ్యాట్స్‌మన్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడి 210 పరుగులు చేసిన హార్దిక్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: SRH vs PBKS: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ