PC: IPL Twitter
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్.. ఐపీఎల్ మెగావేలంలో తొలి రౌండ్‌లో ఎవరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అతన్ని కొనుగోలు చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఐపీఎల్‌లో మిల్లర్ చివరిసారి 2013, 2014 సీజన్లలో వరుసగా(418 పరుగులు, 446 పరుగులు) మంచి స్కోర్లు సాధించాడు. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోయి 2014 తర్వాత మిల్లర్ ఆటతీరు క్రమంగా వెనుకబడింది. ఇక గతేడాది సీజన్(2021లో) మిల్లర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్‌లాడి 124 పరుగులు మాత్రమే చేశాడు.
PC: IPL Twitter
దీంతో మెగావేలంలో ఏ జట్టు మిల్లర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అయితే చివరి నిమిషంలో మిల్లర్‌ను రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. హార్దిక్ పాండ్యా మిల్లర్‌పై నమ్మకముంచి వరుస అవకాశాలు ఇచ్చాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి క్రమక్రమంగా ఫామ్‌లోకి వచ్చాడు. కట్‌చేస్తే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో మిల్లర్ ప్రస్తుతం కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. ఎక్కువగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న మిల్లర్ మ్యాచ్ కిల్లర్‌గా మారాడు.
ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 141 స్ట్రైక్‌రేటుతో 450 పరుగులు సాధించాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో 67 పరుగులు నాకౌట్ ఇన్నింగ్స్‌తో జట్టును ఫైనల్ చేర్చాడు. తనపై గుజరాత్ టైటాన్స్ ఉంచిన నమ్మకాన్ని మిల్లర్ నిలబెట్టుకున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో ఫైనల్ ఫైట్‌కు సిద్దమవుతున్న మిల్లర్.. తన బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
PC: IPL Twitter
''ఐపీఎల్‌లో నా ఆటతీరు చూస్తుంటే..నాకు నేను రిపీట్ అయినట్లుగా అనిపిస్తుంది. కానీ నా బ్యాటింగ్‌లో మాత్రం చాలా మార్పు వచ్చిందని కచ్చితంగా చెప్పగలను. అందుకే గుజరాత్ ఆడుతున్న ప్రతీ మ్యాచ్‌లోనూ నా పేరు ఉంది. గత నాలుగు, ఐదేళ్లలో నా కెరీర్‌లో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్నా. ముఖ్యంగా 2016 ఐపీఎల్ సీజన్ నాకు పీడకల లాంటింది. ఆ సీజన్‌లో నా ప్రదర్శనకు మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టనేమో అనుకున్నా.
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే చాన్స్ ఉంది. ఆ విషయం మనసులో పెట్టుకొని దేశానికి వెళ్లిపోయి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టా.. హార్డ్‌వర్క్ చేశా. సౌతాఫ్రికా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడాను. అలా ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరపున అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నా. ఇది నాలో ఒక గొప్ప మార్పుగా భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.
PC: IPL Twitter
చదవండి: Karthik Drops Buttler Catch: 'జట్టు గ్రహచారమే బాలేదు.. ఎవర్ని నిందించి ఏం లాభం!'
Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది'
Comments
Please login to add a commentAdd a comment