match winner
-
వేలంలో మొదట పట్టించుకోలేదు.. కట్‌చేస్తే మ్యాచ్ 'కిల్లర్' అయ్యాడు
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్.. ఐపీఎల్ మెగావేలంలో తొలి రౌండ్లో ఎవరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అతన్ని కొనుగోలు చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఐపీఎల్లో మిల్లర్ చివరిసారి 2013, 2014 సీజన్లలో వరుసగా(418 పరుగులు, 446 పరుగులు) మంచి స్కోర్లు సాధించాడు. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోయి 2014 తర్వాత మిల్లర్ ఆటతీరు క్రమంగా వెనుకబడింది. ఇక గతేడాది సీజన్(2021లో) మిల్లర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్‌లాడి 124 పరుగులు మాత్రమే చేశాడు. PC: IPL Twitter దీంతో మెగావేలంలో ఏ జట్టు మిల్లర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అయితే చివరి నిమిషంలో మిల్లర్‌ను రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. హార్దిక్ పాండ్యా మిల్లర్‌పై నమ్మకముంచి వరుస అవకాశాలు ఇచ్చాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి క్రమక్రమంగా ఫామ్‌లోకి వచ్చాడు. కట్‌చేస్తే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో మిల్లర్ ప్రస్తుతం కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్న మిల్లర్ మ్యాచ్ కిల్లర్‌గా మారాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 141 స్ట్రైక్‌రేటుతో 450 పరుగులు సాధించాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో 67 పరుగులు నాకౌట్ ఇన్నింగ్స్‌తో జట్టును ఫైనల్ చేర్చాడు. తనపై గుజరాత్ టైటాన్స్ ఉంచిన నమ్మకాన్ని మిల్లర్ నిలబెట్టుకున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో ఫైనల్ ఫైట్‌కు సిద్దమవుతున్న మిల్లర్.. తన బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. PC: IPL Twitter ''ఐపీఎల్లో నా ఆటతీరు చూస్తుంటే..నాకు నేను రిపీట్ అయినట్లుగా అనిపిస్తుంది. కానీ నా బ్యాటింగ్‌లో మాత్రం చాలా మార్పు వచ్చిందని కచ్చితంగా చెప్పగలను. అందుకే గుజరాత్ ఆడుతున్న ప్రతీ మ్యాచ్‌లోనూ నా పేరు ఉంది. గత నాలుగు, ఐదేళ్లలో నా కెరీర్లో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్నా. ముఖ్యంగా 2016 ఐపీఎల్ సీజన్ నాకు పీడకల లాంటింది. ఆ సీజన్లో నా ప్రదర్శనకు మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టనేమో అనుకున్నా. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే చాన్స్ ఉంది. ఆ విషయం మనసులో పెట్టుకొని దేశానికి వెళ్లిపోయి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టా.. హార్డ్‌వర్క్ చేశా. సౌతాఫ్రికా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడాను. అలా ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరపున అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నా. ఇది నాలో ఒక గొప్ప మార్పుగా భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. PC: IPL Twitter చదవండి: Karthik Drops Buttler Catch: 'జట్టు గ్రహచారమే బాలేదు.. ఎవర్ని నిందించి ఏం లాభం!' Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' -
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు..
న్యూఢిల్లీ: సరిగ్గా 38 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్ 18, 1983) భారత క్రికెట్ రూపురేఖలు మారేందుకు బీజం పడింది. భారత్‌లో క్రికెట్ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి ఆ ఇన్నింగ్సే నాంది పలికింది. 1983 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేశ్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులతో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో తొలి సెంచరీ చేసిన కపిల్.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రపంచకప్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 17 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గవాస్కర్, శ్రీకాంత్, అమర్నాథ్ లాంటి స్టార్లు సింగల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. దీంతో ప్రపంచ కప్‌లో భారత్ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆర్గనైజర్స్ అయితే మరో మ్యాచ్ నిర్వహించవచ్చని టాస్ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అప్పుడే వచ్చాడు టార్చ్ బేరర్ కపిల్ దేవ్. తన సారథ్యంలో భారత్‌ను ఎలాగైనా విశ్వవిజేతగా నిలపాలనుకున్న ధృడ సంకల్పంతో బరిలోకి దిగిన ఆయన.. ఓవైపు వికెట్లు పడుతున్నా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. ఇతర బ్యాట్స్మెన్లు బంతిని బ్యాట్‌కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్‌లో అలవోకగా షాట్లు కొడుతూ చెలరేగిపోయాడు. కపిల్ విధ్వంసంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను.. ఆల్‌రౌండర్ కెవిన్ కర్రన్ (73) ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 235 పరుగలకు ఆలౌట్ కావడంతో, భారత్ ఓడాల్సిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కపిల్ బంతితో కూడా రాణించి 11 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్లలో మదన్‌లాల్ 3, రోజర్ బిన్నీ 2, సంధూ, అమర్నాథ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు ఇచ్చిన స్పూర్తితో భారత్ ఆ ప్రపంచ కప్‌లో వెనక్కి తిరగి చూడలేదు. ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌ను 118 పరుగులతో గెలిచిన కపిల్ డెవిల్స్ సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత నాటి ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు -
టీమిండియాను యువీయే గెలిపిస్తాడు: మురళీధరన్
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన యువజరాజ్ సింగ్.. ఐపీఎల్లో ఒక్కసారిగా మళ్లీ విరుచుకుపడి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాబోయే ప్రపంచకప్‌లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా యువీకే ఉందని బెంగళూరు జట్టు సీనియర్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ చెబుతున్నాడు. 29 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన యువరాజ్ చాలాకాలం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో యువరాజ్ మంచి ఆటగాడని, కానీ కొన్నిసార్లు అతడి ఆత్మవిశ్వాసం మాత్రం పడిపోతుంటుందని మురళీ అన్నాడు. టి20 ప్రపంచకప్ తర్వాత దేశమంతా అతడిపై తీవ్ర ఒత్తిడి పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లోనే తాను కూడా ఆడానని చెప్పాడు. ఒక్కాసారి యువీ ఫామ్ లోకి వచ్చాడంటే ఇక అతడిని ఆపడం, అడ్డుకోవడం ఎవరివల్లా అయ్యేపని కాదని తెలిపాడు.