Vijay Shankar
-
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్‌కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
Paagal Vs Kadhal : ప్రతి లవర్ రిలేట్ చేసుకునే కథ
విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాగల్ వర్సెస్ కాదల్". ఈ చిత్రాన్ని శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "పాగల్ వర్సెస్ కాదల్" సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోహీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ - ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నేను కార్తీక్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. కార్తీక్ ఇన్నోసెంట్ అబ్బాయి. తన ప్రేయసి ప్రియతో ఇబ్బందులు పడుతుంటాడు. పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది’ అన్నారు. ‘నేను నటించిన కమిటీ కుర్రాళ్లు సినిమాతో పాటు పాగల్ వర్సెస్ కాదల్ కుడా ఒకే డేట్ కు ఈ నెల 9న రిలీజ్ అవుతున్నాయి. నా కెరీర్ లో మర్చిపోలేని సందర్భం ఇది. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్న’ అన్నారు హీరోయిన్ విషిక. -
‘రాచరికం’ అరాచకంగా ఉండబోతోంది
విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్ గా ‘రాచరికం’ సినిమా ఆరంభం అయింది. సురేష్ లంకలపల్లి దర్శకుడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్పై ఈశ్వర్ నిర్మిస్తున్న ‘రాచరికం’ మూవీ సోమవారంప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు డీఎస్ రావు కెమెరా స్విచ్చాన్ చేయగా, రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈశ్వర్ మాట్లాడుతూ ‘‘సురేష్‌తో ఆరు నెలలుగా ప్రయాణించాం. సినిమా బాగా వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రాచరికం’ చిత్రంలో ప్రతి పాత్రకుప్రాధాన్యత ఉంటుంది’’ అన్నారు సురేష్ లంకలపల్లి. ‘‘రాచరికం’ లాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు విజయ్ శంకర్. ‘‘రాచరికంతో అరాచకం సృష్టించబోతున్నాం’’ అన్నారు అప్సరా రాణి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: చాణక్య, కెమెరా: ఆర్య సాయికృష్ణ, సంగీతం: వెంగి. -
భర్త గురించి మొదటిసారి షాకింగ్ నిజాలు బయటపెట్టిన సింగర్ చిత్ర
-
IPL 2023: ఇలాంటి బంతిని ఎప్పుడూ చూడలేదే..!
గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మే 2) జరిగిన ఉత్కంఠ సమరంలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో గెలవదనుకున్న తన జట్టును విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మపై దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 700 రోజుల తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన 34 ఏళ్ల ఇషాంత్ శర్మ, కుర్ర బౌలర్లా రెచ్చిపోతున్నాడని.. ఈ మ్యాచ్‌లో అతను విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేసినటువంటి నకుల్ బంతిని (స్లో డెలివరి) తానెప్పుడూ చూడలేదని, క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే అత్యుత్తమ నకుల్ బంతి అయ్యుంటుందని కొనియాడాడు. భీకర ఫామ్‌లో ఉన్నటువంటి విజయ్ శంకర్‌ను ఇషాంత్ అద్భుతమైన బంతితో తెలివిగా బోల్తా కొట్టించాడని, ఊహించని రీతిలో బంతి వికెట్లను తాకడంతో విజయ్ శంకర్ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో 2 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఆఖరి ఓవర్లో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి, ప్రత్యర్ధిని గెలవనీయకుండా చేశాడు. Deception at its best! 👊🏻 What a ball that from @ImIshant 🔥🔥#GT have lost four wickets now and this is turning out to be a tricky chase! Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/j7IlC7vf0X — IndianPremierLeague (@IPL) May 2, 2023 ఆఖరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ కేవలం 6 మాత్రమే ఇచ్చి గుజరాత్ నోటి దాకా వచ్చిన విజయాన్ని లాగేసుకున్నాడు. ప్రస్తుత సీజన్లో 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఢిల్లీ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లు (19 పరుగులిచ్చి) పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే, నిన్న ఢిల్లీతో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 5 పరుగుల తేడాతో ఓడింది. ఇషాంత్ శర్మ (2/23) ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ఢిల్లీని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..అమన్ హకీమ్ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రిపాల్ పటేల్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా.. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. గుజరాత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (4/11) అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ రాణించినపట్పికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. -
విజయ్ శంకర్ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..!
గుజరాత్ ఆల్‌రౌండర్, త్రీ డీ ప్లేయర్ విజయ్ శంకర్ బెట్టింగ్ రాయుళ్లను నట్టేట ముంచాడు. నిన్న (ఏప్రిల్ 29) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంకర హాఫ్‌సెంచరీ (24 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదిన శంకర్, బెట్టింగ్ కాసే వాళ్ల కొంపలు కొల్లేరు చేశాడు. గుజరాత్ గెలుపుకు అడపాదడపా అవకాశాలు ఉన్న దశలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శంకర్.. ఎవరూ ఊహించని విధంగా రెచ్చిపోయి ఎడాపెడా సిక్సర్లు బాది, కేకేఆర్ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న బెట్టింగ్ రాయుళ్లకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చాడు. Vijay Shankar's counter-attacking 5️⃣0️⃣ ensures #GujaratTitans keep their perfect away record intact 💯 The defending champions also go 🔝 of the #TATAIPL points table!#KKRvGT #IPLonJioCinema #IPL2023 | @vijayshankar260 pic.twitter.com/uLpd5RYmgW — JioCinema (@JioCinema) April 29, 2023 క్రీజ్‌లో ఉన్నది విజయ్ శంకరే కదా అని తక్కువ అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడి బెట్టింగ్ కాసే వాళ్లను కేకేఆర్‌వైపు చూసేలా చేసిన శంకర్.. ఆతర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల సునామీ సృష్టించాడు. దీంట్లో ఈడెన్ గార్డెన్స్ మైదానంతో పాటు బెట్టింగ్ రాయుళ్లు తడిసిముద్ద అయిపోయారు. కేకేఆర్‌పై పందెం కాసి భారీగా దండుకోవచ్చని అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్ల ఆశలు అడియాశలయ్యాయి. విజయ్ శంకర్‌పై నమ్మకంతో (ఏం చేయలేడని భావించి) భారీగా బెట్టింగ్ కాసి, అది కాస్త బెడిసికొట్టడంతో లబోదిబోమంటున్నారు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో 14 ఓవర్ల (111/3) వరకు గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని గుజరాత్.. శంకర్, మిల్లర్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆ తర్వాత నాలుగు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్‌ను ముగించింది. 15వ ఓవర్లో 18, 16లో 13, వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్లో 24, 18వ ఓవర్లో 14 పరుగులు సాధించి, మరో 13 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. గుర్భాజ్ (81), రసెల్ (18) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. గిల్ (49), విజయ్ శంకర్ (51 నాటౌట్), మిల్లర్ (32 నాటౌట్) సత్తా చాటడంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
కేకేఆర్‌ను ఎన్కౌంటర్ చేసిన విజయ్ శంకర్
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తన హవా కొనసాగిస్తుంది. తాజాగా శనివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 14 ఓవర్ల వరకు 111 పరుగులు మాత్రమే ఉన్న గుజరాత్ తర్వాత మూడు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్‌ను గెలవడం విశేషం. ఇదంతా మిల్లర్, విజయ్ శంకర్ల చలవే అని చెప్పొచ్చు. 14వ ఓవర్ వరకు మిల్లర్ 13, విజయ్ శంకర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. అసలు విధ్వంసం 14వ ఓవర్ నుంచే మొదలైంది. ఇద్దరు పోటాపోటీగా సిక్సర్లు బౌండరీలు బాదుతూ వచ్చారు. వీరిద్దరి దెబ్బకు తర్వాతి 3.5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయంటే ఎంత విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ శంకర్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. 24 బంతుల్లో 51 పరుగులు నాటౌట్‌గా నిలిచిన విజయ్ శంకర్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్‌తో విధ్వంసం సృష్టించిన విజయ్ శంకర్ ఆ తర్వాత నితీశ్‌రానా వేసిన 18వ ఓవర్లో మరో సిక్స్, ఫోర్‌తో విరుచుకుపడి మ్యాచ్‌ను ముగించాడు. మిల్లర్‌ను కూడా తక్కువ చేసి చూడలేం. నిజానికి మిల్లర్ 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది గుజరాత్‌పై ఒత్తిడి తగ్గించాడు. 18 బంతుల్లో 32 పరుగులు నాటౌట్‌గా నిలిచిన మిల్లర్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొత్తానికి ఇద్దరు కలిసి తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను ఎన్కౌంట్ర్ చేశారని చెప్పొచ్చు. Vijay Shankar's counter-attacking 5️⃣0️⃣ ensures #GujaratTitans keep their perfect away record intact 💯 The defending champions also go 🔝 of the #TATAIPL points table!#KKRvGT #IPLonJioCinema #IPL2023 | @vijayshankar260 pic.twitter.com/uLpd5RYmgW — JioCinema (@JioCinema) April 29, 2023 చదవండి: పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి! అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే -
జీరో నుండి హీరోగా 3D ప్లేయర్ విజయ్ శంకర్...సీక్రెట్ ఏంటి?
-
#VijayShankar: ఎంత మార్పు.. అంతా నెహ్రా చలవేనట!
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్ మంచి జోరుమీద ఉన్నాడు. గత సీజన్లకు భిన్నంగా అతని బ్యాటింగ్ సాగుతుంది. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ పూనకం వచ్చినట్లుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న విజయ్ శంకర్ ఓవరాల్‌గా 24 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. Photo: IPL Twitter అయితే ఒకప్పుడు విజయ్ శంకర్ వేరు. క్రీజులో కుదురుకునే వరకు బంతులు తింటాడనే పేరు బలంగా వినిపించేది. గతంలో ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు విజయ్ శంకర్ ఒక్క మ్యాచ్‌లో కూడా మెరిసింది లేదు. టీమిండియాలోకి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అలా అని అతనిలో టాలెంట్ లేదని కాదు.. ఉంది కానీ బయటపెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. పైగా త్రీడీ ప్లేయర్ అంటూ అందరు అతన్ని ట్రోల్ చేసేవారు. అంతలా ట్రోల్స్ బారిన పడ్డ విజయ్ శంకర్ ఈ సీజన్లో మాత్రం కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తన ఇంపాక్ట్‌ను బలంగా చూపించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎలా ఆడినా.. ఇవాళ కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం తన బ్యాటింగ్ పవర్‌ను ప్రదర్శించాడు విజయ్ శంకర్. Photo: IPL Twitter మరి ఇంతలా విజయ్ శంకర్ బ్యాటింగ్ మారడానికి కారణం గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రానే అని అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. నిజానికి గత సీజన్లోనే విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. విజయ్ శంకర్‌ను కొనుగోలు చేయడం వెనుకు పరోక్షంగా నెహ్రా హస్తం ఉన్నట్లు తేలింది. గత సీజన్లో అక్కడక్కడా మెరిసిన విజయ్ శంకర్‌ను కరెక్ట్‌గా వాడితే ప్రయోజనం ఉంటుందని కోచ్ నెహ్రా నమ్మాడు. అందుకు తగ్గట్లే విజయ్ శంకర్ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాది మినీ వేలానికి ముందు విజయ్ శంకర్‌ను రిటైన్ చేసుకున్న తర్వాత ఒక మీడియా సమావేశంలో ఆశిష్ నెహ్రా మాట్లాడాడు.'' విజయ్ శంకర్‌ను వెనుకేసుకు రావడానికి ఒక కారణం ఉంది. అతను టీమిండియాకు ఆడాడు. అతనిలో ఏదో తెలియని టాలెంట్ దాగుంది. దానిని వెలికితీయాలనుకుంటున్నా.. అవకాశాలు ఇస్తేనే కదా తెలిసేది.. ఏదో ఒకరోజు తనను తాను నిరూపించుకుంటాడు.. ఆ నమ్మకం నాకుంది.. అంటూ పేర్కొన్నాడు. తాజాగా ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు నిజమయ్యాయి ఇక తొలి ఇన్నింగ్స్ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ''ఈ సీజన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. కొందరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నా. గతేడాది నాకు కలిసి రాలేదు. కానీ ఈ ఏడాది డొమొస్టిక్ సీజన్లో చాలా పరుగులు చేశాను. ఫ్రాంచైజీ నన్ను రిటైన్ చేసుకోవడంతోనే వారు నాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారని అర్థమైంది. ఒకప్పుడు వరల్డ్‌కప్‌లో గాయపడిన నేను ఆ తర్వాత ఐపీఎల్లో ఘోరంగా విఫలమయ్యాను. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి తిరిగి వస్తాననేది చెప్పలేను. అవకాశమొస్తే మాత్రం వదులుకోను. ఇక కోచ్ ఆశిష్ నెహ్రా మద్దతు నాకు చాలా ఉంది. అతను నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా గత ఐపీఎల్ తర్వాత నాకు సర్జరీ అయింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దేశవాలీ క్రికెట్లో రాణించి మళ్లీ ఫామ్‌ను అందుకున్నా'' అంటూ ముగించాడు. 𝐒𝐇𝐀𝐍𝐊𝐀𝐑 𝐏𝐎𝐖𝐄𝐑 💪💥 The ball flew to all parts of Motera as Vijay Shankar powered @gujarat_titans to their 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 #TATAIPL total 😱 Enjoy the chase in #GTvKKR, LIVE & FREE with #IPLonJioCinema - for all telecom operators!#IPL2023 | @vijayshankar260 pic.twitter.com/3fGqVAW2vj — JioCinema (@JioCinema) April 9, 2023 This man's magical powers have brought out a different Vijay Shankar to the IPL 🙏🏼 pic.twitter.com/B9suXfzODv — Saurabh Malhotra (@MalhotraSaurabh) April 9, 2023 Vijay Shankar unleashed pic.twitter.com/oElwVsvDEp — Ethical Joker (Perry's version) (@Jokeresque_) April 9, 2023 -
త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌కు భారీ ధర.. వాషింగ్టన్ సుందర్‌కు నామమాత్రపు రేట్
TNPL 2023 Auction: ప్రాంతీయ క్రికెట్ టోర్నీ అయిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ఆరు ఎడిషన్లు పూర్తి చేసుకుని ఏడవ ఎడిషన్‌ను సిద్ధమవుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహకులు తొలిసారి ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరుగబోయే ఈ వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు సొంతం చేసుకుంది. వేలంలో పై పేర్కొన్న ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. సాయ్ కిషోర్, సాయ్ సుదర్శన్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, మురుగన్ అశ్విన్.. ఇలా దేశవాలీ స్టార్లు చాలా మంది వేలంలో పాల్గొంటున్నారు. కాగా, ఈ వేలంలో ప్రతి జట్టు కనిష్టంగా 16 మందిని, గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లీగ్‌లో పాల్గొనే 8 జట్లు ఇద్దరు ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫ్రాంచైజీల గరిష్ఠ పర్సు విలువ 70 లక్షలుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్లను నాలుగు కేటగిరీలు విభజించిన నిర్వహకులు.. ఏ కేటగిరి (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 10 లక్షలు, బి కేటగిరి (సీనియర్ బీసీసీఐ దేశవాలీ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 6 లక్షలు, సి కేటగిరి (పై రెండు కేటగిరిల్లో లేకుండా, కనీసం 30 TNPL మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 3 లక్షలు, డి కేటగిరి (ఇతర ఆటగాళ్లు) ఆటగాళ్లకు 1.5 లక్షల చొప్పున బేస్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చేపక్ సూపర్ గిల్లీస్ (ఎన్ జగదీశన్) నెల్లై రాయల్ కింగ్స్ (అజితేశ్, కార్తీక్ మణకందన్) ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ (తుషార్ రహేజా) లైకా రోవై కింగ్స్ (షారుక్ ఖాన్, సురేశ్ కుమార్) దిండిగుల్ డ్రాగన్స్ (రవిచంద్రన్ అశ్విన్) రూబీ త్రిచీ వారియర్స్ (ఆంటోనీ దాస్) సేలం స్పార్టన్స్ (గణేశ్ మూర్తి) మధురై పాంథర్స్ (గౌతమ్) -
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొట్టిన త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో త్రీడీ ప్లేయర్‌గా పిలువబడే టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ అదరగొడుతున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేసిన శంకర్ (187 బంతుల్లో 112; 7 ఫోర్లు, సిక్సర్).. ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు మహారాష్ట్రపై 214 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 107 పరుగులు, అంతకుముందు ముంబైపై 174 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసిన శంకర్ వరుసగా మూడు సెంచరీలు చేసి రంజీల్లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. 2019 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన శంకర్.. తాజా ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు. భారత టెస్ట్ టీమ్‌లో ఎలాగూ హార్ధిక్ పాండ్యా ప్లేస్ ఖాళీగా ఉండటంతో ఆ స్థానంపై శంకర్ కన్నేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన శంకర్.. 2018-19 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడినప్పటికీ, ఆశించినంత ప్రభావం చూపలేక జట్టులో స్థానం కోల్పోయాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా నాటి భారత జట్టు ప్రధాన సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణిస్తూ టీమిండియాకు ఎంపిక చేశాడు. అప్పట్లో అంబటి రాయుడును తప్పించి శంకర్‌కు జట్టులోకి తీసుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. తనను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయకపోవడం పట్ల రాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. వరల్డ్‌కప్‌ను త్రీడీ కళ్లజోడుతో చూస్తానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. రాయుడును కాదని నాడు జట్టులో వచ్చిన శంకర్ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు. నాటి నుంచి జట్టుకు దూరంగా ఉన్న శంకర్ తాజాగా హ్యాట్రిక్ సెంచరీలు బాది తిరిగి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న అస్సాం తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 247 పరుగులు వెనుకపడి ఉంది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. శంకర్‌తో పాటు జగదీశన్ (125), ప్రదోశ్ పాల్ (153) శతకాలు బాదారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 266 పరుగులకే ఆలౌటైంది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఫలితంగా తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
Focus Review: ఫోకస్ మూవీ రివ్యూ
టైటిల్: ఫోకస్ నటీనటులు: విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు నిర్మాత : వీరభద్రరావు పరిస దర్శకత్వం: జి. సూర్యతేజ సంగీతం: వినోద్ యజమాన్య సినిమాటోగ్రఫీ: ప్రభాకర్ రెడ్డి ఎడిటర్: సత్య. జీ విడుదల తేది: అక్టోబర్ 28, 2022 కథేంటంటే.. ఎస్పీ వివేక్ వర్మ(భాను చందర్), న్యాయమూరి ప్రమోద దేవి(సుహాసిని మణిరత్నం) భార్య భర్తలు. వృత్తిధర్మం పాటిస్తూ.. ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో వివేక్ వర్మ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఎస్సై విజయ్ శంకర్(విజయ్ శంకర్) టేకాప్ చేస్తాడు. అనేక మలుపుల తర్వాత ఈ కేసు దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ(అషురెడ్డి) రంగంలోకి దిగుతుంది. అసలు వివేక్ని హత్య చేసిందెవరు? హత్య కేసు దర్యాప్తు ఎందుకు క్రిటికల్‌గా మారింది? విజయ్ శంకర్‌ను తప్పించి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ ఎందుకు ఈ కేసును టేకప్ చేయాలని ప్రయత్నించింది? చివరకు అసలు హంతకులను ఎలా పట్టుకున్నారు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి. ఇలాంటి కథలను కొత్త దర్శకులు ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఫోకస్ చిత్రం కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథతోనే తెరకెక్కింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేసే విధంగా ట్విస్టులు ఉంటాయి. బలమైన సన్నివేశాలు లేకపోవడం, పేలవంగా కథనం సాగడం.. క్యారెక్టర్లలో క్లారిటీ లేకపోవడం లాంటి అంశాలు తొలి భాగంలో కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్టు ఉంటుంది. స్క్రిప్టు పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే.. సినిమా స్థాయి మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఎస్సై విజయ్ శంకర్‌గా విజయ్ శంకర్ తనదైన నటనతో మెప్పించాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అషురెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమగా అషురెడ్డి పర్వాలేదనిపించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సినిమాకు ప్రధాన బలం సుహాసిని పాత్ర అనే చెప్పాలి. అతిథి పాత్రకే పరిమితమైంది. జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. వినోద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ సత్య. జీ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
`ఫోకస్` టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది : శ్రీకాంత్
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్‌బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్నచిత్రం `ఫోకస్`. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు, వీరభద్రరావు పరిస నిర్మాత. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. అక్టోబరు 28న ఈ మూవీ థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శకుడు సూర్యతేజ మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. హీరో విజయ్ శంకర్ చాలా బాగా నటించాడు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు. ‘నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ‘ఫోకస్’. క్రైమ థ్రిల్లర్ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది’అని హీరో విజయ్ శంకర్ అన్నాడు. ఫోకస్ అనేది ఒక కొత్త తరహా క్రైమ్ థిల్లర్. తెలుగు ఆడియన్స్ ఈ జోనర్‌ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. కొత్తగా ఉంటే తప్పకుండా ఓన్ చేసుకుంటారు. ఊహించని మలుపులతో సరికొత్త కథ,కథనాలతో ఈ సినిమా రూపొందింది’అని దర్శకుడు సూర్యతేజ్ అన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాసిని, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు. -
'అదృష్టం అంటే అతడిదే.. సరిగా ఆడకపోయినా.. నుదుటన రాసిపెట్టి ఉంది'
ఐపీఎల్లో అదృష్టవంతమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మన విజయ్ శంకర్ మాత్రమే. కాకపోతే చెప్పండి.. వేలంలో విజయ్ శంకర్‌పై ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. మల్టీ డైమన్షల్ ప్లేయర్‌గా ముద్రించుకున్న విజయ్ శంకర్ ఐపీఎల్లో ఏన్నాడు పెద్దగా మెరిసింది లేదు. ఈ సీజన్లోనూ నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన విజయ్ శంకర్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. తన ఆటతీరుతో జట్టుకు భారమయ్యాడు తప్ప అతని వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు. ఈ విషయాన్ని తొందరగానే గ్రహించిన హార్దిక్.. అతన్ని బెంచ్‌కే పరిమితం చేశాడు. PC: IPL Twitter అయితే నుదుటన అదృష్టం రాసిపెట్టి ఉంటే మ్యాచ్‌లు ఆడకపోయినా టైటిల్ కొల్లగొట్టిన జట్టులో సభ్యుడిగా ఉండడం విజయ్ శంకర్‌కు మాత్రమే చెల్లింది. అతని విషయంలో ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2016లోనూ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టులోనూ విజయ్ శంకర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇంకో విచిత్రమేంటంటే ఆ సీజన్లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో వార్నర్ సేన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. 2016లో ఎస్ఆర్హెచ్ తరపున(PC: IPL Twitter) దీంతో అభిమానులు విజయ్ శంకర్‌ను తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''అదృష్టమంటే విజయ్ శంకర్‌దే.. సరిగా ఆడకపోయినా ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో భాగస్వామ్యమయ్యాడు.. బహుశా ఇలాంటి రికార్డు విజయ్ శంకర్‌కు మాత్రమే సాధ్యమైందనుకుంటా'' అంటూ కామెంట్స్ చేశారు.ఇక ఐపీఎల్ 15వ సీజన్లో ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ కొల్లగొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' -
IPL 2022: ‘వై దిస్ కొలవరి’ అంటూ రచ్చ చేస్తున్న గుజరాత్ ఆటగాళ్లు!
IPL 2022- GT Teammates Video Viral: ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది గుజరాత్ టైటాన్స్. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు.. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 10 గెలిచి 20 పాయింట్లు సాధించింది. తద్వారా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్యాష్ రిచ్ లీగ్ 2022 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా సత్తా చాటింది. దీంతో గుజరాత్ ఆటగాళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతా ఒక్కచోట చేరి తమ విజయాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. తమకంటూ ఓ ‘మ్యూజిక్ బ్యాండ్’ ఏర్పాటు చేసుకుని పాటలు పాడుతూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్ తదితర ఆటగాళ్లు ప్రముఖ తమిళ పాట.. ‘‘వై దిస్ కొలవెరి డి’’ని ఆలపిస్తూ కనిపించారు. ఈ వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి! చదవండి👉🏾Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోయిన్గా అషూ రెడ్డి, ఫోకస్ పోస్టర్ చూశారా?
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్‌బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ఫోకస్'. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవల విడుదలైన ఫోకస్ మూవీ టీజర్ ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేషాదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. తాజాగా ఆమె లుక్‌ను బి. సుమతి ఐపీఎస్ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుదల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. 'ఫోకస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది. ఔట్ పుట్ పట్ల మా యూనిట్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అతి త్వరలో ఒక స్టార్ హీరోతో ఫోకస్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చదవండి: పాన్ ఇండియా సినిమాల సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్ బాలీవుడ్ రీమేక్‌లపై వర్మ వ్యంగ్యాస్త్రాలు -
'జట్టు మారినా ఆటతీరు మారలేదు.. తీసి పారేయండి!'
ఒకప్పుడు మల్టీ డైమన్షన్ ప్లేయర్‌గా పిలవబడిన విజయ్ శంకర్ ఐపీఎల్ 2022లో అదే చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. 2 పరుగులు చేసిన విజయ్ శంకర్ కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నాడు. Courtesy: IPL Twitter ఇన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికి తన బలహీనతను మాత్రం వదల్లేకపోతున్నాడు. అదే రొడ్డకొట్టుడు ఆటతో అభిమానులను విసిగిస్తున్నాడు. గత సీజన్ వరకు ఎస్ఆర్హెచ్కు ఆడిన విజయ్ శంకర్ పెద్దగా ఒరగబెట్టిందేం లేదు. గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. కోటి 40 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్ 4,13 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. తాజాగా అవకాశం ఇచ్చినప్పటికి విజయ్‌శంకర్ మరోసారి విఫలమయ్యాడు. దీంతో అభిమానులు అతన్ని ట్రోల్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు.''ఎన్ని జట్లు మారినా నీ ఆటతీరు మారదు.. అదే నిర్లక్ష్యం.. విఫలమవుతున్న క్రికెటర్‌కు ఎందుకు అవకాశాలిస్తున్నారు.. తీసి పారేయండి'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Shimron Hetmyer: 'నా టైం వృథా చేస్తున్నావు.. దయచేసి పిజ్జా, బర్గర్ తిననివ్వు' FIFA WC Vs IPL 2022: షాకింగ్.. ఫిఫా వరల్డ్‌కప్‌ను దాటేసిన ఐపీఎల్ -
విజయ్ శంకర్ చేసిన రనౌట్ సరైనదేనా!
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 పరుగులు చేసిన లలిత్ యాదవ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను రనౌట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ విజయ్ శంకర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని పంత్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. సింగిల్‌కే అవకాశమున్నప్పటికి పంత్ అనవసరంగా రెండో పరుగుకు యత్నించాడు. కాగా బంతిని అందుకున్న మనోహర్ విజయ్ శంకర్‌కు త్రో విసిరాడు. లలిత్ యాదవ్ క్రీజులోకి చేరేలోపే విజయ్ శంకర్ వికెట్లను గిరాటేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతి అందుకోవడానికి ముందే విజయ్ శంకర్ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నడంతో ఒక బెయిల్ కిందపడింది. అప్పటికే బంతి విజయ్ శంకర్ చేతిలో పడడం.. వెంటనే వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. ఇది గమనించిన పంత్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. అంపైర్ వద్దకు వచ్చి మరోసారి రనౌట్‌ను పరిశీలించాలని కోరాడు. అయితే అంపైర్లు విజయ్ శంకర్ పొరపాటున ముందే వికెట్లను తన్నినప్పటికి.. లలిత్ యాదవ్‌ను రనౌట్ చేసే సమయానికి బంతి అతని చేతిలోనే ఉందని.. కాబట్టి అది ఔటేనని వివరించారు. దీంతో చేసేదేం లేక లలిత్ యాదవ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విజయ్ శంకర్ చేసిన రనౌట్ కరెక్టేనా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చదవండి: Ashwin Vs Tilak Varma: తిలక్ వర్మపై రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం లలిత్ యాదవ్ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
145 కి.మీ. స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం(మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ దుష్మంత చమీరా అద్భుతమైన యార్కర్‌తో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన చమీరా తొలి బంతికే విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే 145 కి.మీ.ల వేగంతో చమీరా వేసిన యార్కర్‌కు శంకర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. . దీంతో శంకర్(6 బంతుల్లో 4 పరుగులు) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 5వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా(55), బదోని(54) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటరల్లో రాహుల్ తెవాటియా(40), హార్ధిక్ పాండ్యా(33), మిల్లర్(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022: అతడొక అద్భుతం.. మాకు బేబీ డివిలియర్స్ లాంటి వాడు: రాహుల్ சமீர 🔥🔥🔥🔥#LSGvGT #IPL2022 #chameera pic.twitter.com/DWhLPe9Uwa — ஷாஜகான் 🇱🇰 (@JudeOff3) March 28, 2022 -
మర్డర్ కేసుపై ‘ఫోకస్’ పెట్టిన విజయ్ శంకర్
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫోకస్’ మూవీ తెరకెక్కుతోందని మూవీ యూనిట్ పేర్కొంది. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా, అషూరెడ్డి హీరోయిన్గా నటిస్తోంది.భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది. మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తాం’అని చిత్ర దర్శకుడు సూర్యతేజ తెలిపారు. -
Ravi Shastri: అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ..
Ravi Shastri: Had No Say Dropping Ambati Rayudu In 2019 World Cup Squad: రవిశాస్త్రి... 2017లో టీమిండియా హెడ్ కోచ్‌గా పగ్గాలు చేపట్టాడు. ఆయన హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించింది. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో 43 టెస్టులు ఆడిన భారత జట్టు 25 గెలవగా.. ఐదింటిని డ్రా చేసుకుంది. ఇక 76 వన్డేల్లో సాధించిన విజయాలు 51. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే... అరవై ఐదింట.. 43 విజయాలు. మొత్తంగా 184 మ్యాచ్‌లలో 119 గెలుపొందింది. విజయాల శాతమే ఎక్కువగా ఉన్నా... ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా 2019లో వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి టీమిండియా కనీసం ఫైనల్‌కు కూడా చేరకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. అంతేగాక జట్టు సెలక్షన్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును కాదని.. విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకొన్న రవిశాస్త్రి తాజాగా ఈ విషయాల గురించి మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో సంభాషించిన ఆయన... ‘‘2019 వరల్డ్‌కప్... జట్టు ఎంపిక విషయం గురించి నాకు పెద్దగా ఫిర్యాదులు లేవు. అయితే, ప్రపంచకప్ కోసం ముగ్గురు వికెట్ కీపర్లను సెలక్ట్ చేయడం సరికాదనిపించింది. నిజానికి అంబటి(అంబటి రాయుడు) లేదంటే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాల్సింది. ఎంఎస్ ధోని, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్.. వికెట్ కీపర్ బ్యాటర్లు ఇంతమంది ఎందుకు అనిపించింది. కానీ సెలక్టర్ల నిర్ణయంలో నేను ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. సాధారణ చర్చల్లో భాగంగా... ఫీడ్బాక్ అడిగినపుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్పేవాడిని’’ అని పేర్కొన్నాడు. కాగా 2019లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ సమయంలో... అద్భుత ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడి కాదని, విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో విమర్శలు రాగా.... విజయ్ త్రీ డైమన్షనల్ ఆటగాడని అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. ఆనక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. చదవండి: IPL 2022 Auction- Avishka Fernando: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్.. ఐపీఎల్ వేలంలోకి వచ్చాడంటే! -
Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు
Tamil Nadu Enters Final Beat Hyderabad By 8 Wickets.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది.తనయ్ త్యాగరాజన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమ్యారు. తమిళనాడు బౌలర్ శరవణ కుమార్ 5 వికెట్లతో దుమ్మురేపగా.. ఎం అశ్విన్, మహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ విజయ్‌శంకర్ 43 పరుగులు నాటౌట్.. సాయి సుదర్శన్ 34 నాటౌట్ గెలిపించారు. ఈ విజయంతో తమిళనాడు ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ, కర్ణాటక మధ్య జరగనున్న సెమీఫైనల్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే.. -
‘కపట నాటక సూత్రధారి’ మూవీ రివ్యూ
టైటిల్ : కపట నాటక సూత్రధారి నటీనటులు : విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు నిర్మాత : మనీష్ (హలీమ్) దర్శకత్వం : క్రాంతి సైన సంగీతం : రామ్ తవ్వా నేపథ్య సంగీతం : వికాస్ బడిస ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్ విడుదల తేది : నవంబర్ 12, 2021 వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. నవంబర్ 12 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ చూద్దాం. కథేంటంటే..? ఒక బస్తీకి చెందిన యాదగిరి(విజయ్ శంకర్ ), సెంథిల్(సంపత్ కుమార్), పూర్ణ(చందులాల్), పుష్ప(అమీక్ష), కల్పన(సునీత) లు లైఫ్ లో గోల్‌ను అచీప్ కావాలనుకుని ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు.అలాంటి తరుణంలో బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని ఒక వ్యక్తి చెప్పడంతో ఆ లోన్ అమౌంట్ తో లైఫ్‌లో సెట్ అవ్వొచ్చని అప్లై చేస్తారు. అయితే వీరు అప్లై చేసిన బ్యాంకులో ఒక కస్టమర్ తను తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకొని వెళితే అది నకిలీ బంగారం అని తేలుతుంది. బ్యాంకు వాళ్లే ఈ మోసానికి పాల్పడుతున్నారని తెలుసుకున్న కస్టమర్స్.. ఈ విషయంపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణ కోసం సిన్సియర్ అండ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అరవింద్ (రుద్ర )ని రంగంలోకి దించుతుంది. అరవింద్ విచారణ చేపట్టే క్రమంలో బస్తీకి చెందిన ఆ ఐదుగురే 30 ఫెక్ అకౌంట్లను ఓపెన్ చేసి 99 కోట్లు అనగా 200 కేజీల బంగారం స్కాం చేశారని తేలుతుంది. దీంతో పోలీస్ ఆఫీసర్ రుద్ర ఈ బస్తీ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడానికి వెళ్తాడు. ఆ తరువాత రుద్ర చేసే ఇన్వెస్టగేషన్ లో ఈ స్కాం వేరేవాళ్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్ కృష్ణ మూర్తి(భానుచందర్)తో పాటు బ్యాంకు ఉద్యోగులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. అసలు ఈ స్కాం ఎవరు చేశారు?ఎందుకు బ్యాంక్ ఎంప్లాయిస్ చనిపోతూ వుంటారు? ఈ స్కామ్ నుంచి ఈ ఐదుగురు బస్తీ వాసులు బయటపడ్డారా.. లేదా..? ఇంతకూ ఈ స్కాం లో అసలైన "కపట నాటక సూత్ర దారుడెవ్వరు? అనేదే మిగతా కథ. ఎలా చేశారంటే...? బస్తీవాసీ యాదగిగిగా విజయ్ శంకర్ తనదైన నటనతో మెప్పించాడు. సెంథిల్ పాత్రలో నటించిన కమెడియన్ శివారెడ్డి తమ్ముడు సంపత్ కుమార్ చక్కటి నటనను కనబరిచాడు. తెలివైన కుర్రాడు పూర్ణగా పాత్రకు చందులాల్ న్యాయం చేశాడు. పూలమ్ముకునే యువతి పుష్ప పాత్రలో అమీక్ష ఒదిగిపోయింది. ట్రాన్స్ జెండర్ కల్పనగా సునీత మెప్పిచింది. పోలీసాఫీసర్ రుద్ర పాత్రలో అరవింద్ అద్భుత నటనను కనబరిచాడు. ఇన్వెస్టగేషన్ చేసే క్రమంలో తన విశ్వరూపాన్ని చూపించాడు. బ్యాంక్ మేనేజర్ గా బాను ప్రసాద్, మేక రామకృష్ణ, విజయ్,మాస్టర్ బాబా ఆహిల్, రవిప్రకాష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎన్ని వచ్చినా సరే.. ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు క్రాంతి సైన ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు. దానికి కొంత ప్రేమను జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రధాన పాత్రల భావోద్వేగాలు, బ్యాక్ డ్రాప్ సెటప్, పాత్రల ఎలివేషన్స్ బాగున్నాయి. మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు క్రాంతి సైన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక సాంకెతిక విషయానికి వస్తే.. రామ్ తవ్వ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. దొంతి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటర్ చోటా కె.ప్రసాద్ పనితీరు బాగుంది. రామకృష్ణ అందించిన మాటలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఐపీఎల్: ‘వాళ్లిద్దరినీ బ్యాన్ చేయండి.. తిరిగి డబ్బు చెల్లించమనండి’
Netizens Trolls SRH Players: ఐపీఎల్-2021లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంతటి ఘోరమైన ఓటమిని తట్టుకోలేకపోతున్నామని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ గెలుస్తారా అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ వంటి వాళ్లకు ఇకనైనా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. వాళ్లిద్దరూ ఫ్రాంఛైజీ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా పంజాబ్ కింగ్స్‌తో సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ సేన 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఓటమితో.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి.. 8 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. మ్యాచ్ మ్యాచ్‌కు ఆటగాళ్లను పదే పదే మార్చడం.. వార్నర్ అన్నను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక.. తుది జట్టులో చోటు కల్పించకుండా అవమానించారని, సరైన ప్రణాళిక లేకుండా ఈ సీజన్లో చేదు అనుభవాన్ని మిగిల్చారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు భారంగా మారిన మిడిలార్డర్ ‘జాతి రత్నాలు’.. మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌ను ఇకనైనా వదిలించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. వాళ్లిద్దరినీ బ్యాన్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో మనీశ్ పాండే 23 బంతుల్లో 13 పరుగులు చేయగా.. కేదార్ జాదవ్.. 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ రవి బిష్ణోయి బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఇక ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్ (కేకేఆర్‌పై 61 (నాటౌట్)) మినహా మిగతా మ్యాచ్‌లలో మనీశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేదార్ జాదవ్ సైతం ఆశించినంతగా రాణించలేదన్న సంగతి తెలిసిందే. SRH owners after buying Kedar Jadhav :#SRHvsPBKS #KedarJadhav pic.twitter.com/mjNNoH3kaH — Vikrant Gupta (@SomewhereNowhe8) September 25, 2021 #PBKSvSRH (Bhuvi Shami Ellis) Well fought Holder you deserve to be in winning side for your tremendous all-round performance But situation of Warner Kane Saha Kedar Jadhav And Manish Pandey.... 🤣 🤣 🤣 🤣 🤣 pic.twitter.com/9v4131iI7O — Roopam Anurag (@RoopamAnurag) September 25, 2021 Manish Pandey played 4 seasons with SRH and cost them 44 crores plus many games, brand value as well. That has to be one of the costliest "CTC" kinda hiring of the IPL. — Manish (@iHitman7) September 25, 2021 We don't have just one we have 3 1.Manish pandey 2.kedar jadhav 3.vijay shankar pic.twitter.com/MOJSkFkJAz — tarakbingumalla (@taraksrinivas) September 25, 2021 -
నటరాజన్‌కు కరోనా.. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఓ గుడ్ న్యూస్
దుబాయ్: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఎస్ఆర్హెచ్ క్యాంప్‌లో కోవిడ్ కలకలం రేపింది. సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌కు కరోనా నిర్ధారణ కావడంతో అతనితో సన్నిహితంగా మరో ఆటగాడు విజయ్ శంకర్ సహా మరో ఐదుగురిని(టీమ్ మేనేజర్ విజయ్‌కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి) ఐసోలేషన్‌కు తరలించారు. అయితే ఎస్ఆర్హెచ్ క్యాంప్‌లోని మిగతా ఆటగాళ్లందరికీ నెగటివ్ రావడంతో నేటి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేయడం విశేషం. మహమ్మారి బారిన పడిన నటరాజన్‌కు ఎలాంటి లక్షణాలూ లేవని, అతను ప్రస్తుతం జట్టు సభ్యులకు దూరంగా మరో చోట ఐసోలేషన్‌లో ఉంటున్నాడని పేర్కొంది. కాగా, ఎస్ఆర్హెచ్ బృందం మొత్తానికి ఇవాళ ఉదయం 5 గంటలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. చదవండి: ఐపీఎల్లో మళ్లీ కరోనా కలకలం.. నటరాజన్‌కు పాజిటివ్! -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కపటనాటక సూత్రధారి’, త్వరలోనే విడుదల
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కపటనాటక సూత్రధారి’. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. ఫ్రెండ్స్ అడ్డా బ్యానర్‌పై మనీష్ (హలీమ్) నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ సహా నిర్మాతలు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మనీష్ మాట్లాడుతూ ‘‘మా ‘కపట నాటక సూత్రధారి’ సెన్సార్ పూర్తయ్యింది. మంచి థ్రిల్లర్ మూవీ చేశామని సెన్సార్ సభ్యులు మా టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ క్రాంతి సైన సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సుభాష్‌గారి విజువల్స్, రామ్‌గారి సంగీతం, వికాస్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యాయి. కచ్చితంగా సినిమా ఆడియెన్స్‌ను డిఫరెంట్ మూవీగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన డిఫరెంట్ పోస్టర్స్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
Kapata Nataka Sutradhari: 99 కోట్ల బంగారం కొట్టేశారు, తర్వాత?
వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి, ఫస్ట్ కాపీ సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ... ఈరోజుల్లో సినిమా పరిశ్రమకు చాలామంది కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. వారు కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో అన్ని నేర్చుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కపట నాటక సూత్రదారి ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రాన్ని క్రాంతి అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా మనీష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా వీరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికి అల్ ది బెస్ట్ అన్నారు. నిర్మాత మనీష్ మాట్లాడుతూ...మా కపట నాటక సూత్రదారి సినిమా ట్రైలర్‌ని ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతగా ఆయనే మాకు స్ఫూర్తి, మా దర్శకుడు క్రాంతి సినిమాను చాలా కొత్తగా ఆవిష్కరించాడు. ఇక సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి ఫస్ట్ కాపీ సిద్దంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అత్యంత ఉత్కంఠ భరితంగా, క్యూరియాసిటీని పెంచేవిధంగా ఉంది. శ్రమ బ్యాంక్ సిబ్బంది తమ బ్యాంక్‌లోదాచుకున్న రూ.99 కోట్ల విలువ గల బంగారాన్ని దొంగిలించారు. దీంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారనేదే మిగతా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. -
కలిస్, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్ శంకర్‌కు చివాట్లు
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల అతను చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ట్విటర్ వేదికగా తనను ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్లైన కలిస్, వాట్సన్లతో పోల్చుకోవడంపై క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తూ చివాట్లు పెట్టారు. వివరాల్లోకి వెళితే, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ శంకర్ మాట్లాడుతూ.. తాను టీమిండియాకు కలిస్, షేన్ వాట్సన్ లాంటి ఆల్‌రౌండర్‌నని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. Kallis and Watson reaction after Vijay Shankar’s comment pic.twitter.com/fk8fmlvqGh — Simran Kaur (@kaursimran_ind) May 17, 2021 దిగ్గజ ఆల్రౌండర్లలానే తాను కూడా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడినని, ఎటువంటి సందర్భంలోనైనా బౌల్ చేయగల సత్తా తనలో ఉందని పేర్కొన్నాడు. తాను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేశానని, అదే తన రెగ్యులర్ స్లాట్ అయితే అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికలుంటాయని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో తాను వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన విషయాన్ని ఆయన ప్రస్థావించాడు. Vijay Shankar in IPL 2022 pic.twitter.com/R4OYMraRg8 — The Beautiful game (@Leg_Gully) May 17, 2021 Indian fans after Vijay Shankar's statement: pic.twitter.com/cF4hh4skS9 — Tanishq Ganu (@smart__leaks) May 17, 2021 అయితే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగడం వల్ల తాను 30, 40 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయానని, ఇటువంటి ప్రదర్శనతో జాతీయ జట్టులో స్థానం ఆశించడం కూడా సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, శంకర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుగా అర్ధం చేసుకుని ట్రోల్ చేశారు. శంకర్ చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ మెగా టోర్నీలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుని కాదని శంకర్ ఆవకాశం దక్కించుకున్నాడు. చదవండి: కోహ్లి సేనకు వ్యాక్సిన్ రెండో డోసు అక్కడే.. -
'ఇప్పట్లో కష్టమే.. అది నా చేతుల్లో లేదు'
ఢిల్లీ: జీవితంలో క్షణం ఆలస్యం చేసినా జాతకాలు మారిపోతుంటాయి. ఇది అందరికి వర్తిస్తుందో లేదో తెలియదు గానీ టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్ విషయంలో మాత్రం అది నిజమనిపిస్తుంది. 2019 ప్రపంచకప్‌కు త్రీ డైమన్షనల్ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌ను సెలెక్ట చేయడం అప్పట్లో టీమిండియా సెలెక్షన్ కమిటీపై విమర్శలు వచ్చేలా చేసింది. దానికి తోడు విజయ్ శంకర్ అప్పటి ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఇతనేనా మీ త్రీ డైమన్షనల్ ప్లేయర్.. త్రీడీ కళ్లద్దాలు పెట్టుకున్నా అతని ఇన్నింగ్స్ ఒక్కటి కనిపించలేదు అంటూ అభిమానులు ట్రోల్ చేశారు. ఈ ఒక్క దెబ్బతో విజయ్ శంకర్ ఇప్పటివరకు మళ్లీ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తాజాగా విజయ్ శంకర్‌ను ఇండియా టుడే ఇంటర్య్వూ చేసింది. మిమ్మల్ని మళ్లీ టీమిండియాలో చూస్తామా అని అడిగిన ప్రశ్నకు అతను ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు.''ఇప్పట్లో కష్టమే కావొచ్చు.. కానీ అది నా చేతుల్లో లేదు. నేను ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. అయితే టీమిండియాకు అరంగేట్రం చేసే సమయంలోను గాయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఒక సిరీస్‌లో మంచిగా ఆడుతున్న అన్న దశలో ఏదో ఒక గాయంతో జట్టుకు దూరమయ్యాను. టీమిండియాకు ఆడిన అన్ని సందర్భాల్లో మంచి ప్రదర్శనే నమోదు చేశా. విధి నాతో ఆడుకుంది.. కెరీర్ మొత్తంలో నాకు గాయాలే ఎక్కువగా కనిపించాయి. నేను మ్యాచ్‌లో బరిలోకి దిగిన ప్రతీసారి నా హార్డ్‌వర్క్‌ను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికీ నాకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. నా ప్రయత్నం నేను చేస్తా.. కానీ ఎంపిక అనేది నా చేతుల్లో లేదు'' అని చెప్పుకొచ్చాడు. నిజానికి 2016లోనే విజయ్ శంకర్ టీమిండియాలోకి అరంగేట్రం చేయాల్సింది. కానీ హార్దిక్ పాండ్యా రూపంలో అతనికి దురదృష్టం ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తలుపు తట్టేందుకు రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2018లో నిదహాస్ ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ ట్రోపీలో ఒక మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2019 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా హార్దిక్ పాండ్యా స్థానంలో అవకాశం లభించింది. అలా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. 2019 ప్రపంచకప్ సెలక్షన్ సందర్భంగా ఎంఎస్కే ప్రసాద్ విజయ్ శంకర్ గురించి చేసిన వ్యాఖ్యలు తర్వాత శంకర్‌ను ఇబ్బంది పెట్టేలా ఉంటుందని బహుశా ఊహించి ఉండడు. రైనా, కార్తీక్‌లతో పాటు మంచి ఫాంలో ఉన్న అంబటి రాయుడును కాదని విజయ్ శంకర్‌కే ఓటు వేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విజయ్ శంకర్ కరెక్టుగా సరితూగాడని.. అతను మల్టీ డైమన్షన్ ప్లేయర్ అంటూ ప్రసాద్ మీడియాకు తెలిపాడు. అయితే విజయ్ శంకర్‌ను ప్రపంచకప్‌కు ఎంపికచేయడం చాలా మంది భారత అభిమానులకు ఇష్టం లేదు. పైగా విజయ్ శంకర్ ఆ ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శంకర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. నానాటికీ అతని ఆటతీరు మరీ ఘోరంగా తయారవ్వడం కనిపించింది. ఇలాంటి చెత్త ప్రదర్శనతో అతను మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టడం కష్టమే. ఇక టీమిండియా తరపున విజయ్ శంకర్ 12 వన్డేల్లో 223 పరుగులు.. 4 వికెట్లు, 9 టీ20ల్లో 101 పరుగులు.. 5 వికెట్లు తీశాడు. చదవండి: పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు -
ఘనంగా భారత క్రికెటర్ విజయ్ శంకర్ వివాహం
చెన్నై: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గురువారం వివాహం చేసుకున్నాడు. గతేడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం చేసుకోగా తాజాగా గురువారం వైశాలి విశ్వేశ్వరను పెళ్లాడాడు. అయితే ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య చెన్నెలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విజయ్ శంకర్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు ఆటగాడు. దీంతో విజయ్ శంకర్‌కు సన్‌రైజర్స్ బృందం శుభాకాంక్షలు తెలిపింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను విజయ్ శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వివాహం చేసుకున్న విజయ్ శంకర్‌కు భారత జట్టు ఆటగాళ్లు రాహుల్, చాహల్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ శంకర్ 2018లో భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు. తొలిమ్యాచ్ శ్రీలంకతో జరిగిన టీ- 20లో ఆడాడు. 2019 వరల్డ్ కప్ భారత జట్టులో విజయ్ ఉన్నాడు. ఇప్పటివరకు విజయ్‌శంకర్ 12 వన్డేలు, 9 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. -
'ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి'
దుబాయ్ : క్రికెట్లో గాయాలనేవి సహజం. ప్రతి క్రికెటర్‌కు గాయాలతో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. గాయల తీవ్రతతో కొన్నిసార్లు ఆటకు దూరమైన సందర్భాలు ఉంటే.. మరికొన్ని మాత్రం క్రికెటర్ల ప్రాణం మీదకు తెస్తుంటాయి. ఒక్కోసారి మనం చేసే తప్పులే మనకు గాయాలను కలిగిస్తుంటాయి.2014 నవంబర్‌లో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బంతి హెల్మెట్ కింది మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్ రెండు రోజుల తర్వాత మరణించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ విషాదవార్త అప్పటి క్రికెట్లో ఒక చెడు జ్ఞాపకంగా నిలిచిపోయింది. (చదవండి : క్రికెట్‌కు వాట్సన్ గుడ్‌బై) తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే అక్టోబర్ 24వ తేదీన కింగ్స్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న విజయ్ శంకర్ పరుగు తీసే క్రమంలో కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ విసిరిన త్రో అతని మెడకు బలంగా తగిలింది. దీంతో విజయ్ శంకర్ తీవ్రమైన గాయంతో విలవిలలాడడం కనిపించింది. వెంటనే ఫిజియోథెరపీ వచ్చి చికిత్స అందించాడు. కానీ అదృష్టవశాత్తు ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. దీనిపై సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'సాధారణంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌కు వస్తే బ్యాటింగ్ ఆటగాడు హెల్మెట్ ధరించడం.. ఒక స్పిన్నర్ బౌలింగ్‌కు వస్తే హెల్మెట్‌ను తీసేయడం చేస్తున్నారు.కానీ ఈ పద్దతిని మార్చాలని.. బౌలర్ స్పిన్నరైనా.. ఫాస్ట్ బౌలరైనా బ్యాట్స్‌మన్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించే నిబంధనను తీసుకురావాలి. హెల్మెట్ అనేది ఆటగాళ్లకు రక్షణగా నిలుస్తుందని.. ఈ నిబంధనను తప్పనిసరి చేయకపోతే ఆటగాళ్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఇకపై స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ ఏదైనా సరే హెల్మెట్ తప్పనిసరి ధరించాలనే నిబంధనను తీసుకురావాలని ఐపీసీని విజ్ఞప్తి చేస్తున్నా 'అంటూ ట్విటర్లో తెలిపాడు. The game has become faster but is it getting safer? Recently we witnessed an incident which could’ve been nasty. Be it a spinner or pacer, wearing a HELMET should be MANDATORY for batsmen at professional levels. Request @icc to take this up on priority.https://t.co/7jErL3af0m — Sachin Tendulkar (@sachin_rt) November 3, 2020 -
విజయ్ శంకర్ ఆఫ్ స్పిన్నరా!
వంద మైళ్ల వేగంతో బంతి విసరకపోవచ్చు గానీ విజయ్ శంకర్ క్రికెట్ ప్రపంచంలో అందరికీ మీడియం పేసర్‌గానే తెలుసు. ఇదే అర్హతతో అతను ప్రపంచ కప్ కూడా ఆడాడు. కానీ ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ మాత్రం అతడిని మరోలా భావిస్తోంది. జట్ల వివరాలు ఉన్న పేజీలో విజయ్ శంకర్‌ను ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా చూపిస్తుండటం విశేషం. సన్‌రైజర్స్ తరఫున ఇప్పటికే మూడు సీజన్లు బరిలోకి దిగిన అతని వివరాలు మాత్రం ఇప్పటికీ తప్పుగా ఉండటం ఆశ్చర్యకరం. భారత్ తరపున విజయ్ శంకర్ 12 వన్డేలు, 9 టి20 మ్యాచ్‌లు ఆడాడు. -
టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం..
టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కాబోయే బార్య వైశాలి వీశ్వేశ్వరన్తో కలిసి దిగిన రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంగరం ఎమోజీని జత చేశారు. ఈ సందర్బంగా విజయ్‌కు అతని సహచరులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇటీవల మరో క్రికెటర్ యుజువేంద్ర చాహల్ సైతం ధనశ్రీ వర్మతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ('కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా') విజయ్ పోస్టుపై స్పందించిన కేఎల్ రాహుల్, చాహల్ ‘అభినందలు సోదరా’.అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా విజయ్ శంకర్ 2018లో కొలంబోలో జరిగిన శ్రీలంక- భారత్ టీ 20 మ్యాచ్‌తో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఏడాదికి మెల్బోర్నోలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి వన్డేలో అరంగేట్రం చేశాడు. శంకర్ భారత్ తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, తొమ్మిది టీ 20లు ఆడాడు. త్వరలో యూఏఈలో జరిగే ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. (రాహుల్ ఆ పదానికి అర్థం ఏంటి..) View this post on Instagram 💍 PC - @ne_pictures_wedding A post shared by Vijay Shankar (@vijay_41) on Aug 20, 2020 at 8:41am PDT -
'కోపం వచ్చింది.. ఏం చేయలేకపోయా'
ఢిల్లీ : ఇండియా, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ అంటే ఆ మజా ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలోనే కాదు బయట కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 2019 ప్రపంచకప్ సందర్భంగా జూన్ 16న మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు జరిగిన ఘటనను తాజాగా విజయ్‌శంకర్ భారత్ ఆర్మీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. ' పాక్‌తో మ్యాచ్‌కు ఒకరోజు ముందు జట్టు మేనేజ్మెంట్ నా దగ్గరకు వచ్చి రేపటి మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావు. సిద్ధంగా ఉండు అని చెప్పడంతో నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత అదే రోజు కొంతమంది ఆటగాళ్లం కాఫీ కోసమని బయటకు వెళ్లాం. అదే సమయానికి అక్కడికి వచ్చిన పాక్ అభిమాని మా వద్దకు వచ్చి ఏవో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా చేస్తుంటే చాలా కోపం వచ్చింది. అయితే చూస్తూ ఊరుకున్నాం తప్ప అతన్ని ఏం చేయలేకపోయాం. భారత్- పాక్‌కు మ్యాచ్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే నాకు మొదటిసారి తెలిసింది ' అని పేర్కొన్నాడు.(అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర) 2019 ప్రపంచకప్‌కు అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడుని కాదని త్రీ డైమన్షనల్ ప్లేయర్ అంటూ విజయ శంకర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కాగా శిఖర్ ధావన్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్.. ఆ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో భారత మేనేజ్మెంట్ సంతృప్తి చెందింది. కండరాల గాయంతో భువనేశ్వర్ ఒక పూర్తి చేయకుండా పెవిలియన్‌కు చేరినప్పుడు మిగతా రెండు బంతుల్ని విజయ్ శంకర్ వేశాడు. తాను వేసిన తొలి బంతికి ఇమాముల్ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్లో సర్ఫరాజ్ వికెట్‌ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో తుది జట్టుకు ఎంపికైన విజయ్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు, విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే అంతలోనే కాలి బొటనవేలి గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అప్పటినుంచి ఒకవన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. మొత్తంగా టీమిండియా తరపున 12 వన్డేల్లో 223 పరుగులు, 4 వికెట్లు తీశాడు. -
నాడు సరితా కోమటిరెడ్డి.. నేడు విజయ్ శంకర్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండో- అమెరికన్‌కు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన విజయ్ శంకర్‌ను దేశ రాజధాని వాషింగ్టన్‌లోని అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్ చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ నిర్ణయానికి సెనేట్ ఆమోదం లభించిన పక్షంలో విజయ్ శంకర్.. వాషింగ్టన్ డీసీలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అసోసియేట్ జడ్జిగా సేవలు అందించనున్నారు. కాగా డ్యూక్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన విజయ్ శంకర్.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జి చెస్టెర్ జే. స్ట్రాబ్ వద్ద లా క్లర్క్‌గా ఉన్నారు.(అమెరికాలో తెలుగు జడ్జిమెంట్) ఇక ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సెల్‌గా ఉన్న విజయ్ శంకర్.. అప్పీలెట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చేరడానికి ముందు వాషింగ్టన్లో ఆయన ప్రైవేటు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. అంతర్జాతీయ స్థాయి లా కంపెనీలైన మేయర్ బ్రౌన్, ఎల్ఎల్సీ కోవింగ్టన్ అండ్ బర్లింగ్, ఎల్ఎల్పీలో పనిచేశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి.. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. సరిత తలిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల. వైద్యులైన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడగా.. సరిత అక్కడే పుట్టి పెరిగారు. (న్యూయార్క్ జడ్జిగా సరితా కోమటిరెడ్డి..!) సరితా కోమటిరెడ్డి -
నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్
న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు సెలక్షన్ సమయంలో రాద్దాంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ ఆటగాడు అంబటి రాయుడ్ని కాదని విజయ్ శంకర్‌కు చోటు కల్పించడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ కోటాలో శంకర్‌కు చోటు కల్పించిన బీసీసీఐ సెలక్షన్ పెద్దలు.. దాన్ని అప్పట్లో సమర్ధించుకున్నారు కూడా. అప్పుడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్.. విజయ్ శంకర్‌ను 3డీ ప్లేయర్‌గా అభివర్ణించడం అగ్గిరాజేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను 3డీతో పోల్చాడు ఎంఎస్కే. దాంతో చిర్రెత్తుకొచ్చిన అంబటి రాయుడు.. భారత క్రికెట్ జట్టు ఆటను చూడటానికి 3డి కళ్లద్దాలకు ఆర్డర్ ఇచ్చానంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఇదే అంశంపై ఇప్పుడు మరోసారి ఎంఎస్కే నిర్ణయాన్ని తప్పుపట్టాడు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. ఒక చీఫ్ సెలక్టర్(సెలక్షన్ చైర్మన్) హోదాలో ఆ మాట అనడం సరైనది కాదని గంభీర్ పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘క్రికెట్ కనెక్టెడ్’ షోలో గౌతం గంభీర్, కృష్ణమాచారి శ్రీకాంత్‌లతో పాటు ఎంఎస్కే ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. ఈ షోలో ఎంఎస్కే ప్రశ్నించాడు గంభీర్.(ధోనిని ఏనాడు అడగలేదు: రైనా) ‘అంబటి రాయుడు విషయంలో ఏమి జరిగిందో చూశాం. ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు ముందు రెండేళ్ల పాటు అతనికి జట్టులో చోటు కల్పిస్తూ వచ్చారు. ఆ రెండేళ్లు నాలుగో స్థానంలో రాయుడు బ్యాటింగ్ చేశాడు. మరి వరల్డ్‌కప్‌కు ముందు 3డీ అవసరమైందా.. ఒక చైర్మన్ హోదాలో మీరు ఆ మాట మాట్లాడటం భావ్యమా’ అని నిలదీశాడు. దీనికి ఎంఎస్కే బదులిస్తూ. ‘ఇంగ్లిష్ వాతావరణంలో ఆల్‌రౌండర్ ఉండాలనే ఉద్దేశంతోనే శంకర్‌ను ఎంపిక చేశాం. మనకు సీమ్ బౌలింగ్ పరంగా ఇబ్బంది ఉందనే శంకర్‌ను చివరి నిమిషంలో తీసుకొచ్చాం. శంకర్ దేశవాళీ రికార్డులను పరిశీలించిన పిదప అతనికి అవకాశం ఇచ్చాం’ అని తెలిపాడు. కాగా, ఎంఎస్కే నిర్ణయాన్ని షోలో ఉన్న శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇక్కడ గంభీర్‌ను వెనకేసుకొచ్చి మిమ్మల్ని కించపరచడం లేదంటూనే అంతర్జాతీయ క్రికెట్‌కు దేశవాళీ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుందన్నాడు. బౌలింగ్ పరంగా శంకర్ ఓకే కావొచ్చు...కానీ బ్యాటింగ్‌లో టాపార్డర్‌లోనే దిగాలి కదా.. ఆ విషయాన్ని పట్టించుకోలేదా’ అని శ్రీకాంత్ ప్రశ్నించాడు. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి) -
త్రీడీ ట్వీట్‌పై స్పందించిన రాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో చోటు దక్కపోవడంతో చేసిన వివాదాస్పద 3డీ ట్వీట్‌పై క్రికెటర్ అంబటి రాయుడు తొలిసారి స్పందించాడు. ఈ ట్వీట్ చేసినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని ప్రకటించాడు. ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టలేదని స్పష్టం చేశాడు. తనకు ఆటే ముఖ్యమని, మిగతా వాటి గురించి పట్టించుకోనని అన్నాడు. ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వెల్లడించాడు. ప్రపంచకప్ కోసం చాలా శ్రమించానని, సెలక్టర్లు వేరే రకంగా ఆలోచించారని చెప్పుకొచ్చాడు. ఫామ్‌లో ఉన్నప్పటికీ తనను జట్టులోకి తీసుకోకపోవడం దురదృష్టంగా రాయుడు వర్ణించాడు. గత ప్రపంచకప్ సెలక్షన్స్‌లో భాగంగా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే మాట్లాడుతూ రాయుడు మెరుగైన ఆటగాడని, అయితే విజయ్ శంకర్‌ను మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాయుడు వ్యంగ్యంగా స్పందిస్తూ మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్) అన్నందుకు ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్వీట్ చేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో చోటు దక్కలేదన్న మనస్తాపంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. (చదవండి: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న రాయుడు) -
కలెక్టర్‌కు కటకటాలు
బెంగళూరు: వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి బోర్డుతిప్పేసిన బెంగళూరు ఐఎంఏ గ్రూప్ కుంభకోణంలో మరో సంచలనం నమోదైంది. రూ.1.5 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ బీఎం. విజయ్‌శంకర్‌ను అరెస్టు చేసిన సిట్ పోలీసులు మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం మళ్లీ ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనుకూల నివేదిక ఇవ్వడానికి ముడుపులు సిట్ అభియోగాల ప్రకారం... 2016 చివర్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఐఎంఏ కంపెనీ నిర్వహించిన కోట్లాది రూపాయల వ్యవహారాలపై భారతీయ రిజర్వు బ్యాంక్‌కు అనుమానం రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేపీఐడీ చట్టం ప్రకారం విచారణ చేపట్టాలని బెంగళూరు ఉత్తర ఉపవిభాగాధికారికి సూచించింది. కానీ ఆ విచారణను జిల్లా కలెక్టర్ విజయ్‌శంకర్, ఉపవిభాగాధికారి ఎల్సీ.నాగరాజుతో కలిసి చేపట్టారు. ఐఎంఏ కంపెనీ డైరెక్టర్ నిజాముద్దీన్ రెవిన్యూ భవన్లో కలెక్టర్ విజయ్‌శంకర్ ను కలిసి ఐఎంఏ కంపెనీకి అనుకూలంగా ఆర్బీఐకి నివేదిక పంపితే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టాడు. ఇందుకు కలెక్టర్ రూ.2 కోట్లు లంచానికి డిమాండ్ పెట్టారు. చివరికి ఇరువురి మధ్య రూ.1.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఆ డబ్బుతో భూముల కొనుగోలు నిజాముద్దీన్ ఒకటిన్నర కోటి నగదును విజయ్‌శంకర్ సూచనల మేరకు ఆర్వీ.రోడ్డులోని బిల్డర్ కృష్ణమూర్తికి చేర్చాడు. ఈ డబ్బు ఐఎంఏ కంపెనీకి చెందినదని బిల్డర్ కృష్ణమూర్తి కి తెలియదు. కొద్దిరోజుల అనంతరం ఆ బిల్డర్‌కు మరో రూ.1.5 కోట్ల ను విజయ్‌శంకర్ ముట్టజెప్పాడు. ఈ డబ్బుతో ఆ బిల్డర్ విజయ్‌శంకర్ భార్య పేరుతో జేపీ.నగర, నందికొండలో భూమిని కొనుగోలు చేశాడు. ఇక ఐఎంఏ అక్రమాలను దాచిపెట్టి, ఆ కంపెనీ అధినేత మన్సూర్ఖాన్కు అనుకూలంగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. ఈ కేసులో ఉపవిభాగాదికారి నాగరాజు కూడా ఐఎంఏ నుంచి రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల నాగరాజ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా విజయ్‌శంకర్ హస్తం ఉన్నట్లు వెలుగులోకి రావడంతో సోమవారం ఎస్ఐటీ అధికారులు ఆయనను విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏకంగా కలెక్టర్ అరెస్టులో అధికార వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. -
విజయ్ శంకర్ గాయం నిజమేనా?
న్యూఢిల్లీ : టీమిండియా ఆల్‌రౌండర్ విజయ శంకర్ గాయం నిజమేనా? లేక గాయం సాకుతో ఉద్దేశపూర్వకంగా తప్పించారా? ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ. ఎడమ కాలు బొటన వేలి గాయం కారణంగా విజయ్ శంకర్ అర్థాంతరంగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అతని స్థానంలో టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను భారత మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అయితే శంకర్ గాయంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. జూన్ 19న నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన యార్కర్‌తో విజయ్ కాలి బొటనవేలికి గాయమైంది. అయితే ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది అనిపించకపోవడంతో భారత్ ఆడిన తర్వాత రెండు మ్యాచ్‌లలో (అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో) అతను బరిలోకి దిగాడు. ఇప్పుడిదే అనుమానాలు రేకిత్తిస్తుంది. టీమ్‌మేనేజ్ మెంట్ మాత్రం గాయం తిరగబెట్టడంతోనే శంకర్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు దూరమయ్యాడని, సీటీ స్కాన్ అనంతరం శంకర్ బొటన వేలికి ఫ్రాక్చర్ అయినట్లుగా తేలిందని పేర్కొంది. గాయం నుంచి కోలుకునేందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుందని, దాంతో అతను వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నాడని ప్రకటించింది. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత ఆటగాళ్లకు శంకర్ డ్రింక్స్ అందించాడు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పరుగెత్తాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. ‘ఒకరోజు ముందు జట్టులో ఉన్నాడు. బ్యాటింగ్ బాగానే చేశాడు. దురదృష్టవశాత్తు ఓ మంచి బంతికి ఔటయ్యాడు. నిన్న(ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా) గాయంతోనే చక్కగా పరుగెత్తుతూ డ్రింక్స్ అందించాడు. నేడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వెంటనే మరొకరు భర్తీ అయ్యారు. దీంతో నేనొక్కడినే అయోమయానికి గురైనట్టున్నా?’ అని సెటైరిక్ ట్వీట్‌తో పెద్దబాంబు పేల్చాడు. మురళీ వాదనను ఏకీభవిస్తూ అభిమానులు కూడా బీసీసీఐని నిలదీస్తున్నారు. ‘గాయంతో అడుగు తీసి, అడుగు వేయలేని స్థితిలో ఉన్నాడనే కదా విజయ్ శంకర్‌ను తప్పించారు? మరి ఆ స్థితిలో ఉన్న ఆటగాడితో డ్రింక్స్‌ను ఎలా తెప్పించుకున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. Day before he needed TLC and batting well but a good delivery got him, yesterday he had a toe niggle not playing but running drinks and today he is Ruled out and already replaced 🤫🤫... Am I the only one confused here — Kartik Murali (@kartikmurali) July 1, 2019 Surely some politics on #VijayShankar exit from #CWC19 If he had toe injury, then why he used for taking drinks for the players against #England. Seems something not good in the Indian dressing room. — Dhamu (@rdhamodharan) July 1, 2019 చదవండి : విజయ్ శంకర్ ఆట ముగిసింది -
విజయ్ శంకర్ ఆట ముగిసింది
బర్మింగ్‌హామ్: ప్రపంచ కప్ కీలక దశలో మరో భారత ఆటగాడు టోర్నీకి దూరమయ్యాడు. ఎడమ కాలు బొటన వేలి గాయం కారణంగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శిఖర్ ధావన్ తర్వాత గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి తప్పుకున్న రెండో ఆటగాడు విజయ్ శంకర్. జూన్ 19న నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన యార్కర్‌తో విజయ్ కాలి బొటనవేలికి గాయమైంది. అయితే ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది అనిపించకపోవడంతో భారత్ ఆడిన తర్వాత రెండు మ్యాచ్‌లలో (అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో) అతను బరిలోకి దిగాడు. ఆ తర్వాత అదే గాయం తిరగబెట్టింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ‘సీటీ స్కాన్ అనంతరం విజయ్ శంకర్ బొటన వేలికి ఫ్రాక్చర్ అయినట్లుగా తేలింది. దీని నుంచి కోలుకునేందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుంది. దాంతో అతను వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నాడు’ అని బీసీసీఐ ప్రకటించింది. ఆది నుంచి విమర్శలే..: 2019 జనవరిలోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన విజయ్ శంకర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో అద్భుతంగా ఆడకపోయినా... సెలక్టర్లను ఆకట్టుకునేందుకు రెండు ఇన్నింగ్స్‌లు (45, 46) సరిపోయాయి. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా అంబటి రాయుడును కాదని 9 వన్డేల అనుభవం ఉన్న అతడిని సెలక్టర్లు ప్రపంచ కప్‌కు ఎంపిక చేశారు. పైగా ‘మంచి బ్యాట్స్‌మన్, చక్కటి బౌలర్ కావడంతో పాటు అద్భుతమైన ఫీల్డర్ కాబట్టి మూడు రకాలుగా ఉపయోగపడతాడు’ అని చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసాపూర్వక మాటలు కూడా చెప్పాడు. అయితే ఈ ప్రపంచ కప్‌లో అతని ప్రభావం అంతగా ఏమీ కనిపించలేదు. ఆడిన 3 మ్యాచ్‌లలో 15 నాటౌట్, 29, 14 పరుగులు చేసిన అతను ఒకే మ్యాచ్‌లో బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. పాక్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీయడం మాత్రం అందరికీ గుర్తుండిపోయే క్షణం. విండీస్‌తో మ్యాచ్ తర్వాత విజయ్ శంకర్ పనికి రాడని, అతడిని తప్పించాలని అభిమానులు, విశ్లేషకుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు గాయంతో అతను మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. -
డియర్ అంబటి రాయుడు.. సారీ మ్యాన్!
ప్రస్తుత వరల్డ్ కప్‌లో టీమిండియా పరిస్థితి ఒకింత గందరగోళంగా తయారైంది. ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతున్నారు. మరోవైపు సెలెక్టర్లు ఎన్నో ఆశలు పెట్టి.. ఎంపిక చేసిన ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇప్పటికే గాయం కారణంగా డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా విజయ్‌శంకర్ కూడా అదే దారిలో గాయాలతో ఇంటిబాట పట్టాడు. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కూడా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరోవైపు సెలక్టర్లు కొండంత నమ్మకముంచిన కేదార్ జాధవ్ తాజాగా ఇంగ్లండ్ మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టు ఆడటంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడి మీద పడింది. క్రికెట్ మెగా టోర్నీ వరల్డ్ కప్‌లో ఆడాలని ఈ వెటరన్ క్రికెటర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కొంతకాలంగా నిలకడగా ఆడుతూ వస్తూ.. సెలక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. అయితే, వరల్డ్ కప్ జట్టు ఎంపిక చేసే సమయంలో యువ ఆటగాడు విజయ్‌శంకర్ అనూహ్యంగా తెరపైకి రావడం.. అంబటి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్ కూడా చేయగల త్రీ డైమన్షన్ ఆటగాడు విజయ్‌శంకర్ అంటూ సెలెక్టర్లు అతన్ని ఆకాశానికెత్తారు. కానీ, తీరా వరల్డ్ కప్‌కు వచ్చేసరికి అతను ఆశించినమేర రాణించలేదు. సెలక్టర్లు చెప్పినట్టు ఏ డైమన్షన్‌లోనూ అతను ప్రతిభ చూపలేదు. అంతంతమాత్రం ఆటతీరుతో చివరకు గాయాలపాలై ఇంటిదారి పట్టాడు. (చదవండి: ‘త్రీడి కళ్లద్దాలు’ ఆర్డర్ ఇచ్చా: రాయుడు) ఐనా.. ఒకవైపు గాయాలతో ఆటగాళ్లు ఇంటిదారి పడుతున్నా.. టీమిండియా సెలక్టర్లు మాత్రం అంబటి రాయుడిపై దృష్టి సారించడం లేదు. అంబటి రాయుడు, రిషబ్ పంత్‌కు ప్రపంచకప్ ద్వారాలు మూసుకుపోలేదని, ఎవరైనా గాయాలపాలైతే.. వారిని జట్టులోకి తీసుకుంటామంటూ.. ఆ ఇద్దరిని స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ప్రకటించింది కూడా. అయినా, ఇప్పటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అంబటిని సెలక్టర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ధావన్ గాయంతో జట్టు నుంచి వైదొలగడంతో పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా విజయ్ శంకర్ నిష్క్రమణ నేపథ్యంలో అంబటికి అవకాశం ఉంటుందని భావిస్తే.. ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. (చదవండి: స్టాండ్‌బైగా పంత్, రాయుడు) మరీ, అంబటి రాయుడిని స్టాండ్ బైగా ప్రకటించి.. ఎవరైనా ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. అవకాశమిస్తామని చెప్పడమెందుకని అంబటి అభిమానులు ఇటు బీసీసీఐని, అంటు సెలక్టర్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్‌శంకర్‌ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. వరల్డ్ కప్ చూసేందుకు త్రీడీ గ్లాసులు ఆర్డర్ ఇచ్చానని రాయుడు వ్యంగ్యంగా ట్విటర్లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించి.. సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొంది. అయినా, రాయుడి వ్యాఖ్యలు సెలక్టర్లను తీవ్రంగానే హార్ట్ చేసి ఉంటాయోమో... అందుకే అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశం వచ్చినా సెలక్టర్లు మొగ్గు చూపడం లేదని వినిపిస్తోంది. టీమిండియాకు ఇప్పుడు బ్యాటింగ్ స్పెషలిస్ట్ అవసరముంది. బ్యాటింగ్‌లో అపార అనుభవమున్న రాయుడిని కాదని.. పెద్దగా అనుభవం లేని జూనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం కల్పించడం పరిశీలకులను విస్తుగొల్పుతుంది. (చదవండి: విజయ్ శంకరానందం) ధావన్, విజయ్‌శంకర్ జట్టు నుంచి వైదొలిగినా.. అంబటికి అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అంబటికి అండగా నిలుస్తున్నారు. తాజాగా నటుడు సిద్ధార్థ అంబటికి మద్దతుగా ట్వీట్ చేశారు. ‘డియర్ అంబటి రాయుడు.. నువ్వు దీని కన్నా ఎన్నోరెట్లు అర్హుడివి. సారీ మ్యాన్. ఈ చెత్తను పట్టించుకోకు. దృఢంగా ఉండు. నీ ప్రతిభకు, నీ పట్టుదలకు నీ నిలకడైన ఆటతీరుకు దీనికి ఏమాత్రం సంబంధం లేదు’ అంటూ అతన్ని జట్టులోకి తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. Dear @RayuduAmbati, you deserve much much better. Sorry man! This is bullshit. Stay strong! This says nothing about your talent, commitment or consistency. https://t.co/tMDVGmnKrE — Siddharth (@Actor_Siddharth) July 1, 2019 -
వన్డే వరల్డ్‌కప్ నుంచి విజయ్ శంకర్ ఔట్
-
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
బర్మింగ్‌హామ్: ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించగా, తాజాగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కథ కూడా ముగిసింది. గత కొన్ని రోజులుగా మడమ గాయంతో బాధపడుతున్న విజయ్ శంకర్ వరల్డ్‌కప్ నుంచి వైదొలగక తప్పలేదు. ఈ టోర్నీలో విజయ్ శంకర్ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పాకిస్తాన్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లలో ఆడాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శంకర్.. విండీస్, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లలో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే భారత్ ఎంతో కాలంగా అన్వేషిస్తున్న నాల్గో స్థానం అవకాశాన్ని విజయ్ శంకర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా సుమారు 140 కిలోమీటర్ల వేగంతో వేసిన ఓ యార్కర్.. నేరుగా అతని పాదాలను తాకింది. దాని దెబ్బకు అక్కడికక్కడే కూలబడిపోయాడు విజయ్ శంకర్. కుంటుకుంటూ నెట్స్ నుంచి తన గదికి వెళ్లిపోయాడు. ఆ తరువాత విజయ్ శంకర్ ఈ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. అది తాత్కాలికమే. మడమల్లో గాయం, వాపుతో బాధపడుతూనే అతను అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ ఆడకపోవడానికి అతని గాయం తిరగబెట్టడమే ప్రధాన కారణం. నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఆడాలనేది ఏ క్రికెటర్ అయినా కోరుకుంటాడు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తారు. సెలెక్టర్ల కంట్లో పడటానికి చెమటోడ్చుతారు. అలాంటి అద్భుత అవకాశాన్ని అనుకోకుండా, అనూహ్యం దక్కించుకున్నాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్. ఆల్ రౌండర్ అనే ఒకే ఒక్క కారణంతో విజయ్ శంకర్ కంటే సీనియర్లయిన, అతని కంటే బాగా రాణించిన వారిని కూడా పక్కన పెట్టారు సెలెక్టర్లు. ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో విజయ్ శంకర్‌కు అవకాశం కల్పించారు. కాగా, టోర్నీ నుంచి ఇలా అర్థాంతరంగా వైదొలగడంతో భారత్‌కు ఎదురుదెబ్బగానే చెప్పాలి. అతని స్థానంలో కర్ణాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను స్టాండ్ బై తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అందుకు ఐసీసీ అనుమతి ఇస్తే మయాంక్ అగర్వాల్ భారత్ వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడిగా మారతాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ నిష్క్రమించిన తర్వాత అతని స్థానంలో స్టాండ్ బైగా రిషభ్ పంత్‌ను తీసుకున్నారు. కాగా, ఇప్పుడు విజయ్ శంకర్ గాయంతో వరల్డ్‌కప్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో అంబటి రాయుడికి ఛాన్స్ వస్తుందని అంతా ఊహించారు. కానీ, అంబటి రాయుడు జట్టు మేనేజ్మెంట్ నుంచి పిలుపు అందకపోగా, భారత వరల్డ్ కప్ స్టాండ్ బై ఆటగాడిగా లేని మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవడానికి మొగ్గుచూపడం చర్చనీయాంశంగా మారింది. గత డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా మయాంక్ అగర్వాల్ టెస్టు ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మయాంక్ అగర్వాల్.. రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 195 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 77. కాగా, వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేయాల్సి ఉంది. ఇక లిస్ట్ -ఎ క్రికెట్లో 75 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ 48.71 సగటుతో 3,605 పరుగులు చేశాడు. 2019 ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన మాయంక్ అగర్వాల్ 141.88 స్టైక్ రేట్‌తో 332 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. -
విజయ్ శంకర్‌కే ఓటేసిన కోహ్లి!
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు అండగా నిలిచాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇప్పటివరకూ విజయ్ శంకర్ ఆడిన మ్యాచ్‌ల్లో విఫలమైన నేపథ్యంలో అతని స్థానంలో రిషభ్ పంత్‌ను వేసుకోవాలంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కోహ్లి.. విజయ్ శంకర్ నుంచి భారీ ఇన్నింగ్స్ చూసే అవకాశం దగ్గర్లోనే ఉందన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్ శంకర్ బౌలింగ్‌లో మెరిసినా అతనిపై విమర్శలు రావడం కొత్తగా అనిపిస్తుందన్నాడు. ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్ క్రీజ్‌లో పెద్దగా తడబడలేదని, కాకపోతే షాట్ సెలక్షన్లో లోపం వల్లే విఫలమయ్యాడని కోహ్లి వెనుకేసుకొచ్చాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ ఒక అద్భుతమైన బంతికి వెనుదిరిగాడన్నాడు. దాంతో అతని బ్యాటింగ్‌లో జట్టు మేనేజ్మెంట్కు ఎటువంటి లోపాలు కనిపించలేదన్నాడు. ఏవో చిన్న కారణాలతో అతన్ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదన్నాడు. కచ్చితంగా విజయ్ శంకర్ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ చూస్తామనడంలో సందేహం లేదన్నాడు. వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో తుది జట్టును మార్చడం అంత మంచి పద్ధతి కాదన్నాడు. అకాగా, ఆదివారం ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమవుతున్న క్రమంలో విజయ్ శంకర్ తుది జట్టులో ఉంటాడని కోహ్లి సంకేతాలిచ్చాడు. దే సమయంలో వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడటం కోసం ఎదురుచూస్తున్న రిషబ్ పంత్ నిరీక్షించక తప్పదనే విషయం కోహ్లి చెప్పకనే చెప్పేశాడు. -
విజయ్ శంకర్.. రాయుడు చూస్తున్నాడు!
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌కు భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో విజయ్ శంకర్‌ను త్రీడైమన్షన్స్(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆటగాడిగా పోల్చుతూ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అంబటి రాయుడికి అవకాశం ఇవ్వకుండా విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై ఇలా సరిపెట్టుకున్నాడు ఎంఎస్కే ప్రసాద్. దానికి అసహనం వ్యక్తం చేసిన రాయుడు.. వరల్డ్‌కప్‌ను చూడటానికి త్రీడి అద్దాలను ఆర్డర్ ఇచ్చా’ అంటూ సెటైర్ కూడా వేశాడు. అయితే మెగా టోర్నీలో అసలైన ఆటలోకి వచ్చేసరికి విజయ్ శంకర్ తేలిపోయాడనే చెప్పాలి. శిఖర్ ధావన్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్.. ఆ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో భారత మేనేజ్మెంట్ సంతృప్తి చెందింది. కండరాల గాయంతో భువనేశ్వర్ ఒక పూర్తి చేయకుండా పెవిలియన్‌కు చేరినప్పుడు మిగతా రెండు బంతుల్ని విజయ్ శంకర్ వేశాడు. తాను వేసిన తొలి బంతికి ఇమాముల్ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్లో సర్ఫరాజ్ వికెట్‌ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో విజయ్ శంకర్ తుది జట్టులో ఎంపికకు మరో ఆలోచన లేకుండా పోయింది. కాగా, అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు చేసి ఔటైన విజయ్ శంకర్.. విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అది కూడా భారత్ జట్టుకు సవాల్‌గా మారిన నాల్గో స్థానంలో బ్యాటింగ్ దిగి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో విజయ్ శంకర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అసలు నాల్గో స్థానంలో విజయ్ శంకర్‌ను దింపడం ఏమిటని క్రికెట్ వ్యాఖ్యతలతో పాటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘ విండీస్‌తో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ బ్యాటింగ్‌లో ఇంకా లోపాలు కనబడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ శంకర్ నిరాశపరుస్తున్నాడు. ఇలానే ఆడితే విజయ్ శంకర్‌కు అవకాశాలు రావడం కష్టం. నా వరకూ అయితే విజయ్ శంకర్‌కు మరో అవకాశం ఇచ్చి చూస్తారు’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక అభిమానులైతే విజయ్ శంకర్‌ను ఏకిపారేస్తున్నారు. ‘ విజయ్ శంకర్‌ను వెంటనే స్వదేశానికి పంపించండి. భారత ఎలెవన్‌లో అతను అనవసరం’ అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ అతని బ్యాటింగ్ బుమ్రాలాగా ఉండగా, బౌలింగ్‌లో కోహ్లిని గుర్తుకు తెస్తున్నాడు’ అంటూ మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. ‘ విజయ్ శంకర్ త్రీ డైమన్షనల్ ఆటను రాయుడు చూస్తున్నాడు’ అంటూ మరొకరు ట్వీట్లో సెటైర్ వేశారు. ‘ రిషభ్ పంత్‌కు అవకాశం ఇవ్వకుండా విజయ్ను కొనసాగించడం ఏమిటి. ఇది స్థానిక మ్యాచ్ కాదు. ఐసీసీ 2019 వరల్డ్‌కప్’ అని మరొక అభిమాని విమర్శించాడు. ఇలా విజయ్ శంకర్ ఆట తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. -
పంత్, శంకర్ కాదు.. మరెవరు?
మాంచెస్టర్: టీమిండియాలో నాలుగు స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది. ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన కష్టపడి నెగ్గడంతో నాలుగో స్థానంపై చర్చ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రిషబ్ పంత్ లేదా విజయ్ శంకర్ సరిపోతారా అని మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్‌ను అడిగితే ఊహించని విధంగా ఆయన మరోపేరు చెప్పారు. కేదార్ జాదవ్ కరెక్టుగా సరిపోతాడని సమాధానమిచ్చారు. ‘జాదవ్ బాగా ఆడగలడు. స్టైక్ రొటేట్ చేస్తూ పరుగులు పిండుకోవడంలో సిద్ధహస్తుడు. తనదైన షాట్లతోనూ అలరిస్తాడు. నా అభిప్రాయం ప్రకారం అతడిని నాలుగో స్థానంలో ఆడించాల’ని గైక్వాడ్ పేర్కొన్నారు. రెండో ఆప్షన్‌గా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వైపు మొగ్గు చూపారు. ‘దినేశ్ కార్తీక్ అనుభవజ్ఞుడు. ఫినిషనర్గా నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లో కుదురుకుని ఆడగల సామర్థ్యం అతడికి ఉంద’ని తెలిపారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ బాగున్నా నాలుగో స్థానంలో ఎలా ఆడతాడో తాను చెప్పలేనని అన్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల షాట్ సెలెక్షన్‌ను గైక్వాడ్ తప్పుబట్టారు. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ అవుటైన తీరును విమర్శించారు. (చదవండి: భారత్ అజేయభేరి) -
‘పంత్ కంటే శంకరే బెటర్’
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో శనివారం అఫ్గానిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తుది జట్టునే అఫ్గానిస్తాన్‌తో కొనసాగించాలంటూ పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు మార్పులు చేయకుండా విరాట్ గ్యాంగ్ పోరుకు సిద్ధమవుతుందనే తాను ఆశిస్తున్నానని భజ్జీ తెలిపాడు. ‘నేను గత మ్యాచ్‌లో చూసిన కాంబినేషన్‌కే కట్టుబడి ఉన్నా. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ స్థానంలో మహ్మద్ షమీ రావడం ఖాయం. అంతకుమించి మార్పులు ఏమీ ఉండవనేది నా అభిప్రాయం. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకుని కాంబినేషన్లో ఏమైనా మార్పులు చేయడం అంత మంచిది కాదు. అఫ్గాన్‌తో పోరుకు ధావన్ స్థానంలో ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలనే దానిపై ఇప్పటికే టీమిండియా యాజమాన్యానికి ఒక స్పష్టత వచ్చే ఉంటుంది. ఇక్కడ మీ మొదటి చాయిస్ శంకర్‌కే ఉంటుందని అనుకుంటున్నా. పాక్‌తో పోరులో శంకర్ తన స్థానానికి న్యాయం చేశాడు. అందుచేత విజయ్ శంకర్‌నే తుది జట్టులో ఎంపిక చేయడం ఉత్తమం. అనవసరంగా మార్పులు చేయకండి’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. అదే సమయంలో వరల్డ్‌కప్‌లో భారత జట్టు నాలుగు వందల పరుగుల మార్కును చేరుతుందని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు. మనకున్న బలాన్ని చూస్తే 400 పరుగులు సాధించడం కష్టం కాదన్నాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల వంటి హిట్టర్లతో నిండి ఉన్న భారత జట్టు ఆ ఫీట్‌ను కచ్చితంగా చేరుతుందన్నాడు. ఇక వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కొట్టిన అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డును(17 సిక్సర్లు) కూడా బ్రేక్ చేసే సత్తా భారత ఆటగాళ్లకు ఉందన్నాడు. -
శంకరా... ఏంటి సంగతి?
సౌతాంప్టన్: ఇప్పటికే బొటన వేలి గాయంతో ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిగా దూరమై, ఫిట్నెస్ సమస్యలతో పేసర్ భువనేశ్వర్ ఇబ్బంది పడుతున్న వేళ... టీమిండియాను కొంత కలవరపరిచే సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఎడమ కాలి పాదానికి బంతి బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. అనంతరం పరిస్థితిని పర్యవేక్షించిన జట్టు మేనేజ్మెంట్ సాయంత్రానికి శంకర్ కోలుకున్నాడని, ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. మరోవైపు గురువారం ప్రాక్టీస్‌లో దినేశ్ కార్తీక్ చాలాసేపు బ్యాటింగ్ సాధన చేశాడు. ఈ తీరు చూస్తుంటే శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు తుది జట్టులో ఉండే అవకాశం కనిపిస్తోంది. శంకర్ మాత్రం బ్యాట్ పట్టలేదు. కాసేపు జాగింగ్ చేశాడు. ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను గమనిస్తూ ఉండిపోయాడు. గాయం ప్రభావం లేనట్లు సాధారణంగానే నడిచాడు. చివర్లో కొద్దిసేపు బౌలింగ్‌కు దిగినా షార్ట్ రనప్‌తో సరిపెట్టాడు. ప్రస్తుత సమీకరణాల్లో జట్టు కూర్పులో కీలకంగా మారిన శంకర్‌కు టోర్నీ ప్రారంభానికి ముందు సైతం నెట్స్‌లో బంతి మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడిని న్యూజిలాండ్‌పై సన్నాహక మ్యాచ్ ఆడించలేదు. ధావన్ దూరమై, రాహుల్ ఓపెనింగ్‌కు వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చోటుదక్కిన శంకర్ రెండు కీలక వికెట్లు తీశాడు. శుక్రవారం టీమిండియా ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోనుంది. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. భువీ పరిస్థితేమిటో! ప్రపంచకప్‌లో జట్టు రెండో ప్రధాన పేసర్‌గా నమ్మకం ఉంచిన భువనేశ్వర్ మరో 8 రోజుల తర్వాతే మైదానంలో దిగే పరిస్థితి కనిపిస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో పాక్‌తో మ్యాచ్ నుంచి మధ్యలో తప్పుకొన్న భువీ ఇంగ్లండ్‌తో మ్యాచ్ (జూన్ 30) సమయానికి కానీ కోలుకోడని తెలుస్తోంది. ఇప్పటికైతే అతడు ఫిట్నెస్ సాధిస్తాడనే బీసీసీఐ భావిస్తోంది. భువీ... బుధవారం జాగింగ్‌కే పరిమతమయ్యాడు. నెట్స్‌లో బౌలింగ్ చేయలేదు. బ్యాట్స్‌మెన్‌ను గాయపర్చాలని బౌలర్లెవరూ కోరుకోరు. మా ప్రాక్టీస్ మేం చేసుకోవాలి కదా?. నావరకైతే బ్యాట్స్‌మెన్‌కు బంతులేయడమే మంచి సాధన. ఆ దిశగానే ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇదంతా ఆటలో ఒక భాగమే. నేనేం విజయ్ను లక్ష్యంగా చేసుకోలేదు (నవ్వుతూ). అతడు క్షేమంగానే ఉన్నాడు. ధావన్ జట్టుకు ముఖ్యమైన ఆటగాడు. తను దూరమవడం దురదృష్టకరం. దీనిని మర్చిపోయి ముందుకెళ్లాలి. –జస్ప్రీత్ బుమ్రా, భారత పేసర్ -
ఎవరూ కావాలని చేయరు: బుమ్రా
సౌతాంప్టన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అన్ని జట్లను గాయాల బెడద వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లు గాయాల కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక వరుస విజయాలతో దూసుకపోత్ను టీమిండియాకు కూడా ఆటగాళ్ల గాయాలు తలనొప్పిగా మారింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచకప్ మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పేసర్ భువనేశ్వర్ తొడ కండరాలు పట్టేయడంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయపడటం టీమిండియాను, అభిమానులను తెగ కలవరానికి గురిచేస్తోంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్ కోసం గురువారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అయితే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా జస్ప్రీత్ బుమ్రా విసిరిన యార్కర్‌ను అడ్డుకోబోయిన శంకర్ విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతడి పాదాన్ని బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే ఫిజియే ప్రథమ చికిత్స అందించాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. అయితే శంకర్ గాయంపై స్పందించిన బుమ్రా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ‘మేము బ్యాట్స్‌మన్‌కు గాయం కావాలని కోరుకోము. కానీ కొన్ని సందర్బాల్లో అలా జరుగుతాయి. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌కు చేయాలని మాత్రమే ఆలోచిస్తాం. కానీ అతడికి గాయం కావాలని అనుకోం. ఎవరూ కూడా ఆ బంతికి గాయం అవుతుందని ముందే అంచనా వేయలేరు. శంకర్‌కు అనుకోకుండా నా బౌలింగ్‌లో గాయం అయింది. కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు’అంటూ బుమ్రా వివరించాడు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్ అప్గానిస్తాన్‌తో శనివారం తలపడనుంది. చదవండి: ధావన్ వీడియోపై స్పందించిన మోదీ ఆరెంజ్ జెర్సీలో కోహ్లి సేన! -
ప్రాక్టీస్‌లో విజయ్ శంకర్‌కు గాయం
సౌతాంప్టన్: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న టీమిండియాను గాయాల బెడద మాత్రం వేధిస్తోంది. ఇప్పటికే భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయంతో టోర్నీ నుంచి వైదొలగగా, భువనేశ్వర్ కుమార్ కండరాల గాయంతో బాధడపడుతున్నాడు. కాగా, టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా మళ్లీ గాయం బారిన పడ్డాడు. శనివారం అఫ్గానిస్తాన్‌తో సౌతాంప్టన్‌లో మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ప్రాక్టీస్ చేస్తుండగా విజయ్ శంకర్‌కు గాయమైంది. ప్రాక్టీస్ సెషన్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌కు విజయ్ శంకర్ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో విజయ్ శంకర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు విజయ్ శంకర్ అందుబాటులో ఉంటాడా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మెగాటోర్నీలో ఇంకా లీగ్ దశ పూర్తి కాకుండానే భారత క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడటం జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. దాంతో ఆటగాళ్లకు ఎటువంటి పెద్ద గాయాలు కాకుండా చూసుకోవడంపైనే దృష్టి సారించింది.(ఇక్కడ చదవండి: ధావన్ ఔట్) వరల్డ్‌కప్ నుంచి ధావన్ నిష్క్రమించిన తర్వాత రిషభ్ పంత్ జట్టుతో కలిసిన సంగతి తెలిసిందే. అయితే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో పంత్ తుది జట్టులో ఉండే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ తుది జట్టులోకి వచ్చి బౌలింగ్‌లో మెరిశాడు. దాంతో అతన్ని అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కొనసాగించాలనే భావనలో టీమిండియా ఉంది. కాగా, విజయ్ శంకర్ కూడా గాయం బారిన పడటంతో అతను జట్టులో ఉండటంపై డైలమా ఏర్పడింది. ఒకవేళ మ్యాచ్‌నాటికి విజయ్ శంకర్ సిద్ధమైతే అతను జట్టులో ఉండటం దాదాపు ఖాయం. కానిపక్షంలో బౌలింగ్ విభాగం కాస్త బలహీన పడతుంది. -
ప్రపంచకప్ : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
-
ప్రపంచకప్: విజయ్ శంకర్ తొలి మ్యాచ్‌లోనే..
-
ఆరంభం అదిరిందయ్యా.. శంకర్
మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో ఆరంభపు మ్యాచ్‌లోనే టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ దక్కించుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బోల్తా కొట్టించాడు. పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్లో నాలుగు బంతులు వేసిన అనంతరం పలు కారణాలతో భువనేశ్వర్ మైదానం వీడాడు. దీంతో చివరి రెండు బంతులు వేయడానికి విజయ్ శంకర్ బంతిని అందుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ దక్కడంతో శంకర్‌తో సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో పాక్‌తో మ్యాచ్‌కు విజయ్ శంకర్‌కు టీమ్ మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ప్రపంచకప్‌కు పలువురు సీనియర్లను కాదని సెలక్టర్లు అతడిని ఎంపిక చేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోని శంకర్, బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. అయితే తొలి బంతికే వికెట్ దక్కించుకోవడంపై విజయ్ శంకర్‌పై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘ఆరంభం అదిరిందయ్యా శంకర్’అంటూ కామెంట్ చేస్తున్నారు. -
కోహ్లికి ఘనస్వాగతం పలికిన అభిమానులు
-
కోహ్లికి ఘనస్వాగతం పలికిన అభిమానులు
మాంచెస్టర్: ఓల్డ్ ట్రఫోర్డ్ మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం డ్రెస్సింగ్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న విరాట్ కోహ్లీకి ఘనస్వాగతం లభించింది. వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. పాక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. నిజాయితిగా చెబుతున్న టాస్ గెలిచినా బౌలింగ్‌నే ఎన్నుకునే వాళ్లమని కోహ్లీ చెప్పాడు.అన్ని విభాగాలలో జట్టు పటిష్ఠంగా ఉందని, 8లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటేనే మ్యాచ్ కల్గించే ఉత్కంఠను అర్థం చేసుకోవచ్చన్నాడు. ఫీల్డ్‌లోకి వెళ్లాక మ్యాచ్ గురించే ఆలోచిస్తామని ఒత్తిడి తట్టుకున్న జట్టే విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు. గాయం కారణంగా శిఖర్ ధావన్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడని ఆల్‌రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
‘అది నో బాల్ కాకుంటే.. నా కథ ముగిసేది’
లండన్: తన కెరీర్‌ను మలుపు తిప్పిందే ఒకే ఒక్క బంతి అని టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ స్పష్టం చేశాడు. ఒక నో బాల్ కారణంగా తన కెరీర్ ఇంత వరకూ వచ్చిందని, అది లేకపోతే తన క్రికెట్ కథ ఎప్పుడో ముగిసి పోయేదని పేర్కొన్నాడు. ఇటీవల గౌరవ్ కపూర్ నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో భాగంగా తన గత అనుభవాల్ని విజయ్ శంకర్ పంచుకున్నాడు. ప్రధానంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన సంఘటనకు సంబంధించి అడిగిన ప్రశ్నకు విజయ్ శంకర్ సమాధానమిస్తూ.. ఒక దేశవాళీ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన అద్భుతమైన బంతికి తాను బౌల్డ్ అయ్యానని, అది నో బాల్ కావడంతో 95 పరుగులు చేసి జట్టును గెలిపించానన్నాడు. అదే తాను భారత ‘ఎ’ జట్టుకు ఎంపిక కావడంతో పాటు ఇక్కడ వరకూ రావడానికి కారణమని ఒకనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. ‘మొదటి సంఘటన నేను రంజీ ట్రోఫీ ఆడుతుంటే జరిగింది. నేను మా కెప్టెన్ లక్ష్య ఛేదనలో ఉన్నాం. మేమిద్దరం బాగా ఆడుతున్న సమయంలో మా కెప్టెన్ రనౌటయ్యాడు. తను ఔటయ్యాక మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత నేను చాలా ఆత్మన్యూనతకు లోనయ్యా. మా కెప్టెన్, కోచ్‌తో ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ బయటివారు మాటలు బాధించాయి. తమిళనాడు తరఫున ఇదే అతడి చివరి మ్యాచ్. దీని తర్వాత ఇంకెప్పుడూ ఇక్కడ ఆడలేడు’ అని విమర్శించారు. దాంతో నేను చాలా కృంగిపోయా. ఎలాగైనా రాణించాలనే లక్ష్యంతో శ్రమించా. ఈ క్రమంలోనే ముంబైతో చెన్నై మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో శార్దూల్ వేసిన ఒక బంతికి నేను బౌల్డ్ అయ్యా. అయితే అది నో బాల్. ఆ తర్వాత నేను 95 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించా. ఆపై నేను భారత‘ఎ’ జట్టుకు ఎంపిక కావడంతో పాటు జాతీయ జట్టులో చోటు సంపాదించాను. అది నో బాల్ కాకుంటే నా కథ అప్పుడే ముగిసి పోయేది’ అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత వరల్డ్‌కప్ జట్టులో విజయ్ శంకర్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. -
అంబటి రాయుడు ట్వీట్‌పై విజయ్ శంకర్ స్పందన
లండన్: ప్రపంచకప్ జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంతో కొద్దిరోజుల క్రితం అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెలలో 15 మందితో కూడిన భారత్ జట్టుని సెలక్టర్లు ఎంపిక చేసిన సమయంలో రాయుడ్ని ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కాగా, అతని స్థానంలో విజయ్ శంకర్‌కి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. రాయుడితో పోలిస్తే..? విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు కోణాల్లో (త్రీ డైమన్షన్స్) టీమ్‌కి ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అప్పడే వివరణ ఇచ్చారు. ప్రపంచకప్ జట్టు ప్రకటన మరుసటి రోజు చీఫ్ సెలక్టర్ వివరణపై అంబటి రాయుడు చురకలేస్తూ ఓ ట్వీట్ వదిలాడు ‘వరల్డ్ కప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చాను’ అని సెటైర్ వేశాడు. దీంతో విజయ్ శంకర్‌కి పరోక్షంగా రాయుడు కౌంటరిచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. దీనిపై రాయుడు, శంకర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ తాజాగా ఎట్టకేలకి విజయ్ శంకర్ ఆ ట్వీట్‌పై పెదవి విప్పాడు. గౌరవ్ కపూర్ నిర్వహించిన ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో విజయ్ శంకర్ దానిపై స్పందించాడు. అప్పట్లో అంబటి రాయుడు చేసిన ‘త్రీడీ’ ట్వీట్ తనపై కాదన్నాడు. అదే సమయంలో రాయుడికి మద్దతుగా నిలిచాడు విజయ్ శంకర్. ‘జట్టులోకి ఎంపికవకపోతే సదరు క్రికెటర్ ఎంత బాధపడతాడో నాకు తెలుసు. అంబటి రాయుడు పరిస్థితిని ఓ క్రికెటర్‌గా నేను అర్థం చేసుకోగలను. అది బాధలో రాయుడు చేసిన ట్వీట్ మాత్రమే. ఆ త్రీడీ ట్వీట్ నా గురించి కాదు’ అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. -
విజయ్ శంకర్‌కు గాయం!
లండన్: ప్రపంచ కప్ సమరాంగణంలో తొలి సన్నాహకానికి భారత్ సిద్ధమైంది. ఓవల్ మైదానంలో నేడు జరిగే తమ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లి సేన తలపడుతుంది. కొన్నాళ్ల క్రితం న్యూజిలాండ్ గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఈ రెండు టీమ్‌లు ఆడాయి. మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకున్నా... తాజా వరల్డ్ కప్ ఫార్మాట్లో అన్ని టీమ్‌లతో ఆడే అవకాశం ఉండటంతో ఇరు జట్లకు కూడా ప్రత్యర్థి బలాబలాలపై అవగాహనకు ఈ మ్యాచ్ ఉపకరిస్తుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ను 15 మంది ఆటగాళ్లు (మ్యాచ్‌లో 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేయవచ్చు) కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకే ఎవరికీ విశ్రాంతినివ్వకుండా బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరినీ పరీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగో స్థానంలో తీవ్ర చర్చ సాగిన నేపథ్యంలో దానిపై కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టనుంది. కేదార్ ప్రాక్టీస్ ... ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రోజు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కుడి చేతికి గాయమైంది. పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని పుల్ చేసే క్రమంలో శంకర్ దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అనంతరం గాయాన్ని నిర్ధారించిన టీమ్ మేనేజ్మెంట్ అతడికి స్కానింగ్ చేయించాల్సి ఉందని ప్రకటించింది. మరో వైపు గాయంనుంచి కోలుకుంటున్న కేదార్ జాదవ్ కూడా రెండు రోజుల పాటు స్వల్పంగా ప్రాక్టీస్ చేశాడు. -
ప్రపంచకప్ 2019: విజయ్ శంకర్‌కు గాయం?
లండన్: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు టీమిండియాకు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో కేదార్ జాదవ్ గాయం కలవరానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ శంకర్ శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడినట్టు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుడి చేతికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడని, కివీస్‌తో జరగబోయే వార్మప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని కథనంలో పేర్కొంది. అయితే విజయ్ శంకర్ గాయంపై ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. ప్రపంచకప్‌కు ప్రకటించిన టీమిండియా జాబితాలో శంకర్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటూ సెలక్టర్లు అంబటి రాయుడుని కాదని శంకర్‌కు అవకాశం కల్పించారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం జూన్ 5న దక్షిణాప్రికాతో ప్రపంచకప్ తొలి పోరును టీమిండియా ప్రారంభించనుంది. -
పాండ్యాతో నాకు పోటీ ఏంటి?
చెన్నై: టీమిండియా ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌పై అందరి దృష్టి పడింది. అంబటి రాయుడుని కాదని శంకర్‌ను జట్టులోకి తీసుకోవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే నాలుగో స్థానంలో రాయుడు బ్యాటింగ్‌కు దిగుతాడని భావించగా.. అతడు ఎంపిక కాకపోవడంతో ఆ స్థానంపై స్పష్టత రాలేదు. దీంతో విజయ్ శంకర్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కీలకమైన నాలుగో స్థానం, జట్టులో శాశ్వత స్థానం కోసం హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్లు పోటీ పడుతున్నారని వార్తల చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా విజయ్ శంకర్ స్పందించాడు. ‘హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆటగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల సమర్థుడు. పాండ్యాతో నేను పోటీ పడుతున్నాన్న వార్తలు అసత్యం. మేము పోటీ పడితే టీమిండియాను గెలిపించడానికే తప్ప వేరేవాటి గురించి కాదు. పాండ్యా నేను మంచి స్నేహితులం. ప్రపంచకప్‌కు నేను ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. న్యూజిలాండ్ సిరీస్ అనంతరం నాపై నాకు నమ్మకం కలిగింది.. విశ్వాసం పెరిగింది. ఐపీఎల్ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన సూచనలు ప్రపంచకప్‌లో ఎంతగానే ఉపయోగపడాతాయి. భారీ సిక్సర్లు కొట్టడం నాకు ఎంతో ఇష్టం. అయితే భారీ సిక్సర్లు కేవలం కండబలం ఉంటేనే కాదు టెక్నిక్ కూడా ఉండాలి. టెక్నిక్ లేకుంటే విఫలం అవుతాం’అంటూ విజయ్ శంకర్ పేర్కొన్నాడు. -
గెలిచేందుకు కావల్సిన ఆయుధాలున్నాయి
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తి భారత్‌కు ఉందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. పరిస్థితులను అనుసరించి జట్టు కూర్పు నిర్ణయిస్తామని వెల్లడించాడు. ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పలు అంశాల గురించి మాట్లాడాడు. మెగా టోర్నీకి ఎంపికైన విజయ్ శంకర్ కీలకమైన నాలుగో స్థానంలో ఆడతాడా లేదా అనే ప్రశ్నకు పరోక్షంగా జవాబు చెప్పాడు. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల క్రికెటర్లు మన సొంతం. నాలుగో స్థానంలో ఆడగల బ్యాట్స్‌మెన్ చాలామంది ఉన్నారు. ఇలాంటి అంశాలను ఎప్పుడో పరిశీలించాం. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదు. ఇంగ్లండ్ వెళ్లడానికి ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే ఇతరుల గురించి ఆలోచిస్తాం. అదృష్టవశాత్తూ కేదార్‌కు ఫ్రాక్చర్ కాలేదు. అతడిని కొన్ని రోజుల పాటు పరిశీలనలో ఉంచుతున్నాం. ఇంగ్లండ్ వెళ్లేందుకు ఇంకా సమయముంది. మరొకరి ఎంపికపై ఇప్పుడే ఆలోచించడం లేదు’ అని రవిశాస్త్రి అన్నాడు. జట్టు సన్నాహం గురించి మాట్లాడుతూ ‘ఇలాంటి మెగాటోర్నీలో ఏ జట్టూ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్లలో ఇలాంటి పరిస్థితులెన్నో చూశాం. ఒత్తిడిని అనుభవించాం’ అని చెప్పాడు. -
ఇద్దరూ ఒక్కటే!
ప్రపంచ కప్ రేసులో అంబటి రాయుడు ను వెనక్కి నెట్టి విజయ్ శంకర్ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అసంతృప్తితో రాయుడు ‘3డి’ వ్యంగ్య వ్యాఖ్యానం కూడా చేశాడు. ఆ తర్వాతి నుంచి ఐపీఎల్లో వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది. అయితే ఇప్పుడు సరిగ్గా లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి ఇద్దరిలో ఎవరు మెరుగైన ఆటగాడో చెప్పలేని విధంగా వారిద్దరు గణాంకాలు నమోదు చేశారు. చెన్నై తరఫున రాయుడు, సన్‌రైజర్స్ తరఫున శంకర్ అన్ని మ్యాచ్‌లు (14) ఆడారు. ఇందులో ఒక మ్యాచ్‌లో శంకర్‌కు బ్యాటింగ్ అవకాశం రాలేదు. చివరకు ఇద్దరూ కూడా సరిగ్గా 219 పరుగులే నమోదు చేయగా... సగటు కూడా (19.90) ఒకేలా ఉండటం యాదృచ్ఛికం! ఒక అర్ధ సెంచరీ చేసిన రాయుడు బౌండరీల ద్వారా 92 పరుగులు సాధించగా... 40 పరుగుల అత్యధిక స్కోరు సాధించిన శంకర్ దాదాపు అదే విధంగా 96 పరుగులు బౌండరీల నుంచి రాబట్టాడు. బౌలింగ్‌లోనూ కేవలం 8 ఓవర్లే వేసి ఒక వికెట్ తీసిన శంకర్ ప్రదర్శన పెద్దగా చెప్పుకోదగింది కాదు. బ్యాటింగ్ స్ట్రయిక్‌రేట్‌లో మాత్రం రాయుడు (90.49)కంటే శంకర్ (120.32) కొంత మెరుగ్గా ఉన్నాడు. జాదవ్‌కు గాయం... మరోవైపు వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన కేదార్ జాదవ్ మళ్లీ గాయం బారిన పడ్డాడు. పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జాదవ్ ఫీల్డింగ్ చేస్తూ కింద పడ్డాడు. దాంతో అతని భుజానికి గాయమైంది. జాదవ్‌కు సోమవారం ఎక్స్‌రే, స్కానింగ్ నిర్వహించనున్నట్లు చెన్నై కోచ్ ఫ్లెమింగ్ నిర్ధారించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే మాత్రం అతను ప్రపంచ కప్‌కు దూరమైనట్లే! భారత వన్డే విజయాల్లో కీలక భాగంగా ఉన్న జాదవ్ ఐపీఎల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 95.85 స్ట్రయిక్ రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు. -
ఇంగ్లండ్‌లో విజయ్ బౌలింగ్ ఉపయుక్తం: గంగూలీ
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పూర్తి అండగా నిలిచాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో విజయ్ బౌలింగ్ ఉపయుక్తంగా మారుతుందంటూ ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌కు అతడి ఎంపికను సమర్థించాడు. విజయ్ గురించి ప్రతికూలంగా ఆలోచించవద్దని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాదిరిగానే అతడు ప్రపంచ కప్‌లోనూ రాణిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఈ రోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది
-
చీఫ్ సెలక్టర్‌పై అంబటి రాయుడు సెటైర్!
న్యూఢిల్లీ: తనను వరల్డ్‌కప్‌కు ప్రకటించిన భారత జట్టులో ఎంపిక చేయకపోవడంపై తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఘాటుగా స్పందించాడు. ప్రధానంగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు రాయుడు. వచ్చే వరల్డ్‌కప్‌ను ‘3డీ’ కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు తనలోని అసంతృప్తిని వెళ్లగక్కాడు. తనను కాదని, ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ను జట్టులో ఎంపిక చేయడానికి ఎంఎస్కే ఇచ్చిన వివరణ రాయుడికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఇక్కడ విజయ్ శంకర్ త్రీ డైమెన్షన్స్ ఉన్న ఆటగాడిగా ఎంఎస్కే పోల్చిన క్రమంలో రాయుడు సెటైర్ వేశాడు. ‘ నేను ఇప్పుడు త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్ చేశా. వచ్చే వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూడాలనుకుంటున్నా’ అంటూ ట్వీటర్ వేదికగా చురకలంటించాడు. (ఇక్కడ చదవండి: అందుకే అంబటిని పక్కకుపెట్టాం) సోమవారం భారత వరల్డ్‌కప్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగా మాట్లాడిన చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే..జట్టును ఎంపిక చేసేటప్పుడు అంబటి రాయుడు, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్ వైపే మొగ్గు చూపామని వివరించాడు. ‘నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్ బ్యాటింగ్, బౌలింగే కాదు మంచి ఫీల్డర్ కూడా. దీంతో శంకర్ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు’ అని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీనికి అంబటి రాయుడు వ్యంగ్యంగా స్పందించడం చర్చనీయాంశమైంది. Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋.. — Ambati Rayudu (@RayuduAmbati) 16 April 2019 -
ఏంటి పంత్ లేడా?
ముంబై : ప్రపంచకప్‌కు యువ సంచలన ఆటగాడు రిషభ్ పంత్‌ను సెలక్టర్లు పక్కనపెట్టడం పట్ల మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచకప్‌కు పంత్‌ను ఎంపికచేయకపోవడం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. యువ కీపర్ పంత్‌ను కాదని 33 ఏళ్ల దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడమేంటని సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు. పంత్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని కామెంట్ చేస్తున్నారు. తాజాగా సెలక్టర్ల తీరును మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు. ‘ప్రస్తుతం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా స్పెషలిస్టు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటే ప్రత్యర్థి జట్టు గందరగోళానికి గురవుతుంది. కొంతమంది బౌలర్లు కూడా ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడానికి ఇబ్బందులు పడతారు. గత కొంతకాలంగా టీమిండియా తరుపున పంత్ విశేషంగా రాణిస్తున్నాడు. ఆటగాడిగా ఎంతో పరిణితి సాధించాడు. ఇక ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు పంత్ 245 పరుగులు చేయగా, కార్తీక్ 111 పరుగులే చేశాడు. ప్రస్తుతం ఆటగాళ్ల ఫామ్‌ను చూడకుండా ఎలా ఎంపిక చేస్తారు?. సెలక్టరు పంత్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం’అంటూ సునీల్ గవాస్కర్ వివరించారు. ఇక పంత్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. దినేశ్ కార్తీక్ తో పోలిస్తే పంత్ క్రికెట్ అనుభవం చాలా తక్కువని ఎమ్మెస్కే పేర్కొన్నారు. ఐపీఎల్ ఆటతీరును బట్టి చూస్తే కూడా పంత్ కంటే కార్తీక్ అద్భుతంగా రాణిస్తున్నాడన్నారు. ఇక కేవలం ధోని గాయపడి జట్టుకు దూరమైన సమయంలోనే సెకండ్ వికెట్ కీపర్ అవసరముంటుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇలాంటి సమయంలో సీనియర్ ఆటగాడు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తే బావుంటుందనే దినేశ్ కార్తిక్ ను ఎంపికచేసినట్లు ఎమ్మెస్కే వివరించారు. -
విజయ్ శంకరానందం
ముంబై: సీనియర్ ఆటగాళ్లు అంబటి రాయుడు, అజింక్యా రహానేలను కాదని ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాకు యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో విజయ్ శంకర్‌తో పాటు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ‘ప్రపంచకప్‌లో పాల్గొనబోయే టీమిండియాకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తొలి మెగా టోర్నీ. ప్రపంచకప్‌లో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు. నేను కూడా దేశం తరుపున ఆడాలని కలలు కనేవాడిని. అది ఇంత త్వరగా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే పర్యటనగా మిగిలిపోతుంది’ అంటూ విజయ్ శంకర్ పేర్కొన్నాడు. ఇక విజయ్ శంకర్ త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ కొనియాడిన విషయం తెలిసిందే. అంబటి రాయుడు, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్ వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే వివరించాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చేదు జ్ఞాపకాలను తుడిచివేసుకొని.. మరింత రాటుదేలిన శంకర్ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది వన్డేలు ఆడిన విజయ్ శంకర్ 33 సగటుతో 165 పరుగులు సాధించాడు. స్లో మీడియం పేసర్ అయిన శంకర్.. చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం, మెరుపు ఫీల్డింగ్ అతడికి అదనపు బలం. -
అందుకే అంబటిని పక్కకుపెట్టాం: ఎమ్మెస్కే
ముంబై : ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన టీమిండియా పూర్తి సమతూకంగా ఉందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. రెండేళ్ల క్రితం జరిగిన చాంపియన్ ట్రోఫీ అనంతరమే ప్రపంచకప్ వేట ప్రారంభించామని తెలిపాడు. సోమవారం ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకంటించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రెండేళ్ల కాలంలో మిడిలార్డర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని అందుకే యువ ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు కల్పించామన్నాడు. జట్టును ఎంపిక చేసేటప్పుడు అంబటి రాయుడు, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్ వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే వివరించాడు. మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్.. ‘భారత జట్టు ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాం. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు, ఆటగాళ్ల బలాబలాలు, ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేశాం. ప్రస్తుతం జట్టులో ఏడుగురు బౌలర్లు ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. అందుకే ప్రస్తుత టీమిండియా మోస్ట్ బ్యాలెన్డ్స్డ్గా ఉంది. సెలక్షన్లో ఐపీఎల్ ప్రదర్శణను పరిగణలోకి తీసుకోలేదు. రిజర్వ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశాం. గత కొద్ది కాలంగా మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరికి తోడు అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా కూడా ఉంటే మంచిదని భావించాం. సైనీ, ఖలీల్‌లకు అవకాశం రావచ్చు.. నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్ బ్యాటింగ్, బౌలింగే కాదు మంచి ఫీల్డర్ కూడా. దీంతో శంకర్ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీల గురించి కూడా చర్చించాం. జట్టుకు మరో పేసర్ అవసరమనుకుంటే వీరిద్దరిలో ఒకరు ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉంది. బ్యాకప్ కీపర్‌గా అనభవం దృష్ట్యా దినేశ్ కార్తీక్ వైపే మొగ్గు చూపాం’అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తొలి పోరులో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తరువాతి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. -
వరల్డ్ కప్‌కు వెళ్లేదెవరు?
ముంబై: అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా... ఈ ఆరుగురిలో నలుగురికి అవకాశం, మరో ఇద్దరు ఔట్! వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టును నేడు ఎంపిక చేయనున్న నేపథ్యంలో చర్చ జరగనున్న అంశం ఇదొక్కటే. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం సమావేశమవుతోంది. గత రెండేళ్లుగా వన్డేల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే 11 మంది సభ్యుల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. మిగిలిన అదనపు నాలుగు స్థానాల కోసం మాత్రం చాలా మంది తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లండ్ విమానమెక్కేదెవరో నేడు తేలనుంది. ముఖ్యంగా జట్టులో నాలుగో స్థానంలో ఆడే బ్యాట్స్‌మన్ విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల ఆలోచనలేమిటో తెలిసే సమయం ఆసన్నమైంది. వీరు ఖాయం... ఫామ్, ఇంగ్లండ్ పరిస్థితులు, జట్టు వ్యూహాలు, కెప్టెన్ కోహ్లి ఆలోచనలను బట్టి చూస్తే తొలి 11 మంది ఆటగాళ్లు మరో మాటకు తావు లేకుండా ఎంపికవుతారు. వీరిలో కెప్టెన్ కోహ్లితోపాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ ఖాయం. వీరిలో ఆరుగురు 2015 ప్రపంచకప్‌లో పాల్గొన్నారు. రాయుడుకు అవకాశం ఉందా! గత ఆరు నెలలుగా నాలుగో నంబర్ ఆటగాడిపైనే చాలా చర్చ జరిగింది. నిజానికి గత ఏడాది అక్టోబరులో ఆసియా కప్ తర్వాత కోహ్లి బహిరంగంగానే రాయుడు సరైనవాడంటూ మద్దతు పలికాడు. గతేడాది ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన తర్వాత రాయుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాక భారత్ 24 వన్డేలు ఆడితే రాయుడు 21 ఆడాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సిరీస్ సమయంలో ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లి, రోహిత్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి. కివీస్‌తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌తో 90 పరుగులు చేసిన రాయుడు ఆసీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్ నుంచి చూస్తే 42.18 సగటుతో రాయుడు చేసిన పరుగులు అద్భుతం కాకపోగా... అతడిని కొందరు మంచి బౌలర్లు ఇబ్బంది పెట్టిన తీరుతో కోహ్లి, రవిశాస్త్రి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అనిపించింది. ఎవరి ఆట ఏమిటి? రేసులో ఉన్న కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ఆటను పట్టించుకోమని సెలక్టర్లు చెబుతున్నా... పూర్తిగా విస్మరించలేరు కూడా. రాహుల్ మిడిలార్డర్లో ఆడటంతో పాటు పైగా మూడో ఓపెనర్‌గా పని కొస్తాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనూ అద్భుతం అనిపించేలా, తనపై నమ్మకం పెంచేలా ఒక్కసారి కూడా ఆడలేదు. ఇక రిషభ్ పంత్ కాస్త ముందంజలో ఉన్నాడు. ఏ క్షణానైనా ఆటను మార్చేయగల దూకుడుకు తోడు ఎడంచేతి వాటం కావడం అతని అదనపు బలం. ధోని ఉండటంతో కీపర్ స్థానంలో పరిగణించకుండా బ్యాట్స్‌మన్‌గా సెలక్టర్లు అతడిని చూస్తున్నారు. జడేజాకు చాన్స్! ఆల్‌రౌండర్ స్థానానికి జడేజా, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంది. శంకర్ పట్ల కొంత సానుకూలతలు ఉన్నా 9 వన్డేలే ఆడిన అతనిపై నమ్మకం ఉంచడం కష్టం. పైగా అతని స్లో మీడియం పేస్ బౌలింగ్ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరోవైపు జడేజా మాత్రం కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేయగల సమర్థుడు. దాని వల్ల వారిపై ఒత్తిడి పెరిగి వికెట్లు దక్కడం చాలా సార్లు జరిగింది. పైగా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో చక్కగా రాణించడం జడేజాకు కలిసొచ్చే అంశం. ఇక కోహ్లి ఆలోచనల ప్రకారం నాలుగో రెగ్యులర్ పేసర్ అవసరం పెద్దగా లేదు కాబట్టి దాని గురించి చర్చ జరగడం సందేహమే. దీనిపై సెలక్టర్లు ఆలోచిస్తే మంచి వేగం ఉన్న నవదీప్ సైనీ పేరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల ప్రకటనకు ఏప్రిల్ 23 ఆఖరి తేదీ కాగా... అవసరమైతే మార్పులు చేసేందుకు మే 23 వరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనుమతినిచ్చింది. -
‘సిక్సర్ కొట్టకుంటే.. నాగిని డ్యాన్స్ చూడలేక చచ్చేవాళ్లం’
-
‘సిక్సర్ కొట్టకుంటే.. చూడలేక చచ్చేవాళ్లం’
హైదరాబాద్ : సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున క్రికెటర్ విజయ్ శంకర్‌ను తిట్టకుండా.. దినేశ్ కార్తీక్‌ను పొగడుకుండా ఉండని అభిమాని ఉండకపోవచ్చు. ఎందుకంటే సులువుగా గెలిచే మ్యాచ్‌ను ఓటమి అంచుకు శంకర్ తీసుకరాగ.. ఇక ఓటమి ఫిక్స్ అనుకున్న తరుణంలో మ్యాచ్‌ను గెలిపించి అభిమానుల ముఖంలో చిరునవ్వు కలిగిలే చేశాడు దినేశ్ కార్తీక్. నిదహాస్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ నుంచి మ్యాచ్‌ను, టీమిండియా పరువును దినేశ్ కార్తీక్ కాపాడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను నెమరు వేసుకుంటున్నారు. ఆ మ్యాచ్.. ఇంకా నా కళ్ల ముందు కదలాడుతూనే’ ఉందంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ‘కార్తీక్ భయ్యా సిక్సర్ కొట్టకుంటే.. నాగిని డ్యాన్స్ చూడలేక చచ్చేవాళ్లం’అంటూ మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇక ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లా బ్యాట్స్‌మన్ షబ్బీర్ రహ్మాన్(77) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఏదీ కలసి రాలేదు. రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించగా.. ధవన్, రైనాలు విఫలమయ్యారు. ఈ తరుణంలో 14వ ఓవర్లో 98/4తో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన శంకర్.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 3 ఓవరల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఈ దశలో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఆ మ్యాచ్‌లో శంకర్ 19 బంతుల్లో 17 రన్స్ మాత్రమే చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. -
ఆ ఇద్దరూ మరీ ‘చెత్త’గా ఆడారు!
ఢిల్లీ: టీమిండియాకు మరింత సమస్యగా మారిన మిడిల్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పష్టం చేశాడు. వరల్డ్‌కప్ నాటికి మిడిల్ ఆర్డర్‌పై ఒక స్పష్టత రాకపోతే ఆ మెగా టోర్నీలో అది భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఆసీస్‌తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక భారత్ ఓడిపోవడంపై మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. ప్రధానంగా భారత యువ క్రికెటర్లు రిషభ్ పంత్, విజయ్ శంకర్లు చాలా నిరాశపరిచారన్నాడు. వారిద్దరూ ఘోరంగా వైఫల్యం చెందిన కారణంగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ‘పంత్, విజయ్ శంకర్లు తీవ్రంగా నిరాశపరిచారు. వారిని నిరూపించుకునే ఛాన్స్ వచ్చింది. అయినా దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. విజయ్ శంకర్, పంత్‌లు భారీ షాట్లు ఆడవచ్చు. అందుకు గాల్లోకి భారీ షాట్లు కొట్టాల్సిన అవసరం లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి తరహాలో గ్రౌండ్ షాట్లతోనే స్టైక్‌రేట్‌ను పెంచుకోవచ్చు. ఇది సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరల్డ్‌కప్ ముందు భారత జట్టులో కొట్టిచ్చినట్లు కనబడిన సమస్య ఏదైనా ఉంటే అది మిడిల్ ఆర్డర్. ఈ సిరీస్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న ఆసీస్‌కు సిరీస్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. వారు భారత్‌కు ఎందుకొచ్చారో అది చేసి చూపించారు’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
నిదాహస్ పాఠాలు నేర్పింది!
నాగపూర్: గత ఏడాది మార్చి 18న నిదాహస్ ట్రోఫీ ఫైనల్ తర్వాత విజయ్ శంకర్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. కెరీర్లో తొలి టోర్నీ ఆడుతున్న అతను ఒత్తిడిలో సరైన విధంగా స్పందించలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో వరుసగా డాట్ బంతులు ఆడటం, కనీసం స్ట్రయిక్ రొటేట్ చేయలేకపోవడంతో ఒక దశలో భారత్‌కు ఓటమి తప్పదనిపించింది. చివరకు దినేశ్ కార్తీక్ చలవతో మ్యాచ్ గెలిచినా... అభిమానులు విజయ్‌పై మాత్రం విరుచుకుపడ్డారు. ఇప్పుడు సరిగ్గా సంవత్సరం తర్వాత అతను బౌలింగ్‌లో ఒక చక్కటి ఓవర్‌తో భారత్‌ను గెలిపించాడు. అయితే నాటి మ్యాచ్‌ను తాను మర్చిపోలేదని, దాని నుంచి ఎంతో నేర్చుకున్నానని శంకర్ అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే నిదాహస్ ట్రోఫీ నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. స్థితప్రజ్ఞతతో ఉండటం ఎలాగో తెలిసింది. పరిస్థితులు చాలా బాగా ఉన్నా, ప్రతికూలంగా కనిపిస్తున్నా అన్ని సమయాల్లో ప్రశాంతంగా, తటస్థంగా ఉండాలని అర్థమైంది’ అతని అతను చెప్పుకొచ్చాడు. రెండో వన్డే చివరి ఓవర్లలో ఏదో ఒకటి తాను వేయాల్సి వస్తుందని ముందే ఊహించానని, 10–15 పరుగులను కాపాడుకోవాల్సి వస్తుంది కాబట్టి మానసికంగా సిద్ధంగానే ఉన్నానని అతను వెల్లడించాడు. బంతి కొంత రివర్స్ స్వింగ్ అవుతోందని, సరైన లెంగ్త్‌లో నేరుగా వికెట్లపైకి వేస్తేనే ఫలితం దక్కుతుందని బుమ్రా చెప్పిన సూచనను తాను పాటించానన్నాడు. తాజా ప్రదర్శనతో వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమైందా అనే ప్రశ్నకు స్పందిస్తూ విజయ్... దాని గురించి ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ‘జట్టులో చోటు, వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపికవంటి వాటి గురించి నేను అతిగా ఆలోచించను. ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. ఇందులో ప్రతీ మ్యాచ్ కీలకమే. నేను బాగా ఆడి జట్టును గెలిపించడమే ముఖ్యం’ అని ఈ తమిళనాడు ఆల్‌రౌండర్ పునరుద్ఘాటించాడు. -
బుమ్రా మరోసారి అదరగొట్టాడు
-
బుమ్రా డెత్ బౌలింగ్ చూశారా?
నాగ్‌పూర్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో డెత్‌ఓవర్ స్పెషలిస్ట్, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. పదునైన బంతులతో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. బుధవారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 250 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని భారత్ ఈ మ్యాచ్ నెగ్గిందంటే దానికి కారణం ముమ్మాటికి జస్ప్రిత్ బుమ్రానే. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. కేవలం 29 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఆతిథ్య బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. 46వ ఓవర్లో అయితే కేవలం ఒకే ఒక పరుగిచ్చి కౌల్టర్ నీల్, కమిన్స్‌ల వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఎంతలా అంటే బుమ్రా బౌలింగ్ ఒక్కటి వదిలేద్దాం.. మిగతా బౌలర్లలో ఆడుదామని ఆసీస్ బ్యాట్స్‌మెన్ అనుకునేంత.. ఇబ్బంది పెట్టాడు. బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టు విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే బుమ్రా, షమీ ఓవర్ల కోటా అయిపోవడం భారత శిభిరంలో కొంతకలవరపాటు గురిచేసింది. కెప్టెన్ కోహ్లి.. ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్‌కు బంతినివ్వగా.. మ్యాచ్ పోయిందని అందరూ భావించారు. కానీ విజయ్.. కెప్టెన్ కోహ్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే స్టోయినిస్‌ను ఔట్ చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అనంతరం మరో రెండు బంతుల్లో జంపాను ఔట్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ కూల్చాడు. అంతకు ముందు కెప్టెన్ కోహ్లి అద్భుత సెంచరీకి, విజయ్ శంకర్ (46) కీలక ఇన్నింగ్స్ తోడవ్వడంతో భారత్ పొరాడే లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. ఇక బుమ్రా డెత్ ఓవర్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. -
నిదాహస్ ట్రోఫీయే నాకు బుద్ధి చెప్పింది : శంకర్
నాగ్‌పూర్ : చివరి ఓవర్లో అదరగొట్టి ఆస్ట్రేలియా విజయానికి అడ్డుకట్టవేసిన టీమిండియా యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఈ తరహా ప్రదర్శనకు కారణం గతేడాది జరిగిన నిదాహస్ ట్రోఫీ ట్రోఫియేనని అభిప్రాయపడ్డాడు. ఆ టోర్నీ వల్లే తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం నాగ్‌పూర్ వేదికగా ఆతిథ్య ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 8 పరుగుల తేడాతో గెలుపొంది.. 500వ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చిన విజయ్ శంకర్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రపంచకప్ బెర్త్ గురించి ఆలోచించడం లేదని, కేవలం తన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టానన్నాడు. ‘నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను.. ప్రపంచకప్ సెలక్షన్ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. నేను కేవలం జట్టు గెలుపుకు తన నుంచి ఇవ్వాల్సిన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే.. నిదాహస్ ట్రోఫీ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. ఆ టోర్నీ తర్వాతే ఒత్తిడిలో ఎలా ఉండాలో తెలిసింది. అన్నివేళలో ప్రశాంతంగా ఉండాలనే తత్వం బోధపడింది. తాజా మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయాడనికి మానసికంగా సిద్ధమయ్యాను. 44 ఓవర్లనంతరం ఎప్పుడైనా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, అది చివరి ఓవరైనా చాలెంజ్‌కు సిద్ధంగా ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. చివరి ఓవర్లో బుమ్రా మెళుకువలు కలిసొచ్చాయి. క్లబ్ క్రికెట్లో తప్పా నేనెప్పుడూ చివరి ఓవర్ బౌలింగ్ చేయలేదు. చివరి ఓవర్లో రెండు వికెట్లు దక్కడంతో పొంగిపోలేదు. కేవలం ఆ మూమెంట్‌ను ఆస్వాదించాను. రనౌట్ కావడం క్రికెట్లో సర్వసాధారణం. ఆ సమయంలో మళ్లీ క్రీజులోకి వేళ్లే అవకాశం లేదు. దీనిని ఏదో నేను దురదృష్టం అనుకోను.’ అని ఈ తమిళనాడు క్రికెటర్ చెప్పుకొచ్చాడు. చదవండి : శంకరన్నా.. సూపరన్నా! -
శంకరన్నా.. సూపరన్నా!
నాగ్‌పూర్ : టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్.. సరిగ్గా ఏడాది క్రితం నిదాహస్ ట్రోఫీ ఫైనల్లో ఒత్తిడిని అధిగమించలేక.. బ్యాటింగ్‌లో తడబడ్డ ఆటగాడిగా మాత్రమే తెలుసు. దాదాపు ఓటమి అంచునకు చేరిన ఆ మ్యాచ్‌ను దినేశ్ కార్తీక్ గట్టెక్కించడంతో ఈ యువ ఆల్‌రౌండర్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతని ప్రదర్శనపై యావత్ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుకోపో.. అని ఘాటుగా కామెంట్ చేశారు. దీంతో అతని కెరీర్ ముగిసినట్టేనని అందరూ భావించారు. కానీ వీటిని పెద్దగా పట్టించుకోని శంకర్.. తన బలహీనతలను అధిగమిస్తూ డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. (చదవండి : అయ్యో.. విజయ్ శంకర్) భారత జట్టులో ఆడాలనే సుడి బాగుందో ఏమో కానీ శంకర్‌కు పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. సరిగ్గా ఆస్ట్రేలియాలోని వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో నిషేధానికి గురవ్వడం.. మనోడికి కలిసొచ్చింది. హార్దిక్ స్థానంలో సెలక్టర్లు శంకర్‌కు అవకాశం కల్పించారు. ఇక్కడి నుంచి మనోడికి అన్ని కలిసొచ్చాయి. ఎంతలా అంటే ప్రపంచకప్ జట్టులో దాదాపు చోటు దక్కించుకునేంత. ఆ సిరీస్‌లోని ఓ మ్యాచ్‌లో జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో అంబటి రాయుడుతో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం శంకర్ సామర్థ్యాన్ని చాటింది. ప్రపంచకప్ సన్నాహకంలో జరుగుతున్న తాజా సిరీస్‌కు ఎంపిక కావాడానికి కూడా అదే కారణం. (చదవండి: నేను ఆశ్చర్యపోయా: విజయ్ శంకర్) ఇక తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ వన్డేలో శంకర్ తన బౌలింగ్ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. ప్రధాన బౌలర్ల కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్ విజయ్ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది. అయితే ఇలాంటి క్లిష్ట స్థితిలో అనుభవం లేకపోవడంతో పాటు వైజాగ్ టీ20లో ఉమేశ్ యాదవ్ వైఫల్యం వెంటాడుతుండగా అందరికీ అతనిపై సందేహాలు. పైగా అప్పటి వరకు బుమ్రా, షమీ బౌలింగ్‌ను అతి జాగ్రత్తగా ఆడుకొని చివరి ఓవర్ కోసం వేచి చూస్తున్న స్టొయినిస్ జోరు మీదున్నాడు. నిదాహస్ ట్రోఫీ ఫైనల్లోనే బిస్కెట్ చేసిన శంకర్ బౌలింగ్‌లో రెండు భారీ షాట్లు పడితే అంతే సంగతులు..! ఈ మ్యాచ్ కూడా పోయేలా ఉందని అందరూ నెత్తులుపట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. శంకర్ అద్భుతం చేశాడు. ఏమాత్రం ఊహించని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. (చదవండి: మా వరల్డ్‌కప్ ప్రణాళికల్లో ఆ ముగ్గురు) తొలి బంతికే అతను స్టొయినిస్‌ను ఎల్బీగా ఔట్ చేసి దాదాపుగా మ్యాచ్‌ను ముగించాడు. రివ్యూలో కూడా ఫలితం భారత్‌కే అనుకూలంగా వచ్చింది. 6 వన్డేల కెరీర్లో అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. మరో రెండు బంతులకు జంపాను బౌల్డ్ చేసి జట్టును గెలిపించాడు. 46వ ఓవర్‌నే శంకర్‌తో వేయించాలని తాను అనుకున్నానని, అయితే బుమ్రా, షమీ వరుసగా నాలుగు ఓవర్లు వేసి 49వ ఓవర్లోనే ఆట ముగిస్తారని ధోని, రోహిత్ చెప్పిన సలహాను పాటించానని మ్యాచ్ అనంతరం కోహ్లి చెప్పాడు. అటు బ్యాటింగ్లోను శంకర్ (46) కెప్టెన్ కోహ్లితో కలసి 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ప్రదర్శనతో విజయశంకర్‌పై భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. ‘శంకరన్నా.. నీవు సూపరన్నా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘నీకు ప్రపంచకప్ కప్ బెర్త్ పక్కా పో’ అంటున్నారు. (చదవండి: అద్భుతం... 500...వ విజయం) What a talent @vijayshankar260 is. Definitely should be in the Indian test team too. Class batsman more than handy medium pacer and can tonk the ball quite well. He is a find for india and is definitely playing in world cup 2019#INDvAUS #vijayshankar — Nizamul Bhuyan (@NizamulBhuyan1) 5 March 2019 -
రెండో వన్డేలో భారత్ గెలుపు
-
అద్భుతం... 500వ విజయం
పిచ్ దాదాపు తొలి వన్డేలాగే ఉంది. బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపిస్తోంది. బంతి తక్కువ ఎత్తులో వస్తూ షాట్లు ఆడటం గగనంగా మారింది. కానీ ఎప్పటిలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకే ఒక్కడు విరాట్ కోహ్లి మాత్రం నేనున్నానంటూ నిలబడ్డాడు. తనకే సాధ్యమైన రీతిలో అతను లెక్కలు వేసుకొని పరిస్థితికి తగినట్లుగా ఆడాడు. బౌండరీలు సాధ్యం కాని స్థితిలో ఏకంగా 76 పరుగులు సింగిల్స్ ద్వారా రాబట్టి మరో క్లాసిక్ సెంచరీతో భారత్‌కు చెప్పుకోదగ్గ స్కోరును అందించాడు. మంగళవారం మ్యాచ్‌కు ముందు లక్ష్యాన్ని ఛేదించే సమయంలో గత పది వన్డేల్లో తొమ్మిది ఓడిన ఆస్ట్రేలియా మళ్లీ అంతే తడబాటుకు గురైంది. చెప్పుకోదగ్గ ఆరంభం లభించినా... భారత బౌలర్ల ముందు మిడిలార్డర్ నిలవలేకపోయింది. ఒత్తిడిలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చేతులెత్తేసింది. ఫలితంగా టీమిండియా తమ వన్డే చరిత్రలో 500వ విజయాన్ని సాధించి ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. వరుసగా రెండో గెలుపుతో సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాగపూర్: సమష్టి ప్రదర్శన కనబర్చిన భారత్ జామ్తా మైదానంలో సాధారణ లక్ష్యాన్ని కాపాడుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో కోహ్లి సేన 8 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (120 బంతుల్లో 116; 10 ఫోర్లు) వన్డేల్లో 40వ సెంచరీ సాధించడం విశేషం. ఇతర బ్యాట్స్‌మెన్‌లో విజయ్ శంకర్ (41 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ (4/29) చెలరేగగా... ఆడమ్ జంపాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. మార్క్ స్టొయినిస్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా... హ్యాండ్స్కోంబ్ (59 బంతుల్లో 48; 4 ఫోర్లు), ఉస్మాన్ ఖాజా (37 బంతుల్లో 38; 6 ఫోర్లు), ఫించ్ (53 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కుల్దీప్కు 3 వికెట్లు... బుమ్రా, విజయ్ శంకర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో నిలవగా... మూడో వన్డే ఈ నెల 8న రాంచీలో జరుగుతుంది. రోహిత్ డకౌట్ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చేసరికి జట్టు స్కోరు 0... కోహ్లి ఔటయ్యాక వచ్చిన పరుగులు 2... మధ్యలో 248 పరుగులు వచ్చిన సమయంలో అతను క్రీజ్‌లో బ్యాట్స్‌మన్‌గా పరుగులు చేశాడు లేదంటే సహచరులను మార్గనిర్దేశనం చేస్తూ కెప్టెన్‌గా నడిపించాడు. కమిన్స్ వేసిన తొలి ఓవర్ చివరి బంతిని కట్ చేయబోయి రోహిత్ శర్మ (0) క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఒక దశలో ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ధావన్ (21) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించగా, ఆసీస్ రివ్యూ చేసి సానుకూల ఫలితం పొందింది. క్రీజ్‌లో ఎక్కువ సేపు తడబడిన రాయుడు (18) కూడా విఫలమయ్యాడు. లయన్ బౌలింగ్‌లో అంపైర్ ఇచ్చిన ఎల్బీ నిర్ణయాన్ని రాయుడు సవాల్ చేసినా చివరకు ఔట్‌గానే తేలింది. దాంతో భారత్ రివ్యూ కూడా కోల్పోయింది. ఆకట్టుకున్న శంకర్ ఈ దశలో కోహ్లి, విజయ్ శంకర్ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా ఈ భాగస్వామ్యంలో కోహ్లి కంటే శంకర్ ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తూ కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. స్టొయినిస్ ఓవర్లో కొట్టిన ఫోర్, సిక్స్ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు 55 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. అయితే శంకర్‌ను దురదృష్టం వెంటాడింది. జంపా బౌలింగ్‌లో కోహ్లి నేరుగా కొట్టిన బలమైన షాట్ బౌలర్ చేతి వేళ్లను తాకుతూ వెళ్లి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వికెట్లను పడగొట్టింది. ఆ సమయంలో క్రీజ్ బయట ఉన్న శంకర్ అర్ధసెంచరీ సాధించకుండానే నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. శంకర్, కోహ్లి నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించగా... అందులో 46 శంకర్, 31 మాత్రమే కోహ్లి చేయడం విశేషం. లోయరార్డర్ విఫలం ఒక వైపు కోహ్లి పట్టుదలగా నిలబడి తనదైన శైలిలో చక్కటి స్ట్రోక్స్‌తో పరుగులు చేస్తూ పోయాడు. అయితే మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. జంపా వరుస బంతుల్లో జాదవ్ (11), ధోని (0)ను ఔట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. జడేజా (21) పెద్దగా పరుగులు చేయకపోయినా కెప్టెన్‌కు అండగా నిలవడంతో ఏడో వికెట్‌కు 67 పరుగులు జత చేరాయి. కూల్టర్ నీల్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కొట్టిన ఫోర్‌తో కోహ్లి అద్భుత శతకం పూర్తయింది. కొద్ది సేపటికి కమిన్స్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ ఇవ్వడంతో ఎనిమిదో వికెట్‌గా కోహ్లి వెనుదిరిగాడు. మరో రెండు పరుగులు జోడించిన తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. రాణించిన ఓపెనర్లు చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌లో కాస్త మెరుగ్గా కనిపించాడు. విజయ్ శంకర్ తొలి ఓవర్లో మూడు ఫోర్లతో 13 పరుగులు రాబట్టిన ఆస్ట్రేలియా పవర్‌ప్లే ముగిసేసరికి 60 పరుగులు చేసింది. అయితే ఫించ్, ఖాజా ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. ఫించ్‌ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో 83 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగియగా, ఖాజాను జాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత 10 పరుగుల వ్యవధిలో షాన్ మార్ (16), మ్యాక్స్‌వెల్ (4) ఔట్ కావడంతో కంగారూల కష్టాలు పెరిగాయి. మరోవైపు హ్యాండ్స్కోంబ్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే జడేజా అద్భుత ఫీల్డింగ్‌తో అతని ఆట ముగిసింది. చివరి ఎనిమిది ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో కుల్దీప్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టి ఆసీస్ జోరు పెంచే ప్రయత్నం చేసింది. అయితే క్యారీ (22)ని కుల్దీప్ ఔట్ చేయగా, ఒకే ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి ఆసీస్‌కు అడ్డుకట్ట వేశాడు. స్టొయినిస్ నిలబడి గెలిపించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. శంభో శివ ‘శంకర’ చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. ప్రధాన బౌలర్ల కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్ విజయ్ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది. అయితే ఇలాంటి క్లిష్ట స్థితిలో అనుభవం లేకపోవడంతో పాటు వైజాగ్ టి20లో ఉమేశ్ యాదవ్ వైఫల్యం వెంటాడుతుండగా అందరికీ అతనిపై సందేహాలు. పైగా అప్పటి వరకు బుమ్రా, షమీ బౌలింగ్‌ను అతి జాగ్రత్తగా ఆడుకొని చివరి ఓవర్ కోసం వేచి చూస్తున్న స్టొయినిస్ జోరు మీదున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం నిదాహస్ ట్రోఫీ ఫైనల్లో ఔటై తీవ్రంగా విమర్శలకు గురైన శంకర్ బౌలింగ్‌లో రెండు భారీ షాట్లు పడితే అంతే సంగతులు..! అయితే ఈసారి అలా జరగలేదు. తొలి బంతికే అతను స్టొయినిస్‌ను ఎల్బీగా ఔట్ చేసి దాదాపుగా మ్యాచ్‌ను ముగించాడు. రివ్యూలో కూడా ఫలితం భారత్‌కే అనుకూలంగా వచ్చింది. 6 వన్డేల కెరీర్లో అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. మరో రెండు బంతులకు జంపాను బౌల్డ్ చేసి విజయ్ గెలిపించాడు. 46వ ఓవర్‌నే శంకర్‌తో వేయించాలని తాను అనుకున్నానని, అయితే బుమ్రా, షమీ వరుసగా నాలుగు ఓవర్లు వేసి 49వ ఓవర్లోనే ఆట ముగిస్తారని ధోని, రోహిత్ చెప్పిన సలహాను పాటించానని కోహ్లి ఆ తర్వాత చెప్పాడు. నన్ను పట్టుకో చూద్దాం..! క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు మైదానంలోకి దూసుకురావడం కొత్త కాదు. ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రెండో వన్డేలో కూడా అలాంటిదే జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు భారత జట్టు మొత్తం మైదానంలోకి అడుగు పెడుతుండగా అనూహ్య సంఘటన జరిగింది. ధోని వీరాభిమాని ఒకడు అతడిని కలిసేందుకు ఫీల్డ్‌లోకి దూసుకొచ్చాడు. అయితే ధోని అంత సులువుగా అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. తన వైపు వస్తున్న వ్యక్తిని గమనించిన ధోని వెంటనే మరోవైపు పరుగందుకున్నాడు. ఆ అభిమాని కూడా తగ్గకుండా ధోనిని వెంటాడాడు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ దాటుకుంటూ ‘జిగ్‌జాగ్’ తరహాలో మాజీ కెప్టెన్ పరుగెడుతూ ఉంటే అభిమాని కూడా అలాగే వెంబడించాడు. కానీ ధోనిని అందుకోవడం మాత్రం అతని వల్ల కాలేదు. చివరకు ధోనినే స్టంప్స్ వద్దకు వెళ్లి ఆగిపోయాడు. దగ్గరకు వచ్చిన ఆ అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వగా... తన అభిమాన ఆటగాడిని కౌగిలించుకొని అతను సంబరపడ్డాడు. అయితే ఇదే తరహాలో మళ్లీ కోహ్లి వైపు వెళ్లబోతే అతను సరదాగా తీసుకోకుండా కళ్లతోనే ఆగ్రహం చూపించాడు! ఆలోగా పోలీసులు వచ్చి ఆ ఫ్యాన్‌ను బయటకు లాక్కెళ్లారు. ►2 వన్డేల్లో 500 విజయాలు పూర్తి చేసుకున్న రెండో జట్టు భారత్. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 558 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. ►33 కోహ్లి సెంచరీ చేసిన 40 పర్యాయాల్లో 33 సార్లు భారత్ గెలిచింది. ఈ విషయంలో సచిన్ (49 సెంచరీల్లో 33 విజయాలు) సరసన కోహ్లి నిలిచాడు. 40 కోహ్లి సెంచరీలు... ఏ దేశంపై ఎన్ని... శ్రీలంక – 8 ఇంగ్లండ్ – 3 వెస్టిండీస్ – 7 బంగ్లాదేశ్ – 3 ఆస్ట్రేలియా –7 పాకిస్తాన్ – 2 న్యూజిలాండ్ – 5 జింబాబ్వే – 1 దక్షిణాఫ్రికా – 4 -
విజయ్ శంకర్ బ్యాడ్ లక్.. తొలి హాఫ్ సెంచరీ మిస్