Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం(మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ దుష్మంత చమీరా అద్భుతమైన యార్కర్‌తో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన చమీరా తొలి బంతికే విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే 145 కి.మీ.ల వేగంతో చమీరా వేసిన యార్కర్‌కు శంకర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. . దీంతో శంకర్(6 బంతుల్లో 4 పరుగులు) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది.
లక్నో సూపర్ జెయింట్స్‌పై 5వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా(55), బదోని(54) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటరల్లో రాహుల్ తెవాటియా(40), హార్ధిక్ పాండ్యా(33), మిల్లర్(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
చదవండి: IPL 2022: అతడొక అద్భుతం.. మాకు బేబీ డివిలియర్స్ లాంటి వాడు: రాహుల్
சமீர 🔥🔥🔥🔥#LSGvGT #IPL2022 #chameera pic.twitter.com/DWhLPe9Uwa
— ஷாஜகான் 🇱🇰 (@JudeOff3) March 28, 2022
Comments
Please login to add a commentAdd a comment