Dushmantha Chameera
-
IPL 2024: కేకేఆర్‌లోకి శ్రీలంక ఫాస్ట్ బౌలర్.. ఇంగ్లండ్ ఆటగాడి స్థానంలో..!
ఐపీఎల్ 2024 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రీలంక స్పీడ్‌స్టర్ దుష్మంత చమీరాను జట్టులోకి తీసుకుంది. గాయపడిన ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్కు ప్రత్యామ్నాయంగా చమీరాను ఎంపిక చేసుకున్నట్లు కేకేఆర్ మేనేజ్మెంట్ వెల్లడించింది. చమీరా రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైజ్‌తో కేకేఆర్‌తో జతకట్టనున్నాడు. చమీరా 2018, 2021, 2022 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన చమీరా 9 వికెట్లు పడగొట్టాడు. చమీరా అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. ఈ 32 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ శ్రీలంక తరఫున 12 టెస్ట్‌లు, 52 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓవరాల్‌గా 143 వికెట్లు పడగొట్టాడు. చమీరా ఇటీవల స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం చమీరాకు వన్డే ఫార్మాట్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గట్కిన్సన్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ పేసర్‌ను 2024 సీజన్ వేలంలో కేకేఆర్ యాజమాన్యం బేస్ ధర కోటి రూపాయలకు దక్కించుకుంది. ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్ జట్టు.. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియ , అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా (గుస్ అట్కిన్సన్ రీప్లేస్మెంట్), సాకిబ్ హుస్సేన్ -
వరల్డ్‌కప్‌కు ముందు లంకేయులకు భారీ ఎదురుదెబ్బ
వన్డే వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు వనిందు హసరంగ గాయం కారణంగా వరల్డ్‌కప్ మొత్తానికి దూరమయ్యాడు. వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న హసరంగ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. ఇదే గాయం కారణంగా హసరంగ ఆసియా కప్ 2023కు దురమయ్యాడు. పాత గాయం నుంచి కోలుకునే సమయంలో మరోసారి అది తిరగబెట్టడంతో లంక స్టార్ స్పిన్నర్ వరల్డ్‌కప్ ఆడే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ గాయం కారణంగా హసరంగ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. హసరంగ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు అన్నారు. మరోవైపు హసరంగతో పాటు మరో లంక ఆటగాడు కూడా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ దుష్మంత్ చమీరా గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇదే గాయం కారణంగా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌తో పాటు ఆసియాకప్‌కు దూరమైన చమీరా.. ఇప్పుడు మెగా టోర్నీ అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడు. కాగా, వరల్డ్‌కప్ కోసం భారత్ సహా 8 జట్లు తమతమ జట్లను ప్రకటించగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. జట్ల ప్రకటనకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 28 కావడంతో లంక క్రికెట్ బోర్డు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తుంది. వరల్డ్‌కప్‌లో హసరంగ లేకపోవడం శ్రీలంక విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుంది. హసరంగకు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
T20 WC 2022: చమీరా ఔట్.. మూడేళ్ల తర్వాత శ్రీలంక పేసర్ రీఎంట్రీ
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక ఆటగాళ్లు గుణతిలక, చమీరా, దిల్షాన్ మధుశంక దూరమయ్యారు. అదే విధంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పేసర్ ప్రమోదు మధుషాన్ కూడా ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. ఇక ఇప్పటికే మధుశంక స్థానాన్ని పేసర్ ఫేర్నాండోతో భర్తీ చేసిన శ్రీలంక క్రికెట్.. తాజాగా గుణతిలక, చమీరా రిప్లేస్మెంట్స్ను కూడా శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. గుణతిలక స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న యువ బ్యాటర్ ఆషెన్ బండార, చమీరా స్థానంలో కసున్ రజితాను శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. అదే విధంగా వీరిద్దరి భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా కసున్ రజితా చివర సారిగా 2019లో శ్రీలంక జట్టు తరపున టీ20ల్లో ఆడాడు. ఇక గురువారం(ఆక్టోబర్ 20) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫియర్ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక.. సూపర్-12 అర్హత సాధించింది. చదవండి: T20 WC 2022: నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్ -
ఎదురుదెబ్బ.. లంకను గెలిపించిన స్టార్ బౌలర్ దూరం
సూపర్-12 దశకు ముందే శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా క్వాలిఫయింగ్ పోరులో యూఏఈపై ఘన విజయం సాధించామన్న ఆనందం ఆ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. యూఏఈపై విజయంలో కీలకపాత్ర పోషించిన లంక స్టార్ బౌలర్ దుష్మంత చమీరా గాయంతో మేజర్ టోర్నీకి దూరమయ్యాడు. కాలి పిక్క కండరాల గాయం తిరగబెట్టడంతో చమీర టి20 ప్రపంచకప్‌కు దూరమైనట్లు లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా చమీరా ఇటీవలే ముగిసిన ఆసియా కప్ 2022కు ఇదే కారణంతో దూరమైన సంగతి తెలిసిందే. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దుష్మంత చమీరా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. యూఏఈ ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి వారిని చావుదెబ్బ కొట్టాడు. తాజాగా చమీరా దూరమవడం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. అంతేకాదు లంక బ్యాటర్ దనుష్క గుణతిలకతో పాటు బౌలర్ ప్రమోద్ మధుషన్లు కూడా మోచేతి గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గాయంతో దూరమైన చమీరా స్థానంలో ఎవరిని ఎంపిక చేయనుందనేది ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనా నమీబియాతో ఓటమి తర్వాత యూఏఈపై గెలిచిన లంక ప్రస్తుతం రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక తన ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సూపర్-12 దశకు చేరుకోవాలంటే లంక తన ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే. చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం 73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ పేసర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్లు దుష్మంత చమీరా, లహురు కుమార తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ తమ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులోకి చోటు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా ఆసియాకప్‌లో అదరగొట్టిన పేసర్లు మధుశంక, ప్రమోద్ మధుషాన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. ఇక ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా షనక సారథ్యంలోని శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్-2022లో తొలుత క్వాలిఫియింగ్ రౌండ్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర (ఫిట్‌నెస్‌కు లోబడి), లహిరు కుమార(ఫిట్‌నెస్‌కు లోబడి) దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్ స్టాండ్‌బై ఆటగాళ్లు: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో Here's your 🇱🇰 squad for the ICC Men's T20 World Cup! ⬇️#RoaringForGlory #T20WorldCup pic.twitter.com/GU7EIl6zOw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2022 చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు' -
Asia Cup 2022: శ్రీలంక జట్టుకు ఊహించని షాక్!
Asia Cup 2022 Sri Lanka Squad: ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక బౌలర్ దుష్మంత చమీర ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. టీమ్ ప్రాక్టీసు సందర్భంగా అనుకోకుండా అతడికి గాయమైంది. ఎడమ కాలి నొప్పి తీవ్రతరం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆంటన్ రక్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ధ్రువీకరించాడు. ఈ మేరకు చమీరతో దిగిన ఫొటోను షేర్ చేసిన ఆంటన్.. ‘‘నేను ఇప్పటి వరకు కలిసి మంచి వ్యక్తులలో తనూ ఒకడు. ఆట పట్ల అంకితభావం కలవాడు. తను గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, దుషీ కచ్చితంగా రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తాడని నమ్మకం ఉంది. అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ నాటికి తను తిరిగి వస్తాడు. క్రీడాకారులు గాయాలపాలు కావడం సహజమే. అయితే, కోలుకునే క్రమంలో మనల్ని మనం దృఢంగా ఉంచుకోవాలి. త్వరలోనే నిన్ను కలుస్తాము దుషీ’’ అని పేర్కొన్నాడు. దుష్మంత చమీర త్వరగా కోలుకుని జట్టులోకి తిరిగి రావాలని ఆకాంక్షించాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్-2022 టోర్నమెంట్ ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా జరుగనున్న ఈవెంట్ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక.. అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇక కీలక పేసర్ చమీర దూరం కావడం లంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. చమీర స్థానంలో నువాన్ తుషార జట్టులోకి రానున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చమీర.. అదే ఏడాది పాకిస్తాన్‌తో సిరీస్‌తో టెస్టుల్లో, విండీస్‌తో మ్యాచ్‌తో టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 44, టెస్టుల్లో 32, టీ20లలో 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహా హర్షల్ పటేల్.. పాకిస్తాన్ కీలక బౌలర్ షాహిన్ ఆఫ్రిది సైతం ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక View this post on Instagram A post shared by Anton Roux (@_anton_roux) -
145 కి.మీ. స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం(మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ దుష్మంత చమీరా అద్భుతమైన యార్కర్‌తో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన చమీరా తొలి బంతికే విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే 145 కి.మీ.ల వేగంతో చమీరా వేసిన యార్కర్‌కు శంకర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. . దీంతో శంకర్(6 బంతుల్లో 4 పరుగులు) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 5వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా(55), బదోని(54) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటరల్లో రాహుల్ తెవాటియా(40), హార్ధిక్ పాండ్యా(33), మిల్లర్(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022: అతడొక అద్భుతం.. మాకు బేబీ డివిలియర్స్ లాంటి వాడు: రాహుల్ சமீர 🔥🔥🔥🔥#LSGvGT #IPL2022 #chameera pic.twitter.com/DWhLPe9Uwa — ஷாஜகான் 🇱🇰 (@JudeOff3) March 28, 2022 -
కేఎల్ రాహుల్ జట్టుకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన లక్నోసూపర్జెయింట్స్కు గుడ్ న్యూస్ అందింది. భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన దుష్మంత చమీర గాయం నుంచి కోలుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 ఆరంభం నుంచి లక్నో జట్టుకు చమీరా అందుబాటులో ఉండనున్నాడు. మెగా వేలంలో చమీరాను రూ. 2 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇక గత ఏడాది ఆర్సీబీకి చమీరా ప్రాతినిధ్యం వహించాడు. ఇక గాయం కారణంగా ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఐపీఎల్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. మెగా వేలంలో భాగంగా మార్క్ వుడ్‌ను 7.50 కోట్లు వెచ్చించి లక్నో కొనుగోలు చేసింది. అయితే అతడు దూరం కావడంతో జాసన్ హోల్డర్‌తో జట్టు పేస్ బౌలింగ్‌ను చమీరా పంచుకోనున్నాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా లక్నో సూపర్‌జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ఇక లక్నోసూపర్జెయింట్స్కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. లక్నోసూపర్జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, జాసన్ హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, అంకిత్ రాజ్‌పూత్, కె గౌతమ్, దుష్మంత చమీరా, షాబాజ్ నదీమ్, మనన్ వోహ్రా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ మేయర్స్, కె. , కరణ్ శర్మ, ఎవిన్ లూయిస్, మయాంక్ యాదవ్ చదవండి: Rohit Sharma: రోహిత్ హోలీ విషెస్.. ఒకవేళ నువ్వు సినిమాలో నటించాల్సి వస్తే! ఇంకేమైనా ఉందా! -
టీమిండియాతో రెండో టెస్టు.. శ్రీలంకకు మరో బిగ్ షాక్!
టీమిండియాతో రెండో టెస్టుకు ముందు శ్రీలంకకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీరా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అధిక పని భారం కారణంగా చమీరాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మోకాలి గాయంతో బాధ పడుతున్న అతడు గత కొద్ది కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి పనిభారాన్ని తగ్గించాలని వైద్య బృందం శ్రీలంక క్రికెట్ బోర్డుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు చమీరాను కేవలం వైట్-బాల్ క్రికెట్లో మాత్రమే ఆడించాలని కూడా వైద్య బృందం సూచించినట్లు సమాచారం. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కూడా చమీరా దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. ఇందులో భారత్ ఇన్నింగ్స్ అండ్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా చమీరాను ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బెంగళూరు వేదికగా జరుగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు ఆటగాడు పథుమ్ నిసాంక కూడా దూరం కానున్నాడు. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
Ind Vs Sl 2nd Test: రోహిత్ శర్మపై దారుణమైన ట్రోల్స్.. చమీర‘సన్’ అంటూ
Ind VS Sl Series 2022: ఇటీవలి టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంక పేసర్ దుష్మంత చమీర.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. చమీర దెబ్బకు రెండో టీ20లో హిట్‌మాన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో టీ20 మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొని.. 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక టెస్టు సిరీస్ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్ హిట్ అయినప్పటికీ.. బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 28 బంతులు ఎదుర్కొని లాహిరు కుమార బౌలింగ్‌లో 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇదిలా ఉండగా.. బెంగళూరు వేదికగా జరుగనున్న పింక్‌బాల్ టెస్టు నేపథ్యంలో.. తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ కుమార స్థానాన్ని దుష్మంత చమీరతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చమీర ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా రెచ్చిపోతున్నారు. రోహిత్ శర్మను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘చమీర దెబ్బకు వణికిపోతున్న చమీర‘సన్’ ఓ మూలకు నక్కి కూర్చుంటాడు. చమీర వస్తే రోహిత్ పరిస్థితి ఇది’’ అంటూ మీమ్‌లు షేర్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఫ్యాన్స్ సైతం ఇందుకు దీటుగా బదులిస్తున్నారు. రోహిత్ ఒక్కసారి కుదురుకుంటే ఆపడం ఎవరితరం కాదని, చమీరకు అంత సీన్ లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. చదవండి: Ravindra Jadeja: రోహిత్, కోహ్లి, బుమ్రా మాత్రమే ఎందుకు.. జడేజా, రాహుల్ ఏం పాపం చేశారు?! Doesn't change the fact that Lux cozi choking of the year award goes to my idolo Rohit Chameera son pic.twitter.com/3cWWFDAJJG — Ritik Raj (@raj_ra63459307) March 10, 2022 Chameera will play and chameerason is already shivering in corner pic.twitter.com/x804ULVHw1 — king_forever💥💥 (@YogeshS60079723) March 11, 2022 Be aware, Chameera is coming 🏃💨 pic.twitter.com/lqjfQFawiV — B (@internet_monk) March 9, 2022 Arrest this Chameera son pic.twitter.com/QtxtvAZdFP — XAVIER (@ParodyofMumba) March 4, 2022 Lets see Super Exited @ILoveYouJanu69 pic.twitter.com/CdNv662ZBf — Abhishek Yadav (@RaoAbhishek_6) March 10, 2022 -
IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన
RCB releases Wanindu Hasaranga and Dushmantha Chameera: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక ప్రకటన చేసింది. శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాను బయో బబుల్ నుంచి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) జట్టులో భాగమైన వీరిద్దరు క్వాలిఫైయర్స్ నేపథ్యంలో... శ్రీలంక జట్టుతో కలవనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా హసరంగ, చమీరాకు ఆర్సీబీ ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా నేడు(అక్టోబరు 11) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఆర్సీబీ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. ఇక... కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2021 సీజన్ పునః ప్రారంభమయ్యే నాటికి ఆడం జంపా, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, ఫిన్ అలెన్, వాషింగ్టన్ సుందర్ వివిధ కారణాలతో బెంగళూరు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వనిందు హసరంగ, దుష్మంత చమీరా, జాన్జ్ గార్టన్, టిమ్ డేవిడ్, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లు ఆర్సీబీలో ఎంట్రీ ఇచ్చారు. ఇక శ్రీలంక క్రికెటర్లలో హసరంగ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయకపోగా... చమీరాకు అసలు ఆడే అవకాశమే రాలేదు. చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్ శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు: దసున్ షనక(కెప్టెన్), ధనంజయ డి సిల్వా(వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేశ్ చండిమాల్, భనుక రాజపక్స, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, పాథమ్ నిసాంక, వనిందు హసరంగ, మహేశ్ తీక్షణ, అకిల ధనుంజయ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, దుష్మంత చమీరా, బిరున ఫెర్నాండో. OFFICIAL ANNOUNCEMENT Wanindu Hasaranga & Dushmantha Chameera have been released from the RCB bio bubble as they join up with the SL team for their #WT20 qualifiers. We wish both of them the best & thank them for their professionalism & hard work during #IPL2021. #PlayBold pic.twitter.com/m8U2p4YaiK — Royal Challengers Bangalore (@RCBTweets) October 11, 2021