సూపర్-12 దశకు ముందే శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా క్వాలిఫయింగ్ పోరులో యూఏఈపై ఘన విజయం సాధించామన్న ఆనందం ఆ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. యూఏఈపై విజయంలో కీలకపాత్ర పోషించిన లంక స్టార్ బౌలర్ దుష్మంత చమీరా గాయంతో మేజర్ టోర్నీకి దూరమయ్యాడు. కాలి పిక్క కండరాల గాయం తిరగబెట్టడంతో చమీర టి20 ప్రపంచకప్‌కు దూరమైనట్లు లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా చమీరా ఇటీవలే ముగిసిన ఆసియా కప్ 2022కు ఇదే కారణంతో దూరమైన సంగతి తెలిసిందే.
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దుష్మంత చమీరా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. యూఏఈ ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి వారిని చావుదెబ్బ కొట్టాడు. తాజాగా చమీరా దూరమవడం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. అంతేకాదు లంక బ్యాటర్ దనుష్క గుణతిలకతో పాటు బౌలర్ ప్రమోద్ మధుషన్‌లు కూడా మోచేతి గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
గాయంతో దూరమైన చమీరా స్థానంలో ఎవరిని ఎంపిక చేయనుందనేది ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనా నమీబియాతో ఓటమి తర్వాత యూఏఈపై గెలిచిన లంక ప్రస్తుతం రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక తన ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సూపర్-12 దశకు చేరుకోవాలంటే లంక తన ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే.
చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment