Calf pain
-
Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్!
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటలో లియోన్ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఇది జరిగింది. ఈ క్రమంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాతి సెషన్‌కు లియోన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఇది ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. రెండో టెస్టులో లియోన్ 13 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే 500వికెట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. ఇక లియోన్‌కు లార్డ్స్ టెస్టు వందోది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లియోన్ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందింస్తూ.. ''నాథన్ కచ్చితంగా ఎలా ఉన్నాడో తెలియదు.. అతని గాయం తీవ్రమైతే మాత్రం తమ జట్టుకు భారీ నష్టం మిగలనుంది. అతని లోటును తీర్చడం చాలా కష్టం. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది.''అంటూ తెలిపాడు. తాజాగా మూడోరోజు ఆటకు ఇరుజట్లు సిద్ధమవుతున్నా వేళ ఆడమ్ వైట్ అనే వ్యక్తి తన ట్విటర్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్న వీడియోనూ షేర్ చేశాడు. ఈ వీడియోలో నాథన్ లియోన్ రెండు స్రెచర్ల సాయంతో నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీన్నిబట్టి లియోన్‌కు గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండో టెస్టుకు లియోన్ దూరమైనట్లే. నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మార్ఫీ! ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్ కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. లియోన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లార్డ్స్ టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసేసమయానికి 61 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 45, బెన్ స్టోక్స్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 138 పరుగులు వెనుకబడి ఉంది. The Australians have arrived 80 minutes before play as Nathan Lyon struggles with his team mates on crutches following his calf injury yesterday. @SEN_Cricket pic.twitter.com/a1lRWLIofm — Adam White (@White_Adam) June 30, 2023 చదవండి: అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం #Ashes2023: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే -
దగ్గు, గొంతు నొప్పికి ఆయుర్వేదంలో పరిష్కారాలేంటీ?
ఆయుర్వేద చికిత్సలో తులసి ప్రధానమైంది. పొడి దగ్గు కోసం తులసి టీ తరచుగా తీసుకోవచ్చు. దగ్గును వదిలించుకోవడానికి మరియు కఫాన్ని తగ్గించడానికి, అలాగే అలెర్జీలు, ఉబ్బసం లేదా ఊపిరితిత్తుల వ్యాధి వల్ల కలిగే దగ్గు లక్షణాలను మెరుగుపరచడంలో తులసి సహాయపడుతుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకున్నట్లయితే, జలుబు వల్ల కలిగే గొంతు నొప్పి, దగ్గు వంటి బాధలు తగ్గుతాయి. అల్లంలో ఉప్పు కలిపి పొంగించిన ఇంగువను కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకుని మింగితే కూడా నొప్పి తగ్గుతుంది. కఫంలో అప్పుడప్పుడు రక్తం కనిపించడం, గొంతు నొప్పి కఫంలో రక్తం వస్తే అది శరీరంలో అధిక వేడిని సూచిస్తున్నట్టు అర్థం. అలాగే గొంతు నొప్పి కూడా వేడి వల్ల వస్తుంది. కఫంలో రక్తం ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి తీవ్రమైన అంతర్లీన వైద్య పరిస్థితిని ఇది తెలుపుతుంది. ఆయుర్వేదంలో పరిష్కారమేంటీ? చిటికెడు నీళ్ళలో పసుపు వేసి మరిగించి ఆ ఆవిరిని రోజుకి పదిసార్లు పట్టాలి. పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగితే రిలీఫ్ ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే తులసి ఆకుల రసం తేనేతో కలిపి తీసుకుంటే త్వరగా జలుబూ గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. జలుబు లేకపోయినా రాత్రి పొడి దగ్గు వస్తే ఎలా తగ్గించాలి? శరీరంలో నీరు సరిపోక ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా దగ్గు వస్తుంది. దగ్గు అప్పటికప్పుడు వెంటనే తగ్గదు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది. - ఉప్పు,నీళ్ళు గొంతు దాకా పుక్కిలించడం - మిరియాల కషాయం (రుచించడం కోసం కొంత బెల్లం కూడా కలపవచ్చు) - గోరు వెచ్చటి నీళ్లలో తేనె, నిమ్మరసం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సమస్య నివారణ కోసం దప్పిక వేసినప్పుడల్లా అశ్రద్ధ చేయకుండా కావలసినన్ని నీరు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. అదే పనిగా తేన్పులు.. ఏం చెయ్యాలి? జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువైనప్పుడు తేన్పు వచ్చినప్పుడు గాలితో పాటు ఆమ్లం గొంతు వరకు వస్తుంది. దానితో గొంతు మంటగా మారుతుంది. - ఆహారంలో మసాలాలు తక్కువగా ఉపయోగించాలి. సాత్వికాహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. రాత్రి పూట గొంతులో మంట ఎందుకు వస్తుంది? ఈ సమస్య వచ్చింది అంటే మీకు ఎసిడిటీ లేదా ఆసిడ్ రిఫ్లెక్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. - రాత్రి పూట మసాలాలు, బాగా కారం, ఘాటు ఉన్న పదార్థాలు తగ్గించండి. - వీలుంటే 7, 8 గంటలకు ముందే రాత్రి భోజనం పూర్తి చేయాలి - దాని వల్ల గొంతు సాఫీగా ఉంటుంది. ఇబ్బంది రాదు. - డా. నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు -
ఎదురుదెబ్బ.. లంకను గెలిపించిన స్టార్ బౌలర్ దూరం
సూపర్-12 దశకు ముందే శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా క్వాలిఫయింగ్ పోరులో యూఏఈపై ఘన విజయం సాధించామన్న ఆనందం ఆ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. యూఏఈపై విజయంలో కీలకపాత్ర పోషించిన లంక స్టార్ బౌలర్ దుష్మంత చమీరా గాయంతో మేజర్ టోర్నీకి దూరమయ్యాడు. కాలి పిక్క కండరాల గాయం తిరగబెట్టడంతో చమీర టి20 ప్రపంచకప్‌కు దూరమైనట్లు లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా చమీరా ఇటీవలే ముగిసిన ఆసియా కప్ 2022కు ఇదే కారణంతో దూరమైన సంగతి తెలిసిందే. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దుష్మంత చమీరా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. యూఏఈ ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి వారిని చావుదెబ్బ కొట్టాడు. తాజాగా చమీరా దూరమవడం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. అంతేకాదు లంక బ్యాటర్ దనుష్క గుణతిలకతో పాటు బౌలర్ ప్రమోద్ మధుషన్లు కూడా మోచేతి గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గాయంతో దూరమైన చమీరా స్థానంలో ఎవరిని ఎంపిక చేయనుందనేది ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనా నమీబియాతో ఓటమి తర్వాత యూఏఈపై గెలిచిన లంక ప్రస్తుతం రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక తన ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సూపర్-12 దశకు చేరుకోవాలంటే లంక తన ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే. చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం 73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం -
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్!
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో మొత్తం సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. పాక్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ 7టీ20ల సిరీస్ ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఇంగ్లీష్ జట్టు అడుగుపెట్టింది. కాగా గత కొంత కాలం నుంచి బట్లర్ కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ది హాండ్రిడ్ లీగ్ మధ్య నంచి తప్పుకున్నాడు. అయితే అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌కు ముందు బట్లర్‌ను ఆడించి ఎటువంటి రిస్క్ తీసుకోడదని ఇంగ్లండ్ జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ సిరీస్‌కు బట్లర్ దూరమైతే.. ఇంగ్లండ్ జట్టుకు ఆల్‌రౌండర్ మోయిన్ అలీ సారథ్యం వహించే అవకాశం ఉంది. పాకిస్తాన్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ (వైస్ కెప్టెన్), హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ఒల్లీ స్టోన్, రీస్ టాప్లీ , డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, ల్యూక్ వుడ్, మార్క్ వుడ్ చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన -
పిక్కలు.. గుండెకు బ్రాంచ్ ఆఫీస్‌లు
పిక్కలు... గుండెకు బ్రాంచ్ఆఫీస్లా పనిచేస్తాయి. దేహం పై భాగంలో ఉండే గుండె మెయిన్ ఆఫీస్ అయితే... పిక్కలు కాళ్లలో ఉన్న క్యాంప్ ఆఫీసు అన్నమాట. గుండె అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్ చేసినట్టే... పిక్క కూడా పై వైపునకు రక్తం వేగంగా వెళ్లేందుకు దోహదపడుతుంది. పిక్క చేసే ఎక్స్ట్రా డ్యూటీ గురించి తెలిపే కథనం ఇది. గుండె పంపింగ్ ప్రక్రియ వల్ల దేహంలోని అన్ని భాగాలకూ రక్తం అందుతుంది. మెదడు ఇతర భాగాల నుంచి మళ్లీ గుండెకు రక్తం చేరడం ఒకింత సులువు. కానీ పాదాల నుంచి పైవైపునకు రక్తం అందడం భూమ్యాకర్షణ (గ్రావిటేషనల్) శక్తి కారణంగా ఒకింత కష్టం అవుతుంది. కానీ పైవైపునకు రక్తప్రవాహం సాఫీగా జరిగేందుకు పిక్క దోహదపడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ అంటారు. దేహానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. గుండెకు బ్రాంచ్ ఆఫీస్ డ్యూటీ ఇలా... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి గుండె డ్యూటీలు నిర్వహించినప్పటికీ... గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ అనే ప్రధాన కండరాలు మరింతగా ఈ విధిని నిర్వహిస్తాయి. ఇవి ఓ క్రమపద్ధతిలో ముడుచుకుంటూ, విప్పారుతూ (రిలాక్స్ అవుతూ) ఓ క్రమబద్ధమైన రీతిలో రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి నెడుతుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా ఈ రక్తనాళల్లోని రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) ఆపుతుంటాయి. ఇలా... గుండెకు చేరాల్సిన రక్తాన్ని కిందికి రాకుండా ఒకేవైపునకు ప్రవహించేలా చూస్తాయి. ‘పిక్క’ బలం లేకపోతే... పిక్క సరిగా పనిచేయకపోతే వైవైపునకు ప్రవహించాల్సిన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అందులో ప్రాణవాయువు లేకపోవడం వల్ల అక్కడి కండరాల్లోని కణాలకు తగినంత ఈక్సిజన్ అందదు. ఫలితంగా ఆ కండరాలు అలసటకు గురవుతాయి. దాంతో వచ్చే సమస్యల్లో కొన్ని... ► కాళ్ల చివరలకు రక్తసరఫరా తగ్గడం ∙ వ్యాధి నిరోధకత ఇచ్చే లింఫ్ నిర్వీర్యం కావడం ∙చెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా... ► కాళ్లు ఎప్పుడూ అలసినట్టుగా ఉండటం ►కాళ్లూ, పాదాలలో వాపు ►వేరికోస్ వెయిన్స్ సమస్య కనిపించడం (అంటే... కాళ్లలో చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం బయట నుంచి కనిపిస్తుండటం). దాంతో కాలిపై పుండ్లు ఓ పట్టాన తగ్గవు. ►కాళ్ల సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్) వంటి సమస్యలు రావచ్చు. నివారణ ఇలా... ► బరువును అదుపులో ఉంచుకోవాలి. ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు నడక వ్యాయామం అవసరం. దాంతో కేవలం పిక్కలకు మాత్రమే కాకుండా... అన్ని కండరాలకూ వ్యాయామం సమకూరి ఆరోగ్యం బాగుంటుంది). ∙కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి ఉంచే ‘వీనస్ స్టాకింగ్స్’ అనే సాక్స్ వంటి తొడుగులను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఒకవేళ అప్పటికీ ఫలితం కనిపించకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. సమస్యలు ఎవరిలో... ► చాలా సేపు కదలకుండా అదేపనిగా కూర్చుని పనిచేసేవారికి ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు, ట్రాఫిక్పోలీసులు... మొదలైనవారికి) ∙స్థూలకాయంతో ఉన్నవారిలో ∙గర్భవతులుగా ఉన్న సమయంలో మహిళల్లో కొందరికి ఈ సమస్య రావచ్చు. -డాక్టర్ పీ సీ గుప్తా సీనియర్ వాస్క్యులార్ అండ్ ఎండోవాస్క్యులార్ సర్జన్ -
పిక్కలు నొప్పిగా ఉన్నాయి.. సమస్య ఏమిటి?
వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. గత 15 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాను. మొదట్లో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే డ్యూటీలో భాగంగా ఎక్కువసేపు నిలబడే ఉంటాను. నాకు ఇటీవల కాళ్లలో వాపు వస్తోంది. అలాగే పిక్కలు కూడా పట్టేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు ఇబ్బందిపడుతున్నాను. బాధ భరించలేనప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను. రోజురోజుకూ సమస్య పెరుగుతోంది. ఇలాంటి సమస్య గతంలో నాకెన్నడూ లేదు. అసలు నాకు ఏమైంది. దయచేసి సలహా ఇవ్వండి. - రాజు, వైజాగ్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఈ సమస్య సాధారణంగా ఎక్కువ సేపు నిల్చుని ఉండేవారిలో, అధిక బరువులు మోసేవారిలో ఎక్కువగా ఉంటుంది. వీరికి మొదట్లో కాళ్లలో వాపు రావడం, మంట పుట్టడం, పిక్కలు పట్టేయడం చోటు చేసుకుంటాయి. అనంతరం వీరు నడక అంటేనే బెదిరిపోయేలా సమస్య మరీ తీవ్రమవుతుంది. వ్యాధి దశను బట్టి పూర్తి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్ నిర్ధారణ చేస్తే, మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్స విధానాలతో మీ సమస్యను పూర్తిగా ఉపశమనం కలిగేలా చేయవచ్చు. మొదటి దశ, రెండోదశలో వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి సర్జరీ అవసరం ఉండదు. కేవలం డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడుతూ వారు అందించే సలహాలను పాటిస్తూ మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. మెరుగైన ఫలితాల కోసం సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సమస్య నుంచి తాత్కాలికంగా రిలీఫ్ దొరికిన చాలామంది మందులు మానివేయడం లేదా కోర్స్ పూర్తయిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించకుండా ఉండటం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల వ్యాధి మరింత ముదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇక మూడు లేదా నాలుగో దశలో వ్యాధి ఉంటే మాత్రం వాస్క్యులర్, శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. వేరికోస్ వెయిన్స్‌కు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కాబట్టి మీరు వెంటనే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులను సంప్రదించి, మీ సమస్యకు కారణాన్ని తెలుసుకోండి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలను సులువుగా పొందవచ్చు. - డా॥దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్