టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం తీవ్రమైంది. ఫలితంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు అతడు పూర్తిగా దూరమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
కంగారు జట్టు సొంతగడ్డపై భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారీ తేడాతో ఓడిపోయిన కమిన్స్ బృందం.. అడిలైడ్ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచింది. పింక్ బాల్ టెస్టులో రోహిత్ సేనను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
గతంలోనూ గాయం
కాగా తొలి టెస్టు సందర్భంగా పక్కటెముకల నొప్పితో బాధపడ్డ హాజిల్‌వుడ్‌కు ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్.. అడిలైడ్ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చింది. హాజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను పిలిపించగా అతడు ఐదు వికెట్లతో రాణించాడు. అయితే, బ్రిస్బేన్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా హాజిల్‌వుడ్‌ను వెనక్కి పిలిపించింది.
కండరాలు పట్టుకోవడంతో
గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ మళ్లీ గాయపడ్డాడు. భారత్‌తో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో అతడు మైదానాన్ని వీడాడు. ఈ 33 ఏళ్ల రైటార్మ్ పేసర్ కుడికాలి పిక్క కండరాలు పట్టుకోవడంతో వెంటనే స్కానింగ్‌కు పంపించారు.
ఈ నేపథ్యంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొత్తానికి హాజిల్‌వుడ్ దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే అతడి స్థానాన్ని భర్తీ చేస్తామని వెల్లడించింది. కాగా బ్రిస్బేన్ టెస్టులో ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన హాజిల్‌వుడ్.. విరాట్ కోహ్లి(3) రూపంలో కీలక వికెట్ తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.
ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), బ్రెండన్ డగెట్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’
Comments
Please login to add a commentAdd a comment